ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో
వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

 

కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

“కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

నీరు గారుతున్న “కాజీపేట రైల్వే డివిజన్” ఆశలు..!

విజయవాడకు తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న కొందరు ఆంధ్ర అధికారులు?

రైల్వేలో “ఉన్నతాధికారులను” సైతం తప్పుదోవ పట్టిస్తున్న “ఆంధ్ర అధికారులెవరు”?

ఉన్నపలంగా కాజీపేటకు 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్యను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెరవెనుక ప్రయత్నాలు?

లోకో పైలట్ ఖాళీలు భర్తీ చేయాలని మార్చి 19న రైల్వే “జిఎం”కు వినతిపత్రం ఇచ్చిన కార్మికసంఘాలు

లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని వినతిపత్రం ఇస్తే, ఉన్న లోకో పైలట్ లను ట్రాన్స్ఫర్ చేస్తూ మార్చి 26న ఉత్తర్హులు ఇవ్వడం ఆశ్చర్యం.

కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడ లను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి అడ్డుకునే కుట్రలు చేస్తు.., సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న తీరు ప్రశ్నార్థకం?

కొత్త పోస్టులు భర్తీ చేయకుండా, హుటా హుటిన ఉన్నవి కూడా తీసేయడం వెనుక మతలబు ఏంటో అధికారుల విజ్ఞతకే వదిలేద్దాం…!

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ..?, ఆంధ్రకు ప్రాధాన్యత?, ఆంధ్ర అధికారుల కుట్రలు? స్పందించని తెలంగాణ కేంద్ర మంత్రులు?

నేటిధాత్రి, వరంగల్, కాజీపేట

 

కాజీపేట-హనుమకొండ-వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆశపడుతున్నది దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్ గా అవతరించాలని. తెలంగాణలో మరో రైల్వే డివిజన్ ఏర్పడితే ఉద్యోగాల సంఖ్య పెరిగి మరి కొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రజలందరూ ఆశపడుతున్నారు. అలాగే ఇక్కడ నుండి కొన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి అవకాశం కూడా లభిస్తుందని అందరూ అనుకున్నారు.

నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం అందరిలో కాజీపేట డివిజన్ ఆశలు మళ్లీ ఒక ఉన్నత స్థాయిలో చిగురించాయి. కానీ ఏ రోజుకైనా కాజీపేట ను డివిజన్ కాకుండా చేస్తామని అధికారులు పన్నాగం పన్నినట్టు ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కాజీపేటలోని రైల్వే కార్మికుల సంఖ్యను క్రమక్రమేన తగ్గిస్తూ వస్తున్నారు. ఇందులో ప్రతిసారి మొదటి వేటు లోకో పైలట్ విభాగం పైనే పడుతున్నది, బుదవారం నాడు కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గిస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కాజీపేటలోని కోచింగ్ లింకులను విజయవాడకు తరలించిన సందర్భంలో లోకో పైలట్ లందరూ ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసనను తెలియజేశారు. అప్పుడు కొద్ది రోజులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. దీనికి కాజీపేటలోని స్థానిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో అధికారులు కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి కోల్పోయిన కోచింగ్ లింకులను తిరిగి ఇవ్వకపోయినప్పటికీ, వాడి బీదర్ సెక్షన్లో నడిచే కొన్ని ట్రైన్లను కాజీపేటకు కేటాయించి కంటి తడుపు చర్యలు చేపట్టారు. కానీ కొంతకాలానికి వాటిని కూడా తిరిగి వేరే డిపోలకు కేటాయించడంతో కాజీపేట క్రూ డిపో ఎంతో నష్టపోయింది ఒక రకంగా చెప్పాలంటే కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం చేయడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పవచ్చు.

గత ఐదు సంవత్సరాల కాలంగా కాజీపేట క్రూ డిపోలో పనిచేస్తున్న లోకో పైలట్ల సంఖ్యను అధికార గణం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. ఈ విషయం కార్మిక సంఘాలు గుర్తించకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్ ల రూపంలో కానీ, నూతన పోస్టింగుల రూపంలో కానీ కాజీపేటకు 10 మందికి మించి కేటాయించలేదు, కానీ ఇక్కడి నుండి చాలామంది ప్రమోషన్ల రూపంలో వేరువేరు క్రూ డిపోలకు వెళ్ళినారు. 2020 వ సంవత్సరంలో 623 మందితో నడిచిన క్రూడిపో నవంబర్ 2023 నాటికి 501 గాను, మార్చి 2025 కు 470 కి పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకు కృూ సంఖ్యను తగ్గిస్తూ అధికారులు కాజీపేట పై ఉన్న నిరాసక్తను తెలియజేస్తున్నారు. కాజీపేట క్రూడిపోకు మే 2020 సంవత్సరంలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంఖ్య 542 కు పడిపోయింది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో 248 పోస్టులు ఇక్కడి నుండి తొలగించబడ్డాయి.

