ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం..

ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం..

హిందూ ముక్తిస్తల్ ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము.

కాశీబుగ్గ, నేటిధాత్రి

Maha Vatavriksha Kalyana Mahotsava.

వరంగల్ తూర్పు కాశీబుగ్గ లోని వివేకానంద జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ముక్తి స్థలంలో ప్రతి యేటా లోక కల్యాణం కోసం మహాశివరాత్రి ముందు రోజు నిర్వహించే కార్యక్రమం మహా శివరాత్రి ముందు మంగళవారం రోజున ఉదయం 11-16 ని.లకు ఉత్తరాషాడ నక్షత్రంలో లక్ష్మీ నారాయణ, శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము హిందూ ముక్తిస్తల్ కమిటీ ఆధ్వర్యంలో పద్మ బ్రాహ్మణులు గజ్జెల రాజ్ కుమార్ శాస్త్రి, కోడం ప్రవీణ్, రాచర్ల రాజు లోక కళ్యానార్థం, నానావిధ ఆత్మానాం గోత్రస్య మహారుద్ర హోమం హిందూ ముక్తిస్తల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బూర రాంచందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తుల సహకారముతో వటవృక్షం కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, అదే విధముగా ఇక్కడి నాయకుల సహకారముతో మరియు దాతల సహకారముతో హిందూ ముక్తీస్థల్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భముగా తెలియజేశారు. ఈ కార్యక్రమములో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్, బీజేపీ నాయకులు సముద్రాల పరమేశ్వర్, ఉపాధ్యక్షులు పడాల నరసింగరావు, శీలం బాబురావు, గోషికొండ సుధాకర్, ఇప్ప ఆదినారాయణ, నలువల మురళీ, ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, వర్కింగ్ కార్యదర్శి వంగర భాస్కర్, సహాయ కార్యదర్శులు ఆకేన వెంకటేశ్వర్లు, గుములపురం ఉప్పలయ్య, గాదె ప్రభాకర్, కోశాధికారి ఉప్పుల రమేష్, సహాయ కోశాధికారి అంబటి అశోక్ కుమార్, సుంకనపెల్లి శ్రీనివాస్, ప్రతాపని సుధాకర్, టీ.వి. అశోక్ కుమార్, పెరుమాండ్ల సురేష్, భాకం హరిశంకర్, వంగరి సూర్యనారాయణ, బింగి మహేష్, మరియు మధు, శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి..

మాజీ మైనారిటీ అధక్షులు అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి

ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కట్కూరు దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన మైనారిటీ యువకుల గ్రీన్ టైగెర్స్ క్రికెట్ టీంనకు మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి అలీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షలు కట్కూరి దేవేందర్ రెడ్డి అతిధులుగా హాజరై జెర్సీలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం సభ్యులతో పరిచయ కార్యక్రమం చేసుకొని క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆడి ఆటను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగారాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఉడుత సంపత్,దొమ్మటి దాసు,డాక్టర్ రోహిత్,వెంకటేష్ రాకేష్ లు పాల్గిన్నారు.

తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత మాదే..

*తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే..

కోలా లక్ష్మీపతి

*పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా..

*తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు…

*రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం…

తిరుపతి(నేటి ధాత్రి) 

తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని. ఇక్కడ పుట్టి, పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతతో మొదటగా మేము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యం గా ఏర్పడ్డామనీ తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు.‌ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి కోసం దశాబ్దాల తరబడి కొండపై నివసిస్తున్న స్థానికులైన మేము మా స్థలాలు ఇతరత్రా వాటిని టిటిడి అభివృద్ధి కోసం అప్పగించి, ప్రత్యామ్నాయంగా జీవనోపాధి క్రింద షాపులు, హాకర్ లైసెన్స్ లు బాలాజినగర్ లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుండి కూడా టిటిడి ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా తిరుమల స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొండపై అన్నింటిలోనూ అవకాశాన్ని స్థానికులకే ఉండేలా చేశారు. అటు తర్వాత గత 6 ఏళ్లుగా ఈవిధానానికి స్వస్తి పలికి స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా స్థానికేతరులందరికీ రాజకీయ ఒత్తిడిలతో కొండపై పలు విధాలుగా స్థానం కల్పించడంతో స్థానికులైన మేము జీవనోపాధి కోల్పోయి మా ఉనికి ప్రమాదంలో పడింది. పైగా ప్రస్తుత టిటిడి యాజమాన్యం తిరుమల కొండపై స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా టిటిడి రెవెన్యూ, పంచాయితీ విభాగం పూర్తిగా అవినీతిమయమై ఇష్టారాజ్యంగా వందలాది తట్టలు, హాకర్ లైసెన్స్ లు విచ్చలవిడిగా కొండపై వెలిశాయి.
ప్రతినిత్యం ఏదోఒకచోట లైసెన్స్ లు లేకుండానే పంచాయితీ, రెవెన్యూ, విజిలెన్స్, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు అనధికారికంగా తట్టలు పెట్టిస్తూనే వున్నారు. ఈవిధంగా వ్యవహరించుకుంటూ పోతే తిరుమలలో స్థానికేతరులు ప్రాబల్యం పెరిగిపోయి అసాంఘిక శక్తుల ప్రమేయంతో ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు పూర్తిగా తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి మావంతుగా స్థానికుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది.ఇకపై అనధికారికంగా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా తిరుమల పరిరక్షణ సైన్యంగా మా ముఖ్య సైనికులు అడ్డుకుంటామని. చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటామని కోలా లక్ష్మీపతి వివరించారు.
మరో ముఖ్య సైనికుడు వి కృష్ణ, కే హరిప్రసాద్, వాసుదేవన్ లు మాట్లాడుతూ పాలకమండలి ఉన్నతాధికారులు తిరుమలలో టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగం అవినీతి కారణంగా సంస్థ ఉనికి ప్రమాదకరంలో పడిందని అన్నారు.
దయచేసి ప్రక్షాళన మీరు మొదలు పెడితే మావంతు సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తిరుమలలో ఆక్రమణలు అనధికారిక తట్టలపై ఫిర్యాదు చేసినప్పుడల్లా దుకాణాలపై కక్ష తీర్చుకునేలా దాడులు నిర్వహించడం ఇబ్బందులకు గురి చేయడం పంచాయతీ రెవిన్యూ విభాగానికి పరిపాటిగా మారిందన్నారు. ఇకపై కొండపై రాజకీయ ఒత్తిడితో పంచాయతీ రెవిన్యూ విజిలెన్స్ ఆరోగ్య శాఖ ఎవరైనా సరే అనధికారికంగా తట్టలు పెట్టాలని చూస్తే తిరుమల పరిరక్షణ సైన్యం మూకుమ్మడిగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. తిరుమల పరిరక్షణ కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించేందుకు 250 మంది సభ్యులతో ఏర్పడిన తిరుమల పరిరక్షణ సైన్యం 15 మంది ముఖ్య సైనికులతో కార్యాచరణ కు దిగుతుందని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న
ముఖ్య సైనికులు ఎమ్.వేలు,కె. ప్రహ్లాద, పి.భాస్కర్, జి.వరప్రసాద్, కె.వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు పి.త్రిలోక్ కుమార్, ఎం.మణి, ముని నాయుడు,చెంజి సురేష్, ఎం.ఆర్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

అన్నమయ్య జిల్లా..
ఓబుల వారి పల్లి(నేటి ధాత్రి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు.ఎంతో మంది గాయాలపాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

బాధిత కుటుంబానికి కోగిల బ్రదర్స్ ఆర్థిక సాయం..

బాధిత కుటుంబానికి కోగిల బ్రదర్స్ ఆర్థిక సాయం

పరకాల:నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన కొగిల అరవింద్ గత కొద్దిరోజులకిందట రైలు ప్రమాదానికి గురై తన రెండు కాళ్ళు విరగడం జరిగింది.దీన స్థితిలో ఉన్నా ఆ కుటుంబానికి కోగిల బ్రదర్స్ మరియు ఏపిఆర్ సేన ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి పదివేల(10,000)రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్బంగా కోగిల అర్జున్ మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయాల వలన కుటుంబం రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతుందని కావున ప్రతి ఒక్కరు బాధ్యాయుతంగా మెలిగి చదువులో ఉన్నత శికరాలకు చేరాలని అన్నారు.సహకారం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిక్షపతి, సుధాకర్,అర్జున్,కిరణ్,లడ్డు,సాయి,సంపత్,బబ్లు,చంటి,దయ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా మద్యం దందా…

జోరుగా మద్యం దందా…

వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు…

బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం.

అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…

అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?

నూగూర్ వెంకటాపురం/నేటిధాత్రి

alcohol

(ఫిబ్రవరి26) వెంకటాపురం మండలంలో అక్రమ మద్యం దందా సాగుతున్న అధికారులు మౌనం వెనుక కారణం ఏమిటి.?వైన్ షాపుల తంతు చూస్తే ఆదాయం రెట్టింపు చేయడం కోసం వాహనాల ద్వారా మధ్యాన్ని తరలిస్తూ, ఎమ్మార్పీకి మించి వసూలుకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుడి,బడి అని తేడా లేకుండా బెల్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసలు అవుతున్నారు.దీంతో పేద కుటుంబాల మధ్య గొడవలు కలహాలు నిత్యకృతమవుతున్నాయి,చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.బెల్స్ షాపుల్లో మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా కొనసాగిస్తూ,పేద కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.రెట్టింపు ఆదాయం కోసం బెల్ట్ షాపులను వైన్స్ యజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులకు తరలిస్తూ గ్రామీణ ప్రాంతంలో విక్రయాలు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నరు.
వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సిండికేటుగా మారిన అక్రమ మద్యం వ్యాపారులు సాగిస్తున్నారు మండలంలో రెండు వైన్ షాపులు ఉన్నప్పటికీ ఒకటి మండల కేంద్రంలో రెండవది చోక్కాల గ్రామంలో ఉంది ఈ రెండు వైన్ షాపుల నుండి మద్యం రోజు ఉదయం 8 గంటల సమయంలో రెండు వాహనాల ద్వారా వెంకటాపురం మీదుగా పాత్రపురం,వీరభద్రారం,ఆలుబాక,సురవీడు,ఏదిరా,ఏకన్న గూడెం మీదుగా మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోందితదితర గ్రామాలకు చట్ట విరుద్ధంగా వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుపుతున్నారు. ఇది వైన్స్ యజమాన్యమే అధిక ధరలకు విక్రయించేందుకు చేస్తూ ఒక సీసా పై 20 నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నారు.
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం

alcohol

సిండికేట్ గా మారి మద్యం వాహనాల ద్వారా రవాణా చేస్తూ ప్రతి బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తూ,వైన్స్ యజమాన్యమే గ్రామాల్లో గుడి బడి అని తేడా లేకుండా బెల్ట్ షాపుల నిర్వాహకులను వైన్ షాప్ యాజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు అనుమానాలు వెళ్ళుతున్నాయి.
అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…
అక్రమ మద్యం రవాణాపై ఇంతవరకు సంధిత అధికారులు చర్యలు తీసుకుపోవడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుండే ఈ తథంగం జరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, అక్రమ మద్యం రవాణా ఇంకా జోరందుకున్నదని చెప్పుకోవాలి.గతంలో అమ్మకాల కంటే ఈసారి నేరుగా గ్రామాల్లోకి మద్యం తరలిపోవడంతో అమ్మకాలు ఇంకా జోరు సాగుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులు అడ్డదిడ్డంగా వెలుస్తున్న వందలాది బెల్ట్ షాపులపై అలాగే అక్రమ రవాణా చేస్తున్న వైన్ యాజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?
మద్యం వ్యాపారం అదుపు తప్పడంతో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న అధికారులను తాము చెప్పిందే చేయాలంటూ ఖద్దరు నేతల అడుగు జాడలో నడుస్తుందని తెలుస్తోంది. మండలంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నారు. కొంత మంది నేతలు గ్రూపులుగా ఏర్పడి తలోకొంత పెట్టుబడులు పెట్టి మద్యం దందాను నడుపుతున్నారు. నేతలు తమ రాజకీయ పలుకుబడితో అధికారులను తమ దారికి తెచ్చుకుంటున్నారు. కొన్ని విషయాలను చూసీ చూడనట్లుగానే వదిలేయాలంటూ అధికారులను సైతం తమ దారికి తెచ్చుకుంటున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇవన్నీ తెలిసిన మౌనం పాటిస్తారు తప్ప, చర్యలు ఏమాత్రం తీసుకోరని జోరుగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.నెలవారీగా మాముళ్లను ముట్టజెప్పడంతో సైలెంట్‌ అయిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా క్షేత్ర స్థాయిలో అక్రమ మద్యం దందాపై ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో లో మంగళవారం రోజున బహుజన సమాజ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు బహుజనులదే అని అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టాలని మన ఓటు బీఎస్పీకే అని భూపాలపల్లి జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నామని పార్టీ నిర్మాణంలో భాగంగా చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని జోరుగా ప్రచారం

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున పోతిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో పంజాల సతీష్ మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్ ,దుర్గం బిక్షపతి, చేపూరి రాజు, రాపర్తి కొండల్, రాపర్తి శ్రీనివాస్ ,రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్..

డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్

అభినందించిన సికెఎం కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రావు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ లునావత్ వెంకన్న ఔషధ మొక్కల నుండి తయారుచేసిన రసాయనాల బయలాజికల్ యాక్టివిటీస్ పై, చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వo ఇటీవల పేటెంట్ మంజూరు చేసింది. ఈ మేరకు సికేఎం కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిధర్ రావు డాక్టర్ వెంకన్నను అభినందించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పరిశోధనలకు పేటెంట్ లభించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఇలాంటి అంశాలను అధ్యాపక బృందం స్పూర్తిగా తీసుకొని సికెఎం కళాశాలలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పేటెంట్ సాధించిన వెంకన్న కేయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో పిహెచ్ డి, పిడిఎఫ్ పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎం.మాధవి అత్యంత ప్రతిష్టాత్మకమైన యుజిసి నెట్ డిసెంబర్ 2024న జరిగిన పరీక్షలో క్వాలిఫై అయినందుకు సికెఎం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్, అధ్యాపకులు,, బోధనేతర సిబ్బంది మాధవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ .ధర్మారెడ్డి, డాక్టర్ వరప్రసాద్, గ్రంథపాలకులు ఎస్ అనిల్ కుమార్, కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్, సూపరిండెంట్ జి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాషా , అతిధి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

తిర’గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం

తిర’గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం

పెరుగుతున్న పవన విద్యుత్

* సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టులు

* రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు

* మరికొద్ది రోజుల్లో అదనపు విండ్ టవర్లు

 

Projects

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త కొత్త
టెక్నాలజీని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేపడుతు న్నారు. రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పరిశ్రమలతోపాటు గృహాల్లోనూ విద్యుత్ అవసరాలు ఎక్కువయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

11,730 మెగావాట్ల విద్యుదుత్పత్తి

ఝరాసంగం మండలంలో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11,730 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు నిర్వాహకులు తెలి పారు. ఒక రోజులో సుమారు 25 నుంచి 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సంవత్సరంలో జూన్ నుం చి అక్టోబర్ మధ్యలో గాలులుగా ఎక్కువగా వీయడంతో విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఆరు నెలలకొ కసారి టర్బైన్ టవర్ల నిర్వహణ చేపడుతారు.

రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు

హీరో ప్యూచర్ పవన విద్యుత్ ప్రాజెక్టు సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పారు. ఇప్పటివరకు 13 టర్బైన్ టవర్లను ఏర్పాటు చేయగా మరికొన్ని ఏర్పాటు చేసేం దుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం, ఒక్కో టర్బైన్ టవర్ సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మాణం కానుంది.

వికారాబాద్ జిల్లాలో

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 48 టర్బైన్ టవర్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యు ద్దుత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.

నిమ్డ్ ఏర్పాటు నేపథ్యంలో

జహీరాబాద్ నియోజకవర్గంలోని యురాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్స్ (జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండ లి) 12,635 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. నిమ్టే ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ను సరఫరా చేయనున్నారు.

సంగారెడ్డి జిల్లాలో హీరో ఫ్యూచర్స్ ప్రాజెక్టు

జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని చీలపల్లి, చీలపల్లి తండా, బర్దిపూర్, ఎల్గోయి గ్రామ శివా రులో అనువైన స్థలాలను గుర్తించారు. హీరో ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల ఎత్తులో 13 పవర్ జనరేటింగ్ టర్బైన్ టవర్స్తో కూడిన విద్యుద్దుత్పత్తి ప్రాజెక్టును నెల కొల్పారు. ఒక్కో టర్బైన్ టవర్ వీచే గాలి సామ ర్థ్యాన్ని బట్టి ఒక రోజులో 2.1 మెగావాట్ల విద్యుద్దు త్పత్తి జరుగుతుంది. 100 మెగావాట్ల విద్యుదు
తృప్తి సామర్థ్యం గణ ప్రాజెక్టును ఏర్పాటు చేశాడు.
ప్రస్తుతం రోజుకి 25 నుంచి 21 మెగావాట్ల విద్యు ద్దుత్పత్తి జరుగుతుంది. ఝరాసంగం మండలం పరిధిలోని కుప్పానగన్ – మార్పూర్ గ్రామాల శివా దులో ప్రత్యేకంగా సడి ప్లేషఏర్పాటు చేశారు. ఉత్పత్తి చేసిన విద్యుడు సబ్ స్టేషనీరు సరఫరా చేసి అక్కనుంచి జహీరాబాద్ శివారులోని కాశీం పూర్ ప్రభుత్వ సరీ స్టేషన్ కు తరలిస్తారు. ఇక్కడి నుంచి అవసరాల మేరకు ఇతర ప్రాంతాలది.

* ఆంధ్రప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో పవన విద్యుత్, తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు.

* రాష్ట్రంలో సంగారెడ్డి, వికారాబాద్ తోపాటు పలు జిల్లాలోని ప్రాంతాల్లో పవన విద్యుదుత్పత్తికి అనుకూలమని జాతీయ పవన విద్యుదుత్పత్తి సంస్థ సర్వే వెల్లడించింది.

* సంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్ జిల్లాలో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలి గిన ప్రాజెక్టులను నెలకొల్పారు. ఆయా జిల్లాల్లో కొన్నేళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

* సోలార్ విద్యుదుత్పత్తి కేవలం ఎండ ఉన్న సమ యాల్లోనే జరుగగా పవన విద్యుత్ మాత్రం వీచే గాలిని బట్టి 24 గంటలూ జరుగుతుంది.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు.డివైడర్ పనులు అడ్డుకున్నారు. ప్రజల సౌకర్యార్థం రహదారి పై అవసరమైన చోట యుటర్న్ లు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సరే నిర్మాణాలు యధావిధిగానే జరుగుతున్నాయని, అవసరమైన చోట యూటర్న్ నిర్మించడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కొత్త తిమ్మాపూర్ వెళ్లే రహదారి దగ్గర యూటర్న్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు.

