* నీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రిన్సిపాల్
*బిల్డింగ్ నిర్మాణానికి ఉన్న నీరు విద్యార్థులకు ఎందుకు లేవు..?
*పూర్తిగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే అంటున్న విద్యార్థులు
* కొన్ని నెలల క్రింద ఇది కేటీఆర్ ప్రారంభించాల్సిన గురుకుల పాఠశాల
* బోరు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్ధిక సహాయం చేస్తా అన్నారు
* ప్రతి విద్యార్థి తల్లిదండ్రి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు
మొగుళ్లపల్లి నేటిధాత్రి
మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో గత కొన్ని రోజుల నుండి నీటి కొరత ఉంది. ఇక్కడ నీటితో కనీస అవసరాలు కాళ్ల కృత్యాలు మరియు త్రాగునీరు కూడా దొరక్కపోవడం ఆశ్చర్య పడాల్సిన విషయం. ఈ గురుకుల విద్యాలయం ప్రారంభమై మొదటి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. విద్యార్థులు కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అంటే ఇది కాంట్రాక్టర్ తప్ప లేక ప్రిన్సిపల్ నిర్లక్ష్యమా అని విద్యార్థులకు అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ట్యాంకర్లతో నీటిని తెప్పించడం వల్ల సరిగ్గా స్నానాలు చేయలేకపోతున్నామని కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఉండటం లేదని ఒక్కొక్క విద్యార్థి నాలుగైదు రోజుల నుండి స్నానాలు చేయకపోవడంతో విద్యార్థులకు దురదలతో కంతులు లేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో మొగులపల్లి స్థానిక ఎస్సై శ్రీధర్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఎవరి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో గత కొద్ది రోజులుగా నీళ్ల సౌకర్యం సరిగా లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని ఇకనైనా వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరారు.
ఖమ్మం : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టణంలో,శివార్లలో బుధవారం విస్త్రతంగా పర్యటించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో రఘునాథ పాలెం మండలం కోటపాడు గ్రామం మాచినేని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి చేప పిల్లల్ని వదిలారు.బురహాన్ పురంలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేసిన
కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపి పాల్గొన్నారు.అలాగే, పట్టణంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరై దాని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపి రవిచంద్ర తన చేయూతతో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు,అర్చనలు చేశారు.మేదర్ బజార్ లో అంకమ్మ తల్లి ఆలయం, గణేష్ మండపాలలో కొబ్బరి కాయలు కొట్టారు.రమణగుట్ట,24గంటల పంపు,మామిళ్ల గూడెం రామాలయం సెంటర్,బోసు బొమ్మ సెంటర్,గాంధీ నగర్,జహీర్ పుర లంబాడీ తండ, అగ్రహారం, అగ్రహారం గేట్,ఆదిత్య థియేటర్ ఎదురుగా జమ్మిబండ రోడ్డు తదితర చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు.పలుచోట్ల అన్నదానం కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు,గాంధీ నగర్ 3వ వీధిలో భక్తులతో కలసి భోజనం చేశారు.వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.రవిచంద్ర వెంట ఉన్న యువకులు “జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ “అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు,టపాసులు పేల్చారు.
`మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు?
`పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు?
`నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు?
`పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు?
`వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు?
`అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు!
`పాలకుల చిన్న చూపును భరిస్తుంటారు!
`సమాధానం చెప్పలేక, వాళ్ల వద్ద లేక కాదు, పాలకుల పరువు కాపాడేందుకు మౌనం వహిస్తుంటారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒకప్పుడు ఐఏఎస్ అధికారులంటే సమాజంలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఎనలేని గౌరవం వుండేది. ఉద్యోగ పరంగా వారి హోదాకు కూడా ఎంతో విలువుండేది. జిల్లా కలెక్టర్ వస్తున్నారంటే ఎమ్మెల్యేలు సైతం పరుగెత్తుకెళ్లేవారు. ఎంపిలు కూడా కలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూసేవారు. కాని ఇప్పుడు పరిస్ధితి దేశ వ్యాప్తంగా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు అంత గౌవరం వుండేది కాదు. ఒకప్పుడున్న అపరిమితమైన అధికారాలు ఇప్పుడూ వున్నాయి. కాని రోజులే మారాయి. రాజకీయ పరిస్ధితులు మారుతున్నాయి. పాలకుల తీరు మారుతోంది. వారి ఆలోచనలకు తగ్గట్టు ఐఏఎస్, ఐపిఎస్‌లు పనిచేయాలని చూస్తున్నారు. వారి కనుసన్నల్లో వుండేలా చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అపరిమితమైన అధికారాల స్వేచ్ఛ చుట్టూ అల్లిన పంజరంలో వుంటున్నారు. పేరుకు పెద్ద ఉద్యోగం. పాలకులు చెప్పిందే చేయాలి. వారికి నచ్చే విధంగా నడుచుకోవాలి. పాలకల మాటను తుచ తప్పకుండా పాటించాలి. పాలకులు కోరుకుంటున్న రీతిలోనే వారు పనులు చేయాలి. వారి సూచనలు కూడా ఆ దిశగానే వుండాలి. అంతే తప్ప పాలకులు అడగకముందే వారి ఆలోచనలు చెప్పొద్దు. అసలు ఐఏఎస్‌లు మర మనుషులుగా మాత్రమే పనిచేయాలి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరితమైంది కాదు…ఏ రాష్ట్రంలోనూ ఇందుకు భిన్నంగా రోజులు లేవు. టెక్నాలజీ పెరిగింది. మరింత చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతోంది. రాజకీయ నాయకుల పలుకుబడి మాత్రమే పెరుగుతోంది. అధికారుల స్వేచ్ఛకు ముళ్లకంచెలు పడుతున్నాయి. ఆ మధ్య ఓ ఉత్తరాధి రాష్ట్రంలో బిజేపి ఎంపి.
అక్కడి ఎస్పీని పది మందిలో కొట్టిన సంఘటన పెద్ద వైరల్ అయ్యింది. అసలు జిల్లాకు ఎస్పీ అంటే ఎంతో హడల్. అలాంటి వారిని ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో వుంచుకునేందుకు పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకొని వారిపై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యంగా బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఐఏఎస్‌లపై పెత్తనం మరింత ఎక్కువగా వుందన్న ఆరోపణలు కూడా వుంటున్నాయి. గతంలో ఐఏఎస్, ఐపిఎస్‌ల గౌరవం ఎంతో గర్వంగా వుండేది. ఇప్పుడు నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్నట్లు తయారైందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎంత సేపు పాలకులు చెప్పే వాటిని మాత్రమే అమలు చేయాల్సిన పరిస్ధితి ఎదరౌతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి పాలన నుంచి ఐఏఎస్‌లను తమ కంట్రోల్‌లో పెట్టుకోవడం మొదలైందనే చెప్పాలి. అంతకు ముందు కొన్ని విషయాలు చర్చించుకుంటే ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో బోళ్ల బుల్లిరామయ్య అనే మంత్రి వుండేవారు. ఆయన సీనియర్ నాయకుడు. ఎంపి ఎన్నికల్లో సూపర్ కృష్ణను ఓడిరచిన నాయకుడు. అలాంటి నాయకుడి దగ్గరకు ఓ అధికారి తన ప్రమోషన్ కోసం వచ్చి కలెక్టర్‌కు ఒక్క మాట చెబితే పని అయిపోతుందన్నాడు. బోళ్ల బుల్లిరామయ్య చాలా సేపు సంశయించాడు. పని చేసిపెట్టకపోతే అసమ్మర్ధ నాయకుడౌతాడు. తాను చేసినసిఫారసు కలెక్టర్ పట్టించుకోకపోతే పరువు కాస్త తనకు తానే తీసుకున్నట్లౌవుంది. తన వద్దకు వచ్చిన అధికారి కోసం రూపొందించిన సిఫారసు లెటర్‌ను చించేసి, డస్టుబిన్‌లో పడేసి, రేపు మరోసారి వచ్చి కలువు అన్నాడట. ఆ సాయంత్రం కొంత ధైర్యం కూడదీసుకొని కలెక్టర్‌కు ఫోన్ చేసి, ఆ పని చేసిపెట్టమని రిక్వెస్టు చేశాడట. ఇదీ ఒకప్పుడు నాయకుల్లో నిబద్దత…ఐఏఎస్‌లకు వున్న విలువ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన జయప్రకాశ్ నారాయణతో ప్రతి విషయాన్ని ఎన్టీఆర్ కూలంకుషంగా చర్చించేవారట.
వారి సూచనలు , సలహాలు తప్పకుండా స్వీకరించేవారట. అలా ఉమ్మడి రాష్ట్రంలోపూర్వపు ముఖ్యమంత్రులందరూ ఐఏఎస్ అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సూచనలు తీసుకుంటూ వుండేవారు. సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేసేందుకు వారిని రిక్వెస్టు చేసేవారు. కాకపోతే తమకు నచ్చని అధికారులను, తమకు సహకరించని అధికారులను పక్కన పెట్టడం అప్పుడూ వుంది…ఇప్పుడూ వుంది…కాకపోతే ట్రీట్ మెంటులో కొంత తేడా వుంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు సైతం ఐఏఎస్‌లకు కొంత భయపడేవారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏది చెబితే, అది కలెక్టర్లు చేయాల్సిందే…లేకుంటే ట్రాన్స్‌పర్ కావాల్సిందే…ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో వున్నదే…కాకపోతే ఇప్పటికీ ఎంతో కొంత గౌరవం ఐఏఎస్‌లకు తెలంగాణ రాష్ట్రంలో వుందని కూడాచెప్పొచ్చు. అక్కడక్కడా ఇక్కడ కూడా కొన్ని వివాదాలు ఎదరైన సందర్బాలు కూడా వున్నా, ఐఏఎస్‌లను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఎందుకంటే పరిపాలనా విషయాల్లో అనుభవం వున్న అనేక మంది రిటైర్టు ఐఏఎస్ అధికారులను కూడా తిరిగి వారి విధులను వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఐఏఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు అధికారాలే కాదు…
కనిపించని అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే కొందరు సర్వీసులను కూడా వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేసే పని పెట్టుకుంటున్నారు. కొందరు రాజకీయాల్లో చేరుతున్నారు. పార్టీలకు నాయకత్వాలు వహిస్తున్నారు. పాలకులు ఐఏఎస్‌ల మాటలు వినాలన్న రూలేం లేదు. పాలకులు చెప్పినట్లే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు చేయాలి. అయితే ప్రజాశ్రేయస్సు కోసం మాత్రం ఐఏఎస్‌లు ఆలోచించాలి. పాలకులు చెప్పిన ప్రతి దానికి తలూపడం కూడా చేయకూడదు. కాని అదే వైఎస్ హయాంలో ఎంతో మంది ఐఏఎస్‌ల కొంప ముంచింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి విషయంలో ఐఏఎస్‌లు జైలుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురైంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కారణమన్న దానిపై అనేక చర్చలు సాగిన మాట తెలిసిందే. అయితే ఓసారి జగన్ కోర్టుకు హజరైన సందర్భంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందని అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలియంది కాదు. ఎంతో నిజాయితీ పరురాలుగా పేరున్న ఓ మహిళా ఐఏఎస్ జైలు జీవితంలో కనీసం నడవలేని స్ధితికి చేరుకున్న సందర్భం చూశాం. ఇదంతా పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి చేసుకున్న స్వయంకృతాపరాధంగా కూడ చెప్పొచ్చు. అయినా ప్రభుత్వం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేయడం వల్ల జరిగిన పరిణామాలను చూసైనా ఐఏఎస్ అధికారులు కొంత జాగ్రత్తగా వుండాలని అంటుంటారు. ఏ ఐఏఎస్ అధికారైనా తాను ప్రభుత్వంలో మంచి శాఖలో పనిచేసి, ఆ శాఖకు మంచి పేరు తేవాలనే కోరుకుంటాడు. సంస్కరణలు అమలు చేయించి, ఆ శాఖను తీర్చిదిద్దాలనుకుంటాడు. తనకు మంచి పేరు వస్తుందా? రాదా? అన్నది ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్ యార్డుల నిర్మాణం వంటి ఓ వినూత్నమైన కార్యక్రమం ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచనల మూలంగా చేపట్టారు. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శమయ్యాయి. నాయకులను గడగడ లాడిరచిన ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు.
అయితే సహజంగా ప్రతిపక్షాలలో వున్న నాయకులపై సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఇటీవల అనుసరిస్తున్న తీరు కూడా కొంత వివాదాస్పదమౌతోంది. అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూసిందే…!అప్పటి పాలకుల ఒత్తిళ్ల మూలంగా తమకు ఇష్టం లేకున్నా, తెలంగాణ ఉద్యమం మీద గౌరవం వున్నా, కొన్ని సార్లు అంతరాత్మ ప్రభోదంగా కాకుండా పనిచేసిన సందర్భాలున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి సవాళ్లు అనేకం ఎదుర్కొంటుంటారు. ఒక్కొసారి చిన్న చూపుకు కూడా గురౌతుంటారు. ఎదిరించే శక్తి వున్నా, మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటారు. దటీజ్ సివిల్ సర్వెంట్స్….!
డిగ్రీ లెక్చరర్ రాధిక భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ విధానంలో పలు అంశాలపై ఆమె పరిశోధన గ్రంథం రూపొందించారు. రాధిక నారాయణ గూడలోని బాబూ జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ పరిశోధన రాధికకు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆర్. సాయన్న పర్యవేక్షణలో జరిగింది. ఈ పరిశోధనకు సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ పి.వి.గీతాలక్ష్మి, సహా అద్యాపకులు పట్నాయక్, కో గైడ్ గా వ్యవహరించిన నిజాం కాలేజీ అధ్యాపకులు డాక్టర్. ఎం. కేశవులు గౌడ్, కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
`పిడిఎస్ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా?
`ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా?
`కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా?
`వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా?
`కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా?
`పది మందిలో ఐఏఎస్ లను నిలదీస్తారా?
`తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా?
` రేషన్ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?
`అరగంటలో మళ్ళీ వస్తాను? అని కలెక్టర్ కు బెదిరింపులు సబబా?
`ఒక్క ముక్క పట్టుకొని కలెక్టర్ ను అవమానకరంగా చూస్తారా?
`ఇలాంటి విషయంలో ఐఏఎస్‌ల ఐక్యత ఎందుకు కొరవడిరది?
హైదరాబాద్,నేటిధాత్రి:
వాళ్లు ఉన్నత విద్యావంతులు…ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష రాసి పాసైన వారు. సమాజంతోపాటు, ప్రపంచ జ్ఞానం తెలిసినోళ్లు. ఐఏఎస్ కోసం పడే శ్రమ అంత ఇంతా కాదు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలతోపాటు, పాలనలో పద్దతులు, నేటి తరం దాకా అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు కూడా తెలిసిన వాళ్లు. ప్రభుత్వ నిర్వహణ అంతా తెలిసిన వాళ్లు…నిర్వహించేవాళ్లు…మన ప్రజాస్వామ్య దేశంలో నాయకులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చే హామీలు గెలిచిన తర్వాత వాటి అమలుకు వీరి మీదే ఆధారపడతారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో ఐఏఎస్‌లదే కీలక పాత్ర. ప్రభుత్వ నిర్వహణలు సరిగ్గా సాగాలన్నా వాళ్లదే కీలక భూమిక. రాష్ట్రాలలోనైనా, కేంద్రంలోనైనా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పాత్ర అనన్య సామాన్యమైంది. వారు విధి నిర్వహణ కోసం పడే తపన, చేసే శ్రమ పైకి కనిపించకపోయినా, కాలం ఎటుపోతుందన్నది కూడా చూసుకోకుండా పనిచేయాల్సి వుంటుంది. అలా అంకితభావంతో పనిచేయడమే వారికి తెలుసు. ఎందుకంటే ఐఏఎస్ చదువు అన్నది ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేసి, సమాజానికి సేవ చేయాలన్న తపనతో వస్తారు. సమాజంలో ఉన్నతమైన గౌరవం వున్న ఉద్యోగం అన్న ఆలోచనతో కొందరు వస్తారు. కొందరు జీవిత లక్ష్యం ఐఏఎస్ కావాలన్న కోరికతో వస్తారు. ఎలా వచ్చినా వారు ఐఏఎస్ అన్నది కావాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఎంత కష్టపడినా ఒక్కొసారి అనుకున్న ర్యాంకు రాకపోతే, మళ్లీ మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టి సక్సెస్ సాధిస్తారు. అలాగే జీవితంలోనూ సక్సెస్ సాధించాలని, గొప్ప అధికారి అని పేరు కోసంపనిచేస్తారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తారు. పేదలకు సేవ చేస్తారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. ఏసి గదుల్లో వుంటారని కూడా అనుకుంటుంటాం…కాని సమాజానికి విపత్తు ఎదురైతే అందరికంటే ముందు అక్కడ ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు వుంటారు. అలాంటి అంకితభావంతో చేసే ఉద్యోగం. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల పెత్తనాలు, పార్టీలకు చెందిన నేతల వేధింపులు కూడా చూస్తుంటారు. అయినా ఎక్కడా తొనకరు. నోరు మెదపరు. ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయరు. ప్రభుత్వన్ని అభాసు పాలు చేయరు. అన్నింటినీ దిగమింగుకొని, ఐఏస్‌ఎస్ పూర్తయిన తర్వాత చేసే ప్రతిజ్ఞను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉద్యోగ జీవితం గడుపుతుంటారు…ఐఏఎస్ పూర్తయిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్తారు. కొండ కోనల్లో వుంటే జిల్లాల్లో కూడా పనిచేస్తారు. అంతటి అంకితభావం వున్నవాళ్లు…వాళ్లే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉద్యోగులు…! అలాంటి ఓ కలెక్టర్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాజీ ఐఏఎస్ అధికారులు సైతం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఐఏఎస్ అధికారులంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఎంత వాటా ఇస్తుంది? ఎంత ఖర్చు చేస్తుంది? ఈ వాటల సంగతి ఏమిటి? అన్నదానిపై కలెక్టర్‌కు అవగాహన వుండకపోవడం అంటూ వుండదు. కొన్ని సమయాల్లో కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని కొన్ని సందర్భాలలో వారి సమాధానాన్ని ఇష్టపడరు. అందుకే చాలా సమయాల్లో ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దలతో సమీక్షల్లో వున్నంత కలుపుగోలు తనంగా ప్రజల్లో వున్నప్పుడు వుండరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వపెద్దలైనా, కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు చాలా కూల్‌గా సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో ఏం సమాధానం చెబితే ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్టవుతారో అన్న అనుమానంతో కూడా నోరు మెదపరు. ఇదే ఇక్కడ జరిగి వుండొచ్చు. అయినా ఓ కలెక్టర్‌ను పది మందిలో అందులోనూ ఓ రేషన్ దుకాణం వద్ద నిలదీయం ఏమిటి? సమీక్ష సమావేశాల్లో ఇలాంటి ప్రశ్నలు వేశారంటే వేరు విషయం? అంతే గాని రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ మీద ఆక్రోశంతో మాట్లాడడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో రేషన్ షాపుల ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తారని ఒక కేంద్ర మంత్రి చెప్పడం ఏమిటి?
ఇప్పటి వరకు ఏ కేంద్ర మంత్రికి ఇలాంటి ఆలోచన రాలేదేమో! ప్రజా పంపిణీ వ్యవస్ధ ఏమైనా భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్ధనా? ప్రధాన మంత్రి మోడీ ఫోటోను రేషన్ షాపుల ముందు పెట్టడం అంటే ఆయన పరువు పెంచినట్లౌవుందా? తగ్గించినట్లౌవుతుందా? పైగా కలెక్టర్లు ఆ ప్లెక్సీలు వున్నాయా? లేదా? ఎవరైనా తొలగించారా? అంటూ వాటిని మానిటరింగ్ చేస్తూ వుండాలా? రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించినట్లు, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మొహన్ సింగ్ ఫోటో పెట్టారా? పైగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రేషన్ సరుకులు అందజేత విషయంలో అదంతా రాష్ట్ర ప్రభుత్వ క్రెడిట్ అంటూ చేసిన వీడియోను కూడా టిఆర్‌ఎస్ విడుదల చేసింది. అంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం అబద్దమని రుజువైనట్లే కదా? ఆ మధ్య ఉల్లి రేటు విపరీతంగా పెరిగింది? మార్కెట్‌లో ఉల్లి రేటు ఎంత వుందో తెలుసా?
అంటూ నేషనల్ మీడియా ప్రశ్నిస్తే నేను ఉల్లిపాయ తినను అంటూ సమాధానం దాట వేశారు. కాని బాధ్యత కల్గిన మంత్రికి ఉల్లి రేటు ఎంతో తెలియదని చెప్పడం, సమాధానం దాట వేయడం ఔచిత్యమేనా? అలాంటిది ఎప్పుడో చేసిన పిడిఎస్ చట్టంలోని అంశాలపై ప్రతి కలెక్టర్‌కు అవగాహన వుండాల్సిన అవసరం లేదు. సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రికో, సెక్రెటిరికో అవగాహన వుంటే చాలు…! రేషన్ షాపులకు సరఫరా అవుతున్న వస్తువులన్నీ ప్రజలకు చేరువౌతున్నాయా? లేదా? అన్నది కూడా ఎవరైనా ఫిర్యాధు చేస్తే తప్ప కలెక్టర్లకు తెలియకపోవచ్చు. అంతే గాని రేషన్ షాపుల్లో ఏం జరుగుతుందన్నదాని మీదే కలెక్టర్లు శ్రద్దపెడుతూ కూర్చుంటే ఇక వారు చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసుకోవాల్సిందే… ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పరిపాలనవిభాగంలో ముఖ్య పాత్రదారులా? లేక కిరాణ షాపుల్లో గుమస్తాలా? అన్నది నాయకులు తెలుసుకోవాలి. అయినా ఒక కలెక్టర్ మీద కేంద్ర మంత్రి అంత హూంకరింపు అవసరమా? అన్నది సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో సీరియస్‌గా జరుగుతున్న చర్చ. రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపించడం అన్నది సరైందేనా? పైగా వారికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా చులకనగా చూడొద్దు. అందుకే కొంత మంది ఐఏఎస్‌లు తాము నాయకులు కావాలన్న ఆలోచన రావడానికి కారణాలు కూడా ఇలా నాయకులు చేసే పెత్తనాలే కారణమన్నది కూడా చెప్పుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లుగా, మంత్రిత్వ శాఖల కమీషనర్లుగా ఐఏఎస్‌లు ఏదైనా తప్పు చేస్తే వారిని కడిగేయడంతో తప్పు లేదు.