Kazipet Railway Division

గూడ్స్ లోకో పైలట్ల నుండి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలట్ మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు, ఈ విధంగా పదోన్నతుల కల్పనలో కూడా కాజీపేట లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, విజయవాడ డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ కు చెందిన క్రూ డిపోలో భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వలన ఆయా సంబంధిత ఖాళీలలో కాజీపేట కు చెందిన గూడ్స్ లోకో పైలట్లు సుమారు 30 మంది పనిచేస్తున్నారు. కొంతమంది పదవీ విరమణ పొందడం, కోవిడ్ కష్టకాలంలో మరణించడం, కొంతమంది లోకో ఇన్స్పెక్టర్గా, ప్యాసింజర్ లోకో పైలట్లుగా పదోన్నతి పొందడం మరియు మరి కొంతమంది మెడికల్ అన్ఫిట్ అవడం వలన కాజీపేటలోని గూడ్స్ లోకో పైలట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు అధికారులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను పరిగణలోకి తీసుకోకపోవడంతో కాజీపేట డిపో యొక్క క్రూ సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది.

Kazipet Railway Division

అయితే విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో విజయవాడ డివిజన్ అనేది విశాఖపట్నం జోన్ లోకి వెళ్తున్నదని రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్కు చెందిన లోకో పైలట్లుగా పనిచేస్తున్న డిపోలో కలపడం ఒక హాస్యాస్పదంగా మారింది. ఈ విధంగా కలపడం వలన భవిష్యత్తులో సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నది.

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్ర నాయకులు వారి వారి స్థాయిలలో కృషిచేసి రైల్వేల పరంగాను ఎదగకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతం కు చెందిన కొంతమంది అధికారులు సికింద్రాబాద్ డివిజన్లో పనిచేస్తూ ఇంకా ఆంధ్రకే మద్దతునిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట డివిజన్ ఏర్పాటును అడ్డుకుంటున్నట్టుగా తెలియవస్తున్నది. కాజీపేట డివిజన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించనున్న లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడలను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Kazipet Railway Division

తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్-హనుమకొండ-కాజీపేట కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టును కేటాయించడం, ఇదే సందర్భంలో రైల్వే ఫ్యాక్టరీ కాస్త మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారడంతో ఇక్కడి ప్రజలలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు ఎగిరిపడ్డాయి. కానీ అధికారులు ఈ విధమైన చర్యలతో డివిజన్ గా మారే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడి రైల్వే కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజలు అందరూ అధికారుల చర్యలను విమర్శిస్తూ కాజీపేట డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.

 

ఈనెల 8వ తేదీన కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి వినతి..

కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందం ఈ నెల మార్చి 8న కేంద్ర రైల్వే మంత్రిని కలిసి, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్‌ను సృష్టించాలని మరియు తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, డి. సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌ లతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాలను జాబితా చేసే మెమోరాండంను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని వాగ్దానం ప్రకారం కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతినిధి బృందం అదే స్థలంలో రైల్వే డివిజన్‌ను కోరింది.

Kazipet Railway Division

 

కాజీపేట రైల్వే డివిజన్…!

విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఫలితంగా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ అనే మూడు డివిజన్లు మాత్రమే మిగిలిపోయాయని, గుంతకల్, విజయవాడ మరియు గుంటూరులను సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో విలీనం చేశారని వారు వాదించారు.
రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ కోసం ప్రయాణీకులకు, వస్తువులకు మెరుగైన భద్రతను అందించడానికి కొత్త విభాగాన్ని సృష్టించడం అవసరమని మంత్రులు అన్నారు. ట్రాఫిక్‌తో పాటు ఎక్కువ సరుకు రవాణా ఉన్న కాజీపేట ప్రాంతాన్ని డివిజన్‌గా చేస్తే గుంటూరు మరియు హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ట్రాక్ కిలోమీటర్లు మరియు ఆదాయం ఉంటుందని వారు చెప్పారు.

