మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే…

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే

◆-::జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, ఆందోల్–జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా, సంబంధిత మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు మరియు వ్యాపార సంస్థల్లో (ఫర్ములు) పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, 1881 ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపుకు ముందు రోజు ఫిబ్రవరి 12 (గురువారం) మరియు లెక్కింపు రోజు ఫిబ్రవరి 13 (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version