మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం

బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి మాజీ సర్పంచులు బిలకంటి ఉమేందర్రావు నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేష్ యాదవ్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే.

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే
ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం*

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్ ,మాజి ఎంపీటీసీ సంతు పటేల్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు:
బాగారెడ్డి పల్లి కి చెందిన మొగుల్లయ గారికి ₹.15,000/-, కుప్పనగర్ కి చెందిన సంధ్య రాణి గారికి ₹.40,500/-,& సతీష్ గారికి ₹.15,000/-,
ఝరసంఘం కి చెందిన నాగరాణి గారికి ₹.25,500/- జోనగామ కి చెందిన సంగాన్న గారికి *₹.15,000/- తుమ్మన్ పల్లి కి చెందిన ఫకీర్ బాబు గారికి ₹.43,500/- బర్దిపూర్ కి చెందిన నర్సింలు గారికి ₹.600,000/-, సిద్దాపూర్ కి చెందిన స్వరూప గారికి ₹.45,000/- ఈదులపల్లి కి చెందిన మంజుల గారికి ₹.19,500/-..ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య

వనపర్తి నెటిదాత్రి:

shine junior collegeవనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య నియామకం అయ్యారు .వనపర్తి వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు .ప్రధాన కార్యదర్శిగా డి బాలరాజ్ కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్య కార్యదర్శిగా గంధం రాజు కోమరి పుల్లూరి విశ్వనాధం దస్తగిరి ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య నియామకం అయ్యారు ఈ సందర్భంగా పార్లమెంట్ నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షున్ని కమిటీ సభ్యులను అభినందించారు వారికి దిశా నిర్దేశం చేస్తూ వనపర్తి పట్టణంలో అన్ని వార్డులు పర్యటించి వార్డులో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులకు తెలపాలని ప్రజల సమస్యలు పరిష్కరించుటకు కృషి చేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని గైర్హాజరు కాకుండా కమిటీ నాయకులు పాల్గొన్నారు సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల కొరకు పనిచేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలకు మూడు నెలలు రాకుంటే వారి వారి పదవిని తొలగిస్తామని రాములు తెలిపారు తెలుగుదేశం పార్టీ ని దివంగత ఎన్టీ రామారావు స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని ఓటు బ్యాంకు కూడా ఉన్నదని స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను ఉంచుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హోటల్ బలరాం ఫారుక్ ఎండి దస్తగిరి శంకర్ ఆవుల శ్రీను అప్పయపల్లి బాలయ్య చిట్యాల బాలరాజు ఉపేంద్ర బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు హుగ్గెల్లి మధు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,
ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఏ బాబా,యువ నాయకులు మూర్తుజా,సత్యం ముదిరాజ్ ,డా. నాగరాజ్,పర్వేజ్ పటేల్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.

మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .

పార్టీ నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.

సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.

కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.

పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

“అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

 

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 25 , గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ నుంచి రైస మజీద్ వరకు రూ.4 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ విజన్ 2047 ద్వారా మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే రూ.250 కోట్లతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా, మరి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కు ఏమి కావాలన్నా ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, రానున్న 3 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , ఫైయాజ్, లీడర్ రఘు, మోయీజ్,ఉమర్ అఫీజ్, మహబూబ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట గ్రామం రాచన్న స్వామి ఆలయంలో ఓ వివాహ వేడుకలో శుక్రవారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు మాణిక్ రావు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా, దీపక్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్, బొల్లారం రత్నం , మాజి సర్పంచ్ సంజీవ్,కళాకారుడు సునీల్,నాయకులు జూబీర్,అమీర్,జగన్ తదితరులు .

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ

 

పరకాల నేటిధాత్రి :

 

మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ అధ్యక్షులు వెంకన్న ను మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి మల్లికార్జున,ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి విత్తనాలు లో,ఎరువులు,పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోవనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబి ఎస్పీ రావుల గీరీదర్ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు జరుపుకున్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  జెండా ఎగరవేశారు

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి

ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి
రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు
నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం
సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు

బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.

ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,

ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో

 

Sports

 

 

ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు

ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న MLA TSS CCDC.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చీలేపల్లి గ్రామం మహ్మద్ హుస్సేన్ కుమారుడు మహ్మద్ ఆరిఫ్ వివాహా వలిమా వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,
మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాగన్న, శేషి వర్ధన్ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సిద్దప్ప,అక్బర్ సహబ్, సభహ ,గ్రామ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ రాజు,మల్ రెడ్డి,నబి సాబ్, చెంగల్ జైపాల్,మహ్మద్ అక్రమ్,మహ్మద్ హుస్సేన్,ఖాజామియా,మహ్మద్ ఆషిఫ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదని.

రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు.

పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారుపట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు
వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనాభా రెండింతలు అయ్యాయని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు.

జనాభాకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్డు ఉండాలని,అప్పుడే పట్టణం అభివృద్ధి చెంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వనపర్తి పట్టణానికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారు చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

రోడ్డు విస్తరణ ప్రజలకు చాలా అవసరమని, విస్తరణ వల్ల ఎక్కువ లాభం రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులకు కలుగుతుందన్నారు.

కొంత స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇవ్వడం, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం టి.డి.ఆర్ తీసుకోవడం చాలా లాభదాయకమని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో డెవలపర్స్ కు అమ్ముకొని నాలుగింతల లాభం పొందవచ్చు అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు.

ముందుగా రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని అదేవిధంగా రోడ్డు విస్తరణ వంద ఫీట్లు కాకుండా 70 నుంచి 80 ఫీట్ల కు కుదించాలని కోరారు. వ్యాపారస్తుల తరపున అడ్వకేట్ నిరంజన్ పాషా తమ వాదనలు వినిపించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉత్తం గార్డెన్స్ లో జరిగిన విట్టునాయక్ తాండా కి చెందిన కేశు సింగ్ గారి కుమారుడి .వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ గోపాల్, మాజి ఎంపీటీసీ చందు ,చందర్ పవార్,నరేష్, సంజు తదితరులు .

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version