 

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రకు ప్రాధాన్యత?, స్పందించని కేంద్ర మంత్రులు?

ఈ నెల మార్చి 19 బుధవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కాజీపేట క్రూ డిపో ని సందర్శించిన సందర్భంగా, లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రిప్రెసెంటేషను ఇచ్చిన కార్మిక సంఘం నాయకులు.
జనరల్ మేనేజర్ సందర్శన జరిగిన వారం రోజులకే కాజీపేట లోకో పైలట్ ల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు వెలవడం గమనార్హం.

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి.

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్లో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 10న అదృశ్యమైన ఇద్దరు వలస కార్మికులు, వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించరు. మృతులు బైద్యనాథ్ భట్ (UP), హరిసింగ్(ఒడిశా)గా పోలీసులు గుర్తించారు. పైడిగుమ్మల్లో వెంచర్ పనులకు వచ్చిన ఇద్దరు కార్మికులు ప్రమాదం బారిన పడ్డట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి వ్యవసాయ బావిలో నుంచి కార్మికుల మృతదేహాలు గుర్తించి, వెలికితీశారు.

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి.

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్.

హన్మకొండ,నేటిధాత్రి:

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని
హన్మకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు
పాముల రమేష్ కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ,కాంగ్రెస్ జాతీయ నాయకులకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను అదేవిధంగా ముదిరాజులను 10 సంవత్సరాల పాటు రాజకీయ వివక్షతకు గురిచేస్తూ అణగదొక్కడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి పార్టీశక్తులు పావులుగా మార్చుకునే వారి కుట్రలను గమనిస్తున్నాం.బిజెపి పార్టీ 1996లో కాకినాడలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందన్నారు.గత శాసనసభ ఎన్నికల ముందు క్యాబినెట్ సెక్రెటరీతో హడావిడిగా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసి ఇప్పటివరకు రిపోర్టు తెప్పించలేదని తెలిపారు.బిజెపి పార్టీ మాదిగల పట్ల, ముదిరాజుల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాల నుంచి కేంద్ర మంత్రులుగా తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.

షబ్ ఎ ఖదర్  లైలతుల్ ఖదర్ కార్యక్రమంలో పాల్గొన్న.

*షబ్ ఎ ఖదర్  లైలతుల్ ఖదర్ కార్యక్రమంలో పాల్గొన్న
ముస్లిం సోదరులు*

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం ఆలంగిరి జామియా మసీదులో మత గురువు మొహమ్మద్ ఫిర్దోస్ మాట్లాడుతూ
షబ్-ఎ-ఖదర్ యొక్క ప్రాముఖ్యత ముస్లింలు రాత్రిపూట ఆచరించే ఆచారాలు వాటిని పాటించడంలో ఈ రంజాన్ నెలలో.

చాలామంది రాత్రంతా ప్రార్థనలు చేస్తూ, ఖురాన్ పఠిస్తూ గడుపుతు 30 రోజులు ఆచరించే కురాన్ ను వింటూ.

కొందరు పేదలకు ఆహారం ఇవ్వడం మరియు పేదలకు సహాయం చేయడం వంటి దాతృత్వాలు కూడా చేస్తారు.లైలతుల్ ఖదర్ అత్యంత శుభప్రదమైన రాత్రులలో ఒకటి మరియు ఇస్లాంలో పవిత్రత పరంగా దీనికి సమానమైన రాత్రి బహుశా మరొకటి లేదు.

ఈ రాత్రి సాధారణంగా రంజాన్ చివరి పది రోజులలో ఉంటుందాని ఆ రోజుల్లో ఇది ఆశ్రమంలోని బేసి రాత్రులలో ఉంటుంది. పంక్తులు వివిధ ఆయత్‌లు మరియు హదీసుల వెలుగులో రాత్రి యొక్క కొన్ని ప్రధాన ధర్మాలను అందిస్తాయని.

ఖురాన్ లో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నారు
ఈ ఖురాన్ ఆయత్ నుండి, లైలతుల్ ఖద్ర్ తో ముడిపడి ఉన్న అతి పెద్ద ధర్మం ఏమిటంటే, ఈ రాత్రిలోనే అల్లాహ్ మానవాళికి ఖురాన్ ప్రసాదించాడు, ఇది బహుశా అల్లాహ్ మానవాళికి పంపిన అతిపెద్ద బహుమతి కావచ్చు.

