కొడవటంచలో అన్నదాన సత్రములను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఎస్ డీ ఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన పూజారుల వసతి గృహము అన్నదాన సత్రముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలేకాక సామాజిక సేవకు నిలయాలుగా ఉండాలని తెలిపారు. పూజారుల సౌకర్యార్థం వసతి గృహము ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే భక్తులకు అన్నదానం అందించే సత్రం ద్వారా సేవాభావం మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సదుపాయాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
