పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది‌.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్.!

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్
పెన్నులుపంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్నులు పంపిణి చేయడం జరిగింది, 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్ధి ఉన్నత చదువులకి మొదటి మెట్టు లాంటిది కాబట్టి విద్యార్థులు బాగా చదివి అందరు ఉత్తిర్ణత సాదించాలి, మనం ఏదైనా సాదించాలి అనుకుంటే అది కేవలం విద్య తోనే సాధ్యం అవ్వుద్ది కనుక ఎగ్జామ్స్ బాగా రాయాలని జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత రావాలని గురువారం పరిక్ష పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రంలో వంశీకృష్ణ , సందీప్, రాకేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మండల విద్యాశాఖ అధికారి రఘపతి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష
కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం

టీఎన్జీవో స్ భద్రాచలం

నేటిధాత్రి భద్రాచలం

10వ తరగతి పరీక్షలు జరగబోతున్న సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ యన్ జి ఓ స్) భద్రాచలం ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్ డెక్కా నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, పడిగ నరసింహారావు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమని.. అందుకే ప్రతి విద్యార్థి ఎంతో మేలుకువతో పరీక్షలు వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని,. అదేవిధంగా వడ దెబ్బ తగలకుండా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ.. ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా విద్యాశాఖ వారు ఆయా పరీక్ష హాల్ నందు అన్ని రకాల వసతులు సమకూర్చనీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

Farewell Day Party

సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.

మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో అంగన్వాడి కేంద్రం- 2 ఫ్రీ స్కూల్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆహాల్లదకరమైన వాతావరణంలో చిన్నారులకు ఆటలు పాటలతో డ్రాయింగ్, రంగు రంగుల బొమ్మలతో విద్యాబోధన చేపట్టారు తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించే అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది 3 సంవత్సరాల వయస్సు నుండి నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ,అంగన్వాడి స్కూల్ లో అయిపోగా ప్రేరణాత్మక బోధన అభ్యసించి అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ మా దేవి అన్నారు అంతేకాకుండా గర్భిణులకు బాలింతలకు పాలు గుడ్లు బాలామృతం మంచి పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రేణుక పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు, ఆయా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు, తయారు కావాలంటే గురువు దగ్గర చదువు తీసుకోవాల్సిందే అని అన్నారు.మేము ఒకరోజు ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా ముష్కే గగన్ వాల్మీకి, ఉపాధ్యాయులుగా సురుగుల నవ్య శ్రీ, శనిగరం చరణ్,కట్ల హిమాన్షు రెడ్డి,మామిడాల విశ్వతేజ రెడ్డి,దుబ్బాకుల వశిష్ట భార్గవ,తోకల నవనీత్ రెడ్డి,గోగుల జస్వంత్ రెడ్డి, కందికట్ల హర్షిత్,సోలంకి జస్మిత,గరిడే శ్రీనిత,తాళ్లపల్లి శ్రీనిధి,పూసాల అభిజ్ఞ, తాళ్లపల్లి శరణ్య, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,మేకల సత్యపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్ పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.?

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..?

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

 

నేటి ధాత్రి! భద్రాద్రి జిల్లా

విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ
రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థు
లకు కనీస సౌకర్యాలు కల్పించా
లని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించ
వద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నా
యన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రు
లకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్య
యన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థు
లు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,
అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,
కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

ఉన్నత ఉద్యోగానికి ఎంపిక..!

‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’

కల్వకుర్తి /నేటి ధాత్రి

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్ అమెరికాలో ఏం.ఎస్ చదువుతుండగా.. కూతురు పూజిత హైదరాబాదులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గృహిణిగా ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో.. పలువురు అభినందనలు తెలిపారు.

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం.!

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం పలికిన విద్యార్థులు

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

Students

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిమీదకు చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు ప్లైకార్డ్స్ తో స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం.పట్టాభి, ఉపాద్యాయలు విటోభా,పద్మ, అరుణశ్రీ, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్నప్రభ,రవిచందర్, సబిత, ప్రవళిక , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పట్టాభి మాట్లాడుతూ 9 నెలల 288 రోజుల సుధీర్ఘ కాలం వివిధ పరిశోధనల నిమిత్తం అంతరిక్షంలో ఉండి, దిగ్విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినవారు కావడం మనందరి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.

Students

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ శ్రీ ,పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన.!

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన ఎస్ ఇ ఆర్ టి బృందం..

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో మంగళవారం రోజున ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకు లు శ్రీ రాంబాబు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కె లక్ష్మణ్ పలు రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మెటివ్ అసెస్మెంట్, టీచర్ డైరీలు, విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించి ఎల్ఐ పి బేస్ లైన్ టెస్ట్, మిడ్లైన్ టెస్ట్ సంబంధించిన రికార్డులు, ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ రిజల్ట్,యాక్షన్ ప్లాన్,ఎస్ఎస్సి గ్రేడింగ్ రిజిస్టర్లు పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యాసామర్ధ్యాలు పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడపాక రఘుపతి ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి ఉపాధ్యాయులు శ్రీ బొమ్మ రాజమౌళి, బుర్రసదయ్య,సాంబారు రామనారాయణ,ఉస్మాన్ ఆలీ,శంకర్, శ్రీనివాస్, నీలిమారెడ్డి, సరలా దేవి, విజయలక్ష్మి, కల్పన,సుజాత,మౌనిక, మరియు సి ఆర్ పి రాజు తదితరులు పాల్గొన్నారు.

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా ఉన్నతమైనటువంటి విద్యాశాఖ ను తన దగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కుట్ర మానుకోవాలని హెచ్చరించారు వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని అదేవిధంగా
ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలనకు చర్మ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటని విద్యార్థుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా పాలిస్తున్న ఈ పాలనను ప్రజా పాలన అంటారా ?ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలను తలపించే విధంగా ప్రశ్నించే ప్రతి వారిపై నిర్బంధాలను విధిస్తూ ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వాగతించడం లేదని వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పై విధించిన నిర్బంధాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి:

మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలాషించారు. పదవ తరగతి పరీక్షలను ఎలాంటి భయము, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు మరియు 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఐదువేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు”.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని రాబోయే కామన్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయ బృందం స్నేహలత, నాగయ్య, రమాదేవి, పరమాత్మ చారి బాబురెడ్డి, సుజాత, సౌభాగ్య, హైమావతి, మమత పాల్గొని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు

విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి

జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి

శాయంపేట నేటిధాత్రి:

Education Minister

శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర నాయకులు కొమ్ము ల శివను అక్రమ అరెస్టులు చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం అని అన్నారు విద్యాశాఖకు మంత్రిని నియమించ కుండా కాలయా పన చేస్తూ విద్యార్థుల జీవితా ల తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతూన్నాడని మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version