ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్ అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ (Brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కీలోనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో పేరొందిన కార్తీక్ యోగీ దర్శకత్వంలో ‘బ్రోకోడ్’ చిత్రం తెరకెక్కనుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. స్ల్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రవి మోహన్ (Ravi Mohan) స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు జయం రవి. మహిళా నటీమణులు ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్ కె. బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు కార్తీక్ యోగీ మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిత్రంలో స్లాప్ స్టిక్ కామెడీ బేస్డ్ సినిమా ఇది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్థన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. రాజేష్ వ్యవహరించనున్నారు.
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు.
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు. ఇటీవల ఓ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి ఓజీ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagath singh) వంతు వచ్చింది. హరీశ్ శంకర్(HariSh Shankar) దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి ఈ నెల 12 నుంచి పవన్‌కల్యాణ్ సెట్‌లో అడుగుపెడతారని తెలిసింది.
ఈ సినిమా అనుకున్నప్పుడు ‘తెరీ’ మూవీ రీమేక్ అనుకున్నారు. ఏపీ ఎలెక్షన్ ముందు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు
అందుకు తగ్గట్టుగా డైలాగ్స్ సీన్స్ రాసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కాబట్టి కంప్లీట్ గా సీన్స్, డైలాగ్స్ మార్చారని సమాచారం. మార్పులు చేర్పులు చేసిన కథతో సెట్స్ మీదకెళ్లనున్నారని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే దర్శకుడు స్పందించాల్సిందే. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారని తెలియగానే అభిమానులు హంగామా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక.
కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొచ్చారు. సత్వరమే భూ సమస్యలకు కృషి చేస్తామని తహశీల్దార్ జయరామ్ నాయక్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ సంబరాలు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనం అన్నారు.పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందని ఇలాగే క్రియాశీలంకంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ దుదిల్ల శ్రీను బాబు మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం రాజు, అనుము ప్రశాంత్, ఇనుముల ప్రదీప్, నాగరాజు,స్వామి,బర్ల రాజు, నాగరాజు,నేతెట్ల కిరణ్, ఎడుమెకల కిరణ్, ప్రదీప్, ఐత రాజు, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –
బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.
దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.
ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.
మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.
సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.
రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.
అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.
కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రైవేట్ విద్యా వ్యాపారం…
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు…
సర్కారు మారిన విద్యావ్యవస్థలో కనిపించని మార్పు…
ఆదేశాలకే పరిమితమైన విద్యాశాఖ…
ప్రభుత్వ విద్య వ్యవస్థపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న విద్యాశాఖధికారులు…
ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థకు వత్తాసు పలుకుతున్న అధికారులు…
నేటి ధాత్రి -గార్ల :-
మహబూబాబాద్ జిల్లాలో చుట్టుపక్క మండలంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు ఆశలు చూపించి జాయిన్ చేస్తూ కోట్లకు కోట్లు గడ్డిస్తున్నారు.
అధిక ఫీజులతో విద్యా వ్యాపారాని కొనసాగిస్తూ విద్యార్థులను అధిక ఫీజులతో మనోవేదనకు గురి చేస్తున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలు వారి సంస్థల్లో జాయిన్ అయ్యే ముందు డిజిటల్ లో సినిమా చూపించి వారి విద్యాసంస్థ పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి అనుకూలంగా ఫీజులు ఉంటాయని నమ్మబలికారు, తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, పాఠ్యపుస్తకాల ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలు దొడ్డిదారిన దోచుకుంటున్నారు.
కళాశాలలో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఉచిత విద్యను అందిస్తామని స్కాలర్షిప్ తోనే చదవచ్చని ఆశలు పెట్టి,తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, మెటీరియల్ ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలకు వేలు దొడ్డిదారిన దోచుకోవటం పరిపాటిగా మారింది.
చిన్నచిన్న గదుల్లో విద్య బోధన చేయటం మరియు కనీస విద్యార్హత లేకుండా ఉన్నవారికి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పెట్టుకొని నడిపిస్తున్నారు.
విద్యార్థులు జాయిన్ అయిన తరువాత అనేక పేర్ల మీద డబ్బులు గుంజటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
తల్లిదండ్రులను జలగల్లా పీకుతూ సర్టిఫికెట్లు ఇవ్వమని మనోవేదనకు గురి చేస్తున్నారు.
చేరే ముందు నమ్మించి చేర్పించుకున్నారని నమ్మి జాయిన్ అయితే అనేక పేర్ల మీద డబ్బులు గుంజినట్టేట ముంచారని తల్లిదండ్రులు గోడు వెళ్ళబోస్తున్నారు.
సరైన వసతులు లేకపోయినా ఉన్నట్లు అనుమతి పొంది అధికారులను మంచిగా చేసుకుని వారికి ఇచ్చే మామూళ్లను వాళ్లకు ఇస్తూ స్కూళ్లను నడిపిస్తున్నారు.
అధికారులను నిలదీసిన వాళ్లకు అధికారులు మీరు ఎందుకు జైన్ అయ్యారు.
ప్రైవేట్ సంస్థలు అంటే ఇలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే ఉండండి కష్టమైతే మానేయండి అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తుంది.
Education Officials.
అంతేగాని విద్యార్థులను రాసిరంపాన పెడుతున్న విద్యా సంస్థలపై ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు ఉంటే పేద మధ్య తరగతి కుటుంబాలు విద్యార్థిని విద్యార్థులు ఎలా చదువులు ముందుకు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాడ్ లు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని ఝరాసంగం నాయబ్ తహసీల్దార్ కరుణాకర్ రావు అన్నారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని బోరేగావ్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.ఈ చట్టం ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలు అధికారులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో వివిద రకాలుగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామారావు జూనియర్ అసిస్టెంట్ శివాజీ జూనియర్ అసిస్టెంట్ ఎజాస్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింలు బస్ శెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ -3’ మూవీ బుల్లితెరలోనూ ప్రత్యక్షం కాబోతోంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను టీవీ ఛానెల్స్ లో ప్రసారం కోసం రీ-సెన్సార్ కు మేకర్స్ అప్లయ్ చేశారని తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్ -3’ (Hit -3) సినిమాను అతని కెరీర్ లోనే కాదు… తెలుగులో వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రం అని విశ్లేషకులు కొందరు వ్యాఖ్యానించారు. నాని గత చిత్రాలకు భిన్నంగా ఇది ‘ఎ’ సర్టిఫికెట్ ను పొందింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో తెలిపారు. చిన్న పిల్లలు, వయసులో మరీ పెద్ద వాళ్ళు ‘హిట్ -3’కి దూరంగా ఉండాలని, కథానుగుణంగా వయొలెన్స్ ను ఈ సినిమాలో పెట్టక తప్పలేదని వివరణ ఇచ్చాడు. మానసికంగా నాని అండ్ టీమ్ ప్రేక్షకులను అంతలా ప్రిపేర్ చేసినా… థియేటర్లలో ‘హిట్ -3’ చూసిన వాళ్ళు అవాక్కయ్యారు.
నాని సినిమాలో ఇంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయేమిటీ అని వాపోయారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ తరహా హింసాత్మక చిత్రాలు బాగానే ప్రేక్షాకరణ పొందుతున్నాయని కొందరు చెబుతూ, అందుకు ఉదాహరణగా మలయాళ చిత్రం ‘మార్కో’ను, హిందీ సినిమా ‘కిల్’ను ఉదహరించారు. తెలుగు వారికి ‘హిట్ -3’ మరో ‘మార్కో’ (Marco) లేదా ‘కిల్’ (Kill) అని సరిపెట్టుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లలో ‘హిట్ -3’ని చూసి హింసను తట్టుకోలేక నోరు వెళ్లబెట్టిన చాలామంది… మే నెలాఖరులో ఓటీటీ (OTT) కి సెన్సార్ ఉండదు కాబట్టి నెట్ ఫ్లిక్స్ (Netfilx) లో ‘హిట్ -3’ అన్ ఎడిటెడ్ వర్షన్ చూసి ఖంగుతిన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత… థియేట్రికల్ వర్షన్ చాలా బెటర్ గా ఉందని భావించారు.
ఇక ఇప్పుడు టీవీలో…
చిత్రం ఏమంటే… ‘హిట్ -3’ సినిమాలోని హింస గురించి సినీ గోయర్స్ లో అంతగా ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ మూవీ మేకర్స్ ‘హిట్ -3’ని టీవీలో స్క్రీనింగ్ చేయడానికి సిద్థపడ్డారట. నిజానికి ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను ఏ ప్రైవేట్ టీవీ ఛానెల్స్ కూడా ప్రసారం చేయవు. ఖచ్చితంగా యు/ఎ సర్టిఫికెట్ పొందాల్సిందే. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిన చిత్రాలను నిర్మాతలు ‘యు/ఎ’ కన్వర్షన్ కోసం మళ్ళీ సెన్సార్ కు అప్లయ్ చేస్తారు. ‘హిట్ -3’ సినిమా నిర్మాతలు సైతం ఇప్పుడు ‘యు/ఎ’ సర్టిఫికేషన్ కోసం తిరిగి సెన్సార్ బోర్డ్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ‘హిట్ -3’ మూవీ విడుదలకు ముందు ‘మా సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే తీశాం, ఈ హింసను తట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళే థియేటర్లకు రండి, ఇది అందరి కోసం తీసిన సినిమా కాదు’ అని అంతగా గట్టిగా చెప్పిన హీరో నాని… ఇప్పుడు ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయడానికి ఎందుకు తహతహ లాడుతున్నాడో!? ఈ సినిమాకు ఆయన కూడా నిర్మాతే కాబట్టి… టీవీ ఛానెల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని నానికి బహుశా అనిపించి ఉండొచ్చు. దారుణమైన హింస ఉన్న కారణంగా ‘హిట్ -3’కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం… ఇప్పుడు ‘యు/ఎ’ కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది? రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకుల కోసం ఎంత ఎడిట్ అవుతుందనేది చూడాలి!?