కాబట్టి, ఏ కారణం చేతనైనా ఒక ముస్లిం రాత్రిని జరుపుకోవాలనుకుంటే, అతి పెద్దది బహుశా అల్లాహ్ తన అతిపెద్ద బహుమతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై ఈ రాత్రినే పంపాడనే వాస్తవం, కాబట్టి దీనిని ఈ బహుమతి కోసమే, అయితే, అంతిమ ఎంపిక ఏమిటంటే, ఈ అత్యంత శుభకరమైన రాత్రి నుండే పవిత్ర ఖురాన్ చదవడం అర్థం చేసుకోవడం నేర్చుకోవడం ప్రారంభించడం.

విశ్వాసం సంప్రదాయానికి చాలా సంబంధించినది; అత్యంత ముఖ్యమైన దీవించబడిన రాత్రులలో ఒకటి.  
ఖురాన్ విశ్వాసాల ప్రకారం, ఖద్ర్ రాత్రి ప్రత్యేకమైనది అల్లాహ్ క్షమాపణ కోరేవారికి ఆయన మార్గదర్శకత్వాన్ని అర్థించేవారికి ఆయన నుండి ఆశీర్వాదాలు లభిస్తాయని వాగ్దానం చేయబడింది. అని అన్నారు.

మన భారతదేశ సుఖ సంతోషాల గురించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కుల మత విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సదర్ గ్రామ ముస్లింల పెద్దలు అందరూ కలిసిమెలిసి పాల్గొన్నారు.

యువకుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల.

ఖానాపూర్ క్రైస్తవ యువకుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి కాండిల్స్ తో నివాళులు అర్పించి అర్పించిన క్రైస్తవులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఆర్ ఇ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమాన స్పద మృతి పట్ల సంపూర్ణ విచారణ జరిపి దుండగులను శిక్షించాలని నిరసన తెలుపడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో క్రైస్తవులపై,, పాస్టర్లపై దాడులు జరగకుండా తగు కఠినమైన చట్టాలని తేవాలని ఖానాపూర్ యువకుల పక్షాన కోరడం జరిగింది. ఈ కార్యక్రములో పెద్ద ఎత్తున ఖానాపూర్ క్రైస్తవ యువకులు పాల్గొని క్యాండీల్స్ తో నిరసన తెలపటం జరిగింది జరిగింది
ఈ కార్యక్రమములో్ ఎక్స్ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్ గ్రామ పెద్దలు కులవస్తులు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

మండలంలోని,వర్షకొండ గ్రామంలో
కోలిచినవారికి కొంగు బంగారంగా నిలుస్తున్న స్వామివారు 150 సంవత్సరాల క్రిందటి పురాతన ఆలయం గా సంతానం లేని వారికి ఏడు శనివారాలు గిరి ప్రదక్షణ చేసిన వారికి సంతానం ప్రసాదించే పరమాత్మునిగా భక్తులు నమ్మకం పురాతనైనటువంటి కాలం నాటి ఆలయాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం  రాతితో గుండుతో ఏర్పాటు చేయబడి ఆలయ గర్భాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి  మూలవిరాట్  స్వామివారి కుడి భాగాన గోదాదేవి అమ్మవారి రెండుమిటర్ల, స్వామివారి   రాతి విగ్రహాలు పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం ప్రతి సవత్సరం ఉగాది రోజున ఘనంగా జాతర నిర్వహిస్తారు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జరుగుతాయి. కొన్ని సంవత్సరాలుగా  మధుర అన్వేష్ చార్యుల మరియు మధుర రాము చార్యుల మరియు లక్ష్మణ్ చార్యులు లచేతుల మిదుగా  ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు మరియు గరుత్మంతుడు. భక్తుల సహకారంతో నిర్మించారు మరియు భక్తుల సౌకర్యం కోసం సల్కం నాడ్పి రాములు ట్యాంకు ఏర్పాటు చేశారు మరియు మామిడి వంశస్థులు రథం చేపించి భగవంతునికి సమర్పించారు బ్రహ్మోత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు అందజేస్తారు ఉత్సవాలను గ్రామాభివృద ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్ లు , పేపర్ ఫైల్ వాడతామని చెప్పా రు. శిక్షణను అందించిన ఉపాద్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయో పేపర్ బ్యాగ్ లు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారికి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వలన మన దేశంలో ప్రతి యోట లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసి పోయో పేపర్ బ్యాగ్ లు,జూట్ , బట్ట సంచులను విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా శిక్షణనను అందించిన ఉపాద్యాయుడు అంజయ్యను ప్రధానోపాద్యాయులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు జావీద్, మహేశ్, శ్రీనివాస్ , పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇఫ్తార్ విందులు.

మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇఫ్తార్ విందులు: షాకిర్ అలీ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని కోహీర్ మండల మాజీ ఎంపీపీ ఎండి షాకీర్ అలీ అన్నారు. కోహీర్ పట్టణంలోని అజిజియా మజీద్ ప్రాంగణంలో ప్రజాబంధు షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో షాకీర్ అలీ మాట్లాడుతూ… పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ద్వారా పవిత్రమైన దివ్య ఖురాన్ మానవాళికి అందిందని, ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించే ఇఫ్తార్ మరియు సెహ్రీ విందు కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తూ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. సూర్యోదయానికి ముందు ఉదయం నిర్వహించే విందును సెహ్రీ అంటారని,సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం నిర్వహించే విందును ఇఫ్తార్ అంటారని, రంజాన్ మాసంలో రోజాలో ఉన్నవారు సెహ్రీ మరియు ఇఫ్తార్ విందుల ధ్వారా ఉపవాస దీక్షలను విరమించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలో జకాత్ ద్వారా పేద ప్రజలకు దానధర్మాలు చేయడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కోహీర్ మండల మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ మొఖీమ్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ గని,సాజిద్ అలీ,అక్షయ్ జాడే, బిఆర్ఎస్ నాయకులు నాగరిగారి సంపత్ కుమార్,ఉమర్ అహ్మద్, వస్త్ర వ్యాపారులు రాచూరి చంద్రశేఖర్, రాచూరి కనకరత్నం,ముక్క శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తొలి ఉగాది.

శీర్షిక:తొలి ఉగాది.

 

నేటి ధాత్రి:

*పుడమి ఆకు పచ్చని చీర కట్టుకుని…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

ఇంద్రుడు మేఘ మాలికల విల్లులతో
తుంపర, తుంపరులుగా
చినుకుల బాణాలు విడుస్తూ …
స్వా గతం సుస్వా గతం తెలుపగా వచ్చింది తొలి ఉగాది..!

పండిన కొత్త చింత పులుపు వగరు మామిడి ఉరింపులు పలుకగా భిన్నసంస్కృతులకు బహు పునాది వేస్తూ వచ్చింది తొలి ఉగాది..!

సంస్కృతి సంప్రదాయాలను ఒకటిగా చేసి చైత్ర మాసపు ఊసులు చెప్తూ గండు కోయిల తీయని పాటలతో స్వాగతం సుస్వాగతం పలుకగా
వచ్చింది తొలి ఉగాది..!

పంచభూతాలు దీవించగా…
చావిడలో పంచాంగ శవ్రణాలు
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

తెలుగు లోగిళ్లలోన మామిడితోరణాలు,
షడ్రురుచులతో ఉగాదిపచ్చడి…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు 2025

శ్రీమతి “మంజుల పత్తిపాటి” (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి.

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
హనుమంతరావు

మల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 27:

 

సికింద్రాబాద్ సెంచనరీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని తెలపడం జరిగింది.
కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్ స్వీటీ, సంజీవరావు బాబు సత్యనారాయణ గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఆకుల తునికాకు కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలి.

50 ఆకుల తునికాకు కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి డిమాండ్

మహబూబాబాద్/కొత్తగూడ,నేటిధాత్రి:

 

వేసవి కాలంలో ప్రభుత్వం చేపడుతున్న తునికాకు 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ (ఎంఎల్) కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొత్తగూడ తాసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపెళ్లి రవి మాట్లాడుతూ మరో పంటలాగా సాగుతున్న తునికాకు సేకరణ జరుగుతూ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా దీనిమీదనే ఆధారపడి జీవిస్తుంటారని అలాంటి కష్టానికి అనుగుణంగా 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. ఎండనకా, రాళ్లు, రప్పలు, గుట్టలు ఎక్కుతూ ఎంతో కష్టపడుతూ తునికాకు సేకరించడం జరుగుతుందని, అదేవిధంగా పాము పురుగు అడవి జంతువుల బారిన పడి అనేకమంది చనిపోవడం కూడా గతంలో జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఆలాంటి ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా ప్రమాదవశాత్తు గాయాలు, దెబ్బలు తరిగిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే నేరుగా చెల్లించి వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తునికాకు కల్లాలలో ఇతరత్రా పనులు చేస్తున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులకంటే 20% పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి పూనెం ప్రభాకరన్న, సహాయ కార్యదర్శి ల్యాదల్ల రాజు, నాయకులు కంగాల పాపన్న, కుర్సం రంగన్న, సువర్ణపాక నాగేశ్వరరావు, చిద్రబోయిన పాపన్న, గోగ్గేల లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు

 

****మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్

*****మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా.!

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్

2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో
ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.

