సమస్యల పరిష్కార దిశగా తొలి అడుగు
ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే మే 30న జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో అంతర్గత కమిటీని వేశారు. మూడు సెక్టార్ల నుండి 30 మందిని ఎంపిక చేశారు.
గత రెండు నెలలుగా ఎగ్జిబిటర్స్ (Exhibitors), డిస్ట్రిబ్యూటర్స్ (Distributors), ప్రొడ్యూసర్స్ (Producers) మధ్య నలుగుతున్న సమస్య తారాస్థాయికి చేరడంతో తెలుగు ఫిల్మ్ చాంబర్ (Telugu Film Chamber) దీనిని పరిష్కరించే పనిని భుజానికి ఎత్తుకుంది. మే 30న జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మూడు సెక్టార్లకు చెందిన 30 మందితో ఓ కమిటీని వేస్తామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె. ఎల్. దామోదర ప్రసాద్ (K. L. Damodara Prasad) ఇప్పటికే హామీ ఇచ్చారు. దాని ప్రకారం 30న విశాఖ పట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. అందులో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ నుండి 30మందితో కూడిన అంతర్గత కమిటీని వేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్ వ్యవహరిస్తారు. అలానే కన్వీనర్ గా ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ వ్యవహరించబోతున్నారు.