రాజ్‌తరుణ్ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్ విజయ్ మిల్టన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో…
రాజ్‌తరుణ్ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్ విజయ్ మిల్టన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సునీల్ నటించనున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మిల్టన్ మాట్లాడుతూ ‘‘సినిమాలో సునీల్ చేయనున్న పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోంది. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే పాత్ర ఇది’’ అని తెలిపారు. చిత్ర టైటిల్‌ను ఈ నెల 15న ప్రకటించనున్నారు.
చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి
మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని చిన్న బోనాల మరియు ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటూ 10 వార్డ్ మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ చిన్న బోనాల అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ మరియు ముష్టి పెళ్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, DEO, MEO లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్న బోనాల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు కేవలం 4 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు రిటైర్డ్ అయ్యారు. అలాగే ముష్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జీవో నెం.25 ప్రకారం ఈ సంఖ్యకు తగినట్టు అదనపు టీచర్లను నియమించాలి అని ప్రజావాణిలో అధికారులకు తెలిపారు.ఈ వినతిపత్ర సమర్పణలో బండారి భాగ్య, గుగ్గిల లావణ్య లలిత, బి.వినోద్, నరాల లత, సరోజ,అనన్య,లింబ్బవ్వ,సురేష్,మహేష్, బాబు,పరశురాములు, రమేష్, శివ, కుమార్, అనిల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణం కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి శ్రీ హరికి మంత్రి పదవి ఇచ్చి,ముదిరాజులకు ఇచ్చిన మాట ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అన్నారు. అలాగే చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం ముదిరాజులు ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి మరియు జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా ముదిరాజులకు కేటాయించాలని అన్నారు. బీసీడీఈ లో ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగాపల్లి శేఖర్,రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంకాయల కార్తీక్,కోలా నరేష్, మామిండ్ల నారాయణ మునిగల రాజు చుక్క శేఖర్ బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. నేటి కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అరటి పువ్వు మధుమేహానికి దివ్య ఔషధమని అంటున్నారు. దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు.
అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
#నాపై నమ్మకంతో 5వ సారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల అధ్యక్షుని ఎన్నిక సోమవారం కుల దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా పోటీలో పాండవుల రాంబాబు, పప్పు మొగిలి బరిలో నిలవగా ఎన్నికల నిర్వాహకులు రావుల రవి, కేశవ వర్మ, జక్కుల రవి, పోతు రెడ్డి రవిఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా సంఘ సభ్యులు ఓటును హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పాండవుల రాంబాబు అధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తూ పార్టీలకు అతీతంగా కుల సమస్యలపై పోరాడి అభివృద్ధి దిశగా నడిపిస్తూ. కుల బాంధవులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సాధక బాధలను తీర్చడం జరిగిందని. కుల సంఘానికి పనిచేసే వ్యక్తి కావాలని 5 సారిగా మరోసారి నాకు అవకాశం కల్పించిన కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన తెలిపారు. అదేవిధంగా కుల సంఘానికి ఎలాంటి సమస్యలు వచ్చిన పెద్ద చిన్న అని తేడా లేకుండా సమస్యల పరిష్కరణ కొరకై అనునిత్యం పనిచేస్తానని ఆయన కుల సంఘానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ – 1 లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పిసిసి మెంబర్ చల్లూరి మధు అప్పం కిషన్ దాట్ల శ్రీనివాసు ముంజల రవీందర్ కేతరాజు సాంబమూర్తి కురుమిళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేది ఎప్పుడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దాంతో నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జులై తొలి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. జూన్ 26న రిలీజ్ కానుందని ఓవర్సీస్‌కు చెందిన ఓ డిస్ర్టిబ్యూషన్ సంస్థ పోస్టు పెట్టింది. సంబంధిత పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్ ఎక్స్ వేదికగా స్పందించి రూమర్స్‌కు చెక్ పెట్టారు. ‘‘హరిహర వీరమలుల్ల’ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లను నమమకండి. మా సోషల్ మీడియా ఖాతా ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పేర్కొంది. నాలుగేళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత సినిమా క్రిష్ చేతుల నుంచి జ్యోతికృష్ణ చేతికి వచ్చింది. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయిక. . అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్సై వినయ్ కుమార్ జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ ఎస్ఐగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.
సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..
విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..
నర్సంపేట,నేటిధాత్రి:
స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో గల దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి,
వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు. 1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.అనంతరం చంద్రయ్యపల్లి,వసంతాపూర్, కమ్మపెల్లి,ప్రగతిసింగారం సంఘాలకు ఉత్తమ సంఘాలుగా ఎన్నిక కాగా మరో నలుగురిని ఉత్తమ పాలకవర్గ సభ్యులుగా ఎంపిక కాగా వారికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు.
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం 2025 గాను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవనంలో గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తిడాక్టర్ రాధా రాణి, తెలంగాణ కళా రత్న బిక్కి కృష్ణ, గిడుగురామా మూర్తి సంస్థ ఫౌండేషన్ దివాకర్ బాబు,కాంతి కృష్ణ అధ్యక్షుడు, సినిమా రచయిత డాక్టర్ సరళ సినిమా రచయిత విశ్వపుత్రిక గజల్ డాక్టర్ విజయలక్ష్మి పండిత్, వారి చేతుల మీదుగా మారుపాక కృష్ణ కు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.