శ్రీమన్నారాయణ శ్రీలహరీకృష్ణ మహిమదిన పండుగను ఘనంగా నిర్వహించిన లహరికృష్ణ భక్తులు

ముత్తారంలో ఘనంగా నిర్వహించిన లహరికృష్ణ భక్తులు

ముత్తారం :- నేటిధాత్రి

ముత్తారం గ్రామంలో సోమవారం రోజున లహరి కృష్ణ భక్తులు అందరూ కలిసి మహిమదిన ఉత్సవా పండుగను ఘనంగా నిర్వహించి .శ్రీమన్నారాయణ శ్రీలాహరీకృష్ణ ఉపదేశమలను భక్తులు జ్ఞాపకం చేసుకొని ఉచ్చరిస్తు వారు ఉపదేశించిన ఉపదేశములలో ఒకే దేవుడు ఒకే దేశము సిద్ధాంతంమును మానవులందరూ ఒక్కటే.మనమందరం ఆయన సృష్టి జాతి, మత, కుల,బెదములను మరచి ప్రజలందరు సోదరబావంగా జీవించాలని ప్రబోధించారు.
మానవుల యొక్క జన్మ విమోచన నిమిత్తం బ్రహ్మ ఆదిలోనే యజ్ఞాన్ని నిర్వహించి మానవుల యొక్క జన్మ కర్మ పాపముల నుండి విముక్తి గావించినాడనీ.ఇట్టి బ్రహ్మ జ్ఞానమును అనేక వేదములలో రహస్యముగా వ్రాయబడియున్న, జ్ఞానాన్ని కలియుగమునందు మానవులు గ్రహించుకుండయున్నారనీ.ఇట్టిమర్మమైన బ్రహ్మజ్ఞానం లహరికృష్ణ సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి వివరించియున్నారు. ఈ కలియుగం నందు ఎవరైతే ఇట్టి బ్రహ్మజ్ఞానాన్ని ధ్యానిస్తు భగవంతునికి స్తుతియాగం చేస్తారో,వారు ఈ యుగం నందు జన్మ విమోచనం (కైవల్యం) పొందగలరని
శ్రీ లహరికృష్ణ మానవులందరికీ ప్రబోదించియున్నారనీ లహరికృష్ణ భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో గోదావరిఖని సెంటర్ కు సంబంధించిన భక్తులు ముత్తారం కేసనపల్లి గుర్రంపల్లి యయిటింగ్ లైన్ కాలనీ గోదావరిఖని మంచిర్యాల సీ.సి. శ్రీరాంపూర్ నార్లాపూర్ కరీంనగర్ పలు గ్రామాలకు సంబంధించిన భక్తులు పాల్గొన్నారు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : టిడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ప్రతి జర్నలిస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి

పెద్దపల్లి :- నేటి ధాత్రి

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు,జిల్లా ఇంచార్జి వల్లాల జగన్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు.జర్నలిస్టులందరికి వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.జర్నలిస్టులకు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి,ఉద్యోగుల మాదిరిగా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిందని,వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని అన్నారు.ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని అన్నారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఉచిత బస్ సదుపాయం కల్పించాలని అన్నారు.రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణి సుదర్శన్, నాయకులు ఇరుకుల్ల వీరేశం,సాబీర్ పాషా, సబ్బు సతీష్, చొప్పరి సుమన్,పూసాల రవి,జంగపల్లి సాగర్, సల్ఫాల ప్రశాంత్,శ్రీనివాస్,శోభన్,ప్రభాకర్ స్వామిలతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల?

`అక్రమార్కుడికే అందలమా.

 

`మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’?

`నకిలీ పత్రాలతో ప్రమోషన్లు!

`రిటైర్‌ అయినా కొత్త కొలువులు!

`’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు!

`పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి

`’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా?

`’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం!
`ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం!

`’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే!

`నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌.

`క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం.

`తన కింద పని చేసే మహిళలతో ‘‘కేళీ కలాపం’’!

`అప్పట్లో దేవాదాయ శాఖలో సంచలనం.

`వసతీ గృహం నిర్మాణంలో చేతి వాటం.

`లక్షల రూపాయలు తిన్నట్లు తేలిన పర్వం.

`అధికారులు ‘‘అంజయ్య’’ గుప్పిట్లో!

`రిటైర్‌ అయినా మరో రెండేళ్లు కుర్చీలో!!

`’’అంజయ్య’’ మీద కనికరం… రెండేళ్లకు కొలువు వరం!

`అన్నిట్లో ఆరితేరినోడు ‘‘అంజయ్య’’!

`’’అంజయ్య’’ మీద అంత ప్రేమెందుకయ్యా ‘‘రామకృష్ణయ్య’’!

`అమ్మ వారి గుడిలో అపవిత్రుడికి కొలువేందయ్య!

`రసరాజు ‘‘అంజయ్య’’కు రెండేళ్లు ఔట్‌ సోర్సింగ్‌ ఎందుకయ్యా!

`గుడి ఎనక నా సామి గుడిసేటి ఏశాలు తెలిసినా ఇదేం పనయ్యా?

`’’అంజయ్య’’ మీద పిర్యాదు చేసిన ‘‘రామకృష్ణ’’ కొలువిచ్చిండు.
`అవినీతి అధికారికి మరో అవకాశం కల్పించిండు.

