శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం
సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు