అమ్మ మాట అంగన్వాడి బాట ప్రారంభం.

అమ్మ మాట అంగన్వాడి బాట ప్రారంభం

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం మిట్టపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం అమ్మ మాట..అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈరోజు నుంచి విద్యార్థులకు వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యాని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది.

children

అలాగే వారం రోజులపాటు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కనిపిస్తూ రెండు,మూడు సంవత్సరాల వయసు దాటిన పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్లు నిరోషా,సరోజ,లావణ్య, ఆయాలు,పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అన్నదాతల ఆట పాటలతో సంబురంగా ఏరువాక పౌర్ణమి.

అన్నదాతల ఆట పాటలతో సంబురంగా ఏరువాక పౌర్ణమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

వర్షాలు విరివిగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరుతూ.. మండలంలోని అన్నదాతలు వర్ణ దేవుని వేడుకున్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా రైతులు, కౌలు రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేకంగా దర్శించుకుని ఆట పాటలతో సందడి చేశారు. మండల కేంద్రమైన న్యాల్ కల్, మండలంలోని మల్గి,గ్రామంలో పండగను ఘనంగా జరుపుకున్నారు. పశు సంపద, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. కోడెదూడలు, ఎద్దులను, గోమాతలకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

పంట పొలాల్లో భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, ట్రాక్టర్లను సుందరంగా ముస్తాబు చేసి గ్రామంలోని ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండలంలోని మల్గి గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయం నుండి గ్రామ శివారులోని ఇస్మాల్ ఖాద్రి దర్గా వరకు ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో భక్తులు, రైతులు, జడ్గొండ మారుతి, శివానంద శ్రీపతి, రాజు, సిద్ధారెడ్డి, మారుతి, విట్టల్, బసవరాజ్, ప్రతాపరెడ్డి, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శాంతు, ధనరాజ్, జలంధర్, మహేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం.

రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ఎస్పై రాజు కమిషనర్ కు పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్, లాఠీ పరేడ్ ను పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, కేసుల్లో స్వాధీనమైన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్ కాప్, హెస్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు కోసం వినియోగించే టెక్ డాటం వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు కేటాయించిన ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది చేత పరిశీలించారు. అలాగే ఎఫ్ఎఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్ష చేసి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామడుగు మండలంలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను నియమించాలని సూచించారు. కోత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు రికార్డు నిర్వహణ, కోర్టు డ్యూటీ, బీట్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సమన్లు తదితర విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్పై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాగేష్ సజ్జన్ బొగ్గుల నాగన్న సార్ మర్యాద పూర్వకముగా కలిసి
మల్లయ్య స్వామి గారికి పూలమాలలతో షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ తమ్మలి మరియు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు….

◆: వృత్తి రీత్యా వైద్యుడైన పేద ప్రజలకు పెన్నిధి…

◆: ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ త్రాగునీటి సౌకర్యాలు పేద ప్రజల వైద్య ఖర్చులు భరిస్తూ…

◆: ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు….

◆:ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే హృదయ నాయకుడు…

◆:సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై ప్రశంసలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి చేసిన ఈ సర్వేలో ఆయన ముందువరుసలో ఉండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నియోజకవర్గంలోని ఆయా గ్రామాల అవసరాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అనేక తన సొంత డబ్బు ఖర్చుతో అభివృద్ధి పనులు చేయడం, ప్రతి ఒకరికీ చేరువై ప్రజా నాయకుడిగా ముద్రవేసుకోవడం వంటి అంశాలు ఆయనకు ఈ గుర్తింపు తీసుకొచ్చినట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నది. అంతేగాక ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా.. చెప్పినప్పుడే పనిచేసి చూపడంలో ముందుండే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి ముందు సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండడం, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండడం ఆయనకు విశేషమైన విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ప్రజల మద్దతే తనకు ప్రధాన బలమని.. ఈ సర్వే ర్యాంకింగ్‌ ద్వారా మళ్లీ రుజువు అయిందని తెలిపారు.పనితీరు బాగుందని రావడం సంతోషం.నిదర్శనం. కేవలం పనితీరే కాకుండా ప్రజల కోసం నిత్యం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని తన సొంత ఖర్చుతో ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయం. ఇలాంటి నాయకుడు జహీరాబాద్ ప్రజలకు దొరకడం అదృష్టం. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన.. మరింత సేవ చేసి మొదటి స్థానం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

