కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగినది. గత కొద్ది కాలం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి.
రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ, గ్రామ స్థాయి,నాయకులు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి. చిత్రపటాన్ని పెట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వెళ్లడం జరిగినది. అక్కడ ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడానికి అనుమతించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగినది. ఇంతలో పోలీసుల జోక్యంతో ఇరు పార్టీల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నుండిజలగం ప్రవీణ్, మునిగేల్ రాజు,గజ్జల రాజు, గుండెలు శీను, భైరవేణి రాము, భాను,ఆరుట్ల మహేష్, చుక్క శేఖర్, రంజాన్ నరేష్, అభి గౌడ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మీ గార్డెన్ లో ప్రవళిక – శివ కుమార్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు.

వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు

వనపర్తి: నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి
మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా
షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు.

‘ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు’

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆరు మండలాల పాత్రికేయ బృందం 100 వాహనాలతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం త్రివేణి సంగమం శ్రీ సరస్వతి నదిలో స్థానం ఆచరించి.. శ్రీ ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భావాలతో దైవారాధన చేయాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర అమలు పరిస్థితులు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ధాన్యం కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిపడిన ధాన్యాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ధనరాశిని రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర….
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు, గండ్ర వీరాభిమాని బోయిని స్వామి గారి తమ్ముడు బోయినిరాములు – స్వరూప గార్ల కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన దంపతులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .

వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, చెక్క శ్రీధర్ గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, రాజేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నేర్పాటి శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు జన్ని రాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ రహీం, సీనియర్ నాయకులు గుండారపు రాజు, బండి కుమార్ స్వామి, తిమ్మాపురం ఆనంద్, ఆకినపల్లి చిరంజీవి, మరియు గండ్ర అభిమానులు పాల్గొన్నారు

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే

 

వనపర్తి నేటిధాత్రి :

 

శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.

భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.

అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు
పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే.

‘జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే’

బాలానగర్ నేటి ధాత్రి :

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి మాజీ ఎంపీటీసీ నేనావత్ వెంకట్ రాము కూతురు నేనావత్ వందన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వందనాకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందన ఉన్నత విద్యలు చదివి తిరుమలగిరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాండవాసులు పాల్గొన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి. !

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం సీతారాంతండకు చెందిన వాంకుడోత్ రజిత-ఉక్కస్వామి దంపతుల కూతురు కృష్ణవేణి-శ్రీనివాస్ ల. వివాహ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

ఖానాపూరం మండలం బుధరావుపేట గ్రామంలో భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారా తోరణం (ఆర్చ్) ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుదవారం ప్రారంభించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు,దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం రామ్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్యను హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం రోజు పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు , వారి వెంట బి ఆర్ఎస్ మండల అద్యక్షులు అల్లం రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు రాజిరెడ్డి గారు మండల నాయకులు పాండ్రాల వీరస్వామి పెరుమాండ్ల రవీందర్ గౌడ్  ఉన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దికి సన్మానం.

ఉద్యమ సారధిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి  నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రథసారధి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన వ్యక్తి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వసంతాల రజతోత్సవ సభను తన భుజస్కందాలపై మోస్తూ సభను విజయవంతం చేయడంలో తన మార్కు చూపించిన పెద్దికి మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే శ్రీనివాసులు గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, ఊరటి అమరేందర్ రెడ్డి, భగీరథ, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశం.!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల
సర్వపురం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమాన్ మహా యాగం మహోత్సవానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పూర్ణాహుతితో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తాంత్రిక పూజారి ప్రదీప్ కుమార్ గురుస్వామి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి, ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు గాను ₹4,87,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గోవర్దన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,మైనార్టీ అధ్యక్షులు వహీద్ , గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది….
లబ్ధిదారుల వివరాలు సత్వార్ గ్రామానికి చెందిన లలిత ₹.25,500/- కృష్ణ ₹.48,000/- లక్ష్మి ₹.17,500/- అనెగుంట గ్రామానికి చెందిన ₹.32,500/- హుగ్గెల్లి గ్రామానికి చెందిన బేబీ లత ₹.22,500/- గౌషియా బి ₹.45,000/- అల్గొల్ గ్రామానికి చెందిన బక్కన్న ₹.21,000/- రయిపల్లి డి గ్రామానికి చెందిన సరిత ₹.15,000/- బాగమ్మ ₹.60,000/- మలచెల్మ తండా కి చెందిన గుని బాయి ₹.22,500/- బుచ్చినెల్లి గ్రామానికి చెందిన శాబుద్దీన్ ₹.37,000/- హోతి బి గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ₹.30,000/- మధులై తండా కి చెందిన రాథోడ్ మోహన్ సింగ్ ₹.16,500/- షేకపూర్ గ్రామానికి చెందిన జైపాల్ ₹.36,000/-గోవింద్ పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ₹.34,000/- కసింపూర్ గ్రామానికి చెందిన గంగమ్మ ₹24,000/-
ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే .

మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ నగర్, ఆల్లిపుర్ రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ అవరణంలో నిర్వహిస్తున్న మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతరకి డి.ఎస్. సుకుమార్ గారితో, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారితో,జనరల్ సెక్రటరీ రవికుమార్ గార్లతో మరియు పాస్టర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి జండా ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డీసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
అనంతరం ఎమ్మెల్యే , చైర్మన్ గార్లు మాట్లాడుతూ గత 95 సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 3 రోజుల పాటు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అని ,ఇట్టి జాతరకు జహీరాబాద్. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి జండా ఊరేగింపు తో వచ్చి దేవుణ్ణి మహిమ పరచడం జరుగుతుందని అన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే .

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ముంగి ఎస్ ఎల్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన న్యాల్కల్ మండల  .మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారి బావమరిది గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ గుండపా,మాజి సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ నేను అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజి సర్పంచ్ లు కళీమ్,ప్రభు పటేల్,మల్లా రెడ్డి,జగదీశ్వర్,కరణ్,మాజి ఎంపీటీసీ రాములు,నాయకులు విజేందర్ రెడ్డి,దత్తురెడ్డి,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ తదితరులు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version