పైదరాబాద్‌,నేటిధాత్రి:
అష్ట దరిద్రుడికి నిత్య కళ్యాణమట.. ఇది చదివితే నిజమేనేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి అత్యంత వివాదాస్పదుడు అని తెలిసిన తర్వాత అతన్ని అందలం ఎక్కించడం దుర్మార్గం. వ్యవస్దకు పట్టన గ్రహణం. అంజయ్య అనే దేవాదాయశాఖలో పనిచేసిన ఉద్యోగి చేసిన అక్రమాలు, అవినీతి అంతా ఇంతా కాదు. ఇక దుర్మార్గాల గురించి ఒక్క ముక్కలో చెబితే సరిపోతయేంత చిన్నది కాదు. అన్ని లీలలు తెలిసిన ఉద్యోగి. రాసలీలల్లో ఆరితేరిన వ్యక్తి. ఇంత గొప్ప నీచ చరిత్ర వున్న అంజయ్య ఇటీవలే ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యారు. అలా అయ్యారో లేదో ఇలా మళ్లీ కొలువు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అదికారిగా విధులు నిర్వహించిన అంజయ్య రిటైర్‌ అయ్యారు. ఏవో కొ ంపలు మునిగిపోయినట్లుగా, దేవాదాయ శాఖలో మరెరూ లేనట్లుగా రెండేళ్లపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ పిబ్రవరి 19న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రమేమిటంటే గతంలో అంజయ్య పెద్ద అవినీతి పరుడు. దేవాదాయ సొమ్మును కాజేస్తున్నాడు. దర్శశాల నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన సొమ్మును అంజయ్య మింగేశాడు. అని రిపోర్టు ఇచ్చిన ఉన్నతాదికారి రామకృష్ణ ఇప్పుడు అదే అంజయ్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా కొలువును ప్రసాదం పంచినట్లు ఇచ్చేశారు. దీన్నే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని చెప్పుకుంటారు. గతంలోనే నకికీ సిర్టిఫికెట్‌ ఆరోపణలు అంజయ్య మీద వున్నాయి. ఆలయం నిధులను మింగినట్లు విమర్శలున్నాయి. విజిలెన్స్‌ అదికారులు కూడా లెక్కలుతేల్చి, రిపోర్టు కూడా ఇచ్చారు. వాటిని ఎప్పుడో పక్కన పెట్టారు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చారు. రిటైర్‌ అయినా సరే మళ్లీ అంజయ్యను తెచ్చి సీట్లో కూర్చొబెడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోవుందన్న సోయి కూడా ఉన్నతాధికాలకు లేకుండాపోయింది. ఎవరు పట్టించుకుంటారు లే అనుకున్నారో లేక, మాకు ఎదురేముందిలే అని అనుకున్నారో గాని పోస్టింగ్‌ ఆర్టర్‌ ఇచ్చేశారు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంతో ఆదర్శంగా వుండాలి. వారి జీవితం ప్రజలకు మేలు చేసేలా వుండాలి. ఎల్లప్పుడూ సేవచేసేలా వుండాలి. ప్రజలకు అందుబాటులో వుండాలి. సేవ చేయడంలో అందరికన్నా ముందుండాలి. అదే ప్రభుత్వ శాఖలో మరింత గొప్పగా జీవితాలను గడపాల్సిన వారు దేవాదాయశాఖలో వుండాలి. ఆ శాఖలో పనిచేసే వారికి సమర్ధత ఒక్కటే కొలమానం కాదు. వారి వ్యవహారశైలి కూడా ఎంతో కీలకం. వారి ఆలోచన దగ్గర నుంచి వారు నడుచుకునే విధానం కూడా సరిగ్గా వుండదకూడదు. కలలో కూడా తప్పటడుగు వేయకుండా వుండాలి. ప్రజా దనం దుర్వినియోగం చేయకుండా వుండాలి. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే స్థలాలైన గుళ్లలో పనిచేసే అధికారులు ఎంతో పవిత్రంగా వుండాలి. వారి మనసు అంతకన్నా పవిత్రంగా వుండాలి. ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా భయపడాలి. దేవుడంటే హిందువులకు ఎంతో నమ్మకం. దేవుడంటే ప్రతి వారికి భక్తి వుంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం వుంటుంది. కాని కోట్లాది మంది ఎంతో భయభక్తులతో దేవుళ్లను సందర్శించి వారి తప్పులను మన్నించమని వేడుకుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన స్ధలాలలో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు ఎలావుండాలి. ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఆ దేవునిపై అచెంచలమైన భక్తిభావం వుండాలి. అంతకన్నా కొన్ని వందల రెట్ల భయం వుండాలి. కాని గుళ్లలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల జీవితాలు ఎంత నీచంగా వుంటాయంటే చెప్పడానికి కూడా అలవి కాకుండా వుంటాయి. అంత దుర్మార్గంగా వుంటాయి. మరికి వారికి దేవుడంటే భయం లేకుండా, నిర్భీతిగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇంకాకొంత మంది ఓ అడుగు ముందుకేసి చేయకూడని పనులు చేస్తుంటారు. అలా పవిత్రమైన స్ధలాలో కొలువు చేస్తూ నీచమైన పనులు చేస్తూ తనకుతానుగా దొరికిపోయిన ఉద్యోగి అంజయ్య. కొమురవెళ్లి దేవస్దానంలో చిన్న ఉద్యోగిగా కొలువులో చేరిన అంజయ్య కష్టపడి అంచెలంచెలుగా ఎదగలేదు. భక్తులకు సేవ చేసి పేరు పొందలేదు. ఉత్తమ ఉద్యోగిగా ఎక్కడా పేరు లేదు. ఎవరు అంజయ్య గురించి చెప్పినా నీచం,నికృష్టం అనే చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఉన్నతాధికారులు ఎందుకు సహకరించారన్నది అంతుచిక్కని ప్రశ్న. అంటే కింది స్దాయి నుంచి పై స్ధాయిదాకా ఎంతో పవిత్రమైన దేవాదాయశాఖలో కీచకులు, కామకులు, లంచావతారులు తిష్టవేశారని చెప్పడంలో సందేహం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటే ఇదే మరి. ఒక ఉద్యోగి ఆలయ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసినా పై అధికారులు ఎందుకు ఉపేక్షిస్తూ పోయారన్నది కూడా తేలాల్సివుంది. తాను చేరుకోవాల్సిన రైలు జీవిత కాలం లేటు అంటూ గతంలో చెప్పుకునేవారు. దేవాదాయ శాఖలో చూస్తే జీవితం అయిపోయినా కూడా గమ్యం చేరని ప్రయాణంలా సాగుతుంటాయి. అందుకే అవినీతికి పాల్పడిన, అనేక అక్రమాలు చేసిన అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ఏకంగా రిటైర్‌ అయిపోతున్నారు. కాని కేసులు అలాగే పెండిరగ్‌లో వుంటున్నాయి. అసలు విషయానికి వస్తే కొమురవెళ్లిలో జూనియర్‌ అసిస్టెంటుగా మొదలైంది అంజయ్య జీవితం. నికిలీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్‌ పొందాడన్నది రుజువైంది. క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. అన్నీ తెలిసినా అంజయ్యకు ప్రమోషన్‌ ఇచ్చారు. క్రిమినల్‌ కేసు నమోదైన తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించలేదు. చిన్న ట్రాన్ఫ్‌ఫర్‌తో సరిపెట్టారు. అదే శిక్ష అని దేవాదాయశాఖ అదికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా పై అదికారులు ఆశీస్సులు వున్న అంజయ్య లాంటి వారి వ్యవహార శైలి విచ్చలవిడి తనాన్ని మరింత పెంచుకుంటుంది. అందుకే అంజయ్యకు భుక్తులంటే చులకన. దేవుడంటే భయం వుండదు. భక్తి వుండదు. పవిత్రమైనస్ధలంలో కొలువు చేస్తున్నామన్న సోయి కూడా వుండదు. ఇక కొమురవెళ్లి దేవస్దానంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల ఆయన చేష్టలు మరీ దుర్మార్గంగా వుండేవి. మహిళా ఉద్యోగులు తనకు లొంగిత ఒక లెక్క..లొంగకపోతే మరో లెక్క. అంతే కాదు తనుకు లొంగిన మహిళలతో పోటోలు దిగి, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా గతంలో బైట పడ్డాయి. ఇలా పవిత్రమైన స్ధలంలో మహిళలను వేదింపులకు గురిచేయడమే కాదు, వారి లొంగదీసుకొని కేళీ కలాపాలు నిర్వహించాడు. అయినా అదికారులు పట్టించుకోలేదు. అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే దేవాదాయ శాఖ ఎంత భ్రష్టుపట్టిపోయిందో అర్దం చేసుకోవచ్చు. తన కింద పనిచేయాలంటే మహిళా ఉద్యోగులు గజగజ ఒనికిపోయేవారు అని చెబుతుంటారు. ఇక ఆలయం శుభ్రం చేసే స్వీపర్లను బానిసలకన్నా హీనంగా చూసేవాడు అనే ఆరోపణలు అనేకం వున్నాయి. వారు అంజయ్య చెప్పినట్లు చేయాలి. లేకుంటే ఉద్యోగాలు పోతాయని భయపెట్టేవాడు. వారు సర్వస్వం అర్పించుకునేలా చేసేవాడని అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా కూడా అనేక ఫోటోలు కూడా బైటకు వచ్చాయి. కాని దేవాదాయాశాఖ పై స్ధాయి అదికారులు అంజయ్య మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే గుడి సొమ్మును అప్పనంగా మింగుతూ పై స్ధాయి అదికారులకు వాటాలు పంపుతుండేవారని సాటి ఉద్యోగులే చెబుతుంటారు. అంతే కాదు పై అదికారులు ఆశలు ఎలాంటివైనా తీర్చేవాడని అందుకే అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయేవారని చెబుతుంటారు. ఇంత కాలం తప్పుడు పనులు చేసిన అంజయ్యకే ఉన్నతాదికారులు అండదండలు అందించారు. రిపోర్టులను బుట్టదాఖలు చేశారు. నిధులు మింగినా చర్యలు తీసుకోలేదు. పైగా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. అంటే అంజయ్య చేసిన తప్పులలో ఉన్నతాధికారులకు వాటాలున్నట్లు వాళ్లే అంగీకరించనట్లు కాదా? తమకేం తెలియదన్నట్లు ప్రకటనలు చేస్తారా చూడాలి.
మంత్రిగారు…ఈ దుర్మార్గం చూడండి.
ప్రభుత్వానికి తెలియకుండా చీమ చిటుక్కుమనకూడదు. దేవాదాయా శాఖ కొండా సురేఖకుతెలియకుండా ఒక్క ఫైలు కూడా కదలకూడదు. కాని ఉద్యోగాల నియామకాలు మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయా? సాక్ష్యానికి అంజయ్య నియామకం ఒక్కటి చాలు. ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదరుచూస్తున్నారు. వాళ్లందరినీ కాదని ఉన్నతాదికారులు అంజయ్యకే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఎందుకిచ్చినట్లు? ఇక పోతే సంబంధిత మంత్రికి తెలియాల్సిన అవసరం లేదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం మొత్తం అదికారుల చేతుల్లోనే వుందా? అలా అని ప్రభుత్వం వారికి స్వేచ్ఛనిచ్చిందా? అదే నిజమైతే కొత్తగా అర్హులైన నిరుద్యోగిని ఎంపిక చేయొచ్చు. లేకుంటే రిటైర్‌ అయిన నిజాయితీ పరుడైన ఉద్యోగికి ఇవ్వొచ్చు. పవిత్రమైన గుడిలో కొలువు చేస్తూ అపవిత్రమైన పనులు చేసే అంజయ్య లాంటి ఉద్యోగికి మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌ కొలువంటే అపచారం కాదా? తెలంగాణలో ఏడుపాయల జాతర అంటే ఎంతో గుర్తింపు వుంది. వనదుర్గాభవాని అంటే మూడు నాలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఏటా వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా, భక్తులకు కొంగు బంగారమైన ఎంతో శక్తి వంతమైన మహిమాన్విత క్షేత్రంలో అంజయ్య లాంటి లోలుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని భక్తులంతా తప్పు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తి నియామకం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యే అవకాశం వుంది. మంత్రికొండా సురేఖ తక్షణం స్పందించి, అంజయ్య మీద వున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. రిటైర్‌ అయినంత మాత్రాన ఆయన చేసి అవినీతి మాసిపోదంటున్నారు. పైగా మళ్లీ అంజయ్య అంత సుద్దపూస లేడన్నట్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చిన అదికారులపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. అంజయ్య అవినీతిలో ఉన్నతాదికారుల వాటా కూడా తేల్చాలంటున్నారు. లేకుంటే దేవాదాయశాఖలో ఇలాంటి ప్రబుద్దలు మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కోచింగ్‌.. చీటింగ్‌!