కాని ఏ తప్పు లేని సందర్భం..ప్రజల్లో ఏదో ఒక సంచలనం కోసం కేంద్ర మంత్రి చేసిన పని తప్ప అందులో మరేం లేదు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కేంద్ర మంత్రి అవమానించడాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తప్పుపట్టారు. ఐఏఎస్‌లకు సంఫీుభావం తెలిపారు. అయితే ఐఏఎస్‌లలో ఐక్యత లేకపోవడం కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో ఇటీవల జైలు నుంచి అత్యా చారం, హత్య కేసుల్లో నిందితులు విడుదల కావడాన్ని తప్పు పడుతూ సిఎంవో సెక్రెటరీ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఆమెకు ఐఏఎస్‌లు సంఫీుభావం వ్యక్తం చేయడం లేదు. సివిల్ సర్వీసెస్‌లో వున్నప్పుడు ప్రభుత్వాల మీద ప్రకటనలు చేయొద్దు. కాని ఒక మహిళగా సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని స్మితా సబర్వాల్ గుర్తు చేయడాన్ని కూడా తప్పంటే ఎలా? ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన సమాజంలో ఆడవారి మీద జరిగే అన్యాయాలపై, అకృత్యాలపై కూడా నోరు మెదపొద్దా?
ఈ సమాజంలో సామాన్య మహిళల ప్రశ్నలకు అంత గుర్తింపు వుండదు. ఉన్నత విద్యావంతులైన మహిళల మాటలకు ఎంతో గుర్తింపు వుంటుంది. వారి ప్రశ్నలపై సమాజంలో చర్చ జరుగుతుంది. ఆ ప్రశ్న సమాజంలో చైతన్యానికి ఒక వేధికౌతుంది. ఆమెను కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సరైందికాదు. ఇక గతంలో ఉమ్మడిరాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించలేక, వారి ఒత్తిళ్లను అడ్డుకోలేక మహిళా ఐఏఎస్‌లైన శ్రీలక్ష్మి లాంటి వారు ఎంతటి శిక్షలను అనుభవించారో తెలియందికాదు. అందుకే తప్పు చేస్తే ఎంతటి స్ధాయిలో వున్న అధికారినైనా ప్రశ్నించే హక్కు, అధికారం పాలకులకు వుంటుంది. కాని తమకు సంబంధం లేని విషయాల్లో కూడా వారినిదోషులను చేసినా, వారిపై విరుచుకుపడినా, పది మందిలో చులకన చేసినట్లు మాట్లాడినా ఐఏఎస్ అధికారుల సంఘం ఉపేక్షించడం కూడా మంచిది కాదు. ఇలాంటి సందర్భాలలో వారికి ఐక్యత ఎంతో అవసరం. ఎవరైతే చిన్న చూపు చూడబడ్డారో వారికి మిగతా ఐఏఎస్ అధికారులు వారికి అండగా నిలబడడం కూడా ఎంతో ముఖ్యం.
విమోచనమే అయితే నిజాంను రాజ్ ప్రముఖ్ ఎలా అయ్యారు?
`సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది!
`తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు!
`నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు.
`తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్ ఆర్మీతో కూడా పోరాడారు!
`బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు!
`నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో షోయాబుల్లా ఖాన్ వంటి జర్నలిస్టు వున్నాడు!
`తొలి అమరుడు షేక్ బందగీ ముస్లిమే!
`తెలంగాణ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే, నిజాం ప్రపంచ కుభేరుడెలా అయ్యాడు!
`సర్థార్ వల్లభ్ భాయ్ తెలంగాణ విమోచనమే చేయిస్తే నిజాంను శిక్షించాలి కదా!
`ఏడాదికి లక్ష రూపాయల భరణంతో రాజ్ ప్రముఖ్ గా గౌరవించారు?
`ప్రజలను గందరగోళ పర్చకండి!
`చరిత్రకు మరకలద్దకండి!
`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక కీలక ఘట్టం!
`ప్రపంచానికి ఒక చైతన్యం నింపిన ఘట్టం.. దోపిడీ వ్యవస్థకు గుణపాఠం!
`తెలంగాణలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరిన రోజు….దేశ సమైక్యతలో, సమగ్రతలో తెలంగాణ భాగమైన రోజు…?
హైదరాబాద్,నేటిధాత్రి: విత్తు ముందా…చెట్టు ముందా? అన్నదానికి ఇప్పటికీ సమాధానం లేనట్లే, తెలంగాణ విషయంలోనూ సెప్టెంబర్ 17 అనేది విలీనమా? విమోచనమా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏ రకంగా అన్వయించినా ఏదో లోపం కనిపిస్తూనే వుంటుంది. విమోచనం అని నిర్ధారిస్తే వందల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. విలీనమంటే కూడా అనేక ప్రశ్నలు కళ్ల ముందు మెదులుతాయి. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ సందిగ్ధతను నివృత్తి చేసిన వారు లేరు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటైనా 1952 తొలి ఎన్నికలు జరిగేదాకా కూడా జరిగిన సైనిక పాలన, పౌర పాలనల్లో కూడా అనేక వివాదాలున్నాయి. మేజర్ జనరల్ జేఎస్. చౌదరి నేతృత్వ సైనిక పాలన తెలంగాణ ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందనేది కూడా ఓ చరిత్ర. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పటి గవర్నరైన ఎంకే. వెల్లోడి నేతృత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేశాక తెలంగాణలో పోలీసు చర్యలు తగ్గాయి. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలకు ముందు సాగించిన సైనిక పాలన తెలంగాణలో 40 వేల మంది రైతుల మరణానికి కారణమైనట్లు అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతోనే ఎంకే. వెల్లోడి పాలన వచ్చింది. ఎం.కే. వెల్లోడి కేరళకు చెందిన ఓ ఐపిఎస్ అధికారి. ఆయనను హైదరాబాద్ రాష్ట్ర పౌర ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పనిచేస్తే అందులో బూర్గులు రామకృష్ణారావు వున్నారు. 1952 ఎన్నికల తర్వాత బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు కూడా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ప్రభుత్వం కుదురుకోకముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ 9 జిల్లాలుగా, మరో 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలపడంతో అసలు హైదరాబాద్ రాష్ట్ర ఉనికే లేకుండాపోయింది. కాకపోతే మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు 1957 నుంచి హైదరాబాద్ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. కాని ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17ను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. ఆనాటి నుంచి కమ్మూనిస్టు పార్టీలు ఎంత పోరాటం చేసినా అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పటికీ నైజాం రాజ్యం ఇండియాలో కలపడం అన్నది విలీనమా? నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కావడం విమోచనమా? అన్నదానిని కూడా ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి నవంబర్ 1నే రాష్ట్రావతణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనాయితీగా వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరింది. కాని విమోచనం అన్నదానిపై ఆ పార్టీ కూడా విముక్తి దినోత్సవంగా జరపాలనే కోరింది. తెలంగాణ వచ్చాక మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించేలేదు. ప్రతిపక్షాలు ఎంత అడిగినా ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ పరంగా చేసుకోవడానికి అనుమతినిచ్చాడే గాని, ప్రభుత్వం తరుపున జరపలేదు. ఉద్యమ కాలంలో మాత్రం సెప్టెంబర్ 17ను ఒక రాజకీయ అస్త్రంగా టిఆర్‌ఎస్ మల్చుకుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు బిజేపి అదే దారిలో నడుస్తోంది.
బిజేపిలో తెలంగాణ విమోచనం అంటున్నా , ప్రజల్లో గందరగోళం ఇప్పటికీ వుంది. దానిని నివృత్తి చేయడం గత డెబ్బై ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, దేశ స్వాతంత్య్రం వచ్చే నాటికి 612 చిన్న చిన్న సంస్ధానాలు స్వపరిపాన సాగిస్తున్నాయి. అందులో కొన్ని పెద్ద రాజ్యాలు కూడ వున్నాయి. వాటిలో హైదరాబాద్ రాజ్యమనేది అన్నింటికన్నా పెద్దది. చిన్న చిన్న సంస్ధానాలన్నీ స్వాతంత్య్రం రాగానే దేశంలో విలీనమయ్యాయి. కాని హైదరాబాద్ నిజాం రాజ్యం మాత్రం విలీనం కాలేదు. ఇండియాలో విలీనం కావడాని నిజాం ససేమిరా? అన్నాడు. దాంతో ఆపరేషన్ పోలో అనేది నిర్వహించి, హైదరాబాద్‌ను కేవలం 5 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకున్నది. లొంగిపోయిన నిజాంను అప్పటినుంచి 1964 వరకు రాజ్ ప్రముఖ్‌గా( ప్రస్తుతం గవర్నర్) నియమించింది. ప్రతి ఏటా లక్ష రూపాయల భరణం కూడా ఇస్తూ వచ్చింది. ఒక వేళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్‌ను నిజాం నుంచి విముక్తి చేశారనుకుంటే ఆయనకు రాజ్ ప్రముఖ్‌గా పదవి ఇచ్చేవారు కాదు. విలీనం చేసుకున్నామన్న భావనతో, లొంగిపోయిన నిజాం రాజుకు గౌరవం ఇచ్చి సత్కరించినట్లే లెక్క. అంతే కాదు నిజాం లొంగిపోయినా, తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న ఆనాటి రైతాంగం మీద సైనిక చర్యలు ఆగలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో నిజాం, రజాకార్ల మూలంగా 10 వేల మంది రైతులు మరణిస్తే, కేంద్ర ప్రభుత్వం అణిచివేత వల్ల సుమారు 40 వేల మంది రైతులు మరణించారని చరిత్ర లెక్కలు చెబుతోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ ప్రజలకు విలీనమే బహుమతిగా ఇచ్చినట్లు లెక్క. కేంద్రం విమోచనమే బహుమతి చేస్తే 40 వేల మంది రైతులు మరణించేవారు కాదు. కేంద్ర సైనిక చర్యల్లో భాగంగా రజాకార్ల నాయకుడు కాశిం రజ్వీని బంధించి అప్పటి వరంగల్ జైలుకు తరలించిన కేంద్ర ప్రభుత్వం నిజాం సూచన మేరకు ఆయనను విడుదల చేసింది. కాశిం రిజ్వి పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అంటే ఈ సంఘటన కూడా తెలంగాణ విమోచనమని చెప్పడానికి కూడా వీలు లేకుండాచేసింది.
సరే మంచో చెడో ఇన్నేళ్లకైనా ఒక అడుగు ముందుకు పడిరదనే అనుకుందాం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైకత్యా దినోత్సవం అంటోంది. బిజేపి విమోచన దినోత్సవం అంటోంది. ఈ రెండు ప్రభుత్వాలలో బలమైన కేంద్రంలో అధికారంలో వుండి నిర్ణయాత్మక శక్తిగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిసి ఏడు మండలలాను తిరిగి మళ్లీ తెలంగాణకు ఇస్తామని చెప్పగలరా? అంతే కాకుండా ఇప్పటికీ అటు కర్నాటకలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ విలీన దినోత్సవాలు జరుపుకుంటున్న ఎనమిది జిల్లాలను తిరిగి తెలంగాణలో కలిపే ప్రకటన ఏదైనా చేస్తారా? అదే జరిగితే నిజంగా బిజేపి చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. కాని కేవలం రాజకీయాల కోసం మాత్రమే సెప్టెంబర్ 17ను వాడుకుంటామంటే ప్రజలు స్వాగతిస్తారని అనుకోలేం. ఎందుకంటే బిజేపి చెబుతున్న విషయాలు అన్నీ వాస్తవాలు కావు. రజకార్ల దాష్టికాలనే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని చూస్తే, ఇప్పటి వరకు గ్రామాల్లో వున్న ముస్లిం, హిందువుల ఐక్యతకు బీటలు వారుతుంది. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో హిందువులే కాదు, ముస్లింలు కూడా వున్నారు. నిజాం బాధితుల్లో అనేక మంది ముస్లింలు కూడా వున్నారు. అందులో తొలి అమరుడుగా చెప్పుకోవాల్సిన వారిలో షేక్ బందగీ వున్నాడు. కలాన్ని ఖడ్గంగా చేసి నిజాం ప్రభుత్వం మీద అక్షరాలను సంధించిన షోయబుల్లా ఖాన్ కూడా ముస్లిమే. ఆయనను చాదర్‌ఘాట్ వద్ద చేతులు, కాళ్లు నరికి అత్యంత కిరాతకంగా చంపింది నిజాం ప్రభుత్వమే…అంతే కాదు నిజాం కు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్ధ స్ధాపించిన ముగ్ధుం మొహినుద్దీన్ కూడా ముస్లిమే…ఇలా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు వున్నారు. అంతే కాదు నిజాం రాజ్యంలో హిందువులకు తీరని అన్యాయం జరిగిందనో, చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీలో రామానంద తీర్ధ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు అనుమతినిచ్చింది కూడా నిజామే…! అందువల్ల తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అన్నది ఒక చారిత్మ్రాక ఘట్టమే…కాదని ఎవరూ అనలేరు. కాని దాన్ని ఓ వర్గానికి ముడిపెట్టడమే సరైంది కాదు. పైగా అది విమోచనం అనడానికి కూడా వీలు లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు పది లక్షల ఎకరాలు నాటి భూస్వాముల చెర నుంచి రైతులు విడిపించుకున్నారు. మరి భూములు సైనిక పాలన కాలంలో మళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయి. ఏ విస్నూర్ దొర మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, జనగామ రైల్వే స్టేషన్‌లో అంతమొందించారో…ఆయన కుమారుడినే తెలంగాణ ప్రజలు అసెంబ్లీకి పంపారు. మరి దీన్నే మంటారు…! అందువల్ల తెలంగాణ ఇండియాలో విలీనమైన రోజుగానే సెప్టెంబర్ 17ను భావించాలే గాని, విమోచన అనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఏది ఏమైనా ఆనాటి నుంచి సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలకు వేధికగానే వుంది. ఇప్పుడూ అదే వేధికగా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతోంది.
*సగం జీతాలకే గంటల తరబడి విద్యార్థుల భవిశ్యత్ కోసం కష్ట పడుతున్నాము*
*గ్రామ సర్పంచ్ పిల్లల నుండి దేశ నాయకుల పిల్లలు చదువు నేర్చుకునేది ఫ్రైవేట్ ఉపాద్యాయుల దగ్గరే కదా*
*చివరికి ప్రభుత్వ ఉపాద్యాయుల(ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహితలు) పిల్లలు కూడ చదువుకునేది ఈ ప్రైవేట్ ఉపాద్యాయుల వద్దే కదా*
*పదవ తరగతి ఉత్తీర్ణతలో ప్రభుత్వ శాతం ఎంత…? ప్రైవేట్ శాతం ఎంత..?*
*తెలంగాణ రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాద్యాయులు పనిచేస్తున్నారు*
*ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాద్యాయుల శ్రమ ను గుర్తించి, సత్కరించాలి.*
*తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ )వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ డిమాండ్*
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న, ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “* వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ . మాట్లాడుతూ, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యకు ఉన్నతమైన ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్యను అందించేలా, విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ జీతాలతో రోజుకు 8 గంటల నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యాభివృద్ధి కోసం, వివిధ బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షల్లో రాణించడం కోసం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారు. వీరు పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపునిస్తుంది, అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి, వివిధ బోర్డు, పోటీ పరీక్షలకు, స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం, తక్కువ జీతాలతో అధికంగా పనిచేస్తూ, అర్ధాకలితో అలమటిస్తూ, విద్యా-బోధనే ఏకైక వృత్తిగా, ఆహోరాత్రులు పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనేదే మా ప్రశ్న. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా, వేలాది మంది ఉపాధ్యాయులు సగం జీతాలకే ఆన్లైన్లో గంటల తరబడి తరగతులు నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల,రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల పిల్లలకు విద్యను బోధించేది ఈ ప్రైవేటు ఉపాధ్యాయులే. తరగతుల బోధనే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజానికి సేవ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు, రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాంటి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు..?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 5 న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి. ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరిస్తుంది. ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించవు..?సత్కరించవు…? ఈ ప్రభుత్వాలు… అనేదే ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడి ప్రశ్న. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులే…అందులో తేడాలోద్దు. ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులదే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులది కూడా. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాల్సిన అన్ని అర్హతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి. కావున సెప్టెంబర్ 5 న నిర్వహించు గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన, *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “(TAPTA)* ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
బడి ఒక ఆలయం అయితే, ఆ ఆలయంలో దేవుడు గురువు విద్యార్థులకు నైవేద్యం ఇచ్చే మాధవుడు గురువు అజ్ఞాన తిమిరాన్నించి విజ్ఞాన కాంత్రులు ప్రసరింపజేసేవాడు ఉపాధ్యాయుడు ఆ ఆంద యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఉపాధ్యాయుడే ఋషి.మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర ప్రదాత,సమాజ దేవాలయానికి నిజమైన పరిరక్షకుడు ఉపాధ్యాయుడు, అందుకే మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకు ఇవ్వడం జరిగింది. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, నడక నేర్పిన నాన్న రెండవ గురువు, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యాబుద్ధులు అందించే మహోన్నత వ్యక్తి మూడో గురువు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన గురువు శ్రేష్టుడు, మేధావి, విద్యావేత్త రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వారసులమని చెప్పుకోడానికి మాకు గర్వకారణము.
జాతి కుల మత వర్గాలకు అతీతంగా విశ్వమానవ సౌభ్రాతృత్వానికి మేధస్సుకు దగ్గరగా ఉండే మన విద్యా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల అధీనంలో ఉంది. ఈ రెండు రంగాలలో ప్రైవేట్ వ్యవస్థదే పైచేయి అని చెప్పవచ్చు.
దేశంలో ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మన తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ 2019 -20నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది నివేదికలో ప్రైవేట్ పాఠశాలల సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, పాఠశాల కార్యక్రమాలు మరియు షెడ్యూల్ ని అందిస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కంటే ఎక్కువ గంటల పాఠశాలకు హాజరు అవుతున్నారు అని అర్థం. దీనర్థం ఇబ్బందిలోకి రావడానికి తక్కువ సమయం, మరియు కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుంది.
ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడి బహుముఖ పాత్ర.
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గానీ, ప్రైవేట్ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు ఇది యధార్థం. కొందరుంటారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా లభిస్తుందని. ఇది నాణెంలో ఒక భాగమే రెండో భాగం ఉంది అదే ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు శరవేగంగా దూసుకు పోతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా మంది తమ రంగంలో నిపుణులు మాస్టర్స్,మరియు డాక్టర్ డిగ్రీలను కలిగి ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు భావోద్వేగాలకు ఎన్నో ఒత్తిళ్ళకు లోనవుతు కూడ కొత్త కరిక్యులమ్ ఉపోయోగించి బోధనలో సృజనాత్మకతను, శాస్త్రీయతను జోడిస్తూ ప్రభావవంతంగా బోధిస్తారు విద్యార్థుల భవిష్యతే లక్ష్యంగా పరమావధిగా భావిస్తూ రోజుకు 9 గంటల నుండి 10 గంటలు వెచ్చిస్తారు,ఆదివారం కూడా అడ్డు చెప్పకుండా వెళ్తారు. విద్యార్థుల బంగారు సౌధానికి నిచ్చెనలు వేస్తూ ప్రోత్సహించేవారు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు.
విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడే ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా విధానాలు సక్రమంగా లేవు ఉపాధ్యాయులు సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడంలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నది. ఇదీ సరైంది కాదు ఉపాధ్యాయుడు ఎక్కడైనా ఉపాధ్యాయుడే, అది ప్రభుత్వ ఉపాద్యాయుడా లేక ప్రైవేట్ ఉపాధ్యాయుడా ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల వివక్షను విడనాడాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ప్రైవేటు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి వారి యొక్క ఉపాధ్యాయు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చూడాలని మనవి చేస్తూ ఈ ప్రైవేటు ఉపాధ్యాయులు….
ఏ ముహూర్తాన కాంగ్రెస్ లో చేరిండో గాని అంతా ఆగమాగమే!
టిడిపిలో వున్నప్పుడే నయముండే!
పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే!
మాట చెల్లుతలేదాయే!
టిఆర్‌ఎస్, బిజేపి మధ్య కాంగ్రెస్ నలిగిపోవట్టే!
రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే?
`ఎటు చూసినా లుకలుకలేనాయే!
`మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే!
`ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే!
`కాలం కలిసొచ్చేలా లేదాయే!
`గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోవట్టే!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏమేమో…! అనుకుంటాం..అన్నీ అవుతాయా..ఏంటి? ఇది ఓ సినిమాలో డైలాగ్. ఇప్పుడు సరిగ్గా ఇది పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డికి సూటౌతోంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ పిసిసి అధ్యక్షులు కావాలనుకుంటారు. కాని ఏ కొందరికో అవకాశం వస్తుంది. అది కూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందికి మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అందులో రేవంత్‌రెడ్డి లాంటి వారికి పిపిసి ప్రెసిడెంటు పదవి అన్నది బంపర్ ఆఫర్ లాంటిదే. కాకపోతే దాని ఫలితాలు అనుకున్న రీతిలో రావడం లేదు…ఇదే ఇక్కడ పెద్ద మైనస్..అంగట్లో అన్నీ వున్నా…అన్నది ఇక్కడ నిజమౌతోందని కూడా చెప్పొచ్చు. గతంలో పిసిసి ప్రెసిడెంటు పదవి అన్నది గొప్ప వరంగా భావించేవారు. అలా అదృష్టం కూడ కలిసొచ్చేది. అప్పుడు ఆ పదవి పెద్ద కొండ. నాయకత్వానికి పెద్ద అండ. అదేంటో గాని తెలంగాణ వచ్చాక పిసిసి పదవి అన్నది గుడిబండగా మారింది. పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్న వారికి కలిసి రావడంలేదు. పదవి వచ్చిన వారికి అసలే కలిసి రావడంలేదు. ఇప్పుడు పిపిసి పదవి అన్నది ముళ్ల కిరీటైమైపోయింది. కోరికోరి పదవి కావాలనుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఎదురుకానున్నది. తెలంగాణ రాగానే నాకంటేనాకు పిసిసి అని చాలా మంది కోరుకున్నారు. ఆ రేసులో పొన్నాల లక్ష్మయ్య గెలిచారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్లే అనుకున్నాడు. తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడయ్యాకు పొన్నాల లక్ష్మయ్య, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి నేనే అన్నంతగా కలలుగన్నాడు. కాని పాపం ఆయనే జనగామలో గెవలేదు. ఆశలు బోల్తా కొట్టాయి. ఆపై పదవి బరువైంది. తాను మోయలేన్నంత దాకా వచ్చింది. భారమెక్కువైంది. పార్టీని నడపడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని తెలుసుకున్నాడు. ఖర్చుపెట్టాలంటే చుక్కలు లెక్కబెట్టాల్సివస్తుందని గుడ్లుతేలేశాడు. నెల నెల పార్టీ కోసం సొమ్ము నీళ్లలా ఖర్చు చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పదవి తనకు తాను వద్దనుకున్నాడు. వదులుకున్నాడు.
