సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనూషను గెలిపించండి
సిపిఐఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో కాంగ్రెస్,సిపిఐ సిపిఐఎం కూటమి అభ్యర్థి ఎర్రం అనూషను సుత్తే కొడవలి చుక్క గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు
సోమవారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డు లోని హైటెక్ కాలనీ, రెవెన్యూ కాలనీ,సత్తార్ నగర్,జవహర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ… ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి మున్సిపాలిటీని అత్యాధునిక అంగులతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ప్రజలు తమ వంతుగా ఓటు హక్కుతో 27వ వార్డు అభ్యర్థిని ఎర్ర ఆనుషను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎర్రం సతీష్ కుమార్,ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు వంగాల లక్ష్మి,సంఘం ప్రీతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్,సిపిఎం నాయకులు రాజేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