హైదరాబాద్ :నేటిధాత్రి

 

car accident

కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా..
రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి..
మరో నలుగురికి గాయాలు

 

యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి చెందిన వాసా సాయితేజ(23), వాసా పవన్ కుమార్(25), వాసా రాఘవేందర్ (24), వాసా శివకుమార్, ఇ. సాయికుమార్ వరసకు అన్నదమ్ములు. మూసాపేటలో నివాసం ఉండే ఎం.సందీప్, శివకుమార్ వారి మిత్రులు. వీరందరూ హైదరాబాద్లో వేర్వేరు చోట్ల ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాసా శివకుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం అందరూ కలిసి నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్ కాలనీలోని కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లారు. పొద్దుపోయే వరకూ అక్కడే ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో.. రాత్రి 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్ పట్టణం దాటిన కొద్దిసేపటికి వీరు ప్రయాణిస్తున్న కారు..ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నుజ్జయింది. వాసా సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్కుమార్కు మూడేళ్ల కుమార్తె ఉందని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా అవివాహితులని వెల్లడించారు.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత..

 ◆ చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

◆ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు

◆ పుస్తకాల బరువు తగ్గించాలంటున్న వైద్యులు

◆ పట్టించుకోని విద్యా శాఖ అధికారులు

◆ నేలను చూస్తున్న పసి నడుములు

◆ బ్యాక్ పెయిన్ తో చిన్నారుల అవస్థలు

◆ వ్యాపారంగామారిన నోట్ పుస్తకాలు

◆ బాల్యంపై బరువు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి. పుస్తకాల బ్యాగు మోత.. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నది. తద్వారా చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు బ్యాగుల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల వయస్సుకు, తరగతులకు మించి పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 జూలై 19న విద్యాశాఖ జీవో నంబర్ 22 జారీ చేసింది. జీవోను పకడ్బందీగా అమలుచేయాలని ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల పరిధుల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. విద్యను వ్యాపారంగా మారుస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరానికి మించి పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

నిబంధనలు ఇవీ………

విద్యార్థుల బ్యాగు బరువుకు సంబంధించి గతేడాది విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ పాటించాలని ఆదేశించింది. 1, 2 తరగతులు చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు 1.5 కిలోల లోపు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతులకు 4 కిలోల లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల మెటీరియల్స్, సిలబస్ల పేరుతో పిల్లల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. జిల్లాలో పలు స్కూళ్లు పలు అంతస్తుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు బ్యాగులు మోస్తూ పైఅంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపైన భారం పడుతున్నది. పలు సమావేశాల్లో బ్యాగుల భారం తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

లెక్కకు మించి బుక్స్…….

ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్ ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారు. ప్రతి రోజూ ఆయా సబ్జెక్టులు చెప్పనప్పటికీ విద్యార్థులు ప్రతి రోజూ అన్ని పుస్తకాలను మోసుకెళ్తున్నారు. విద్యార్థుల బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థికి 3 కిలోల బ్యాగు ఉండాలని. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే పుస్తకాల బరువు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఇలా ఏ తరగతి విద్యార్థిలను తీసుకున్నా పరిమితికి మించి బ్యాగులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో సబ్జెక్ట్ వారీగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. తమ స్కూల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సూచిస్తుండడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అధిక బరువు ఉన్న బ్యాగులు మోయడం ద్వారా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు మెడ, భుజాలు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

పిల్లల ఎదుగుదల పై ప్రభావం పడుతుంది……

విద్యార్థులు అధిక బరువులు మోయడం ద్వారా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారుల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా బ్యాగులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఎక్కువ పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తల్లిదండ్రులు………

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై బ్యాగుల భారం వేయవద్దని గతంలోనే సూచనలు చేశాం. ఏ తరగతి విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలో స్పష్టంగా సూచించాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ.

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్‌ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు.ఝరాసంగం గ్రామంలో ఉదయం,7.00 సాయంత్రం 10.00 వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంచుతున్నారని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ తెలిపారు.సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంట వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారుల డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

30 శాతం పంపిణీ పూర్తి

ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 15 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ ఆయన తెలిపారు.
ఝరాసంగం మండల కేంద్ర పరిధిలోని రేషన్ షాపుల్లో 30 శాతం పంపిణీ పూర్తయిందని అధికారి తెలిపారు.

