మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి
ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్.
హన్మకొండ,నేటిధాత్రి:
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని
హన్మకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు
పాముల రమేష్ కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ,కాంగ్రెస్ జాతీయ నాయకులకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను అదేవిధంగా ముదిరాజులను 10 సంవత్సరాల పాటు రాజకీయ వివక్షతకు గురిచేస్తూ అణగదొక్కడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి పార్టీశక్తులు పావులుగా మార్చుకునే వారి కుట్రలను గమనిస్తున్నాం.బిజెపి పార్టీ 1996లో కాకినాడలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందన్నారు.గత శాసనసభ ఎన్నికల ముందు క్యాబినెట్ సెక్రెటరీతో హడావిడిగా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసి ఇప్పటివరకు రిపోర్టు తెప్పించలేదని తెలిపారు.బిజెపి పార్టీ మాదిగల పట్ల, ముదిరాజుల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాల నుంచి కేంద్ర మంత్రులుగా తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.