కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి రద్దు కలెక్టర్ ఆదర్శ్ సురబి…

 

కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి రద్దు కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిధాత్రి .

 

 

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజావాణి దరఖాస్తు దారులు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి కోరారు దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుని రావొద్దని ఒక ప్రకటన లో ప్రజలను కోరారు

మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజావాణి తాత్కాలిక రద్దు

మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి తాత్కాలిక రద్దు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసునట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version