దుకాణాల వద్ద క్యూ కడుతున్న లబ్ధిదారులు

సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

కారేపల్లి నేటి ధాత్రి:

కారేపల్లి మండలం లోని కొమ్ముగూడెం ముత్యాలంపాడు గ్రామాల లో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వై ఆర్ జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో వై ఆర్ జి కేర్ డిఆర్పి శివయ్య క్లస్టర్ లింక్ వర్కర్ ఆదేర్ల శంకర్ రావు డాక్టర్ ప్రబంధ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి రక్ష పరీక్షలు చేయడం జరిగింది అలాగే టిబి ఎలా వ్యాపిస్తుంది దానికి నివారణ మార్గాలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎలాంటి అనారోగ్యం కలిగినను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని.

Blood tests

ఈ వర్షాకాలపు సీజన్లో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ ప్రబంధ తెలిపారు వివరిస్తూ తెమడ పరీక్షలు టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్యం ల్యాబ్ సూపర్వైజర్ రామకృష్ణ టీబీ పేషెంట్ సూపర్వైజర్ విజయ కుమారి ఎల్ హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు ఏఎన్ఎం శ్యామల విజయ కుమారి ఆశా వర్కర్లు సుజాత హనుమంతి పద్మ సావిత్రి వెంకటరమణ లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘‘నేటిధాత్రి’’కి ‘‘గుమస్తా’’ నోటీసులు!

`నిజానికి, నిర్భయానికి నిదర్శనం ‘‘నేటిధాత్రి’’.

`ఈ పిట్ట బెదిరింపులు ‘‘నేటిధాత్రి’’ చాలా చూసింది.

`రైతు ప్రయోజనాలే నేటిధాత్రి’’కి ముఖ్యం.

`రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం.

`2016 లో ‘‘నేటిధాత్రి’’ రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది.

`‘‘నేటిధాత్రి’’ చేసింది ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం.

`ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్‌ ఆటలాడుతున్నాడు!

`వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్‌ వడ్లు మాయం చేస్తున్నాడు!

`చిన్నా, చితక వ్యవహారం అనుకుంటున్నాడు

`కేంద్ర ప్రభుత్వం అన్ని గమనిస్తోంది.

`కేంద్రం రంగంలోకి దిగితే అసలు సినిమా అప్పుడు తెలుస్తోంది.

`కిలాడి జగన్‌ ను ఉసిగొల్పుతున్న జగత్‌ కిలాడీలు ఎవరో ‘‘నేటిధాత్రి’’ కి తెలుసు.

`మిల్లర్‌ జగన్‌ చేసిందే అన్యాయం, ఘోరం.. నేరం.

`నేరం చేసి బరితెగిస్తామంటే మీడియా ఊరుకుంటుందా?

`ప్రభుత్వం కళ్లు మూసుకుంటుందా?

`పాపం పండే సమయం చట్ట పరంగా రాకుండా వుంటుందా?

`‘‘నేటిధాత్రి’’ కథనంతో యంత్రాంగం కదలకుండా వుంటుందా?

`సివిల్‌ సప్లైలో ఎంత మందిని మేనేజ్‌ చేయగలరు.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి వారు ఒక్కరు చాలు.

`ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది.

`‘‘నేటిధాత్రి’’ ఎప్పుడూ తప్పుడు వార్తలు రాయదు.

`21 సంవత్సరాల ట్రాక్‌ రికార్డులో మచ్చ లేదు.

`తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు.

`బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తుంది.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌ మిల్లులకు నోటీసులిచ్చింది నిజం కాదా?

`2 వేల బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా?

`ముగ్గురు బలమైన మంత్రులున్న ఖమ్మం రైతులను మోసం చేయడం అంత సులువనుకున్నావా?

`జగన్‌ మిల్లుల నుంచి మురుగు నీరు ఇరిగేషన్‌ కాలువలో కలుస్తున్నది నిజం కాదా?

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా?

`అనవసరంగా జగన్‌ ఆటలో అరటిపండౌతున్నాడు.

`జగత్‌ కిలాడీల బాగోతం బైటకు రాకుండా జగన్‌ను ముందు పెట్టి ఆడిస్తున్నారు.

`‘‘నేటిధాత్రి’’కి నోటీసులిచ్చి జగన్‌ మరింత ఇరుక్కున్నాడు.

`తెలంగాణలో మిల్లర్లు మింగిన వడ్ల లెక్కలు వెయ్యి కోట్లౌతుంది.

`రైతులను మోసం చేసిన వారి బండారం బైట పెట్టడం ‘‘నేటిధాత్రి’’ కర్తవ్యం.

`రైతుల వడ్లు జగన్‌ మాయం చేయడం నేరం.