సహజంగా పిసిసి అధ్యక్ష పదవిలో వున్నవారు ఎప్పుడు దిగిపోతారా? మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తారు. పొన్నాల మాత్రం ఎప్పుడు దిగిపోతాడా? అని ఎవరూ చూడలేదు. అది కూడా పొన్నాలకు రంది తెచ్చిపెట్టింది. ఎలాగో అలాగా ఆఖరకు పదవి వదిలించుకొని ఫ్రీ బర్డ్ అయ్యాడు. రెండో కృష్ణుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ప్రజలు, పార్టీ నేతలు ఆయనపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. పైగా ఆయన అప్పటికే కోవర్టు అన్న ముద్రను వేసుకున్నారు. అలా జరిగిన ప్రచారాన్ని ఆయన ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. నేను కోవర్టును కాదని కూడా ఆయన ఏనాడో తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. ఆఖరుకు ప్రభుత్వం మీద పెద్దగా యుద్దం చేసింది లేదు. ఆఖరుకు తన సోదరుడు కౌషిక్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తుంటే ఆపలేదు. కాకపోతే ఆయనే పంపాడని అనేవారు అంటారు. అది ఎంత వరకు నిజమో! కాదో!! ఆయన ఏనాడు చెప్పలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌రెడ్డి వస్తూ వస్తూనే జాక్ పాట్ కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. ఫైర్ బ్రాండ్ అన్న బిరుదును నిలబెట్టుకుంటారని అందరూ అనుకున్నారు. కాని గత 2018 ఎన్నికల్లో ఓడిపోయి, తానేం తీస్మార్ ఖాన్‌ను కాదని నిరూపించుకున్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగో టిక్కెట్టు తెచ్చుకొని గెలిచి, పోయిన పరువును నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆశలు పెంచుకొంటూ, ఎన్నో అవాంతరాల మధ్య పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి పాపం కంటి మీద కునుకు లేకుండాచేసుకున్నాడు. స్వయంకృతాపరాధం చూపించే ఫలితం చేదు రుచి చూస్తున్నాడు. పాపం మొదటినుంచి రేవంత్‌ది రాజకీయాల్లో ఒంటరి ప్రయాణమే…
ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్నా తనదైన శైలి రాజకీయాలతో ముందుకు సాగాలని అక్కడా ఒంటరి తనాన్నే భరించాడు. తర్వాత టిడిపిలో చేరినా తెలంగాణ ఉద్యమం, ఆపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టిడిపిలో కూడా ఒంటరి రాజకీయ ప్రయాణమే దిక్కయ్యింది. ఆఖరకు కాంగ్రెస్‌లో చేరి, పిపిసి అధ్యక్షుడైనా ఇప్పుడూ ఒంటరి పోరు చేయాల్సి వస్తోంది. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు ఆయనను అడుగడుగునా పార్టీలో అడ్డుకున్నవారే…ఆయనను పిసిసి కాకుండా అనుక్షణం అడ్డంకులు సృష్టించిన వారే…దాంతో ఆనాడైనా, ఈనాడైనా ఆయనకు ఒంటరి ప్రయాణమే దిక్కౌవుతోంది. సీనియర్లు ఆయననెక్కడ నెగలనిస్తారు? కొంత కాలం విహెచ్ రూపంలో, మరి కొంత కాలం జగ్గారెడ్డి రూపంలో, ఇందులో ఆది నుంచి కోమటిరెడ్డి సోదరుల రూపంలో రేవంత్‌కు సీనియర్లు ఊరిపిసలుపనివ్వడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేల నాకిస్తున్నారు. తన ప్రమేయం లేకున్నా సరే ఆఖరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. నోటిదురుసు ఆయనను ఇంత దూరం తీసుకొచ్చింది. అదుపు తప్పకపోతే ఒక తంటా…తప్పితే ఒక తంటా అన్నట్లు తయారైంది. ఆఖరుకు ఇటీవల మునుగోడులో పర్యటిస్తున్న సందర్భంలో కొందరు మహిళలు రేవంత్‌ను ఎందుకొస్తున్నారని ముఖం మీదే అడగడం, వద్దు వద్దు రావొద్దంటూ చెప్పడంతో ఆయన పరువు మరింత పోయిందనే చెప్పాలి.
మునుగోడును ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చూసినా, ఎక్కడిక్కడ ఏదో ఒక అడ్డంకి ఎదురౌతూనేవుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజుకే మునుగోడులో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసి, సక్సెస్ చేస్తే తన ఇమేజ్ అమాంతం పెరుగుతుందని ఆశించాడు. కాని గ్రాఫ్ ఒక్కసారిగా వున్నది కాస్తా పడిపోయింది. అసలు ఇంత తొందరగా సభ పెట్టాల్సిన అసవరం ఏమొచ్చిందన్న ప్రశ్నలే మిగిలాయి. ఆఖరుకు కోమటిరెడ్డి సోదరుల మీద చేసిన వ్యాఖ్యలకు వివరణిచ్చుకోవాల్సివచ్చింది. సంచనలం సృష్టిస్తాననుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పాడు. జూనియర్లు, జిల్లా నేతలు ఎటువైపో కూడ ఇప్పటికీ రేవంత్‌రెడ్డికి ఓ క్లారిటీ లేదు.
పార్టీలో సీనియర్లు పని గట్టుకొని పగబట్టినంత రాజకీయాలు చేస్తుంటే కనీసం జిల్లా స్ధాయి నేతలు, జూనియర్లనైనా చూసి ధైర్యం తెచ్చుకుందామంటే అక్కడా ఆశలు నెరవేరడం లేదు. జిల్లా స్ధాయిలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకుండాపోతున్నాయి. వాళ్లు ఎటు నిలుస్తారో అన్నది తెలియకుండాపోతోంది. ఆ మధ్య సికింద్రాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలలో అనేక జిల్లాల నాయకులు రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం చూసిందే… ఏ ముహూర్తానా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిండో కాని ఆనాటి నుంచి ఆగమాగమే…ఇక్కడ ఒక్కటే ఆయన అదుపు చేసుకోవాల్సింది! జనం కనిపించగానే నోరు గంగవెర్రులెత్తడం ఆపుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడో కూడా గుర్తెరిగి మాట్లాడాలి. నాయకుడన్న తర్వాత మానసిక సంఘర్షణ సహజం. అందులో పార్టీని లీడ్ చేసే స్ధాయిలో వున్నప్పుడు మాట కన్నా, మౌనం ఎక్కువ మంచింది.
ఎందుకంటే గతంలో ఏ పిపిసి ప్రెసిడెంటు కూడా నిత్యం మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఏదైనా సీరియస్‌సమస్య వున్నప్పుడో, లేక వారానికి ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చేవారు. దాంతో వారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత వుండేది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు నిత్యం ప్రజల్లో వుంటున్నామన్న భ్రమల్లో మీడియా ముందు వుంటున్నారు. మీడియాలో నిత్యం కనిపిస్తే జనంలో వున్నట్లే అన్న భావనలో రాజకీయం నెరుపుతున్నారు. ఇదే వారి వైఫల్యాలకు కారణమౌతోంది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఏదో ప్రత్యేక సందర్భంలోనే మీడియా ముందుకు వచ్చేవారు. కాని రేవంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుబాటలో నడుస్తున్నాడు. నిత్యం మీడియాలో వుండడానికే ఇష్టపడుతున్నాడు. కాంగ్రెస్‌లో నగుబాటుకు గురౌతున్నాడు. టిఆర్‌ఎస్, బిజేపిల రాజకీయాల మధ్య నలిగిపోతున్నాడు. పార్టీలో మాట చెల్లుబాటు లేదు…ప్రజల్లో ఫైర్ బ్రాండ్ అన్న పేరు రోజు రోజుకూ తగ్గవట్టే…పార్టీలో లుకలుకలు…భవిష్యత్తుకు నీలి నీడలు…పాపం రేవంత్…అనుకుంటున్నారు.
`ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్.
`చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే!
`తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్
`రైతు బంధు అందులో భాగమే
`ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్ కోసమే
`తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాలి.
`దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కేసిఆర్ కల.
`దేశంలోని రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా అమలు కావాలి.
`దేశమంతా మంచినీటి సమస్య తీరాలి.
`గఇవన్నీ దేశమంతా అమలు కావాలంటే దేశానికి కేసిఆర్ నాయకత్వం రావాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని మధనపడొద్దు. సాగు నీటి కటకట అసలే రావొద్దు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. దేశమంతా రైతుకు ఆసరా కావాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే ప్రభుత్వాలే వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకు ప్రభుత్వాలే పెట్టుబడి సాయం అందించాలి. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యం. ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల. ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము…మరి దీన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాయి.అందుకు కారణం దేశంలోని అనేక మెజార్టీ రాష్ట్రాలలో బిజేపి ప్రభుత్వాలు వుండడమే కారణం. అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏనాడూ సమైక్య పాలకులు తెలంగాణ కోసం ఆలోచించలేదు.
తెలంగాణకు అన్యాయం చేయకుండా వుండలేదు. 1956 నుంచే అన్యాయం చేస్తూ వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏకమైన సమైక్య రాష్ట్ర్రం ఏర్పాటు అయిన సమయంలోనే తెలంగాణ రెండుకోట్ల మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రం. 4 కోట్లు లోటుతో వున్నది అప్పటి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం. తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించారు. అక్కడ ప్రాజెక్టులు, కాలువలు కట్టుకున్నారు. తెలంగాణ ఎండబెట్టారు. ప్రాజెక్టులకు మొండిచేయి చూపారు. ఆనాడు ప్రశ్నించిన కొందరు నాయకులే గాని, నిలదీసిన నాయకులు లేరు. ఎదిరించి నిలబడిన నాయకులు లేరు. తెలంగాణలో ఉద్యమ స్వరూపం సాగుతున్నా, ఉవ్వెత్తున సాగేంత కొండంత అండ నాయకత్వం తెలంగాణ లేదు.2001లో కేసిఆర్ రూపంలో ఒక ఉద్యమ స్వరూపం ఎవరెస్టు శిఖరమంత బలమైంది ప్రజల ముందు నిలబడిరది. మనిషి బక్క పల్చనే కాని, బలం వెయ్యేనుగుల బలమంతది అని ప్రజల నమ్మారు. కేసిఆర్ వెంట నడిచారు. ఆ సమయంలో కేసిఆర్ చూసిన తెలంగాణ సాగు గోసలు అన్నీ ఇన్నీ కావు. తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎప్పుడూ ఎండడమే తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కాలువ అంటూ చెప్పుకోవడానికి తప్ప, నీరు పారడానికి వీలు లేకుండా కాకతీయ కాలువను మార్చారు. కాలువ తప్ప నీరు లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఏడాది మొత్తం ఆ కాలువ కళకళలాడుతుంటోంది. నిజామాబాద్ నుంచి ఖమ్మం సరిహద్దు దాకా సాగునీరు మోసుకెళ్తోంది. కాళేశ్వరంలో ఉత్తర తెలంగాణలోని ప్రతి పల్లెలో నీటి సిరులు జళజళ పారుతున్నాయి. ప్లోరైడ్‌ను తరిమేసేలా అటు ఖమ్మంతోపాటు, ఇటు నల్లగొండలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచీనీరు అందుతోంది…తెలంగాణ సాధిస్తే ఇవన్నీ సాధ్యమా? అని అనుకున్నవారు కూడా ఆ నిజాన్ని కల్లారా చూస్తున్నారు…తెలంగాణ ప్రగతిని చూసి మురుస్తున్నారు. అందుకే నిన్నటి గోసనుమర్చిపోవద్దు. నిన్న పడిన కష్టం కల అనుకోవద్దు.
నిలిచి గెలిచిన తెలంగాణను మళ్లీ ముంచేవాళ్లు కాచుకొని కూర్చున్నారు. అసలు ప్రగతి అంటే అర్ధం కూడా తెలియని నాయకులు ప్రతిపక్షాలలో మాటల గారడీ నేర్చుకున్నారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. తెలంగాణ సరిహద్దులు కూడా సరిగ్గా తెలియని వాళ్లంతా మాకు ఒక్కసారి చాన్స్ ఇవ్వండంటున్నారు. వచ్చిన తెలంగాణను మూడేళ్లులోనే ఆగం చేసేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పనిచేసి ఓటుకు నోటు కేసులో ఇరుకున్నవాళ్లు వాళ్లు కూడా తెలంగాణను పాలిస్తామంటున్నారు. పరాయి వాళ్ల చేతుల్లో తెలంగాణను పెట్టేందుకు దాసోహం అంటున్నారు. తెలంగాణ గురించి కనీసం ఉచ్చరించే అర్హత లేని వాళ్లంతా ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఏనాడు తెలంగాణ జెండా మోసిన దాఖలాలు లేని వాళ్లంతా తెలంగాణలో పెత్తనం కోసం నయవంచన కపట నాటకాలాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వారి మాయల్లో పడొద్దు. కుప్ప మీద పడి తినాలని చూస్తున్నారు. దోచుకొని తినాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. నీరు పెట్టి, దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండిరచి, కుప్ప నూడ్చాక కుప్ప మీద పడి తినడానికి గోతి కాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. కుప్ప నూడ్చడానికి కష్టపడ్డవారిని ప్రజలు మర్చిపోవద్దు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే వాళ్లుంటారు. సమాజం గురించి సోయి లేని వారు పార్టీల పేరు చెప్పుకొని నయవంచన కోసం వస్తుంటారు. అధికారంలోకి రావాలని తంటాలుపడుతుంటారు. ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ మీద పెత్తనం కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కనాడు జై తెలంగాణ అనేందుకు నోరు రాని వాళ్లు, ఆనాడు నోరు లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క దూం..ధాం కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర లేని వాళ్లంతా దద్దమ్మమాటలు మాట్లాడుతున్నారు. పచ్చగా వున్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని వాళ్లు, ఆ మాటలు చెబితే ఎలాగూ తెలంగాణ ప్రజలు వినరని తెలుసు.
వారిని నమ్మరని తెలుసు. వారిని దగ్గరకు రానియ్యరని తెలుసు. అందుకే కులం చిచ్చు ఒక వైపు, మతం మత్తు ఒకవైపు నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దేవుని పేరు చెప్పి, మనుషులను చీల్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అన్నది జనం అందరూ గమనించాలి. తెలంగాణ సాగు రంగంలో వేస్తున్న విప్లవాత్మక అడుగులు ఎలా వున్నాయో చూసేందుకు అనేక రాష్ట్రాలనుంచి రైతు నాయకులు వచ్చారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో వున్నారు. తెలంగాణలోరైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. రైతు బంధు విశిష్టతను స్వయంగా చూసి ఎంతో సంతోషంగా కొనియాడారు. రైతు భీమా వంటి వినూత్నమైన పధకం గూర్చి చర్చ చేశారు. పంట కొనుగోలు లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ, ముఖ్యమంత్రి కేసిఆర్ విజన్ తెలుసుకున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి , వాటికి పూర్వ వైభవం ఎలా వచ్చింది. ఇప్పుడు వాటి పరిస్దితి ఎలా వుంది. తెలంగాణ ఎలా కరువును దూరం చేసుకున్నది. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని,ఇంటింటికి ఎలా అందించుకుంటోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఈ పధకాలు ఎందుకు అమలు కావడంలేదు? అన్నదానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఎలా సాధ్యం? తెలంగాణ ఎలా సుసాధ్యం చేసింది? దేశమంతా ఎందుకు అమలు కావడంలేదు. అక్కడి పాలకులకు ఎందుకు చిత్తశుద్ది లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ సోయి ఎందుకు లేదు? ఇవన్నీ పొరుగు రాష్ట్రాల రైతులు కళ్లారా చూసి, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజెంటేషన్‌తో తెలుసుకున్నారు. దేశానికి కేసిఆర్ ఎలా ఆదర్శం కావాలో, దేశానికి కేసిఆర్ నేత అయితే ఎలా వుంటుందో అన్నది ఆ రైతు నాయకులే ఆయా రాష్ట్రాలలో చెప్పడానికి సిద్దంగా వున్నారు. దేశంలో వినూత్నమైన మార్పు కేసిఆర్ నాయకత్వం నుంచే మరో కొత్త తరం ఆవిష్కరణ జరగనుందని భవిష్యత్తు చెబుతోంది.
`ఓ పసిగుడ్డు, ఓ తల్లి ప్రాణాలు తీసిన వారిపైనే ఇంతవరకు చర్యలు లేవు?
`అధికారుల మీద ప్రజలకు ఇంకా నమ్మకం వుందా?
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లు పనిగట్టుకొని, పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ, పసిగుడ్డులను పొత్తిళ్లలో చిదిమేస్తూ, వైద్యం ముసుగులో వ్యాపారం చేస్తూ ప్రాణాలు తీస్తుంటే వాళ్లపై చర్యలుండవా? వారిపై కేసులుండవా? వారు నేరస్ధులు కాదా? శిక్షార్హులు కాదా? క్రిమినల్స్ జాబితాలో వారు చేరరా? వారి సర్టిఫికెట్టు సస్పెండ్ చేయరా? ఆసుపత్రులు మూసేయరా? వారి సర్టిఫికెట్లు నిజమేనా? ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వ్యవస్ధలోనే ఆసుపత్రి వుందా? అన్నవి కూడా ఎంతో ముఖ్యం. కాని ఇక్కడ అవేవీ పట్టించుకోకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని కాపాడుతున్నదెవరు? వారికి అండగా నిలుస్తున్నదెవరు? ఎక్కడో ఏదో లోపం లేకుంటే వైద్య వృత్తి ముసుగులో గర్భిణీ ప్రాణాలకు ముప్పు తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇంత కాలమెందుకు పడుతోంది? ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాని వైద్య శాఖ అధికారుల అలసత్వమా? లేక అవకాశవాదమా? ఏం జరుగుతోంది? ఓ వైపు పసి ప్రాణాలు ప్రపంచం కూడకముందే కంటి దీపం ఆర్పేస్తున్న వారిని కాపాడుతూ, మరో వైపు బేటీ బచావో, బేటీ పడావో అంటూ సమీక్షలు నిర్వహించడం దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో భ్రూణ హత్యలు అన్నవి నిత్యకృత్యమైపోయాయని అందరికీ తెలుసు. అందుకు ఎంతో కఠినమైన చట్టాలున్నాయని తెలుసు. అయినా వైద్య వృత్తిలో వున్నవారు అబార్షన్లు చేయడం ఆపడంలేదు. అధికారులకు తెలిసినా వారు చర్యలకు ఉపక్రమించడం లేదు? తాజాగా హన్మకొండ కలెక్టరేట్‌లో బేటీ బచావో, బేటీ పడావో అనే విషయం మీద కొన్ని గంటల పాటు జిల్లా స్ధాయిలో అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. అదే సమావేశానికి జిల్లావైద్యాధికారులు కూడా హజరయ్యారు. ఇటీవల భ్రూణ హత్యతోపాటు, రజిత అనే మహిళ ప్రాణం కూడా పోయింది. ఆ కుటుంబం వీధిన పడిరది. ఇద్దరు చిన్నారుల జీవితం ఆగమ్య గోచరమైంది. వారికి తల్లిలేకుండాపోయింది. వారి భవిష్యుత్తు అంధకారమైంది. ఎవరు వారిని చూసుకున్నా, కన్నతల్లి ప్రేమను పంచి, పెంచి పెద్ద చేసేంత పెద్ద మనసు మరొకరికి వుండదు. అలాంటి తల్లిని ఇద్దరు చిన్నారులకు దూరం చేసిన వారు దర్జాగా తిరుగుతుంటే, ఆ పిల్లలు నిత్యం కన్నీళ్లతో జీవితం గడపాల్సిన స్ధితికి కారణమైనవారిని గుర్తించరా? వారిని శిక్షించరా? మరి ఇలాంటి సమీక్ష సమావేశంలో ఇంత పెద్ద సంఘటనపై చర్చ జరిగిందా? కనీసం కలెక్టర్ ఈ విషయాన్ని ప్రస్తావించారా? సంబంధిత అధికారులకు గుర్తు చేశారా? కలెక్టర్ తిరిగి పంపిన ఫైలు గురించి మాట్లాడారా? ఓ వైపు పెద్దఎత్తున భ్రూణ హత్యలు జరుగుతుంటే అరికట్టేందుకు సమీక్షలు ఎందుకు నిర్వహించలేదు? :
కేంద్ర ఫ్రభుత్వం ఎనమిదేళ్లుగా బేటీ బచావో…బేటీ పడావో అనే కార్యక్రమం అమలు చేస్తోంది. అందుకు అవసరమైన నిధులు కూడా పెద్దఎత్తున వెచ్చిస్తోంది. ఆ నిధులు వినియోగమౌతున్నాయే…తప్ప ఎక్కడా వాటి ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఆడ పిల్లను బతికిద్దాం…వారిని చదివిద్దామని ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమలు మీద చిత్తశుద్ధి అవసరం లేదా? ముందు రిజిత సంగతి తేల్చండి? ఆమె మరణానికి కారకులైన వారిని ముందు అరెస్టు చేయండి? వారిని శిక్షించండి? అప్పుడు అధికారుల మీద ప్రజలకు నమ్మకం కల్గుతుంది. ఓ వైపు కలెక్టర్ రజిత మరణంమీద జిల్లా అధికారులు రూపొందించిన నివేధికలో ఏదో లోపముందని గ్రహించి, ఫైలు తిప్పి పంపించినప్పుడైనా అధికారుల్లో చలనం వుండొద్దా? సాక్ష్యాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను చూసుకొమ్మని ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో కించిత్ స్పందన లేదా? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఓ కమిటీ ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసినా జిల్లా వైద్య అధికారులు కదలినట్లు లేదు. తాజాగా ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన సంఘటనలో ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అంతే కాదు ఏదైనా ప్రభుత్వాసుపత్రిలో సంఘటనలు జరిగి, వైద్య అందడంలో ఏదైనా లోపం జరిగిన సందర్భాలలో వైద్యులను బాధ్యులు చేయడం చూస్తుంటాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవడం తెలిసిందే! మరి డబ్బులు ఖర్చు చేసి, వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను నమ్మితే వారు ప్రాణాలు పోయాల్సిన వారి చేతుల్లో ప్రాణాలు పోతే వారి బాధ్యత లేదా? వారికి శిక్షలుండవా? రిజత కేసులో ఫైలు మూసేయడానికి అవసరమైన మార్గాలు అన్వేషిస్తున్నారే గాని, రజిత మరణంతో అనాధలైన చిన్నారులను ఆదుకోవాలన్న బాధ్యత వైద్యాధికారులకు లేదా? కనీసం వారిలో మానవత్వం కూడా లేదా? కర్తవ్యం గాలికి వదిలేశారా?అందరూమర్చిపోయారు…మీరెందుకండీ…రజిత కేసులో న్యాయం అంటూ… ఇంకా సాగదీస్తున్నారు?:
ఇది ఎవరో కాదు…రియా ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్ నేటిధాత్రికి ఫోన్ చేసి అన్న మాటలవి. అసలు అబార్షన్‌కు కారణమైన వైద్యురాలు సబిత. మా తప్పేముంది? అంటూ నేటిధాత్రితో చెబుతూ మమ్మల్ని వదిలేయండి? అంటున్నారు. దయచేసి ఇకనైనా ఆపండి…అందరూ మర్చిపోయిన దాన్ని మళ్లీ రేపుతున్నారు? మేమేదో మేనేజ్ చేసుకున్నాం…ఇంకా ఆ విషయాన్ని లైమ్‌లైట్‌లోకి తేకండీ అంటున్నారు. వారికి ఒక గర్భిణీ ప్రాణం చిన్నగా కనిపిస్తోంది. అదేదో సినిమాలో నేను కోడిని కోస్తాను…మనిషిని చంపుతాను? రెండిరటీనీ ఒకే రీతిగా చూస్తాను…అంటూ విలన్ చెప్పినప్పుడు విన్నాం. కాని ఇప్పుడు రియా ఆసుపత్రి వైద్యుడు కూడా పరోక్షంగా అదే విషయాన్ని చెప్పినట్లు అనిపించకమానదు. ఇద్దరు చిన్నారులు జీవితాలు ఏం కావాలి? అన్నది మాత్రం ఎవరూ ఆలోచించడంలేదు? అటు ఆసుపత్రులు ఆలోచించక, ఇటు ప్రభుత్వ అధికారులు ఆలోచించక, పసి పిల్లలను దిక్కులేకుండా వదిలేద్దామా? వారికి ఓ దారి చూపిస్తామన్న మాటలే ఎక్కడా వినిపించడం లేదు? ఎంత సేపు మేనేజ్ చేశాం…అంటున్నారు? అంటే అర్దమేమిటో వారికే తెలియాలి? ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామన్న మాట మాత్రం వారి నోటి నుంచి రావడంలేదు? మీకు చేత కాకుండా పోలీసు శాఖకు అప్పగించండి?:
వైద్యాధికారులకు ఇది కొత్త సమస్య కాకపోవచ్చు. కాని ఒక ప్రాణం అన్నది సమాజానికి ఎప్పుడూ పెద్ద సమస్యే…అసలు సమస్యే…అన్ని మీడియా సంస్ధల వదిలేశాయి? మీకుందుకు? అని నేటిధాత్రిని అనడం కూడా వైద్యులకు తగనిది. ఆ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి? అన్నది మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు? ఇదీ మన వ్యవస్ధ దౌర్భాగ్యం. నెలల కింద జరిగిన ఈ సంఘటనను ఆసుపత్రులు, వైద్యులు, వైద్యాధికారులు, ఆఖరుకు వైద్యురాలు సబిత కూడా మర్చిపోయింది. మళ్లీ ఆమె పనుల్లో ఆమె నిమగ్నమైంది. రోజుకు ఎన్ని అబార్షన్ కేసులు వస్తే, అన్నీ పూర్తి చేస్తూనే వుంది. తన పాపపు పని ఆపడం లేదు. ఈ విషయాలన్నీ అందరకీ తెలుసు. ఒక్కటి వికటించి ఏదో జరిగినంత మాత్రాన ఆపుతామా? అన్నట్లు వైద్యంలో భ్రూణ హత్యల వ్యాపారం సాగిస్తూనే వున్నారు…! కలెక్టర్ గారు ఇక ప్రజలకు మీపైనే ఆశ.