2025 – 2026 జనరల్ బాడి..

2025 – 2026 జనరల్ బాడి కమిటీలో
అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు,
ప్రధాన కార్యదర్శి మోటురి రవి,
సహాయ కార్యదర్శి కాంసాని అశోక్,
కోశాధికారి దాస్యం రంగనాథస్వామి,
ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్,
లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.

మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*

 

రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హత గల ప్రతీ ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.దుగ్గొండి మండల గిర్నిబావి గ్రామంలో గల జిఆర్బీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ల కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని వెల్లడించారు.

మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు,మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మాట్లాడుతూ దుగ్గొండి మండల యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోడానికి దరకాస్తులు చేసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి కోరారు.

GRB function hall

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధన్జ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింగరావు ,తాజా మాజీ సర్పంచులు క్లస్టర్ ఇంఛార్జ్ లు ఇంగోలి రాజేశ్వర్ రావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి ,గోగుల ప్రకాశ్ రెడ్డి,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మినేని భరత్,బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకినే నాగరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్లి వెంకటేశ్వర్లు,రొట్టె రమేష్,వివిధ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు పాల్గొన్నారు.

అప్లై చేసుకున్న అర్హులు.

— అప్లై చేసుకున్న అర్హులు
ధ్రువపత్రాల స్వీకారణ

నిజాంపేట:నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు ఫారం ను అందిఇవ్వాలని ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువత నూతన అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్ తో సహా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జిరాక్స్లు కార్యాలయంలో అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నర్సింలు, బాలయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై.!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై సమగ్రహ విచారణ చేయాలి.

సీబీఐ విచారణకు డిమాండ్.

తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్.

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి జీవకోన షెకినా చర్చి నందు తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రా తెలంగాణా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తికుడు ప్రవీణ్ పగడాల గత 25 వ తేది తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళుతూ దివాన్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురియై శోక సంద్రంలో మునిగిపోయారు.

అయినా గొప్ప బైబిల్ పండితుడు. పేదలకు తమ సొంత ఖర్చులుతో సహాయం చేస్తు, అనేక మంది అనాధులకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారు.

అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు హత్య జరియుండవచ్చుననని అక్కడ ఆక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైంది.

క్రైస్తవ సమాజమంతా ఎలుగెత్తి నిరసన చేయగా పోలీసులు శాఖా వారు అనుమానాస్పద మరణముగా కేసు నమోదు చేసుకొని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్ట్ మార్టం చేసారు.

పోస్ట్ మార్టం అయిన తరువాత ఎస్పీ,హోం మంత్రి, ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి తీవ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

అయితే తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేస్తు ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గుతేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సెక్రటరీ జైపాల్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేసారు.

బీఎస్పీ పార్టీ నాయకులు వెంకట్ ప్రవీణ్ పగడాలా మరణం సందేహాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్.సగేయు, అజరయ్య,దిలీప్ కుమార్,పీటర్, పీరారెడ్డి, జెర్నియా, తిమోతి దేవర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

DCRB నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం.

డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం

నేటిధాత్రి :హన్మకొండ

 

రామగుండం కమిషనరేట్ ఏ.ఎస్సై’గా విధులు నిర్వహించి, బదిలీ’పై ములుగు జిల్లా’ కు నూతనంగా విచ్చేసిన నలివేల లక్ష్మణ్’ ముదిరాజ్’ కు మెపా జిల్లా కార్యాలయానికి ఆహ్వానించి, ముదిరాజ్’ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని ఇచ్చి, శాలువా’తో ఘనంగా సన్మానించడం చేశారు అనంతరం
మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ పై ములుగు జిల్లా కు విచ్చేసిన ఉద్యోగులందరని మెపా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుందని, జాతి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం జాతి ఐక్యత’కు నిదర్శనం అని తెలిపారు.
డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్’ముదిరాజ్ మాట్లాడుతూ సన్మానం చేసినా మెపా టీమ్ కి, ముదిరాజ్ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మెపా జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version