భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ…

భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం జడ్పి ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, ఇతరులు 4 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.

అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట రెండు చోట్లా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

30 వార్డు విభజనలో అన్యాయం.

30 వార్డు విభజనలో అన్యాయం

అఖిలపక్ష ఐక్యవేదిక.

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి 30 వ వార్డులో అఖిలపక్ష ఐక్యవేదిక తరుపున వార్డు ను పరిశీలించామని
మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తెలిపారు
వనపర్తి లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వ నిధులను ఉపయోగించకుండా కొందరి సలహా హాలు తీసుకుని రోడ్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సతీష్ ఎమ్మెల్యే ను అధికారులను కోరారు
వార్డు విభజనలో 30 వార్డును అన్యాయంగా 5 వార్డులను చీల్చి ఒక వార్డుగా చేశారని దానివల్ల వార్డు అభివృద్ధి కి నోచుకోవడం లేదని అన్నారు జంగిడి పురం మర్రిచెట్టు అనూస్ స్కూల్ రోడ్డు గుంతలు ఏర్పడి ఈ రోడ్డు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి.వరకు లింకు ఉన్నదని, సివి రామన్ కాలేజ్ కింది నుండి నాగవరం పోయే రోడ్డు మొత్తం దెబ్బతిన్నదని
స్విమ్మింగ్ పూల్ దగ్గర రెండు రోడ్లు ఇంతవరకు వేయలేద నివెంటనే సిసి రోడ్లు వేయాలని 30వ వార్డు ప్రజల తరఫున అధికారుల ను ఎమ్మెల్యే ను కోరారు 30 వార్డు ను పరిశీలించిన వారిలో వెంకటేశ్వర్లు తెలుగుదేశం కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్, రామస్వామి నాగరాజూ, రమేష్ ముదిరాజ్ గార్డుల శీను వార్డు ప్రజలు ఉన్నరని సతీష్ యాదవ్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version