మీరు సత్వర న్యాయం జరిపిస్తారననే నమ్మకంతోనే చాలా మంది వున్నారు. రజత విషయంలో ఫైలు తిరిగి పంపినప్పుడు మీరు ఎలాగైన దోషులను శిక్ష పడేలా చేస్తారని అనుకుంటున్నారు? మీరు మరి కాస్త మనసు పెడితే…వైద్యుల ముసుగులో పసి ప్రాణాలను గాలిలో కలుపుతున్న వారిని శిక్షిస్తే తప్ప , ఇతర వైద్యుల్లో భయం కలగదు..! మీరు మరింత గట్టిగా ఈ విషయంపై దృష్టిసారితే తప్ప…అసలు దోషులు బైటకు రారు…బేటీ బచావో…బేటీ పడావో సార్ధకం కాదు?
`జిల్లా వైద్య విభాగం రూపొందించిన రిపోర్ట్ ను కలెక్టర్ తిప్పి పంపినా స్పందనేది?
`డిఎంఅండ్ హెచ్‌ఓ సమాచారమిచ్చే తీరికలేదా?
`రియా ఆసుపత్రిలో పేషెంట్ రజితను ఎలా చేర్చుకున్నారు?
`శ్రీచక్రకు ఎందుకు పంపించారు?
`ఒక్క రోజులో సేకరించే సమాచారానికి నెలల సమయం కావాలా?
`అసలు రియా, శ్రీ చక్ర ఆసుపత్రులకు ఎలా అనుమతులిచ్చారు?
`అంతా గందరగోళం వ్యవహారం?
`తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎథిక్స్ కమిటీ సభ్యులు ఏం రిపోర్టు ఇస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ?
`ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగని భ్రూణ హత్యలు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రాణాలు పోయడం మర్చిపోయిన కొందరు స్వార్ధపరులు ప్రాణాలు తీయడం నేర్చుకున్నారు. అవి కూడా పసి ప్రాణాలు. ప్రపంచాన్ని చూడాల్సిన ప్రాణాలు. అమ్మ కడుపులో చల్లగా పెరగాల్సిన ప్రాణాలు…కళ్లు తెరవకముందే ఆరిపోతున్నాయి…ప్రాణాలు పురిటిదాకా రాకుండానే పోతున్నాయి? ప్రాణాలు నిలపాల్సిన సమయంలో పసి ప్రాణాలు తీయడం కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇది ఎంత దర్మార్గమైన చర్యలో అర్ధం చేసుకోవచ్చు. వారి వ్యాపారం కోసం, ఆదాయం కోసం, కోట్లకు పడగడలెత్తడం కోసం మహిళలే అరకొర చదువులతో వైద్య చేస్తూ, భ్రూణ హత్యలు చేయడమే వైద్యంగా పెట్టుకుంటున్నారు. నిత్యం భ్రూణ హత్యలతోనే క్లినిక్‌లు నడుపుతున్నారు. అలాంటివారిలో సబిత అనే వైద్యురాలు ఒకరు. ఇదంతా ప్రపంచానికి తెలుసు. ఆమె ఇప్పటికే మూడు సార్లు పట్టుబడిన సంగతి తెలుసు. తాజాగా రజిత అనే ఓ మహిళకు అబార్షన్ చేసే క్రమంలో జరగరాని ఘోరం జరిగిందన్నది అందరికీ తెలుసు. కాని అదంతా తారు మారు చేశారు…తప్పుడు నివేదిక తయారు చేశారు… కనీసం భయం లేకుండా దాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఆయనకు దానిపై అనుమానం వచ్చి, తిరిగి పంపారు…అయినా వైద్యాధికారుల్లో చలనం లేదు…స్పందన కరువు…! రజిత అనే గృహణి శ్రీచక్ర ఆసుపత్రిలో చనిపోయిందన్న నిజం అందిరకీ తెలిసిందే.
శ్రీ చక్ర ఆసుపత్రికి రజిత అనే గృహిణి ఎక్కనుంచి వచ్చిందంటే రియా ఆసుపత్రి నుంచి అన్నది కూడా తెలిసిందే. రియా ఆసుపత్రికి రజిత ఎలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు రిఫర్ చేశారు? ఏ పరిస్ధితుల్లో రజిత రియా ఆసుపత్రిలో చేరిందన్న విషయం పూర్తిగా ఆసుపత్రి వైద్యుడు రవి చెబుతూనే వున్నారు. నేటిధాత్రికి కూడా ఆ విషయం వెల్లడిరచారు. అలాంటిది ఎంక్వౌరీ కమిటీకి రజిత రియా ఆసుపత్రికి ఎలా వచ్చిందన్న విషయాన్ని వెల్లడిరచకుండా వుంటారా? ఎవరిని మభ్యపెడదామని డిఎంఅండ్ హెచ్‌ఓ చూస్తున్నారు. ఎవరిని కాపాడేందుకు నివేదికను తప్పుల తడకగా తయారు చేశారు? రజిత మరణం మీద డిఎంఅండ్‌హెచ్‌ఓ తయారు చేసిన నివేధిక అంతా అతుకుల బొంతగా వుందని, అర్ధం పర్ధం లేకుండా వుందన్న సంగతి జిల్లా కలెక్టర్ కూడా చెప్పేశారు. ఆ నివేదికను తిరిగి వెనక్కి పంపిచారు. అయినా జిల్లా వైద్య యంత్రాంగం మాత్రం కదిలినట్లు లేదు. స్పందిస్తున్నట్లు అసలే కనిపించడం లేదు? నేటిధాత్రికి రిజత అనే గర్భిణీని సబిత అనే వైద్యురాలు రియా ఆసుపత్రికి రిఫర్ చేసిందన్న సంగతిని పేరుతో సహా డాక్టర్ రవి వెల్లడిరచారు. అదే విషయాన్ని ఎంక్వరీ కమిటికీ కూడా చెప్పి వుంటాడు? కాని దాన్ని తారు మారు చేయాల్సిన అవసరం డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఏమొచ్చిందనేది ఇక్కడ తేలాల్సిన అసలు పాయింట్? రజిత అనే గర్భిణీకి అబార్షన్ ఎవరు చేశారని రియా ఆసుపత్రి వైద్యుడు రవిని నేటిధాత్రి ప్రశ్నించింది? మా ఆసుపత్రికి వచ్చే సరికే రిజతకు అబార్షన్ చేయడం జరిగిందన్న సంగతిని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. ఇంత స్పష్టంగా డాక్టర్ . రవి చెప్పినా నివేదికను జిల్లా వైద్యాదికారులు ఎందుకు తారు మారుచేశారు? తప్పుల తడక నివేదిక ఎందుకురూపొందిచారు? ఇక్కడ మరో విషయంపై కూడా లోతుగా ఎంక్వౌరీ జరగాల్సిన అవసరం వుంది.
అసలు అబార్షన్ వికటించి, ప్రాణాపాయ స్ధితిలో వున్న రిజిత గురించి పూర్తి వివరాలు సేకరించకుండానే రియా ఆసుపత్రి జాయిన్ చేసుకున్నదా? అన్నది కూడా ఇక్కడ తేలాల్సివుంది? మరి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ, ప్రపంచానికి తెలియకుండా, జరిగిన సంఘటనలు వెలుగులోకి రాకుండా మభ్యపెడుతున్న రియా ఆసుపత్రి లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయొద్దన్నదానికి విచారణ కమిటి ఎందుకు ప్రశ్నించలేదు? రియా ఆసుపత్రికి ఎందుకు ఇంతవరకు నోటీసులివ్వలేదు? మా దగ్గర ఆబార్షన్ కాలేదన్న విషయాన్ని మాత్రమే నమోదు చేసి, మిగతా విషయాలన్నీంటిని కమిటి ఎందుకు వదిలేసింది? ఆసుపత్రి మీద చర్యలకు ఎందుకు రిపోర్టు చేయాలేదు? తూతూ మంత్రంగా రిపోర్టు తయారు చేసి చేతులు దులుపుకుంటే చాలని అనుకున్నారా? రియా ఆసుపత్రి వైద్యులు వెల్లడిరచిన వివరాల ప్రకారం తమ ఆసుపత్రిలో రిజితను జాయిన్ చేసుకున్నా, తమ వల్ల కాకపోవడంతోనే రిజితను శ్రీచక్ర ఆసుపత్రికి పంపడం జరిగిందన్న సంగతిని కూడా డాక్టర్ రవి చెప్పేశారు. మరి శ్రీచక్ర ఆసుపత్రి ఎలా జాయిన్ చేసుకున్నది? రజిత మరణానికి శ్రీచక్ర వైద్యులు ఎలా కారణమయ్యారో అన్నది దానిపై అధికారులు ఎంతో సీరియస్‌గా వుండాల్సిన అవసరం వుండేది. అసలు రియా ఆసుపత్రి ఎలా వుంది? శ్రీచక్ర ఆసుపత్రి ఎలా వుంది? అన్నది ఓసారి పరిశీలిస్తే, ఏదైనా జరగరానిది జరిగితే, గత కరోనా సమయంలో విజయవాడలో రమేష్ ఆసుపత్రికిలో జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం వుంది. కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా వుంది. ఏదైనా ఫైర్ ఆక్సిడెంటు అయినా వెనకనుంచి వెళ్లేందుకు గాని, ఫైర్ ఇంజన్ ద్వారా నీళ్లు చల్లేందుకు కూడా స్ధలం కూడా లేదు. అలాంటి భవనాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం? వాటికి అధికారులు లైసెన్సులు ఇచ్చేడం కూడా పెద్ద మాఫియాగా తయారైంది! సరే….లైసెన్సులు ఇచ్చేప్పుడుఏదైనా విషయంలో షరతులు ఉల్లంఘించినా, రజిత లాంటి మహిళ భ్రూణ హత్యలో ప్రాణాలు కోల్పోతే కూడా ఆ ఆసుపత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్నది అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. డిఎంఅండ్‌హెచ్‌ఓ ఫోన్లోకి అందుబాటులోకి రారు?:
ఎన్ని సార్లు డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఫోన్ చేసినా కట్ చేస్తుంటారు..లేకుంటే పోన్ ఎత్తరు. ఆగష్టు 19నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా డిఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు పోన్ లిప్ట్ చేయడంలేదు. అసలు నివేదిక మళ్లీ తయారు చేస్తున్నారా? అన్న సంగతి కూడా చెప్పడానికి ఆయనకు సమయం చాలడం లేదా? లేక మీడియాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఓ మహిళ ప్రాణం తీసిన వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎవరినీ లెక్క చేయడం లేదా? రజిత మరణం మీద తయారు చేసిన నివేధిక కలెక్టర్ రిటన్ పంపిన తర్వాత కూడా కదిలేందుకు డిఎంఅండ్‌హెచ్‌ఓకు సమయంలేదా? లేక కలెక్టర్ ఆర్డరును కూడా బేఖాతరు చేస్తున్నారా? అసలు రిజిత మరణం విషయంలో అసలైన దోషులను ఎందుకు ఆయన దాచిపెడుతున్నారన్నది తేలాల్సిన అవసరం వుంది? వైద్యురాలు సబిత అనుచరుడి తిరకాసు మాటలు?: వైద్యురాలు సబిత నేటిధాత్రిని లీగల్‌గా చూసుకుంటామని కొత్త రాగం అందుకున్నారు? అంటే ప్రాణాల మీద ప్రాణాలుతోపాటు, నిత్యం భ్రూణ హత్యలు చేస్తూ, పట్టుబడి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్ధలను వైద్యురాలు సబిత ఎలా మేనేజ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంటే రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న వైద్య అధికార సిబ్బంది, నివేదికలు సమర్పించిన సిబ్బంది, అరెస్టు చేసిన పోలీసులందరిదీ తప్పని నిరూపించుకుంటానని భహిరంగంగానే చెబుతున్నారంటే చట్టాలు కూడా లెక్కలేవా? జైలు జీవితం అనుభవించి కూడా మారని తీరుతో, మళ్లీ, మళ్లీ అవే తప్పులు చేస్తున్నాం, పాపాలు మూట గట్టుకుంటున్నామన్న బాధ కించిత్తు కూడా లేకుండా లేదు. పైగా తమ తప్పులను ఎత్తి చూపడం తప్పంత దోరణితో నేటిధాత్రికి దమ్‌కీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అర్ధం చేసుకోండి? ఇక సామాన్యుల పరిస్ధితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు? రంగంలోకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ :
గర్భిణీ రజిత మరణం, భ్రూణ హత్యలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ రాజలింగం నేటిధాత్రితో మాట్లాడారు. రజిత మరణంపై జరిగిన పూర్తి స్ధాయి నివేదిక రూపొందించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటి ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఉపాధ్యాయవైద్యులతో కమిటి ఏర్పాటైంది. గైనిక్ డాక్టర్ నిర్మల, పిల్లల డాక్టర్. శేషుమాధవ్‌లతో కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు చొరవతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. వంద గొడ్లనుతిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కొట్టుకుపోయిందని తప్పుల మీద తప్పులు నేరాలు చేస్తూ, పసి ప్రాణాలను కర్కషంగా చంపేస్తున్నవారికి ఎన్నటికైనా శిక్ష తప్పదు…!
`మునుగోడు సభ నాడే తెలంగాణలో అమిత్ షా కొత్త రాజకీయం
`అటు రామోజీ రావు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం.
`తాజాగా లోకేష్ తో అమిత్ షా భేటీ
`చంద్రబాబుకు భద్రత మరింత పెంపు
`తెలంగాణపై ముందు ఫోకస్…
`ముందే చెప్పిన నేటిధాత్రి…
`ఎన్టీఆర్ మానియాతో తెలంగాణలో బిజేపి…
`ఆంద్రప్రదేశ్ లో రెండు కలిసి పోటీ…
`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…
కేసిఆర్ కాదంటే చంద్రబాబు…
`బిజేపి పొత్తు రాజకీయాలు….
`తెదేపా కు రెడ్ కార్పెట్…
హైదరాబాద్,నేటిధాత్రి:
మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. పాత పొత్తులు తెరమీదకొస్తున్నాయి. దక్షిణాదిన పాగా వేయడం అంత సులువైన పని కాదని తెలుసుకున్న బిజేపి మళ్లీ పాత స్నేహాల కోసం చేతులు చాచుతోంది. హస్తం పార్టీ పాగా వేయకుండా వుండాలంటే ఏక కాలంలో దక్షిణాదిలో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఉభయకుశలోపరిగా బిజేపి తన వంతు ద్విపాత్రాభియన రాజకీయాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏక కాలంలో అటు వైసిపితో, ఇటు తెలుగుదేశంతో జట్టుకట్టేందుకు, తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి సాగేందుకు నయా రాజకీయం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఒంటరిగా బిజేపి పాగా వేయడం కుదరనిపని. వైసిసితో పొత్తు సాగని పని. జనసేనను నమ్ముకుంటే సీట్లొస్తాయన్న నమ్మకం లేని పని. ఇక మిగిలింది. … కొత్త మిత్రుడికన్నా, , పాత శత్రువే మేలు అన్న సామెతను బిజేపి నిజం చేయనున్నది. తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరకు చేర్చుకుంటోంది. తెలంగాణ ఇవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి సుతారం ఇష్టం లేని విషయం. అందులోనూ రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో ఒక వైపే చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టని చంద్రబాబుకు రాష్ట్ర విభజన ఏ కోశాన ఇష్టంలేదు. ఇచ్చేదా…వచ్చేదా? అన్న ధోరణిలోని తెలంగాణలో ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నాయకుల రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఉత్తరం ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. 2009 డిసెంబర్9న తెలంగాణ ప్రకటించిన వెంటనే సీమాంధ్రకుచెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలను రాజకీయం సృష్టించిందే. ఆ రాత్రంతా నిద్ర లేకుండా తెల్లారే సరికి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ పూర్తయ్యే దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో బిజేపి అంటకాగడం కొత్త కాదు. పైగా ఒకనాటి బిజేపికి తెలంగాణ ఇవ్వడంఇష్టమున్నా, నాడు కూడా అద్వానీ లాంటి వారికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని పని. ఇప్పుడు అదే ప్రధాని మోడీకి కూడా తెలంగాణ ఏర్పాటు అన్నది అసలే ఇష్టం లేని పని అన్నది పలు మార్లు ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టం చేసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతిలో 2014లో తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. యధాలాపంగా రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ చేసిన వ్యాఖ్యలనే అందరూ అనుకున్నారు. అరవైఏళ్లలో అలాంటి మాటలు ఎన్నో విన్న తెలంగాణ ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా అవి నరేంద్ర మోడీ మనసులో నుంచి వస్తున్న మాటలు అనుకోలేదు. కాని ఆయన కావాలనే అన్నారని, సమయం దొకినప్పుడల్లా తెలంగాణ మీద కసి తీర్చుకుంటున్నాడని అనేక సార్లు రుజువైంది. తాజాగా కూడా ఆయన పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అసందర్భంగా ప్రస్తావించి బిజేపి వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు పాకులాడడంతో తేలిపోతోంది. నిజానికి నరేంద్రమోడీని చంద్రబాబు దూషించినంతగా ఎవరూ తిట్టలేదు.
ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలు విషయంలో కేంద్రం చేసిన తొండి రాజకీయాన్ని చంద్రబాబు బాగానే తూర్పారపట్టారు. మొదట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పని చేసినా ఆహా…ఓహో అని తెగ పొడిగిన చంద్రబాబు, తీరా 2019 ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఎన్డీయేనుంచి బైటకు వచ్చాడు. ఎన్డీయే కన్వీరన్ పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాకపోతే చంద్రబాబుని, ఆయన మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జీరో అయ్యారు. 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమయ్యారు. ఇక ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో కోలుకునే పరిస్ధితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే ఎలాగైనా మరో పార్టీతో పొత్తు లేకుండా పోటీ సాధ్యం కాని పని. ఎన్నికల్లో ఒంటరి పోరు వల్ల లాభం లేదు. ఇక జనసేనకు అంత సీన్ లేదు. ఒక వేళ పొత్తుతో ఏదైనా లాభం జరిగినా మరునాటి నుంచే తలపొటు తప్పదు. రెండున్నరేళ్లు మేము..మరో రెండున్నరేళ్లు మీరు అన్న కాన్సెప్ట్ అమలు పర్చాల్సి రావచ్చు. లేకుంటే కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే, జనసేన లాంటి పార్టీతో మహారాష్ట్ర లాంటి రాజకీయాలకు తెరతీయొచ్చు. ఇలాంటి వాటిలో ఎంతో దూర దృష్టితో వుండే చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలి. జనసేనను పక్కకు తప్పించాలి. అంటే బిజేపితో సఖ్యత కావాలి. కలిసి సాగాలి. కాంగ్రెస్‌తో వెళితే మొదటికే మోసం రావొచ్చు. పైగా ఆ పార్టీని ఆదరించేందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఎటు తిరిగి చూసినా బిజేపేని పట్టుకొని ఎన్నికల గోదారి ఈదడమే సరైందన్న నిర్ణయానికి వచ్చి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అందుకే ఈవరస బేటీలు…దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా చంద్రబాబును డిల్లీకి ప్రధాని మోడీ ఆహ్వానించారు.
పనిలో పనిగా చంద్రబాబుతో ఐదు నిమిషాలు రాజకీయం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో లంచ్‌చేశారు. అంటే ఇప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకున్నారు. కాకపోతే చంద్రబాబు అడిగిన సెక్యూరిటీ పెంచేశారు. చంద్రబాబుకు జడ్ కేటగిరిలో 12 సెక్యూరిటీ వుంది. ఇప్పుడు దాన్ని 24చేశారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ దేశంలో బిజేపి ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసిన సమయంలో చంద్రబాబుకు సెక్యూరిటీ విషయంలో జగన్‌కు ఇష్టంలేని పని చేశారు. అంటే పొత్తు పొడుపుకు సంకేతాలు పంపించారు. ఇక ఇదిలా వుంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజల దృష్టంతా మునుగోడు కేంద్రీకృతమై వుంది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సభకన్నా, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనాడు అధినేత రామోజీరావును, సినీ నటుడు ఎన్టీఆర్‌ను కలసి వార్తలకే ప్రాధాన్యం పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి పెట్టిన కోట్ల రూపాయల ఖర్చ గంగలో కలిపిపనట్లైంది. భవిష్యత్ రాజకీయాలను ఎంచుకునే సమయంలో రాజగోపాల్ రెడ్డి రాజకీయం కోసం బిజేపి ఆలోచిస్తుందా?
అందుకే తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రధాన శత్రువులైన తెలుగుదేశం పార్టీని, మళ్లీ కలుపుకుపోతే తప్ప బిజేపికి మనుగడ లేదు. అందుకే ఎలాగూ తెలుగేదేశం పార్టీకి తెలంగాణలో ఎవరో ఒకరు దిక్కు కావాలి. ప్రజలు కూడా ఎన్టీఆర్‌వైపు చూస్తున్నారు. ఏదో రకంగా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లో ఇరికిస్తే, ఆయనకు తెలంగాణ రాజకీయాలు అప్పగిస్తే, సీమాంధ్రలోనూ ఓట్లు కురిపించేందుకు ఉపయోగపడతాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన స్ధానాలు కొన్ని వున్నాయి. వాటిలో తెలుగుదేశం కీలక భూమిక పోషించినా, మిగతా ప్రాంతాల్లో బిజేపికి బలం పెంచుకునే అవకాశం వుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. సీమాంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన కనుమరుగౌతుంది. లోకేష్‌ను నాయకుడిగా గుర్తించేందుకు అవకాశం ఏర్పతుంది. అవసరమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో ఎన్ని వేషాలేసేందుకైనా కుదురుతుంది. ఇప్పటికే పదేళ్లుపాటు ఉమ్మడి రాజధాని అన్నది కొనసాగుతోంది. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప జగన్ చేసిందేమీ లేదు. దాంతో మళ్లీ అమరావతి మీద దృష్టిపెట్టడం కాన్న, తెలంగాణ రాజకీయాల మీద సమయం కేంద్రీకరించడం మేలన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. బిజేపి కూడా అందుకు సై అన్నట్లే కనిపిస్తోందన్న వార్తలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు, మోడీ పాత మిత్రులే. బిజేపి, తెలుగుదేశం పార్టీలు ఎన్‌డిఏలో మొదటినుంచి ఆప్తులే. కేసిఆర్ ఎలాగూ తిరుబాటు జెండా ఎగరేశాడు. కేంద్రంపై కత్తులు నూరుతున్నాడు. ఈ విషయంలో బిజేపికి, ప్రధాని నరేంద్ర మోడీకి పీకల దకా కోపం వుంది. ఎలాగైనా టిఆర్‌ఎస్‌ను కట్టడిచేయాలంటే, తెలుగుదేశం పార్టీని లేపాలి. లేకుంటే కాంగ్రెస్ లేచి నాట్యం చేస్తుంది. చేతికి బలమొస్తే కమలాన్ని పీకేస్తుంది. అందుకు ఒక్క దెబ్బకు రెండుపిట్టలు…అటు టిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలి…ఇటు కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలి. ఇదే ఇప్పుడు బిజేపి లక్ష్యం…తెలంగాణలో అధికారమే లక్ష్యం..!తెలుగుదేశంతో మళ్లీ సాగడమే నయా రాజకీయం!!
`కేసిఆర్ కుటుంబ పాలన ఆరోపణ ఒక్కటే నమ్ముకుంటే గెలుస్తారా?
`పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను ఉచితాలంటే, వ్యాపారుల రుణాల మాఫీపై సమాధానం చెప్పరా?
రాజకీయ పార్టీ అన్న తర్వాత అధికారం కోరుకోవడం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం ఆశ కాదు. ప్రజలకు మరింత సేవ చేయాలన్నా అధికారం కావాలి. ఆయా పార్టీలు అనుకున్న తీరిలో సమాజ నిర్మాణం జరగాలన్నా అధికారంలో వుండాలి. ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో కొత్త ఒరవడి తీసుకురావాలన్నా అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. వారి సంక్షేమం కోసం నిరంతరం తపన పడాలి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ రాజ్య నిర్మాణం జరగాలి. ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీలు పదిలంగా వుండాలి. కొన్ని దశాబ్ధాలైనా సరే ప్రజలకు మేలు చేసిన నాయకులను మర్చిపోని పాలన అందించాలి. అందుకు పార్టీలు ఎంతో కృషి చేయాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజల కోరిక మేరకు పని చేయాలి. ప్రజా పోరాటాలు చేయాలి. ప్రజల హక్కుల రక్షణకు పాటు పడాలి. అభివృద్దిలో రాజీలేని పోరాటం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి. ఇవీ సహజంగా రాజకీయ పార్టీలు ఆలోచించేవి. నిర్ణయాత్మక ఆలోచనలతో, నిర్మాణాత్మక విధానాలతో ముందడుగు వేయాలి. అంతే కాని ఒక్క ఛాన్స్ ప్లీజ్…ప్లీజ్…ప్లీజ్ అంటే సరిపోతుందా? ప్రజలు ఓట్లేస్తారా? కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వున్న బిజేపి, 19 రాష్ట్రాల్లో అధికారంలో వుండి అక్కడ ఎలాంటి పాలన సాగిస్తున్నారన్నది ప్రజలు గమనించరా? తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలోనైనా అమలౌతున్నాయా?
తెలంగాణ కంటే మరింత మెరుగైన పథకాలు మరెక్కడైనా వున్నాయా? అందులోనూ బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలౌతున్నాయా? కనీసం గుజారాత్‌లోనైనా అమలౌతున్నాయా. గుజరాత్‌లో తెలంగాణలో ఇస్తున్న రూ.2116 పెన్షన్ ఇస్తున్నారా? అక్కడ కేవలం రూ.500 ఇస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేదు. అక్కడెక్కడా ప్రాజెఉ్టలు కట్టింది లేదు. రిజర్వాయర్ల నిర్మాణం లేదు. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకం లేదు. అలాంటి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన లేదు. రైతు బంధు వంటి కార్యాక్రమాలు లేనే లేవు. అయినా మేం గెలుస్తాం…గెలుస్తున్నాం…టిఆర్‌ఎస్‌ను ఓడిస్తాం…డబుల్ ఇంజన్ తెస్తాం…తెచ్చి ఏం చేస్తారు? గెలిచి ఏం చేస్తారో ఇప్పటికి కూడా చెప్పకపోతే ఎలా? అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ అమలు చేస్తామనే ప్రత్యేకమైన పధకాలు బిజేపి వద్ద వున్నాయా? వుంటే అవి కదా? బిజేపి చెప్పాల్సింది. ఒక్క ఛాన్సు ప్లీజ్..అంటూ ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారా? యూపిఏ 2 హయాంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతోపాటు, నాడు నరేంద్రమోడీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని దేశమంతా అమలు చేస్తాడని ప్రజలు ఎంతో నమ్మారు. అప్పటికి గుజరాత్ అన్ని రంగాల్లో పెద్దఎత్తున ప్రగతిలో దూసుకుపోతోందన్న ప్రచారం విసృతంగా వుంది. పైగా బిజేపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని పార్టీ గుర్తించి ప్రకటించిన తర్వాత నరేంద్రమోడీ ప్రజలకు చేసిన వాగ్ధానాలు ప్రజలను పెద్ద ఎత్తున కదించించాయి. అప్పటికే పడిపోతున్న రూపాయి విలువను మళ్లీ నిలబెడతానమన్నారు. ద్రవ్యోల్భనం తగ్గిస్తామన్నారు. ధరలు అదుపు చేస్తామన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండేలా అన్ని రకాల ధరలు నియంత్రిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలుకల్పిస్తామన్నారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. గ్యాస్ ధరలు దించుతామన్నారు. పెద్దఎత్తున పారిశ్రామిక రంగాన్ని విసృతం చేస్తామన్నారు. యువతకు ఉపాది కల్పిస్తామన్నారు. పారిశ్రామిక రంగంలో పరుగులు తీయిస్తామన్నారు. వ్యవసాయం పండగ చేస్తామన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు మహిళళపై దాడులు జరక్కుంగా కఠినమైన చట్టాలు తెస్తామన్నారు. విదేశాల్లో వున్న నల్ల డబ్బును తెస్తామన్నారు. ప్రతి అకౌంట్లో 15లక్షలు వేస్తామన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నారు. బిజేపి తొలి నినాదమైన రామమందిర నిర్మాణం చేస్తామన్నారు. దేశమంతా ఒకే పన్ను విధానం అమలు చేస్తామన్నారు. ఇలా అనేక రకాల వాగ్ధానాలు చేశారు. దాంతో బిజేపి దేశ ప్రజలు నమ్మారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. దేశమంతా బిజేపి ప్రభజంనంలా గెలిపించారు. మరి అదే బిజేపి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చెబుతారు?
ఏదీ చెప్పకుండా ఎలా అధికారంలోకి వస్తారు? రాష్ట్రంలో బిజేపి ఒంటరిగా పోటీ చేసే శక్తిని పెంపొందించుకోవడం నిజంగా శుభపరిణామమే…తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో 5 సీట్లు గెలిచిన బిజేపి, 2018 ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్కసీటుకు పరిమితమైంది. కాకపోతే మధ్యలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు కలిసొచ్చాయి.ఊపు ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ రెండు సీట్లు కూడా బిజేపి బలంతో గెలిచాయని చెప్పడం కన్నా, ఆయా అభ్యర్ధుల మీద ప్రజల్లో వున్న నమ్మకం గెలిపించిందని చెప్పకతప్పదు. కాకపోతే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మాత్రం బిజేపి మానియా పనిచేసింది. ఆ ఎన్నికల్లో కూడా చేయరాని వాగ్ధానాలు చేస్తే తప్ప, ప్రజలు ఓట్లేయలేదు. మరి మర్చిపోయినట్లున్నారు. ప్రజా సంగ్రామయాత్రతో బిజేపి రాష్ట్ర ఛీఫ్ బండి సంజయ్ పాదయాత్ర వరకు బాగానే వుంది. కాని ఒక్క ఛాన్స్ అనే మాటనే జనం వింతగా తీసుకుంటున్నారు. ఈ ఒక్క ప్లీజ్ అన్న పదం తప్ప మరేం లేదా? అన్న ప్రశ్న కూడా జనం నుంచే వస్తోంది. ఆ మధ్య బీజేపీ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పేదల దేవుడు అన్నా…మన మోడీ అంటూ చెప్పుకొచ్చారు.
మరి పేదల దేవుడైతే పెరుగుతున్న ధరలేంది? అన్న ప్రశ్న ప్రజలు వేసుకుంటారని, సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని బండి సంజయ్‌కు తెలియందా? ఆ మధ్య ప్రజా సంగ్రామ యాత్రలో ఓసారి ఈ ధరలేంది? అని మహిళలు నిలదీసిన సంఘటన మర్చిపోయారా? ఎంత సేపు ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ పాలన…అవినీతి పాలన అంటూ చెప్పడం బాగానే వుంది. ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడితే… తెలంగాణ ప్రజలకు బిజేపి ఏం చేయాలనుకుంటుంది? అన్నది చెప్పరా? చెప్పాల్సిన అవసరం లేదా? టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే బిజేపికి వరాలా? సరే…బిజేపిని ప్రజలు నమ్మి గెలిపిస్తే దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పధకాల అమలౌతున్న ఆ పధకాలు అమలు చేస్తారా? లేక వదిలేస్తారా? ప్రజలకు వచ్చే ప్రధానమైన అనుమానల్లో ఇవి కూడా వున్నాయి. అసలే రాష్ట్ర్రం అప్పుల్లో వుందంటున్నారు. అప్పులు చేస్తే తప్ప రాష్ట్రానికి పూట గడవడదంటున్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్ధితి వుందంటున్నారు. అప్పులు తేకుండా, ఉద్యోగస్తుల జీతాలు ఆపకుండా వుండాలంటే సంక్షేమ పథకాలకు కోత పెడతారా? పెన్షన్లు దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన వాటికి సమానం చేస్తారా? వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం లేదా? గత ఎన్నికల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. పనిలో పనిగా నవరత్నాలే తమ మ్యానిఫెస్టో అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వివిధ రకాల పెన్షన్లు సంఖ్య పెంచుతామన్నారు. ఇచ్చే నగదు కూడా పెంచుతామన్నారు. ఇలా కొత్త కొత్త పథకాలకు శ్రీకారంచుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తామన్నారు. మరి తెలంగాణలో బీజేసీ ఏం చెప్పదల్చుకుంది?
పొరుగున వున్న కర్నాటకలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు లేదు. రూ.2116 పెన్షన్ లేదు. తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం అమలులో లేదు. గురుకులాలు లేవు. ఫీజు రీఎంబర్స్ మెంటు లేదు. ఆరోగ్యశ్రీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సంక్షేమ పధకాలకు లెక్కే లేదు. మరి వాటన్నింటినీ ఆపకుండా అమలు చేస్తామని, ఇంకా మెరుగైన పధకాలు సృష్టిస్తామని, అమలు చేస్తామని బ్లూ ప్రింట్ ఏదైనా ప్రకటిస్తారా? ఎన్నికల నాడు ఏదో తూతూ మంత్రంగా మ్యానిఫెస్టో అని ఏవో నాలుగు ప్రకటించి, గెలిచి తూచ్ అంటారా? ఇది కూడా ప్రజల నమ్మకం మీద ఆధారపడి వుంటుంది? ప్లీజ్…ప్లీజ్ మీద ఆధారపడి సాగేది కాదు…ఆలోచించుకోండి!!
`కాంగ్రెస్ పార్టీకి జెల్లకొట్టకపోతే కాంట్రాక్టు మాయం
`వ్యాపారం చే జారిపోతే కష్టం!
`తమ్ముడితో నడవడం తప్పదు
`కాంగ్రెస్ మునిగిన నావ అనకపోతే నష్టం.
`నేనెక్కడికీ వెళ్లననే మాటలు ఒట్టివే!
`పనికిరాని తిరకాసులందుకే!
`అన్నదమ్ములది ఒకేదారి…చెరోదారి అన్నది చెప్పుకోవడానికే మరి…
`అన్న అంతరంగం…తమ్ముడు ఆవిష్కారం!
`అంతా మునుగోడు నాటకం!
`ఇరవై ఏళ్ల వ్యాపారం కోసం ముప్పై ఏళ్ల పార్టీని నిండా ముంచడం?
హైదరాబాద్,నేటిధాత్రి:
తనను తాను మోసం చేసుకోవడం మూర్ఖులు చేసే పని. తన పని కోసం ఇతరులను మోసం చేయడం అతి తెలివి మంతుని పని. అదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఊగిసలాట ఎలా వున్నా ఉత్తుత్తి ప్రచారానికి తప్పకుండా వస్తా! తన వంతు పాత్ర ఎలా పోషించాలో అలా పోషిస్తా? ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తా? పార్టీ కోసమే పనిచేస్తా? పార్టీలోనే వుంటా? ఎలాగైనా పంతం నెగ్గించుకుంటా? తను అనుకున్నది నెరవేరడానికి కావాల్సిన ఎత్తుగడలు వేస్తా? తమ్ముని కోసం కొత్త తరహా కోవర్టు అవతారం ఎత్తుతా? అన్నట్లే వుంది కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. పిపిసి దక్కలేదన్న అంసతృప్తితో వున్న వెంకటరెడ్డికి ఏ క్షణాన ఏఐసిసి స్టార్ కాంపైనర్ పోస్టు ఇచ్చిందో కాని అది ఈ రకంగా వెంకటరెడ్డికి ఉపయోగపడుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఇలాంటి పరిస్ధితుల్లో వెంకటరెడ్డి అడకత్తెరలో పోక చెక్క కావాలి. నుజ్జు నుజ్జు కావాలి. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కునే పరిస్ధితి ఎదురుకావాలి. కాని స్టార్‌కాంపెయినర్ పదవి అన్నది వెంకటరెడ్డికి అనుకూలంగా మారుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే దాన్ని వినియోగించుకొని మాత్రం తమ్ముడి వైపు పరోక్ష ప్రచారానికి క్షేత్ర స్ధాయిలోకి వెళ్లే అవకాశం దక్కింది. నిన్నటిదాకా మునుగోడు ప్రచారానికి నేను వెళ్లను…
అంటూ భీష్మించుకు కూర్చున్న వెంకటరెడ్డిలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు పార్టీ కోసమనుకుంటే అంత కంటే అమాయకత్వం వుండదు. తాను పంతం పట్టుకొని కూర్చుంటే తమ్ముడి వైపు అన్న లేడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. అందుకే చీకటి రాజకీయాలు చేసైనా సరే తమ్ముడిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ పదవి అడ్డం పెట్టుకొనే, శకుని పాత్ర పోషించొచ్చు. శల్య సారధ్యం వహించొచ్చు. ఇది కాంగ్రెస్‌పెద్దలు ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్ధం కాకుండా వుంది. నిజాలు మాట్లాడుకోవడం కాంగ్రెస్‌లో పూర్తిగా కనుమరుగైనట్లుంది. తమ్ముడు రాజగోపాల్‌కు వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారంచేయడం అంటే నమ్మశక్యం కాని విషయం. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించండి అని చెప్పడం కాదు…రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేసిండని చెప్పగల ధైర్యం వెంకటరెడ్డికి వుందా? రాజగోపాల్‌రెడ్డి ఎన్నుకున్న మునుగోడు ప్రజలను మోసం చేశాడని చెప్పగడా? తన నాయకత్వాన్ని చూసే పార్టీ రాజగోపాల్‌కు ఇన్ని రకాల అవకాశాలు కల్పించినా, పార్టీని వదిలివెళ్లడం తల్లికి ద్రోహం చేయడమే అని వెంకటరెడ్డి చెప్పగలరా? మరి ఏం చెబుతారు? ఎలా ప్రచారం చేస్తారు? ఇదంతా హంబక్ అన్నది ఇక్కడే తెలిపోతోంది. ఇక్కడ వెంకటరెడ్డి అడుగులకు ముందర కాళ్లకు బంధం పడిరది.
ముందుకు అడుగు వేయలేడు. వెనక్కి వేయలేడు. రాష్ట్రంలో పరిస్ధితులు కొద్దిగా మారుతున్నాయి. బిజేపిలో ఒక వర్గం దూకుడు ఆ పార్టీకి నష్టం తెచ్చే పరస్థితి వుందని తేలిపోయింది. ఇది గమనించే ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు పూనుకున్నది. ఆయనను సస్పెండ్ చేసింది. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. నిజానికి కోమటిరెడ్డి సోదరులకు మునుగోడులో మంచి పట్టు వుంది. ప్రజల ఆదరణ కూడా వుంది. దీన్ని వదులుకుంటే రాజగోపాల్‌రెడ్డిది ఎటూ కాని రాజకీయం అవుతుంది. అందుకే అన్న వెంకటరెడ్డి చాలా చాకచక్యంగా రంగంలోకి దిగాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఒక వేళ గెలిస్తే, ఆ మరు క్షణమే వెంకటరెడ్డి కూడా భువనగిరి పార్లమెంటు స్ధానానికి రాజీనామా చేస్తాడు. ఒక వేళ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే, తాను చేసిన ప్రచారం మూలంగానే తమ్ముడు ఓడిపోయాడు? అన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు…ఇందులో పెద్ద లాజిక్ లేదు. కాకపోతే వెంకటరెడ్డి ఊ… అనడమే గొప్ప అన్నట్లు కాంగ్రెస్ పార్టీ చేసుకునే ప్రచారం అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే ఇక్కడ ఎవరికి వారు కాంగ్రెస్ నేతలంతా తప్పించుకునే ఎత్తుగడలోనే వున్నారన్నది పూర్తిగా స్పష్టమౌతోంది. కోమటిరెడ్డి సోదరుల మూలంగానే పార్టీ నల్లగొండలో బతుకుతుందన్న సంకేతాలు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతోంది. ప్రజల్లోకి పంపుతున్నట్లే అవుతుంది. అంతే కాదు వెంకటరెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కాల్చుతున్నామన్న భ్రమల్లో పిసిపి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసిసి నేతలు కూడా వున్నారనడంలో సందేహం లేదు. ఏది జరిగినా కోమటిరెడ్డి కుటుంబానికి నష్టం లేదు.
రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కన్నా, కోమటిరెడ్డి కుటుంబానిదే పై చేయి అన్నది ప్రచారం చేసుకోవడానికి వీలౌతుంది. బిజేపిలో ఆయనకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అన్న వెంకటరెడ్డి కూడా బిజేపిలో అడుగుపెట్టడానికి మార్గం సుగమమౌతుంది. కాంగ్రెస్ పార్టీ మునిపోయిన నావ అంటూ వెంకటరెడ్డి నోటితోనే పదే పదే చెప్పించుకునేందుకు వీలౌతుంది. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి ఓడిపోతే, వెంకటరెడ్డి బలమైన నాయకుడు. ఆయన వల్లే తమ్ముడు ఓడిపోయాడని కాంగ్రెస్‌లో మరింత ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం ఏర్పడుంది. ఎటు చూసినా కోమటిరెడ్డి కుటుంబానికి మేలే తప్ప, నష్టం లేదు. ఇదీ అసలు లెక్క. రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే అన్న కూడా అన్నీ సర్ధుకుంటాడు. లేకుంటే తమ్ముడు అక్కడ, అన్న ఇక్కడ రాజకీయాలు చేస్తుంటారు. పైకి కనిపించేందంతా రాజకీయమైనా, లోన సాగేందంతా వ్యాపారమే అన్నది అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్‌కు జెల్ల కొట్టకపోతే కాంట్రాక్టు మాయమౌతుంది. రెండేళ్లలో కేంద్రానికి ఎన్నికలు జరగాల్సివుంది. ప్రజలు మార్పు కోరుకుంటే పరిస్ధితి మరో రకంగా వుంటుంది. గత నలభై ఏళ్ల కాలంగా దేశ ప్రజలు వరసగా మూడుసార్లు ఏ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు బిజేపికి మూడోసారి అవకాశం వరించిందంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పూర్తిగా గల్లంతే…! అన్నది నూరు పైసల నిజం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇద్దరు అన్నదమ్ములు మళ్లీ అసెంబ్లీకే పోటే చేసే అవకాశం వుంది. అప్పుడు ఏది అధికారంలో వుంటే దానికి సై అనేందుకు ఇద్దరు సోదరులు సన్నద్దమనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మంచో చెడో కాని రాజగోపాల్‌రెడ్డి కుమారుడు నడిపే కపంనీకి ఇరవైఐదేళ్ల కాలం సాగే ఓ కాంట్రాక్టు అన్నది వశమైంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జీవిత కాలం కాంట్రాక్టు. ఒక జీవితానికి సరిపోయంతే పెద్ద ప్రాజెక్టు. ఒక తరం సుసంపన్నంగా కాలం వెళ్లదీసేందుకు ఆ ఒక్క కాంట్రాక్టు చాలు. అంత పెద్ద వ్యాపారం ముందు రాజకీయాలు చాలా చిన్నవి. అధికారంలో వున్న పార్టీ ఆశీస్సులు ఎంతో అవసరం. అందుకే ముందూ వెనుక ఆలోచించాల్సిన అవసరం లేకుండా రాజగోపాల్‌రెడ్డి జంప్ అయ్యారు. అన్న అలాగే వున్నారు. అయినంత మాత్రాన వెంకటరెడ్డి చెప్పే నేనెక్కడికీ వెళ్లను అన్న మాటలు వట్టివే…అన్నది అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు.పనికి రాని తిరకాసులు పెడితే తప్ప తన ప్రభావం కనిపిచంచేలా లేదన్న చాణక్యం ప్రదర్శించడంలో వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు.
ఎందుకంటే తమ్ముడు పార్టీకి జెల్ల కొట్టి పోయినా, అన్న వెంకటరెడ్డి తన హావాను కొనసాగిస్తున్నాడంటే వారి రాజకీయాల ముందు రేవంత్ రాజకీయం తేలిపోయిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. పట్టుబట్టి మరీ రేవంత్‌రెడ్డి చేత సారీ చెప్పించుకున్నాడు. అయినా సంతృప్తి పడలేదని తేల్చేశాడు. అద్దంకి దయాకర్ సారి చెప్పాలన్నాడు. నాలుగు సార్లు చెప్పినా అబ్బే నాకు నచ్చలేదన్నాడు. అద్దంకిని సాగనంపితే తప్ప తాను కాంగ్రెస్ మొహం చూడనన్నాడు. అది కూడా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైనా తూచ్ అన్నాడు. నేను మునుగోడుకుప్రచారం చేయనన్నాడు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్ధితే లేదన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. అందర్నీ పిచ్చోళ్లను చేశాడు. అయినా పార్టీకి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారనుకోవడం వెర్రిబాగుల తనం. పాపం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నాయకుడు ఆడమన్నట్లు అడేదాకా దిగజారిపోయిందనేది కళ్లముందు సాక్ష్యాత్కారం…ఇక పార్టీ కోలుకోవడం దేవుడెరుగు…జనం ఆదరణ మాత్రం ఇప్పటికే కరువు!?
నువ్వైనా, నేనైనా, మనమెవరమైనా మంచికి ప్రతీకలం కావాలి. మానవత్వానికి సంకేతం కావాలి. ఐక్యతకు స్పూర్తి కావాలి. ఐకమత్యం ప్రదర్శించాలి. ఆదర్శానికి నిదర్శనం కావాలి. ప్రగతికి మార్గనిర్ధేశకం కావాలి. అభివృద్ధికి ఆలంబన కావాలి. మన మధ్య ఎప్పుడూ స్నేహం వెల్లివరిస్తూ వుండాలి. చిద్విలాసం మన పెదవులపై చిందిస్తుండాలి. ఎవరైనా భయపడాల్సివస్తే అనారోగ్యానికి భాధపడాలి. పేదరికానికి భయపడాలి. అంతే కాని మనిషినికి మనిషి చూసి భయపడే రోజులు రావొద్దు. ఆ రోజులు ఎవరూ సృష్టించొద్దు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చింతించాలి. అంతే కాని సమాజమేమౌతుందో అని చింతించే రోజు రావొద్దు. బిక్కు బిక్కు మంటూ బతికే పరిస్ధితులు ఎవరూ కోరుకోవద్దు. వాటిని సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. రాజకీయ ప్రయోజనాలు ముడిపెట్టి, మనుషుల మధ్య విభజనలు సృష్టించొద్దు. కులాల కుంపట్లు పెట్టొదు. మతాల మధ్య దూరాలు, మనుషుల మధ్య విద్వేషాలు రగిలించొద్దు. అంతరాలు పెంచేవే రాజకీయ అగచాట్లు. వాటిని దరి చేరనీయొద్దు. తోటి వారికి సాయం చేయాలన్న ఆలోచనలు చేయాలే తప్ప, కీడెలా జరుగుతుందన్నది మదిలోకి కూడా రానివ్వొద్దు. మతాల పేరుతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఉపేక్షించొద్దు.పిచ్చి ప్రేలాపనలు చేసేవారిని ఊరికే వదిలేయొద్దు. కఠినంగా వుంటే తప్ప కాక చల్లారదు.
మన దేశం లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రపంచ దేశాలు మనను చూసి స్పూర్తి పొందుతున్న ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం మనది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతున్నది. మతం పేరుతో చిచ్చు రేపితే శాంతిభద్రలకు విఘాతం కలుగుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన మన దేశంలో కులాలెన్ని వున్నా, మతాలెన్ని వున్నా మన మధ్య ఐక్యతే మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలిపింది. ప్రజా ప్రతినిధిలే సమాజంలో విద్వేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం మనకు ఏ మాత్రం మంచిది కాదు. సమాజాన్నీ చీల్చే రాజకీయాలు ఎవరూ చేయొద్దు. కేవలం అధికారమే పరమాధిగా సమాజాన్ని వర్గాలుగా విభజించడం పెద్ద తప్పు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో కుల రాజకీయాలను గురించి నిత్యం మాట్లాడుకుంటుంటాం. మనలో మనకే కుల రాజకీయాలే సమాజానికి విఘాతం అనుకుంటే, మత రాజకీయాలు ఉత్పాతాలౌతాయి. సమాజాన్ని రెండుగా చీల్చేస్తాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎంత మాత్రం హితం కాదు. అందుకే రాజకీయా పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు సృష్టించే రాజకీయ ప్రసంగాలెక్కడా చేయెద్దు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు చేయాల్సిన పనులు కాదు. అది ఏ పార్టీ చేసినా తప్పే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల నాడు ఎల్లన్న, తర్వాత బోడన్నా అనే రాజకీయాలు చేయొద్దు. ఏ ఒక్క కులమో, ఓ ఒక్క మతమో ఓట్లేస్తే గెలిస్తేనే నాయకులు కాలేదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఓట్లేస్తేనే గెలిచారు. అది మర్చిపోవద్దు. ఎన్నికల నాడు ఒక రాజకీయం…ఎన్నికల కోసం ఒక రాజకీయం చేయొద్దు. సమాజంలో చిచ్చు రేపే రాజకీయాలు మనకొద్దు. మతాల మధ్య మానవత్వం అందరికీ ముద్దు. కాని ఎవరూ విద్వేషపూరితమైన వాతావరణం కావాలని కోరుకోవద్దు. ఆఆలోచనలు చేయొద్దు. సమాజాంలో అందరికి ఐక్యత, అలాయ్ బలాయ్ లాంటి సంస్కృతి మనది. అది సమాజానికి ఎంతో ఆనందదాయకం. సఖ్యత సంతోషదాయకం. ఆధిపత్య రాజకీయాల కోసం, కేవలం అధికారం కోసం, ఓ పార్టీని అప్రదిష్టపాలు చేయడంకోసం, అధికారంలో వున్న పార్టీని గద్దెదింపడం కోసం చేసే రాజకీయ కుట్రల్లో మతాన్ని జొప్పించడం అన్నది ఎవరికీ శ్రేయస్కరం కాదు. అలజడులు ఆకలి తీర్చవు. కుత్సితాలు రేపే కుంపట్లు ఆరని మంటలు తెచ్చిపెడతాయి.ఒక్కసారి మన తెలంగాణ రాజకీయాలు బాగా గమనించండి.
తెలుగు సామ్రాజ్యాలు మన దేశంలోనే కాదు, మన తెలంగాణలో అంతరించిన తర్వాత సుమారు ఆరు వందల సంవత్సరాల పాటు ముస్లింల పరిపాలనలోనే తెలంగాణ వుంది. మొఘలులు, కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీల పరిపాలన కొనసాగింది. కాని ఐక్యత ఒక ఒరవడిగానే సాగింది. ఒక దశలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లిం సమాజం కూడా వుంది. అందరూ కలిసే నిజాం మీద తిరగబడ్డారు. తెలంగాణ సాయుధపోరాటం చేశారు. నిజాంలకు తొత్తులుగా పనిచేసిన దొరల మీద అందరూ పోరాటం చేసి, తెలంగాణ సాధించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అస్ధిరతల సృష్టికి ఆనాడు కూడా కొందరు పాకులాడేవారు. ప్రభుత్వాల అస్ధిరతకు కారణభూతులయ్యేవారు. అయినా సమాజంలో అవి రాజకీయ కుట్రలుగా కనిపించేవి. ఎన్టీఆర్ హాయాం వచ్చేసరికి కొంత సద్దుమణిగింది. చంద్రబాబు కాలంలో మరింత తగ్గింది. కాని వైఎస్. రాజశేఖరెడ్డి సమయంలో గోకుల్ ఛాట్ , లుంబినీ పార్కు వంటి దుర్ఘటనలు జరిగాయి. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చాలా వరకు నగరంలో అల్లర్లు లేకుండా చేశారు. తెలంగాణ వచ్చాక అసలు అలజడి అన్న పదమేలేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన ప్రగతి శీల భావనలు ఎంతో మార్పును తెచ్చాయి. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల అమలు. వంటి వాటితో సమాజంలో విజభన అన్నది లేకుండాపోయింది. అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపే రోజులువచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన వాతావరణం వున్న రాష్ట్రంగా తెలంగాణ, ఎంతో ఆనందదాయకమైన నగరంగా హైదరాబాద్ మరింత కీర్తికెక్తింది. ఎన్నో రకాల పరిశ్రమల ఏర్పాటుకు, ఐటి రంగానికి ఉజ్వలభవిష్యత్తు తెలంగాణలో కనిపించింది. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు, రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో ఒక్కసారిగా కుదుపుకు కారణమైంది.
కొన్ని సంవత్సరాలుగా చార్మినార్ వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రుళ్లు కూడా ప్రశాంతమైన వాతావారణం నెలకొన్నది. కాని మళ్లీ ఏడు గంటలకే దుకాణాలు మూసేయాల్సిన పరిస్ధితులు మళ్లీ వస్తాయని సగటు తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించలేదు. ఇందుకు కారణం ఎవరైనా కావొచ్చు. కాని రాష్ట్ర్రప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ర్యాపిడ్ ఆక్షన్‌ఫోర్సును రంగంలోకి దింపి, పరిస్దితి చక్కదిద్దింది. త్వరలో గణేష్ నవరాత్రులున్నాయి. పరిస్ధితి చేయిదాటిపోకుండా వుండాల్సిన తరుణం. అసలు ప్రేజలు రెచ్చగొట్టే వేషాలు ఎవరూ వేయొద్దు. తెలంగాణ ఉద్యమ కాలంలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ పండుగ, తర్వాత పెద్దఎత్తున సాగిన సద్దుల బతుకమ్మలు, గణేష్ నిమజ్జనాలు ఎంతో సంతోషంగా సాగాయి. కాని ఒక్కసారిగా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా? అని రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. నిన్నటిదాక రాష్ట్ర బిజేపిలో అంతా మిత వాదులే వుండేవారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు అతి వాద నాయకుడి మారిపోవడం అన్నది కొంత ఇబ్బందికరమైన పరిస్ధితికి సంకేతం. చనిపోయిన వారి ఇళ్లముందు భగవగ్ధీతను పెట్టొద్దు? అని చెప్పడం వేరు. అలా పెట్టిన వారిపై దాడి చేస్తామని చెప్పడం వేరు. హిందువులే భగవగ్ధీతను నమ్ముతారు. ఎంతో పవిత్రంగానే భగవధ్గీతను ప్రతి హిందువు చూస్తాడు. కాని కొంత కాలంగా అలా భగవద్గీతను వైకుంఠదామాల వాహనాలకుండే మైకుల్లో వినిపిస్తున్నారు. ఇది తప్పని చెప్పండి. కాని హిందులపైనే దాడి చేస్తామని చెప్పడం కూడా బిజేపికి తీవ్ర నష్టదాయమైన పనే. ఇక బిజేపి మొత్తం హిందువుల కోసమే అన్నట్లు మాట్లాడుతూ పోతే , ఆ పార్టీలో మైనార్టీ నాయకులకు చోటు లేకుండాపోతుందన్న సంకేతాలు వెళ్తాయి. అది పార్టీ మూలసిద్ధాంతానికి కూడా వ్యతిరేకం. అదే నుపుర్ శర్మ విషయంతో తేలిపోయింది. అయినా ఒక ప్రజా ప్రతినిధిగా వున్న రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల్లో అలజడిని సృష్టించాయి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, ప్రజలను రెండుగా చీల్చి, ఇప్పుడేం సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది ఎంత వరకు సమంజమో! కూడా పార్టీల నాయకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రజలకు అసౌకర్యం కల్పించడమే రాజకీయం అనుకుంటే, ఆ పార్టీల రాజకీయానికి చరమగీతం పాడడం ప్రజలకు పెద్ద పని కాదు…ఓటుతో ఎక్కడ విసిరేయాలో అక్కడకి విసిరేస్తారు…బంగాళాఖాతంలో కలిపేస్తారు.
ప్రతి వాడు ప్రజలను నిందించేవాడే…ప్రతి వాడు నీతులు చెప్పేవాడే… ప్రతి వాడు ప్రజలను తప్పు పట్టేవాడే…ప్రతి వాడు తామేదో ప్రజలను ఉద్దరిస్తున్నట్లు చెప్పేవాడే…అక్కడికేదో ప్రజలకు ఏమీ తెలియదనన్నట్లు, అంతా వాళ్లకే తెలిసినట్లు, అందుకే నాయకులైనట్లు వాళ్లను గొప్పగా ఊహించుకుంటారు. నాయకుల అవతారమెత్తి పాలించే హక్కు మాకుందని చెప్పుకుంటున్నారు. నాయకులుగా చెలామణి అవుతున్నారు. ప్రజలనే నిందించే స్ధాయికి చేరుకున్నారు. అదేం దౌర్భాగ్యమో వాళ్లే ప్రజా ప్రతినిధులౌతున్నారు. ప్రజల నెత్తిన తాండవం చేస్తున్నారు. దేశమంతా నేతలంతా ఇలాగే వున్నారు…ప్రజలకు తాము లేకుంటే ఏమౌతారని మొసలి కన్నీరు కారుస్తుంటారు. పెత్తనం చేసేందుకే మేమంతా వున్నదని నిరూపిస్తున్నారు. ప్రజలు మారాలి…అంటూ సోది చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. నాయకులు మారాలా? ప్రజలే మారాలా? నోరుంది కదా? ఏది పడితే అది చెప్పడం అలవాటు చేసుకున్నారు. మీడియా కూడా ప్రజలను కాకుండా, తమనే చూపిస్తుంది కదా? అని ప్రజలను పలుచన చేయడం నాయకులు అలవాటు చేసుకున్నారు. వారికి నీతిభోధలు నేర్పడం అలవాటు చేసుకుంటున్నారు. ప్రజలు ఓట్లనాడు నోటు కోసం ఎదురుచూస్తున్నారంతగా చిన్నగా మాట్లాడడం మొదలుపెడతున్నారు. ప్రజలనే కించపరుస్తున్నారు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడండి? ప్రజలు ఏనాడైనా మాకు ఇది కావాలని కోరారా? నోటిస్తేనే ఓట్లేస్తామన్నారా? వారికి లేని ఆలోచనలను సృష్టించిందినాయకులు. వారు వద్దని వారించినా వద్దంటే నామీదొట్టే అంటూ జనాన్ని మభ్యపెట్టి నోటు చేతిలో పెట్టింది నాయకులు. అవ్వా, అయ్యా, పెద్దయ్య, చిన్నయ్య, అక్కా చెల్లి, అన్నా, తమ్మీ అంటూ వరసల కలిపి, దేవుళ్లుగా కొలిచి వారిని బుట్టలో వేసుకొని,ఓట్లు దండుకోవడం అలవాటు చేసుకున్నది నాయకులు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకున్నది నాయకులు. ఆ తర్వాత మెల్లిగా మద్యం అలవాటు చేసి, ఎన్నికల సమయంలో మద్యం సరఫరా చేసి, ఓట్లనాడు ఓటు ఎటుపోతుందో అన్న అనుమానంతో నోటు జేబులో పెట్టడం అలవాటు చేసుకున్నది నాయకులు. కాని ఇప్పుడు ఆ నెపం జనం మీద తోసేస్తున్నారు…రూపాయి ఇవ్వందే జనం కదలడం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కోరుకున్నా అది సమాజం శ్రేయస్సు కోసమే…
ప్రగతి కావాలని కోరుకుంటారు…అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కావాలంటారు. ఉపాధి చూపించమంటారు. పేదలకు కనీస సౌకర్యాల కల్పన కావాలంటారు. కూడు, గుడ్డ, గూడు సమకూర్చాలంటారు. ఆరోగ్యం కోసం వైద్యం కావాలంటారు. ఇవి ప్రజలకు కల్పించడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. ఎన్నికల ముందు అమలు చేయలేని వాగ్ధానాల్విడం, ముందు ఓట్లు వేయించుకునేందుకు నోట్లివ్వడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. అభివృద్ధిని ప్రశ్నించిన ప్రజలను నిందించడం నేర్చుకున్నారు. ఓట్లు ఊరికే వేశారా? అంటూ ఎదరు ప్రశ్నించడం నేర్చుకున్నారు. అదే గొప్ప తెలిగా భావిస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్య సూర్తి…మీరేం తక్కువ నాయకులరా? ప్రజలు ఏదైనా పని కోసం వస్తే ఊరికే చేసిపెడుతున్నారా? ఒక్కరైనా గుండెమీద చేయి వేసుకొని మేము రూపాయి అవినీతి చేయకుండా వుంటున్నామని చెప్పగలిగే నాయకులు ఏ పార్టీలోనైనా వున్నారా? సంతకానికి రూపాయి వసూలు చేయడం ఎక్కడైనా మానుకున్నారా? పనుల కోసం వస్తే ఓ రేటు…పైరవీల కోసం వస్తే ఓ రేటు అంటూ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని ప్రజా సేవ ముసుగేసుకున్న నాయకులు ముందు మరాలి. తామున్నది ప్రజా సేవ పేరుతో రాజకీయం చేస్తూ, పదవులు అనుభవిస్తూ, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవం కాదు? నికార్సనైన సేవ చేసే నాయకులు ఏ పార్టీలోనైనా ఈరోజుల్లో కనిపిస్తారా? ఒక్కసారి మునుగోడు రాజకీయమే చూసుకుందాం…
తాను రాజీనామా చేస్తే మునుగోడుకు మేలు జరుతుంది. మునుగోడు అభివృద్ధి జరుగుతుంది. అంటూ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇది మునుగోడులో రాజీనామాకు ముందు కోమటిరెడ్డి తిరకాసు తొలి వ్యాఖ్య? అమిత్‌షా ను పిలిచి మునుగోడులో సభ ఏర్పాటు చేసి, బిజేపిలో చేరిన సందర్భంలో ఇదే రాజగోపాల్ చెప్పిన మరో మాట…నాలుక మడతెట్టిన తీరు చూడలేదా? అమిత్‌షా రాజీనామా చేయమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా ప్రకటించానన్నారు. ఇందులో ఏది సత్యం…ఏదసత్యం!
నాయకులు నోరు తెరిస్తేనే అబద్దం…మాట మాట్లాడితే అసత్యం…నిలబడితే స్వార్ధం…అడుగేస్తే అన్యాయం…ఇంతకన్నా చెప్పుకోవడానికి నాయకుల తీరులో, వ్యవహారంలో కొత్తమీ లేదు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో నిండిపోయి, అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయి, అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలు మారాలా? డబ్బుకు ప్రజలు అమ్ముడుపోతున్నారా? మద్యం ఇస్తేగాని మాట వినడం లేదా? చెప్పడానికి కనీసం సిగ్గనిపించాలి. ఐదేళ్ల నాడు ఇచ్చే ఐదు వందల రూపాయలతో ప్రజలు ఐదేళ్లు బతుకున్నారా? మీరు జాలిపడి ఎన్నికల నాడు నోటు ప్రజలచేతికిస్తున్నారా? నాయకులు సిగ్గు శరం పూర్తిగా వదిలేశారు…నిజాలు చెప్పడం ఏనాడో మానేశారు…కనీసం చెప్పే అబద్దమైన కాండ్రిరచి మీద ఉమ్మేస్తుందేమో! అన్న భయం లేకుండా నోరుంది కదా? అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే నిస్సిగ్గుగా తమకు తాము గురివింద సామెతను నిజం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెడతారు…నాయకులౌతారు.
