గ్రామాల్లోకి అధికారులు
• భూభారతిని సద్వినియోగం చేసుకోండి
• తహశీల్దార్ శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి పథకంలో భాగంగా గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని కల్వకుంట గ్రామం లో సోమవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుండి 12 వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని గ్రామాల్లోకి అధికారులు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ఇమద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.