ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి:టి పిటిఎఫ్…

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి:టి పిటిఎఫ్.

కోదాడ, నేటి ధాత్రి:

 

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డిఏ లు, హెల్త్ కార్డులు పిఆర్ సి, సిపిఎస్ రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిపిటిఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాపర్తి రామ నరసయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్.బిక్షం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ పట్టణం ఎమ్మెస్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టిపిటిఎఫ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి నాణ్యమైన విద్య అందించడానికి బాధ్యతలు కోసం నిలబడతామని విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం నిరంతరం టిపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఇటీవల మార్చి 31, 2026న ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందిన టిపిటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు పోతురాజు సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ బోటనీ వాయిల సింగారం, పోతురాజు నరసయ్య స్కూల్ అసిస్టెంట్ హిందీ, పేరం ముత్తయ్య గెజిటెడ్ హెడ్మాస్టర్ లను శాలువా మెమొంటో పూలమాల అంకరణతో ఘనంగా సన్మానించడం జరిగింది. టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ముత్తవరపు రామారావు, డి ఎన్ స్వామి, పొనుగోటి కోటయ్య, టి పి టి ఎఫ్ డివిజన్ సంఘం బాద్యులు కొల్లు శ్రీనివాసరావు, ఏ. హనుమంతరావు, కైలాస వెంకటేశ్వర్లు, సుధాకర్, రాజమహేంద్ర, కృష్ణయ్య పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి, సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం 600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలకు కావలసిన అవసరాలు గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు, పుస్తకాలు, అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు మొట్టమొదటి సారిగా కాటారం మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు విద్యను అభ్యసించాలని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్క విద్యార్ధి ఇంగ్లీషులో మాట్లాడాలని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా, మండల స్థాయి విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, అవసరాలు గురించి తెలుసుకొని నివేదికలు అందించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను అధునాతంగా తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆదేశించారు.

కాటారాం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ పునర్నిర్మాణం, సైన్స్ ల్యాబ్ కెమికల్స్ ను అందిస్తామని అన్నారు.

లైబ్రరీ లో పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్ లను సమకురుస్తామని మంత్రి తెలిపారు.

హై స్కూల్ లలో కూడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడానికి విద్యాశాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా గ్రామ కూడలిలో గ్రామ సభ గ్రామస్తులు, విద్యార్థుల చే నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు, రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే పాఠశాల లు మూత పడి పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, కావున ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు ప్రతి గ్రామస్తుడు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సాధించిన విజయాలపై “కరపత్రాలు “ముద్రించి గ్రామ సభ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ పెద్దలు దూదిగాం గంగాధర్, లక్ష్మి నర్సయ్య, ప్రసాద్, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, రాణి, నర్మదా, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version