పార్టీలో క్రియాశీలమౌతారు…అప్పుడు పైలా పచ్చీసు ఆట మొదలుపెడతారు? పార్టీ కార్యక్రమాలకు సొంత నిధులు ఖర్చు చేస్తారా? లేదు. అందుకు అవసరమైన నిధులు సేకరిస్తారు. ఏదైనా సభ నిర్వహణ అంటే చేతిలోనుంచి పెట్టుకుంటారా? లేదు. మళ్లీ వ్యాపారుల మీద పడతారు…అందులో నుంచి సభలకు వచ్చే ప్రజలకు నగదిస్తారు? ప్రజలు పనులు వదులుకొని వచ్చినందుకు వారికి గిట్టుబాటు కావొద్దా? కడుపు వుండేది నాయకులకేనా? ప్రజలకు కాదా? సభలేమో! ప్రచారాలేమో!! కాని ప్రజలు ఎండల్లో రావాలి. ఎండలో నిలబడాలి. నాయకులు చెప్పే సొల్లు వినాలి. ఇదంతా పుణ్యానికి రావాలి. మరి అదే నాయకులు ఎక్కడైనా ప్రచారానికి వెళ్తే ఊరికే వెళ్తారా? అక్కడి నాయకులను పీడిరచుకొని తినరా? సౌకర్యాల ఏర్పాట్లలో చుక్కలు చూపించరా? ప్రచారం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో సంచులు నింపుకొని రారా? మరి మీరైతే సంచులకు సంచులకు తెచ్చుకోవచ్చు? కాని ప్రజలను మారమంటారు? ఇదేం న్యాయం…!ఇంకా పెద్ద నాయకుల తీరు చెప్పుకుంటే అబ్బో ఆ చరిత్రలే వేరు…పెద్ద నాయకులకు కదలాలంటే లక్షలు కావాల్సిందే…అద్దాల హోటళ్లలో మకాం ఏర్పాటు చేయాల్సిందే…వారు అడిగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందే…! ఎక్కడ తేడా వచ్చినా, ఆగమాగం చేయాల్సిందే…ఎవరినైతే గెలిపించాలని వచ్చారో…వారిని ఓడిరచేందుకు కూడా వెనకాడని రాజకీయాలు చేయాలి…ఇంత దుర్మార్గమైన నాయకత్వాలు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. కాని వీళ్లు నీతులు చెబుతారు. ప్రజలు మారమంటారు…ప్రజలకు వాతలు పెడతారు? పన్నుల మీద పన్నులేసి ముక్కు పిండి వసూలు చేస్తారు..ధరలు పెంచుతారు…అన్నీ వడ్డిస్తారు…ప్రజల కోసమే ఇవన్నీ చేస్తున్నామంటారు…? కాలం మారింది. పార్టీలుమారుతున్నాయి? నాయకులు మారుతున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు ఎలా మభ్యపెట్టాలో నేర్చుకొని, కొత్త తరం రాజకీయాలు ఇవే అంటూ రుచి చూపిస్తున్నారు…అందరూ అందరే…అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదే!! ఏ నాయకుడు సుద్దపూస కాడులే!!!
నేను రానుబాబో అంటూ ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుకూర్చున్నాడు. ఎలా బైటపడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఒక్కడివొస్తే చాలదు…అన్నా దమ్ములు ఇద్దరూ కలిసి వస్తేనే లెక్క…అని బిజేపి ఫిట్టింగ్ పెట్టి కూర్చున్నది. సరే…అంటూ కోమటిరెడ్డి సోదరులు తలూపినట్లు సమాచారం…కాని రాజగోపాల్ రెడ్డి ముందు పరిస్ధితి గమనించేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాం..రాం చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటాడు… ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం పోరాటమా? పోరుబాటను ఎంచుకోవడం ఇదా అంటే అదంతా మాకు తెల్వదంటాడు…తాము ఎంచుకున్న మార్గం వేరు అంటారు…అన్నా దమ్ములం కలిసొస్తామని చెప్పినట్టు తెలుస్తున్నా…అబ్బే అదేం లేదంటారు…అసలు నిజం చెప్పలేరు…అబద్దం చెబుతూ కాలం గడపలేదు… ఆఖరుకు పార్టీని ముప్పు తిప్పలు పెట్టి అన్నాదమ్ములు కలిసి కాంగ్రెస్ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయినా సరే …రాజగోపాల్‌రెడ్డి పోయినా ఫరవాలేదు…మీరుండాలి అంటూ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి కాళ్లా వేళ్లా పడుతోంది…గతంలో ఏ నాయకుడికి బ్రతిమిలాడనంత గౌరవంగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ చూస్తోంది…నిజానికి అక్కడ ఏం జరగాలి….పార్టీని వెంకటరెడ్డి బ్రతిమిలాడుకోవాలి….కాని అంతా రివర్స్ జరుగుతోంది. వెంకటరెడ్డి జారి పోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్‌కు తెలుసు…ఇటు వెంకటరెడ్డికి తెలుసు…కాని జగన్నాటకమాడుతున్నారు…జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజేపిలోకి వెంకటరెడ్డి వెళ్లడం ఖాయమని విసృతంగా చర్చ జరుగుతోంది…కాని నేను వెళ్లను అంటూ వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల దాకా ఆగాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ కట్టప్ప పాత్ర పోషించాలని చూస్తున్నాడు. తమ్ముడిని గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్‌కు జెల్లకొడదామని చూస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. కాని ఏంచేయలేని నిస్సహాయక స్ధితి. ఇలాంటి పరిస్ధితి కాంగ్రెస్ ఏనాడు అనుభవించలేదు. ఒక నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం మోకరిల్లడం కూడా ఆయన బిజేపిలోకి చేరడానికి మరింత బలంగా మారుతోంది. కాంగ్రెస్ మొత్తం వదులుకునేందుకు ఇష్టపడని నాయకుడు బిజేపిలో చేరితే బలమైన నాయకత్వంగా అవతరించొచ్చని అన్నా, దమ్ములు అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం బిజేపికి అర్ధం కావడంలేదు. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, మిమ్ముల్ని నమ్మి కన్న తల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలేశానని మొసలి కన్నీరు కార్చొచ్చు…పార్టీ మొత్తం నన్ను వద్దన్నా వినకుండా బిజేపి పంచన చేరాని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడ ఇప్పుడు చేస్తున్నట్లే రాజకీయం చేయొచ్చు…
ఇదిలా వుంటే వెంకటరెడ్డి ఎలా ఆడిస్తే కాంగ్రెస్ అలా ఆడుతుండడం కూడా ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.
గత కొంత కాలంగా భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నాడు. ఒక దశలో గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనన్నాడు. రేవంత్ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదని భహిరంగంగానే చెప్పేశాడు. రూ.50 కోట్లు ఖర్చు చేసిన పిపిసి కొనుక్కున్నాడని కూడా వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు. అయినా ఆయనను పార్టీ సముచితంగానే గౌరవిస్తోంది. తాజాగా చండూరు సభలో కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. పాపం రేవంత్ భేషరుతుగా క్షమాపణ చెప్పాడు. అద్దంకిని పార్టీనుంచి బైటకు పంపాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎలాగో అద్దంకిని ఆ దిశగా కూడా పార్టీ భుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగితే మునుగోడు ప్రచారానికి వస్తానన్నాడు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నాడు. మంగళవారం డిల్లీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ను మార్చాలంటున్నాడు. అంతే కాదు, సీనియర్లందరినీ మరోసారి సంప్రదించి, పిపిసిని కూడా మార్చాలంటున్నాడు. అప్పటిదాకా తాను పార్టీకి పనిచేయనని స్పష్టం చేశాడు. పనిలో పనిగా ఎవరు ఎంత కష్టపడినా సరే…మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చెప్పేశారు. అంటే తాను పరోక్షంగా తమ్ముడికే మద్దతిస్తున్నానని మరోసారి చెప్పాడు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనను నెత్తినెత్తుకొని ఊరేగేందుకు ప్రయత్నం చేస్తోంది. పార్టీ సీనియర్లందరూ వెంకటరెడ్డి మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు…
ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలోనైనా వుంటుందా?
జనం ఆలోచనలకు కాంగ్రెస్ నేతలు ప్రతీకలు కాలేకపోతున్నారు. చుండూరు సభను కార్యకర్తలు సక్సెస్ చేశారు. అంటే క్షేత్ర స్ధాయిలో కూడా బలంగానే వున్నామని కాంగ్రెస్ పార్టీకి సంకేతాలిచ్చారు. కాని కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం లేదు. పార్టీ యంత్రాంగం వున్న కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై నమ్మకం లేదు. కాని అసలు కార్యకర్తలే లేని బిజేపికి అతి విశ్వాసం ప్రదర్శిస్తోంది. అంటే నాయకుల్లో ఐక్యత అన్నది ఏ పార్టీకైనా ముఖ్యమన్నది కాంగ్రెస్ నేతలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది ఇప్పటికీ వారిలో వారికే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది.
మొత్తంగా కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.
అసలు పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని ఎందుకు భుజ్జగిస్తున్నట్లు. జగ్గారెడ్డి లాంటి నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు..కొత్తగా అసంతృప్తి వాదులతో గొంతు కలిపిన మర్రి శశిధర్‌రెడ్డి చెబితే ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్‌కు ఓటు పడుతుందా? అసలు సామాన్య ప్రజలు ఆయనను గుర్తుపడతారా? తనకంటూ సొంత ఇమేజ్ లేని మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచిన వాళ్లే తప్ప, సొంతంగా క్యాడర్ వున్న వాళ్లు కాదు. జగ్గారెడ్డి కూడా అంతే…2004లో టిఆర్‌ఎస్ మూలంగా, 2009లో కాంగ్రెస్ మూలంగా గెలిచాడు. 2014లో తెలంగాణ గాలిలో కొట్టుకుపోయాడు…మళ్లీ 2018లో కాంగ్రెస్ ఓట్లతో గెలిచాడు. అలాంటి నాయకుడు కూడా సొంతంగా పార్టీ పెడతానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెబితే తెలంగాణలో సంగారెడ్డిలో కాకుండా మరెక్కడైనా గెలిచే పరిస్దితి వుందా? కనీసం ఉమ్మడి మెదక్ జిల్లాలో మరెక్కడినుంచి పోటీ చేసినా గెలవగలడా? కాంగ్రెస్‌ను కాదని తన స్వార్ధం కోసం బిజేపిలో చేరి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన నాయకుడు జగ్గారెడ్డి. ఆయన కూడా నీతి గురించి, పార్టీ మార్పు గురించి రేవంత్‌రెడ్డిపై మాట్లాడడం విడ్డూరం.
ఎలాగైనా రేవంత్‌ను దించేయాలి…
ఇదొక్కటే సీనియర్ల ఎజెండా! ఎందుకు? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సరే రేవంత్‌ను పక్కన పెడితే జనారెడ్డిని పిపిసి చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందా? వెంకటరెడ్డిని చేస్తే అధికారంలోకి వస్తుందా? అంతో ఇంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్న పుల్ మాస్ లీడర్ అంటే కనిపించే ఏకైక పేరు రేవంత్‌రెడ్డి. ఆయన వుండడం సీనియర్లకు ఇష్టం లేదు…ఎందుకంటే ఇంత కాలం ఆడిరది ఆట, పాడిరది పాటగా రాజకీయాలు చేసిన, సీనియర్లకు రేవంత్ గిట్టడం లేదు. మరి రేవంత్‌లాగా వాళ్లు పార్టీకి జోష్ నింపగలరా? అదీ లేదు. పొన్నాల లక్ష్మయ్య పిపిసిగా వున్నంత కాలం ఆయనతో కోమటిరెడ్డి సోదరులకు పడలేదు…ఉత్తమ్ కుమార్‌రెడ్డి వున్నంత కాలం అంతే…ఈ ఇద్దరు అన్నదమ్ములకు పడలేదు…ఇప్పుడు రేవంత్ రెడ్డి వారికి అసలే నచ్చలేదు. అంటే మేం తప్ప మరొకరు పార్టీలో వుండొద్దన్నంత హార్డ్‌కోర్ కాంగ్రెస్ నాయకులా అంటే అదీ లేదు…తమ్ముడి బీజేపి తీర్ధం పుచ్చకున్నాడు…అన్న ఎలా తీర్ధం పుచ్చుకునేది అని ఎదురు చూస్తున్నాడు…వీళ్ల కోసమా? పార్టీ మెట్లు దిగేది…వీళ్లకోసమా..పార్టీ ఆత్మాభిమానం చంపుకునేది…ఒక్కసారి ఆలోచించండి!! నాయకుల ఆటిట్యూడ్ మార్చుకోండి…తర్వాత మీరు మారండి…పార్టీ కాదు సుమీ…క్యారెక్టర్లు మార్చుకోండి…కలిసి కట్టుగా సాగండి!!!
నేను రానుబాబో అంటూ ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుకూర్చున్నాడు. ఎలా బైటపడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఒక్కడివొస్తే చాలదు…అన్నా దమ్ములు ఇద్దరూ కలిసి వస్తేనే లెక్క…అని బిజేపి ఫిట్టింగ్ పెట్టి కూర్చున్నది. సరే…అంటూ కోమటిరెడ్డి సోదరులు తలూపినట్లు సమాచారం…కాని రాజగోపాల్ రెడ్డి ముందు పరిస్ధితి గమనించేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాం..రాం చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటాడు… ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం పోరాటమా? పోరుబాటను ఎంచుకోవడం ఇదా అంటే అదంతా మాకు తెల్వదంటాడు…తాము ఎంచుకున్న మార్గం వేరు అంటారు…అన్నా దమ్ములం కలిసొస్తామని చెప్పినట్టు తెలుస్తున్నా…అబ్బే అదేం లేదంటారు…అసలు నిజం చెప్పలేరు…అబద్దం చెబుతూ కాలం గడపలేదు… ఆఖరుకు పార్టీని ముప్పు తిప్పలు పెట్టి అన్నాదమ్ములు కలిసి కాంగ్రెస్ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయినా సరే …రాజగోపాల్‌రెడ్డి పోయినా ఫరవాలేదు…మీరుండాలి అంటూ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి కాళ్లా వేళ్లా పడుతోంది…గతంలో ఏ నాయకుడికి బ్రతిమిలాడనంత గౌరవంగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ చూస్తోంది…నిజానికి అక్కడ ఏం జరగాలి….పార్టీని వెంకటరెడ్డి బ్రతిమిలాడుకోవాలి….కాని అంతా రివర్స్ జరుగుతోంది. వెంకటరెడ్డి జారి పోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్‌కు తెలుసు…ఇటు వెంకటరెడ్డికి తెలుసు…కాని జగన్నాటకమాడుతున్నారు…జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజేపిలోకి వెంకటరెడ్డి వెళ్లడం ఖాయమని విసృతంగా చర్చ జరుగుతోంది…కాని నేను వెళ్లనుఅంటూ వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల దాకా ఆగాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ కట్టప్ప పాత్ర పోషించాలని చూస్తున్నాడు. తమ్ముడిని గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్‌కు జెల్లకొడదామని చూస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. కాని ఏంచేయలేని నిస్సహాయక స్ధితి. ఇలాంటి పరిస్ధితి కాంగ్రెస్ ఏనాడు అనుభవించలేదు. ఒక నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం మోకరిల్లడం కూడా ఆయన బిజేపిలోకి చేరడానికి మరింత బలంగా మారుతోంది. కాంగ్రెస్ మొత్తం వదులుకునేందుకు ఇష్టపడని నాయకుడు బిజేపిలో చేరితే బలమైన నాయకత్వంగా అవతరించొచ్చని అన్నా, దమ్ములు అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం బిజేపికి అర్ధం కావడంలేదు. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, మిమ్ముల్ని నమ్మి కన్న తల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలేశానని మొసలి కన్నీరు కార్చొచ్చు…పార్టీ మొత్తం నన్ను వద్దన్నా వినకుండా బిజేపి పంచన చేరాని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడ ఇప్పుడు చేస్తున్నట్లే రాజకీయం చేయొచ్చు…ఇదిలా వుంటే వెంకటరెడ్డి ఎలా ఆడిస్తే కాంగ్రెస్ అలా ఆడుతుండడం కూడా ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.
గత కొంత కాలంగా భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నాడు. ఒక దశలో గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనన్నాడు. రేవంత్ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదని భహిరంగంగానే చెప్పేశాడు. రూ.50 కోట్లు ఖర్చు చేసిన పిపిసి కొనుక్కున్నాడని కూడా వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు. అయినా ఆయనను పార్టీ సముచితంగానే గౌరవిస్తోంది. తాజాగా చండూరు సభలో కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. పాపం రేవంత్ భేషరుతుగా క్షమాపణ చెప్పాడు. అద్దంకిని పార్టీనుంచి బైటకు పంపాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎలాగో అద్దంకిని ఆ దిశగా కూడా పార్టీ భుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగితే మునుగోడు ప్రచారానికి వస్తానన్నాడు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నాడు. మంగళవారం డిల్లీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ను మార్చాలంటున్నాడు. అంతే కాదు, సీనియర్లందరినీ మరోసారి సంప్రదించి, పిపిసిని కూడా మార్చాలంటున్నాడు. అప్పటిదాకా తాను పార్టీకి పనిచేయనని స్పష్టం చేశాడు. పనిలో పనిగా ఎవరు ఎంత కష్టపడినా సరే…మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చెప్పేశారు. అంటే తాను పరోక్షంగా తమ్ముడికే మద్దతిస్తున్నానని మరోసారి చెప్పాడు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనను నెత్తినెత్తుకొని ఊరేగేందుకు ప్రయత్నం చేస్తోంది. పార్టీ సీనియర్లందరూ వెంకటరెడ్డి మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు…ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలోనైనా వుంటుందా?
జనం ఆలోచనలకు కాంగ్రెస్ నేతలు ప్రతీకలు కాలేకపోతున్నారు. చుండూరు సభను కార్యకర్తలు సక్సెస్ చేశారు. అంటే క్షేత్ర స్ధాయిలో కూడా బలంగానే వున్నామని కాంగ్రెస్ పార్టీకి సంకేతాలిచ్చారు. కాని కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం లేదు. పార్టీ యంత్రాంగం వున్న కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై నమ్మకం లేదు. కాని అసలు కార్యకర్తలే లేని బిజేపికి అతి విశ్వాసం ప్రదర్శిస్తోంది. అంటే నాయకుల్లో ఐక్యత అన్నది ఏ పార్టీకైనా ముఖ్యమన్నది కాంగ్రెస్ నేతలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది ఇప్పటికీ వారిలో వారికే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. మొత్తంగా కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.అసలు పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని ఎందుకు భుజ్జగిస్తున్నట్లు. జగ్గారెడ్డి లాంటి నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు..కొత్తగా అసంతృప్తి వాదులతో గొంతు కలిపిన మర్రి శశిధర్‌రెడ్డి చెబితే ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్‌కు ఓటు పడుతుందా? అసలు సామాన్య ప్రజలు ఆయనను గుర్తుపడతారా? తనకంటూ సొంత ఇమేజ్ లేని మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచిన వాళ్లే తప్ప, సొంతంగా క్యాడర్ వున్న వాళ్లు కాదు. జగ్గారెడ్డి కూడా అంతే…2004లో టిఆర్‌ఎస్ మూలంగా, 2009లో కాంగ్రెస్ మూలంగా గెలిచాడు. 2014లో తెలంగాణ గాలిలో కొట్టుకుపోయాడు…మళ్లీ 2018లో కాంగ్రెస్ ఓట్లతో గెలిచాడు. అలాంటి నాయకుడు కూడా సొంతంగా పార్టీ పెడతానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెబితే తెలంగాణలో సంగారెడ్డిలో కాకుండా మరెక్కడైనా గెలిచే పరిస్దితి వుందా? కనీసం ఉమ్మడి మెదక్ జిల్లాలో మరెక్కడినుంచి పోటీ చేసినా గెలవగలడా? కాంగ్రెస్నుకాదని తన స్వార్ధం కోసం బిజేపిలో చేరి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన నాయకుడు జగ్గారెడ్డి. ఆయన కూడా నీతి గురించి, పార్టీ మార్పు గురించి రేవంత్‌రెడ్డిపై మాట్లాడడం విడ్డూరం. ఎలాగైనా రేవంత్‌ను దించేయాలి…
ఇదొక్కటే సీనియర్ల ఎజెండా! ఎందుకు? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సరే రేవంత్‌ను పక్కన పెడితే జనారెడ్డిని పిపిసి చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందా? వెంకటరెడ్డిని చేస్తే అధికారంలోకి వస్తుందా? అంతో ఇంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్న పుల్ మాస్ లీడర్ అంటే కనిపించే ఏకైక పేరు రేవంత్‌రెడ్డి. ఆయన వుండడం సీనియర్లకు ఇష్టం లేదు…ఎందుకంటే ఇంత కాలం ఆడిరది ఆట, పాడిరది పాటగా రాజకీయాలు చేసిన, సీనియర్లకు రేవంత్ గిట్టడం లేదు. మరి రేవంత్‌లాగా వాళ్లు పార్టీకి జోష్ నింపగలరా? అదీ లేదు. పొన్నాల లక్ష్మయ్య పిపిసిగా వున్నంత కాలం ఆయనతో కోమటిరెడ్డి సోదరులకు పడలేదు…ఉత్తమ్ కుమార్‌రెడ్డి వున్నంత కాలం అంతే…ఈ ఇద్దరు అన్నదమ్ములకు పడలేదు…ఇప్పుడు రేవంత్ రెడ్డి వారికి అసలే నచ్చలేదు. అంటే మేం తప్ప మరొకరు పార్టీలో వుండొద్దన్నంత హార్డ్‌కోర్ కాంగ్రెస్ నాయకులా అంటే అదీ లేదు…తమ్ముడి బీజేపి తీర్ధం పుచ్చకున్నాడు…అన్న ఎలా తీర్ధం పుచ్చుకునేది అని ఎదురు చూస్తున్నాడు…వీళ్ల కోసమా? పార్టీ మెట్లు దిగేది…వీళ్లకోసమా..పార్టీ ఆత్మాభిమానం చంపుకునేది…ఒక్కసారి ఆలోచించండి!! నాయకుల ఆటిట్యూడ్ మార్చుకోండి…తర్వాత మీరు మారండి…పార్టీ కాదు సుమీ…క్యారెక్టర్లు మార్చుకోండి…కలిసి కట్టుగా సాగండి!!!
`చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా గాయి గత్తర చేస్తామంటారు?
`మతం మాయలో ఓట్ల జాతరను నమ్ముకున్నారు?
`తెలంగాణలో అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
అడిగిందానికి మాత్రం సమాధానం చెప్పం? అవసరం లేని విషయాలన్నీ మాట్లాడతాం? ప్రజలకు అక్కరకొచ్చే మచ్చట్లు మాత్రం చెప్పం? ప్రపంచంలోకి అన్ని విషయాలు ప్రస్తావిస్తాం? దేశం కోసం, ధర్మం కోసమని మాత్రమే చెబుతాం? ఆ ధర్మమేమిటో మాత్రం చెప్పం? ప్రజల మీద ఇలా భారం వేయడం ధర్మమా? అన్నది కూడా ఆలోచించం? ప్రజలున్నది, ఎన్నుకున్నది భారాలు మోసేందుకు అని మాత్రం ధరలు పెంచి చెబుతాం? వారి నడ్డి మీద వాతలు పెట్టినా భరించాలని చెబుతాం? అది దేశం కోసమే? అని చెబుతాం? ఇదీ బిజేపి పరిస్ధితి. తెలంగాణకు మీద కన్నేశాం…వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటారు? అన్నీ సరే తెలంగాణకు ఏం చేస్తారో చెప్పమంటే చెప్పరు? ఇప్పటికీ విభజన చట్టం పొందు పర్చిన వాటిని ఇమ్మంటే ఇవ్వరు. ఇస్తామని విభజన చట్టంలో చెప్పిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తడమే లేదు. గిరిజన యూనివర్సిటీ గురించి అడిగీ అడిగీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే గోసకొచ్చింది. అయినా కేంద్రం ఇవ్వదు. బిజేపి తరుపున ఎవరూ మాట్లాడరు? రాష్ట్రానికి చెందిన ఏ బిజేపి నాయకుడు కేంద్ర పెద్దలకు గుర్తు చేయరు. అడిగితే నోరు నొప్పి పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వమే అడగాలి. కాని ఆ బాధ్యత బిజేపి నేతలు తీసుకున్నది లేదు. అడిగింది లేదు. తెచ్చింది లేదు. కాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి? అనేది టిఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ.తాజాగా ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కటే మాట అడిగారు.
ఎందుకొస్తున్నావ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా…మా కృష్ణానదీ జలాల వాటా గురించి తేల్చకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఆ వాట గురించి తేల్చేస్తే మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తయినా ఎత్తి పోతల పథకాలకు నీరు లేకుండా పోతోంది. రిజర్వాయర్లు నిండుకుండాపోతున్నాయన్నారు. దీనికి అమిత్‌షా సమాధానం చెప్పలేదు. కేసిఆర్ ఈ విషయం ప్రస్తావించాడని ఏ బిజేపినాయకులు అమిత్‌షాకు చెప్పలేదు. కాని కాళేశ్వరం గురించి మాత్రం మాట్లాడారు. మొన్న ఏ జలశక్తి శాఖ మంత్రి చెప్పిన విషయాలను అమిత్‌షా ఎందుకు రూడీ చేయలేకపోయాడు? అంటే కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడిన మాటలు అబద్దమని పరోక్షంగా అమిత్‌షా ఒప్పుకున్నట్లే అయ్యింది? కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురదజల్లాలన్న ధోరణి తప్ప నిజాలు మాట్లాడాలన్న ఆలోచన అమిత్‌షాలో కనిపించలేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కల్లకుంట్ల కుటుంబానికి ఏటిఎంగా మారిందన్నారు. ఇది ప్రజలు కూడా హర్షించని విమర్శ. ఇకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడులో ఏర్పాటు చేసిన సభలో సూటిగా స్పష్టంగా బిజేపిని, అమిత్‌షాను కొన్ని ప్రశ్నించారు. దేశంలోని బిజేపి రాష్ట్రాల్లో లేని రకరకాల పెన్షన్లు తెలంగాణలో అమలౌతున్నాయి. వృద్దులు ఎంతో సంతోషంగా వున్నారు. మరిఆయా రాష్ట్రాలలో తెలంగాణలో ఇచ్చినంత నగదును ఇవ్వడం లేదు. మరి మేమొస్తాం…అనగానే సరిపోదు…ఈ పెన్షున్లు పెంచుతారా? తగ్గిస్తారా? అన్న దానికి అమిత్‌షా ఎలాంటి స్పందన కనబర్చలేదంటే అర్ధమేమిటి? తెలంగాణలో అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి ముఖ్యమంత్రి కేసిఆరే స్వయంగా చెప్పారు. అది ఒక వేళ అబద్దమైతే అమిత్‌షా ఎందుకు ఖండిరచలేదు. మునుగోడులో బిజేపిని గెలిపిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని ముంచేస్తామని చెప్పిన అమిత్‌షా తెలంగాణలో రైతుల కరంటు మోటార్లకు మీటర్లు పెట్టమని ఎందుకు చెప్పలేదు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన జరిపిస్తామని ప్రకటిస్తే చాలా?
అదే పెద్ద గొప్ప వరమని తెలంగాణ ప్రజలు సంతోషపడాలా? కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోలు ధరలు తగ్గించిందా? నిత్యం పెరుగుతున్న పెట్రోధరలను రెండు సార్లు సవరించినా నిత్యం పెరగడంలో ఆగుదల వుందా? ఆగకుండా వుంటుందా? యూపిఏ ప్రభుత్వంలో పెట్రోల్ ధర 74 రూపాయలకు చేరితే సామాన్యుడు ఎలా బతికేదన్నారు? రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఆఖరకు ఉల్లిగడ్డ ధర పెరిగితే కూడా నానా హంగామా చేశారు. బిజేపి హాయాంలో ఉల్లి ధర ఎందుకు పెరగుతుందంటే ఉల్లి తినే అలవాటు మాకు లేదని తప్పించుకునే ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా వుంటారా? అంటే ప్రజలు ఉల్లి తినడం మానేయండని పరోక్షంగా చెప్పడం కాదా? ఒకప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే దేశానికి భారమా? ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం దేశం కోసం, ధర్మం కోసమా? రైతులకు గిట్టుబాటు ధరల ప్రకటన ఏనాడో మర్చిపోయిన కేంద్రం , విత్తనాలు, యూరియా, ధరలు పెంచి రైతుల సమస్యలను గాలికి వదిలేసినా ప్రశ్నించొద్దా? రైతులకు రైతు బంద్ పధకాలు ఉచితాలుగా అభివర్ణించడం అన్యాయం కాదా? పెట్టుబడి దారులకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయడం దేశం కోసమా? అవి ధర్మం కోసమా? ఇలాంటి అనేక ప్రశ్నలు ముఖ్యమంత్రి లేవనెత్తారు. కాని వాటిలో ఏ ఒక్కటికీ అమిత్‌షా సమాధానం చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. అందుకే తన రాజకీయం పక్కదారి పట్టించారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. గతంలో రూ.50 గ్యాస్ ధర పెరిగితే గోల గోల చేసిన బిజేపి, సబ్సిడీకి మంగళం పాడిరది. సిలిండర్ ధర పదకొండు వందల యాభై రూపాయలు చేసింది. గ్యాస్ ధర తగ్గిస్తారా లేదా? అంటే గ్యాస్ బండ సైజు తగ్గిస్తామని, మహిళలు ఇంతింత సిలిండర్ మోయలేకపోతున్నారని చెబుతున్నారు. ఇలా ప్రజలు అడిగేదానికి, బిజేపి నేతలు చెప్పే సమాధానాలు ఎక్కడా పొంతన వుండదు. దేశంలో 11 రాష్ట్రాలలో బిజేపియేతర ప్రభుత్వాలు ఏర్పాటును జీర్ణించుకోలేని బిజేపి ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసింది. బిజేపి ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే చేయాలని చూస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించాలని ఏక్ నాధ్ షిండేలను తయారు చేస్తామంటోంది? ఇదినా? నైతికత అంటే నవ్వుతోంది? పడగొట్టడమే మాకు తెలుసన్న దాన్ని పదేపదే చెబుతోంది…ఎనమిదేళ్ల కాలంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, వున్న ఉద్యోగాలు పోయేలా చేసింది. జిఎస్టీ పేరుతో పరిశ్రమలకు మంగళం పాడిరది. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తోంది. అతి తక్కువ ధరకు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అంటగడుతోంది. ఆ రుణాలు తీర్చలేని అదే ప్రైవేటు వ్యక్తులకు రుణాలు మాఫీ చేస్తోంది. పేదల నోరుకొడుతోంది. అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన అరోపణ. ఇదిలా వుంటే నోట్ల రద్దు నుంచి మొదలు అన్నిట్లోనూ ప్రజలకు ఇబ్బందులు ఎదురౌతున్నా, ఓర్చుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వన్నీ అంగీకరిస్తున్నట్లు కాదని తెలుసుకోవాలి. అంతే కాకుండా రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరతీయం కూడా అంత మంచిది కాదు. మునుగోడులో బిజేపిజెండా ఎగరడం అన్నది కష్టం.అసలు దక్షిణాదిలో బిజేపికి అంత పెద్ద సీన్ లేదు. కర్ణాటక వరకే దాని పరిధి పరిమితం. తెలంగాణలో పాగా వేయాలన్న కుతూహలం బాగా వున్నప్పటికీ ప్రజలను మెప్పించి, ఒప్పించి వారికి మరింత మెరుగైన పాలన ఎలా చేస్తామన్నదానిని గురించి చెప్పకుండా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తామంటున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పరిహాసమాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనేది టిఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ. అందుకే ఉద్యమాలు కొత్తకాని, పోరాటాలు పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి తెలిసిన పార్టీయే టిఆర్‌ఎస్. అలాంటి టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే ప్రజలకు మెరుగైన సేవల కోసం ఆలోచించాలే గాని, గాలి మాటలు చెప్పి, ప్రభుత్వాలను భయపెట్టి పాగావేస్తామంటే తెలంగాణలోఅంత సులువు కాదు. ప్రజలు నమ్మరు.
`కొందరు తెలంగాణ నేతల కనుసన్నలో సాగుతున్న చీకటి పథకం!
`అన్ని పార్టీలను ముంచి, తెలుగు రాగంలో వంచనకు తెరతీసి…
`పైకి కనిపించేంత చిన్న రాజకీయాలు కాదు…
`తెలంగాణను వదిలేయడం వాళ్ల వళ్ల కావడం లేదు!
`తెలంగాణ బాగుపడడం అసలే నచ్చడం లేదు!
`ఎలాగైనా బిజేపితో కలిస్తేనే తెలంగాణ మళ్ళీ కలుపుకోవచ్చు?
`పెత్తనం చేయొచ్చు! అణచివేయొచ్చు?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ కనుసన్నల్లో రాజకీయాలు నడిచింత కాలం…తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో వున్నంత కాలం…ఆపార్టీ బలంగా వున్నంత కాలం ఏమీ లేయలేం…మన పప్పులు ఉడికించలేం. మన ఆటలు చెల్లవు. కోరికలు నెరవేరవు…కలలు తీరవు. అధికారం అన్న మాట మన కల్ల…కనీసం దాని దరిదాపుల్లోకి కూడ వెళ్లలేం…ప్రభావం చూపలేం…మనం గెలిచినా తెలంగాణ నాయకత్వం ముందు మోకరిళ్లకుండా బతకలేం…వారి కనుసన్నల్లో బతక్కుండా వుండేలేం…పెత్తనానికి తావులేని చేట చోతలు కట్టుకొని బతకడం కష్టం…ఇప్పటికే ఎనమిదేళ్లయింది…ఇంకా ఎనభై ఏళ్లయినా మనం అనుకున్నది చేయలేం…మళ్లీ తెలంగాణను వశం చేసుకోలేం…తెలంగాణ లేకుండా ఎక్కువ కాలం వుండలేం…గత డెబ్బై ఏళ్లనుంచి సీమాంధ్ర నాయకులది ఇదే తంతు…మద్రాసు నుంచి విడిపోయిన నాడు అందుకున్న పాట…తెలుగు రాగం…ఐక్య మోసం…చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరడం…విష పెత్తనం చెలాయించడం…తెలంగాణను దోచుకోవడం…నాశనం చేయడం సీమాంధ్ర నాయకులకు తెలిసింది…దోచుకు తినడం అలవాటైన వాడు ఆగలేడు…తెలంగాణ లేకుండా రాజకీయం నెరపలేడు….ఎంతో చైతన్యవంతమైన తెలంగాణలో 1948లోనే నైజాంను తరిమినా, కలిసుంటే కలదు సుఖం…అంటూ తెలుగు పిడి వాదం తెచ్చి, ఆంధ్ర అనే పదం చేర్చి తెలంగాణ అస్ధిత్వాన్ని మళ్లీ చెల్లా చెదురు చేశారు…తెలంగాణను చెరపట్టించారు…వేధించారు…వెక్కిరించారు…గోస పెట్టారు…పలుచన చేశారు…చులకన చేశారు…ఇదంతా తెలంగాణ ప్రజలు మర్చిపోరు…కాని తెలంగాణ వాదుల ముసుగులో ఉద్యమం చేసినట్లు భవిష్యత్ రాజకీయం కోసం పైలా పచ్చీసుఆడినవారితోనే ఇప్పుడు మళ్లీ తంట…బానిక బతుకులకు అలవాటు పడిన నేతలనే, గోతి కాడ నక్కలతోనే అసలు తంటా…సీమాంధ్ర నేతలతో వారు కలిసి ఆడుతున్న తొండాట…పూర్వపు రోజులకు మళ్లీ వేయనున్న ముళ్ల బాట…సీమాంధ్ర నేతలు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయడమే ఒక విషరాజకీయ క్రీడ. ఇంకా వేచి చూస్తే ఏం చేయలేదు..ఎక్కడా ఎదగలేం…తెలంగాణలో కనీసం ముప్పై నుంచి నలభై స్ధానాల్లో ప్రభావం చూపే స్ధితిలో వున్నాం…తెలంగాణ బాగుపడుతుంటే తట్టుకోలేం…అక్కడి సంపదమీద కన్ను వదులుకోలేం…ఇది ఆంధ్రా నాయకుల గోతికాడ నక్క వేషాలు…ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకు చేరుకుంటుంటే తెలంగాణ బాగుపడుతోంది.
అభివృద్ధిలో దూసుకుపోతోంది…ప్రగతిలో పరుగులు పెడుతోంది. పేదరికం లేని సమాజ నిర్మాణం జరుగుతోంది. విద్య, వైద్య రంగాల్లో పురోగమిస్తోంది. ఐటిలో దేశంలోనే మేటిగా రాకెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు కోట్లున్న భూముల ధరలు నాలుగు లక్షలకు పడిపోయాయి…ఉన్న రాజధాని పనికి రాకుండాపోతోంది…అభివృద్ధి కుంటుపడిరది. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా డేరాలు వేసుకున్న కాలం కంటే అద్వాహ్నంగా తయారౌతోంది….ఇప్పుడు మళ్లీ ఒక్క ఆంధ్రతో అరవైఏళ్ల కాలానికి వెళ్లిపోయాం…? అరవైఏళ్ల పాటు ఎంత తొక్కేసినా, తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ సమర్ధవంతమైన నాయకత్వంలో తెలంగాణ మురిసింది…ఎనమిదేళ్లలో ఎక్కడికో వెళ్లిపోయింది….ఉమ్మడి రాష్ట్రంలో ఊహించలేని పనులన్నీ పూర్తి చేసుకుంటూ నెంబర్ వన్ రాష్ట్రమౌతోంది…ఎండబెట్టిన తెలంగాణలో ఏరుల్లో నీటి పరవళ్లు వయ్యారాలు పోతున్నాయి….పండబెట్టిన తెలంగాణను పచ్చగ చేసుకున్నారు…ప్రాజెక్టులు కట్టుకున్నారు..రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. కాలువలు తవ్వుకున్నారు…కాళేశ్వరం కట్టుకున్నారు. తెలంగాణలో ఏదైతే సాద్యం కాదని అవరవైఏళ్లపాటు మోసం చేశారో…ఆ తెలంగాణ మొత్తం ప్రాజెక్టులతో కళకళలాడేలా చేసుకున్నరు…సిరుల తెలంగాణ చేసుకున్నరు…! కాని విడిపోయి పోలవరం కట్టుకోలేకపోతున్నమని సీమాంధ్ర నేతులు కుమిలిపోతున్నారు…పచ్చగా వున్న కాడ తినడం…ఎచ్చగా ఉన్న కాడం పండుకోవడం అలవాటైన సీమాంధ్ర నాయకత్వం భరించలేకపోతోంది…తెలంగాణ ప్రగతిని ఓర్వలేకపోతోంది…! అరవై ఏళ్లు చీకట్లు చేసినా, తెలంగాణ తెచ్చుకొని మూడు నెలల్లో వెలుగులు నింపుకున్నరు..మూడేళ్లలో రైతాంగానికి ఇరవై నాలుగుగంటల ఉచితం కరంటు ఇచ్చుకుంటున్నరు…! కాని సీమాంధ్రలో కోతలు చూస్తున్నారు..ఉడకపోతలో బతుకులు వెల్లదీస్తున్నరు…కళ్లలో మంటలు నింపుకుంటున్నరు…తెలంగాణను చూసి నిప్పులు పోసుకుంటున్నారు…అందుకే మళ్లీ తెలంగాణ మీద పెత్తనం కోసం పాకులాడుతున్నారు…
తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణలోనే మళ్లీ ముసలం పుట్టిస్తామని ఎనమిదేళ్ల కిందనే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఒకనాడు విడిపోయిన తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలే కలుస్తన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు..రెండు దేశాల మధ్య వున్న బెర్లిన్ గోడలను ప్రజలే బద్దలు కొడుతున్నారంటూ రాళ్లు తెచ్చి చూపించారు…ఆనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనే హడావుడి చేశారు…ఏనాటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు కలుస్తాయంటూ చెప్పుకున్నారు. కుటిలత్వం నిండిన నాయకులు ఖాళీగా వుంటే కుత్సిత బుద్ధిని ఎలా ప్రదర్శించాలో ఆలోచిస్తుంటారు….కొట్లాడే తత్వం లేకపోయినా, మోసాన్ని నమ్ముకుంటారు..! ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లకే తెలంగాణను అస్ధిర పర్చాలని చూశాడు…పిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోయాలని చూశాడు..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాంతో తెలంగాణనుంచి చంద్రబాబు పారిపోయాడు…కాని తెలంగాణ మీద ఆశ చావలేదు…తెలంగాణ మీద ఆధిపత్యం మీద మోజు తీరలేదు…ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ఎదుర్కొలేక, తెలంగాణలోనైనా చోటు కోసం నయవంచనను తెర తీస్తున్నాడు…అందుకు మళ్లీ పాతరాగం అందుకుంటున్నాడు…. తెలంగాణలో రాజకీయంగా అసంతృప్తి వాదులతో కొత్త రాజకీయం మొదలు పెట్టాడు…అటు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్‌లో రాజకీయం మొదలుపెట్టి, ఇటు బిజేపితో కలిసి ఏక కాలంలో రెండు మూతుల పాము రాజకీయం నెరపాలనుకుంటున్నాడు…బిజేపితో కలిసి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలనుకుంటున్నాడు..అందుకు షర్మిల అడుగులతో ప్రయోగం చేశారు…ప్రజలు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగ మారుతున్నారన్న భ్రమల్లో కళ్లు మూసుకొని పిల్లి పాలుతాగినట్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు….సీమాంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే బతకలేదన్నారు…
నిజానికి తెలంగాణ లేకపోతే తాము బతకలేమని తెలుసుకున్నారు…భుజ్జగింపులు చేయాల్సిన సమయంలో గద్దింపులు మొదలుపెట్టారు…ఒత్తిడి రాజకీయాలే తెలంగాణ మీద ఎల్ల కాలం మేలనుకున్నారు…ఆఖరకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటూ బెదిరింపులకు దిగారు…కాని తెగించి కొట్లాడే తెలంగాణ ముందు ఆ పిల్లిబిత్తిరి బెదిరింపులు పనిచేయలేదు…తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు…అరవైఏళ్లపాలు ఎండబెట్టి, పండబెట్టి తెలంగాణ విడిపోతే బాగుపడదని, తొండలు గుడ్డు పెట్టే జాగలని ఎద్దేవా చేశారు…తెలంగాణను నైరాశ్యంలో పడేసే కుట్ర పెద్దఎత్తున చేశారు…కాని కలిసి తెలుగురాగం పంచుకోవాలని వాళ్ల రోగం మన మీద రద్దాలనే పదే పదే చూశారు…ఎన్నాళ్లకైనా తెలంగాణ విడిపోతుందని తెలిసే, తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించుకున్నారు. తెలంగాణలో పైసా ఖర్చు పెట్టకుండా, సీమాంధ్రలో వెలుగులు నింపుకున్నారు…తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చారు…కలిసి వున్నన్ని రోజులు వాళ్లు పచ్చగా వుంటూ, తెలంగాణను ఎండబెట్టారు…ఇప్పుడు వాళ్లు ఎండుతూ పచ్చగైన తెలంగాణను చూసి కుళ్లుకుంటున్నారు…మళ్లీ సమైక్యం పేరుతో నక్కల రాగం అందుకుంటున్నారు…తోడేళ్లలలా కాచుకు కూర్చుకుంటున్నారు…బిజేపితో కొత్త ఎత్తులకు తెరలేపి, ఆడా వుంటాం…ఈడా వుంటాం….తెలంగాణలో ఎన్టీఆర్‌ను దింపుతాం…సీమాంధ్రలో లోకేష్‌కు పట్టం…పేరుతో రామోజీరావుతో బిజేపి సరికొత్త రాజకీయం మొదలుపెట్టింది….తెలంగాణ ఇవ్వడమే ఇష్టం లేని బిజేపి, మునుగోడులో గెలిచి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలనిచూస్తోంది…! ప్రతి తెలంగాణ వాది మళ్లీ అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది…మునుగోడులో ముంచాలని చూస్తున్న వారిని తరిమితే తప్ప…తెలంగాణ వైపు ఇక చూడకుండా వుండలేరు…టిఆర్‌ఎస్‌తో పెట్టుకుంటే రాజకీయాలు చేయలేమని తెలిసొచ్చేలా చేస్తే తప్ప, అనైతిక రాజకీయాలు ఆపలేరు…!
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.