`ఈ రెండిరటికీ తేడా తెలియక ఎగిరితే జగన్‌ ఎల్లెలుకల పడడం ఖాయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

  రైతుల వడ్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా జగన్‌ అలియాస్‌ మిల్లర్‌ జగన్‌ నేటిదాత్రి దినపత్రికకు నోటీసులు పంపించారు. జగన్‌ వ్యవహారం ఎలా వుందంటే దొంగే దొంగ అన్నట్లుంది. ఆరు గాలం కష్టించి రైతులు పండిరచిన వడ్లును అన్యాయంగా మాయం చేసినప్పుడు తాను తప్పు చేస్తున్నానని గుర్తురాలేదా? తాను చేసేది పెద్ద నేరమన్న సంగతి తెలియదా? పొరపాట్లు చేసుకుంటూ పోయే వ్యక్తిని నేటిధాత్రి జగన్‌ చాలా గొప్ప పని చేశాడంటూ కీర్తించాలనుకుంటున్నాడా?ఏమిటి? చేసిందే పాడు పని. పాపిష్టి పని. పాపపు పని. రైతులను అన్యాయం చేయడమే పెద్ద ఘోరమైనపని. అంతా చేసి తన పరువుకు భంగం కలిగిందని నేటిధాత్రికి నోటీసులు పంపితే బెదిరిపోతుందనుకున్నాడో ఏమో? మిల్లర్‌ జగన్‌ చేసినపని అందరికీ తెలుసు. జిల్లా అధికారులకు తెలుసు. జగన్‌ చేసిన పని ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ యంత్రాంగానికి తెలుసు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏకంగా జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులకు సూచించారు. ఖమ్మం జిల్లానుంచి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయినా జగన్‌ మేకపోతు గాంభీర్యం ఎక్కడో ప్రదర్శించాల్సిందిపోయి, నేటిదాత్రికి నోటీసులు పంపించి మరింత తప్పు చేసినట్లైంది. నేటిధాత్రి ఇలాంటి పిట్ట బెదిరింపులు గత 24ఏళ్లలో అనేకం చూసింది. జగన్‌ అనేవ్యక్తి తప్పు చేయకుంటే నేటిధాత్రిలో వార్త అయ్యేదే కాదు. హన్మకొండ జిల్లాల్లో ఏ మిల్లర్‌ చేయని నీచమైనపని చేసి, తాను సచ్చీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం కూడా హర్షించదు. ఇప్పుడిప్పుడే జగన్‌ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఖమ్మం జిల్లా నుంచి ఇది వరకు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వడ్ల వివరాలు కూడా అన్నీ త్వరలో పూర్తి వివరాలు రానున్నాయి. పెద్దఎత్తున రైతులను జగన్‌ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వస్తోంది. జగన్‌ మీద వర్తాల పరంపర ఆగిపోలేదు. ఇప్పుడే మొదలైంది. ముందు ముందు మరిన్ని కథనాలున్నాయి. జగన్‌ చేసిన తప్పుల లెక్కలు అన్నీ బైటకు వస్తాయి. ఎందుకంటే నేటిధాత్రికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రైతులను మోసం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తిలేదు. ఉదారత ప్రదర్శించే అవకాశం లేదు. రైతులను మోసం చేసిన వారు ఎంత పెద్ద వాళ్లైనా సరే నేటి ధాత్రి వదిలిపెట్టదు. పైగా చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, జగన్‌ తాను చేసిన సుద్దపూస పని గొప్పగా వుందనుకుంటున్నాడో ఏమో? నేరం చేసి కూడా ఇంకా బరితెగిస్తామంటే నేటిధాత్రి ఊరుకోదు. తప్పులు, మోసాలు చేసిన వారికి పాపం పండే సమయం ఎప్పుడో అప్పుడు వస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేటిధాత్రిలో వచ్చిన కథనాలలో తప్పు వుంటే జగన్‌ మీడియా ముఖంగా వివరాలు వెల్లడిరచవచ్చు. పూర్తి వివరాలు బైట పెట్ట వచ్చు. ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన మిల్లులలో 2వేల వడ్ల బస్తాల మాయాజాలంపై నోటీసులు అందిన మాట వాస్తవం కాదా? తనకు నోటీసులు రాలేదని జగన్‌ చెప్పగలరా? ఈ వివరాలు ఎందుకు బైట పెట్టడం లేదు. అదికారులు ఎంత మందిని జగన్‌ మేనేజ్‌ చేయగలడు. ఎంత కాలం వారు కాపాడగలరు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినసమయంలో తప్పకుండా వారు స్పందించాల్సిందే. జగన్‌పై కేసులు నమోదు చేయాల్సిందే. లేకుంటే అధికారులు తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాల్సిందే. జగన్‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదన్న భ్రమల్లో వున్నట్లున్నాడు. రెండు మూడు రోజుల్లో అంతా తేలుతుంది. అప్పుడే తొందరెందుకు? పిల్లికండ్లు మూసుకొని పాలు తాగినట్లు, తన మిల్లులో వడ్లు మాయమైతే గుర్తించేదెవరు అని అనుకున్నాడు. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వడ్ల బస్తాల మీద లెక్కలు రాయిస్తారని పసిగట్టలేపోయాడు. రాత్రికి రాత్రి వడ్లు తరలించి, లేవని చేతులు దులుపుకుంటే సరిపోతుందనుకున్నాడు. కాని ఒక సమర్ధవంతమైన ఐఏఎస్‌ అధికారి సరిగ్గా పని చేస్తే ఎలా వుంటుందో జగన్‌కు ముందు ముందుతెలుస్తుంది. జగన్‌ లాంటి అక్రమార్కుల పని పట్టాలంటే ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి ఉన్నతాదికారి ఒక్కరు చాలు. ఇంత కాలం తిన్నదంతా కక్కించేందుకు పెద్దగా సమయం పట్టదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లైలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా కమీషనర్‌కు వెళ్తూనే వుంది. కమీషనర్‌ చౌహాన్‌ అన్నీ గమనిస్తూనేవున్నారు. నేటిధాత్రికి సుద్దపూసలాగా జగన్‌ నోటీసులు పంపడం కూడా వారి దృష్టికి వెళ్లింది. నేటిధాత్రి అనేది ఒక బ్రాండ్‌. మీడియా రంగంలో నేటిధాత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాదు, స్ధానం వుంది. రెండున్న దశాబ్ధాల కాలంలో తప్పుడు వార్తలు రాయడం అన్నది జరిగింది లేదు. ఇప్పటి వరకు తప్పుడు వార్తలనే మచ్చ లేదు. తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు, నేరాలు చేస్తున్న జగన్‌ తన పరువు గురించి ప్రస్తావించడమే విచిత్రంగా వుంది. నేటిధాత్రికి పంపిన నోటీసుల్లో వడ్ల ప్రస్తావన చేసిన జగన్‌ తన మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు. తమ మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీటి ప్లాంట్ల గురించి ఎందుకు చెప్పలేదు. ఆ నీరుంతా ఇరిగేషన్‌ కాలువలో కలవడం లేదని నిరూపించగలడా? కాలువల్లో పారుతున్న మురుగునీటికి మిల్లుల నుంచి వెలువడుతున్న నీరు కాదని రుజువు చేసుకోలగడా? ఇటు ఇరిగేషన్‌ శాఖకు నష్టం చేస్తూ, అటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును మోసం చేస్తూ, ప్రజల ప్రాణాలకు హాని తలపెడుతున్న జగన్‌ కూడా నీతులు వల్లించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. తెలంగాణలో ముగ్గురు మంత్రులున్న ఏకైక జిల్లా ఖమ్మం. అలాంటి జిల్లాకు చెందిన రైతులు మోసం చేస్తే వదిలేస్తారని జగన్‌ ఎలా అనుకుంటున్నాడో? ఎవరు రక్షిస్తారనుకుంటున్నాడో? ఎందుకంటే జగన్‌కు పూర్తిగా రైతుల చట్టాలు తెలియనట్లున్నాయి. ఇంత కాలం నేటిధాత్రిలా చెప్పిన మీడియా లేకపోవడం కూడా జగన్‌కు కలిసొచ్చినట్లుంది. ఆహార భద్రతా చట్టాలు ఎంత పకడ్భందీగా కేంద్రం అమలు చేస్తుందో ఎప్పుడూ విననట్లుంది. 2019కి మందు తెలంగాణలో సివిల్‌ సప్లైలో జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి రాసిన వరుస కధనాలతో కదిలిన కేంద్రం సబ్సిడీలు అప్పుడు ఆపేసింది. ఇంత వరకు వాటిని విడుదల చేయలేదు. అంతటి ట్రాక్‌ రికార్డు నేటిధాత్రి సొంతం. తప్పులు చేసి కూడా పరువు, ప్రతిష్ట అని జగన్‌ చెప్పుకోవడమే సిగ్గు చేటు. అలాంటి వారిని వదిలిపెట్టిన చరిత్ర నేటిధాత్రికి లేదు. బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేసిన చరిత్ర నేటిధాత్రిది. ఆ సంగతి తెలిసి కూడా జగన్‌ చేసిన తప్పు సరిదిద్దుకోకుండా నోటీసులు ఇవ్వాలనుకోవడం మరో తప్పుకు కారణమైంది. నేటిధాత్రి చేసేదే ఇన్‌వెస్టిగేషన్‌ జర్నలిజం. ఆ సంగతి జగన్‌కు తెలియకపోవడం విచారకరం. జగన్‌ చేసింది చిన్నా చితకా వ్యవహారంకాదు. దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులను మోసం చేసిన మిల్లర్లు ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో తెలుసుకుంటే మంచిది. అనేక రాష్ట్రాలలో బస్తా వడ్లు మాయం చేసిన మిల్లర్లపై కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. ఇక్కడ అదికారుల ఉదాసీనతతో మిల్లర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా కిలాడీ జగన్‌ వెనుక వున్న జగత్‌ కిలాడీలు ఎవరో కూడా నేటిధాత్రికి తెలుసు. జగన్‌కు ఉసిగొల్పి ఆట లాడిస్తున్నవారి మాటలతో మొదటికే జగన్‌ మోసం తెచ్చుకుంటున్నాడు. ఆఖరుకు ఆటలో అరటి పండు కావడమే తరువాయి అన్న సంగతి జగన్‌ తెలుసుకోలేకపోతున్నాడు. అనసవరంగా సివిల్‌ సప్లైతో సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఎగదోసే వాళ్లు ఎగదోస్తారు? ఒక్కరిని ముందు పెట్టి ఆడిరచాలనుకుంటారు? కారణం ఇతరులు చేసే తప్పుల మీద చర్చలు రాకుండా చూసుకుంటారు. వడ్ల మాయం సంగతి ఒక్క జగన్‌కే సొంతం కాదు. తెలంగాణ వ్యాప్తంగా చాల మంది జగన్‌ లాంటి మిల్లర్లు సాగిస్తున్నారు. అవన్నీ బైటకు వచ్చే సమయం ముందు ముందు వుంది. ఆ లెక్కలన్నీ తేలిస్తే వేల కోట్లవుతున్నాయి. రైతులను ఏఏ మిల్లర్‌ ఎంత మోసం చేశాడన్నది కమీషనర్‌ స్ధాయిలో అన్ని లెక్కలున్నాయి. అవి కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. అప్పుడు జగన్‌కే కాదు, అందిరకీ వుంటుంది?

