మేడ్చల్‌లో మునిసిపల్ ఎన్నికల వేళ రాజకీయ కలకలం

ఆగమాగం అవుతున్న ఆ పార్టీ

* మునిసిపల్ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ కు బీటలు
* బిఆర్ఎస్ గూటికి 400 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు
* దడ పుట్టిస్తున్న మునిసిపల్ ఎన్నికలు
* ఆగమాగంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు
* కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మోరాయిస్తున్న సీనియర్లు, బి ఫారం పంచాయతీలతో ఆ పార్టీలు ఆగమాగం అవుతున్నాయి. పార్టీ పీరా ఇంపులతో తలలు పట్టుకుంటున్నాయి. పార్టీలను విడుతున్న నేతలను బుజ్జగించడంలో గోరంగా విఫలం అవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు మేడ్చల్ నియోజకవర్గం లోనే. మునిసిపల్ ఎన్నికల హడావిడి మొదలవగానే పార్టీ పీరాఇంపులు మొదలయ్యాయి. మల్లన్న దూకుడుకు కాంగ్రెస్, బీజేపీ లు కంగూటింతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బిఆర్ఎస్ బాట పట్టారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్యనేతలు బిఆర్ఎస్ లో చేరడం చర్చనియా అంశాంగా మారింది. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ 22 వ వార్డు కొనాయిపల్లి – మైసిరెడ్డిపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమరం, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం, అలియాబాద్ మునిసిపల్ అలియాబాద్ నుండి సుమారు 400 మంది బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కొనయపల్లి లో…
గ్రామ అధ్యక్షులు గుంటి దీపక్ ముదిరాజ్, గ్రామ మాజీ సర్పంచ్ గుంటి శేఖర్ ముదిరాజ్, గుంటి కుమార్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటి చిన్న కుమార్, గుంటి భాస్కర్, అన్నారం శ్యామ్ కుమార్, గుంటి నర్సింగరావు, సంచులింగం, జక్కుల ప్రవీణ్, జక్కుల వంశీ, బోయిని సత్యనారాయణ, అన్నారం నరసింహ, జక్కుల శోభ, బోయిని కుమార్, జక్కుల యాదగిరి, జక్కుల బిక్షపతి, జక్కుల కృష్ణ, ఉప్పరి సత్తయ్య, జక్కుల చిన్న బిక్షపతి, గుంటి మహేందర్ మరియు దాదాపు 100 మంది మహిళాలు, యువకులు.

సోమారం లో…
సోమరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కరుణకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ వార్డ్ మెంబెర్ సి హెచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.కృష్ణ, ఆర్. బలరాం, బి చంద్ర శేఖర్, అశోక్ లు.

అలియాబాద్ లో…
అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20.

ఎల్లగూడెం లో….
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్లం వెంకటేష్, రమేష్, సంతోష్, సాయి కిరణ్, కాంగ్రెస్, బీజేపీ నుండి 60 మంది.

ఆనంతారంలో…
కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామితో పాటు 30 మంది పార్టీ లో చేరగా విరందరికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆహ్వానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version