మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

మరింత వెనక్కి దేవరకొండ సినిమా!
సినిమా పుస్తకాలు

Kingdom: నేటి ధాత్రి

 

 

 

 

 

జూలై 4న రావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. జూలై నెలాఖరుకు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం.

Kingdom: మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

ఇవాళ భారీ తెలుగు సినిమాలన్నీ విఎఫ్ఎక్స్ (VFX) మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి.

ఆ వర్క్ కాస్తంత ఆలస్యమైనా…

పోస్ట్ ప్రొడక్షన్ లో ఊహకందని జాప్యం ఏర్పడుతోంది.

దాంతో సినిమాలను ముందు ప్రకటించిన తేదీకి విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలోకి నిర్మాతలు జారిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కారణంగానే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా పూర్తి కావడం లేట్ అయ్యిందన్నది వాస్తవం.

అయితే… పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తి చేసినా…

విడుదల మరోసారి వాయిదా పడింది.

ఇప్పుడు దానికి కారణం సకాలంలో కాని వీఎఫ్ఎక్స్ పనులు.

జూన్ 12న జనం ముందుకు రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడింది.

ఎప్పుడు వస్తోందో మేకర్స్ ఇంకా చెప్పలేకపోతున్నారు. సినిమా పుస్తకాలు

 

ఇదిలా ఉంటే… విఎఫ్ఎక్స్ కారణంగానే పలుమార్లు వాయిదా పడిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఎట్టకేలకు ఈ నెల 27న విడుదల అవుతోంది.

అలానే అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన నితిన్ ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నారు.

నిజానికి ఇదే తేదీన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ (Kingdom) సైతం రావాల్సి ఉంది.

కానీ ఇప్పుడు ఆ తేదీన అది రావడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బాలెన్స్ ఉందని తెలుస్తోంది.

ఇప్పటి నుండి నాన్ స్టాప్ గా టీమ్ వర్క్ చేస్తే…

జూలై 25న ఈ సినిమాను విడుదల చేసే ఆస్కారం ఉందట.

మొదట్లో జూలై 24న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కావచ్చుననే వార్తలు వచ్చాయి.

కానీ ఆ సినిమా విఎఫ్ఎక్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ చేస్తున్నారు.

సో… అవి ఒక కొలిక్కి వచ్చే వరకూ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించి ఆలోచించవద్దని చిరంజీవే స్వయంగా చెప్పాడని అంటున్నారు.

దాంతో జూలై 25వ తేదీ స్లాట్ దాదాపుగా ఖాళీ ఉన్నట్టే!

కేవలం హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ నరసింహా’ అనే పాన్ ఇండియా మూవీ మాత్రం ఆ రోజున వస్తుందని గతంలో ప్రకటించారు.

సో… విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’కు జూలై 25 బెస్ట్ డేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version