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య.

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ సిజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంకు సంబంధించి బుధవారం దేవాలయం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో.. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రో” జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Shiva temple

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరు చదువుకోవాలని లక్ష్యంతో. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

 

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. అలాగే నిరుపేదలు ఎవరు ఉన్నా సరే వారు ఏ పార్టీలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడకూడదు అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి దాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రలోని. దేశ పల్లి గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంగన్వాడీలోని. పిల్లలు నమోదు కావాలని అంగన్వాడీ లోనే పిల్లలకు సంపూర్ణ వికాసం అభివృద్ధి చెందుతుందని మన అంగన్వాడీలో కూడా ఫ్రీ స్కూల్స్ పిల్లలకు బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అలాగే ఆటపాటలతో కూడిన అందిస్తారని విద్యతోపాటు పిల్లల ఫస్ట్ ఆహారం వారి పెరుగుదల పర్యవేక్షణ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సూపర్వైజర్ సుస్మిత. తల్లులు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు

11వ అంతర్జాతీయ యోగ డే జూన్ 21 నుంచి నిర్వహించబడును.

11వ అంతర్జాతీయ యోగ డే జూన్ 21 నుంచి నిర్వహించబడును…

తంగళ్ళపల్లి నేటి దాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల వృద్ధ ఆశ్రమంలో ఈనెల 11వ తారీకు నుంచి అంతర్జాతీయ యోగా డే 21 వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక వృద్ధాశ్రమంలో ఉన్న సీనియర్ సిటిజన్ వారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగ చేయాలని తెలుపుతూ వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ యు నాని. డిస్పెషనరీ. యోగ శిక్షకులు బి శ్రీనివాస్. టి సప్న సీనియర్ సిటీ జనులతోఆసనాలు ప్రాణామాయం ముద్రలు ధాన్యం చేస్తూ వాటి ఉపయోగాలు ఫలితాలు వివరించారు. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తిరుపతి స్థానిక గ్రామ మండల పల్లి. ఆశ వర్కర్లు సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు

దశ మారుతున్న దామర చెరువు

దశ మారుతున్న దామర చెరువు..

ఎమ్మెల్యే రోహిత్ రావు చొరవుతో వేగంగా అభివృద్ధి పనులు..

ఇప్పటివరకు రూ.7 కోట్ల అభివృద్ధి పనులు..

రామాయంపేట జూన్ 11 – నీటి ధాత్రి (మెదక్)

మెదక్ నియోజకవర్గం లోని రామయంపేట మండలం దామరచెరువు గ్రామానికి మహర్దశ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి దామరచెరువు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందే గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రారంభించారు. మొట్టమొదటగా ఇక్కడ లేనివిధంగా గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. రూ. రెండు కోట్లతో బీటి, సి సి, రోడ్డుతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు ఐదున్నర కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా చర్చి కాంపౌండ్ లో, మరియు అంగన్వాడి పాఠశాల, ప్రభుత్వ దవాఖాన వద్ద టాయిలెట్లను నిర్మించేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ధి పనులు జరగకపోవడం ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాడవాడలో సిసి రోడ్లు, గ్రామం నుండి వెళ్లే రోడ్డు బిటి మరియు సిసి రోడ్డుగా పనులు చేయడం పట్ల గ్రామస్తులతో పాటు గిరిజనులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారు.

 

The changing phase of the Damara Lake

… చెప్పడం కాదు చేతుల ప్రభుత్వం మాది.. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుడు మాటలు కాదు చేతుల ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే నిజం చేస్తున్నాం. ఎవరు ఇచ్చిన విధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పనులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. దామరచెరువు గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ మేము అలా చేయలేదు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రత్యేక చొరవత గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఎక్కడలేని విధంగా చేయడం జరుగుతుంది. గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం.

ఎమ్మెల్యే రోహిత్ రావుకు రుణపడి ఉంటాం.. మాజీ సర్పంచ్ పడాల శివప్రసాద్ రావు.

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావ్ చెప్పారు. అంతకుమించి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. దీంతో గ్రామంలో రూపురేఖలే మారిపోతున్నాయి. ఏక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించకుండా బీటీ మరియు సిసి రోడ్లు వేయించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామం అభివృద్ధి దిశలో వెళుతుంది. ఇది ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు చొరవ తోనే. ఆయనకు గ్రామస్థులం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.

The changing phase of the Damara Lake.

 

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి :హైదరాబాద్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియమక పత్రాలని విడుదల చేసిన భాగంగా అందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హుజురాబాద్ నియోజకవర్గనికి

చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ నియోజకవర్గం కార్యదర్శి ఉమ్మడి సందీప్ జమ్మికుంట పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బిసది వంశి తదితరులు పాల్గొన్నారు.

ఎస్ సి గురుకుల పాఠశాలనుమైదాన ప్రాంత నాయకులు తరలించుకు పోతున్నా పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ తెరాస నాయకులు అవసరమా డా జాడి రామరాజు నేత

ఎస్ సి గురుకుల పాఠశాలనుమైదాన ప్రాంత నాయకులు తరలించుకు పోతున్నా పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ తెరాస నాయకులు అవసరమా

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం నేటి ధాత్రి

కన్నాయిగూడెం మండల కేంద్రం లోని బుట్టాయిగూడెం గ్రామంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఏటూరు నాగారం లో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల ను మంగపేటకు మార్చిన తర్వాత మైదాన ప్రాంత నాయకులు ఏజెన్సీ ప్రాంత దళిత బహుజన వర్గాల విద్యార్థులకు విద్య అందకుండా చెయ్యడమే లక్ష్యాంగా నాటి జిల్లా పరిషత్ చైర్మన్ క్రీశే జగదీష్ మరియు నాటి ప్రతిపక్ష నాయకురాలు నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మల్లంపల్లి కి తరలించుకు వెళ్లిన మాట్లాడాని కాంగ్రెస్ తెరాస నాయకులు ఈ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అదేవిదంగా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి ఏజెన్సీ ప్రాంతం లో ఉన్నా ఐటీడీఎ ను కూడా మైదాన ప్రాంతానికి తరలించుకొని పోవాలని చూస్తున్నా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మైదాన ప్రాంత కాంగ్రెస్ నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రినాటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా దళిత బంద్ నిరుపేదలకి అందకుండా నాడు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులకు ఇచ్చింది నేడు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందకుండా కాంగ్రెస్ నాయకులకే ఇస్తే జెండాలు మోసి జేజేలు కొట్టిన నిరుపేదలైన కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమణి అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజనమైనార్టీ నాయకులారా మైదాన ప్రాంతనాయకురాలు పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోకుండా ఈ మన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని విడాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు ఏటూరునాగారం కన్నాయిగూడెం తడ్వాయి మంగపేట కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలోచించి చుడండి మైదాన ప్రాంత నాయకురాలు ఏటూరు నాగారం లో ఉండవలసిన సాంఘిక సంక్షమా గురుకుల పాఠశాలను స్థానిక మండలమైన మల్లంపల్లికి తీసుకెళ్ళింది దేవాదుల లీప్ట్ ఇరిగేషన్ నుండి ములుగు మండల రైతులకు సాగు నీరు త్రాగునిరు

 

తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాన్ని ఎడారిగా చేసిన నాయకురాలు అవసరమా అదేవిదంగా 6 కోట్లతో కొండాయి దొడ్ల వాగుపై నిర్మించిన బ్రిడ్జి పిల్లర్ల దగ్గర ఇషిక తీసి బ్రిడ్జిని కులగొట్టి 8మంది మరణానికి కారణమైన కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు అవసరమాఅన్నారు అదేవిదంగా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామాన్ని మండలం చేస్తానానీ చెప్పి ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయి మైదాన ప్రాంతమైన మల్లంపల్లి మండలం చేసుకున్నా నాయకురాలు ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలకు అవసరమా 2011 మున్సిపాలిటీ చట్ట ప్రకారం ఏటూరు నాగారం గ్రామపంచాయితీ 20వేల 800వందల జనాభా కలిగి ఉన్నా ఏటూరు నాగారం గ్రామపంచాయితీ ని మున్సిపాలిటీని చేయకుండ 13వేల 600వందల జనాభా కలిగి ఉన్నా ములుగు ను మున్సిపాలిటీ ని ప్రకటించు కున్నా మంత్రి మనకు అవసరమా అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం బస్సు డిపో గురించి గత 35సంత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుకున్న చిరుకాల కళ నేరవేర్చకుండా ములుగు బస్సు డిపో ప్రకటించుకున్నా మంత్రి అవసరమా అన్నారు అదేవిదంగా రెవెన్యూ డివిజన్ ఇంపిల్మెంట్ కాకుండా అడ్డుకొని రాక్షసనందం పొందుతూ ఉన్నా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోవడంఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలవలన వాళ్ళ కుటుంబాలు బంధువులు అభివృద్ధి అవుతున్నారు తప్ప నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నా సంక్షమా పథకాలు అందకుండా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని భూస్థాపీతం చెయ్యడమే లక్ష్యాంగా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఏకం కావలసిన అవసరం వచ్చిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

టిఆర్టిఎఫ్ బడిబాట ర్యాలీ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని ఘనంగా నిర్వహించారు. టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ బోయన్న గారి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ర్యాలీని ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో కంప్యూటర్ విద్య, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి తరగతిగది సామర్ధ్యాన్ని విద్యా హామీగా మేము ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నందున వాటిని ఉపయోగించుకోవాల ని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

We guarantee quality education.

ఒత్తిడి లేని విద్య, పౌష్టికాహారం ప్రభుత్వ పాఠశాలలతోనే సాకారం అని పేర్కొన్నారు.

 

 

 

తెలంగాణ రాష్ట్ర టీచర్ల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచడం ద్వారా, ప్రభుత్వ విద్యను వారికి అందుబాటులో తెచ్చేందుకు, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేసేందుకు, పాఠశాలల్లోని వివిధ కార్యక్రమాల్లో సమాజాన్ని అనుసంధానం చేయడం, తదితర అంశాలుగా ఈ బడిబాట విద్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బైక్ ర్యాలీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నుండి బయలుదేరి న్యూ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు సాగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షులు మోతిలాల్, టిఆర్టిఎఫ్ నాయకులు పోతుగంటి రమేష్, మహేషుని లక్ష్మీనారాయణ , గోలీ రాధాకిషన్, ముత్తయ్య గారి నాగరాజు, జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, ఇప్పకాయల ప్రకాష్, రాజశేఖర్, దేవేందర్, పప్పుల శ్రీనివాస్ సామల రాములు, కుమారస్వామి, పులి ప్రవీణ్ కుమార్, కోల వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు బాలఎల్లయ్య, కొమురయ్య, సుల్తాన్ రాజు, బూట్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version