 

`కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన.

`గోల్‌ మాల్‌ గోవిందం!

 

`‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు!

`అకాడమీ లకు హద్దుండదు.

 

సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం.

`పైకి మాత్రం కి విద్యా వికాసం.

`జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం.

`లక్షల మందికి కోచింగులు.

`వేలాది రూపాయల ఫీజులు.

`చెతికందేవి ఎన్ని కొలువులు?

`అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు.

`విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి.

`పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆగష్టు నెలలో జరగాల్సిన పరీక్షలు. కాని జరగడం లేదు. కారణం అభ్యర్ధుల నుంచి వచ్చిన ఒత్తిడి అన్నది అందరూ చెప్పుకునే మాట. కాని దాని వెనుక కోచింగ్‌ సెంటర్ల మాయా జాలం వుందన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కోచింగ్‌ సెంటర్ల మాఫియా మూలంగానే జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి ఇంత కాలం వాయిదా కోసం ఉద్యమాలు చేయించారు. దాని వెనుక కూడా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకల ప్రోద్భలం వుందన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ఈ పరీక్షల వాయిదా వల్ల కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ కల వచ్చిందనే చెప్పాలి. కనీసం ఆరు నెలల పాటు ఇక కోచింగ్‌ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్యాచ్‌లు నిర్వహిస్తారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోచింగ్‌ సెంటర్లు క్లాసులు చెప్పే సమయంలో వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌ కోచింగ్‌ల పేరుతో ప్యాకేజీలు కూడా అమ్ముకుంటున్నారు. దాంతో అటు యూ ట్యూబ్‌ నుంచి ఆదాయం. దానికి తోడు ఉచిత ప్రచారం. ఆన్‌లైన్‌ ప్యాకేజీ కింద ఒక్కొ అభ్యర్ధి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తాయి. సెంటర్ల నిర్వహణతో వచ్చే ఆదాయం అదనం. అదే అసలైన సంపాదనకు మార్గం. ఇక చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మూతబడిన కోచింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. ప్రభుత్వం కూడా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఇక ఐదేళ్లపాటు విరామం లేకుండా సెంటర్లు నిర్వహిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు తమ చదువు పూర్తి చేసుకొని వస్తుంటారు. వారికి రకరకాల విద్యా కోర్సుల కోసం, ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇస్తుంటారు. గ్రూప్‌ పరీక్షల వాయిదా వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చన్నది ఒక అంచానా. డిఎస్సీ వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం సమకూరేది. గ్రూప్‌ పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసినా, కోచింగ్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కారణం ఉద్యోగాలు తక్కువగా వుంటాయి. డిఎస్సీ పదకొండు వేల ఉద్యోగాలున్నాయి. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు వుంటాయి. కోచింగ్‌ సెంటర్లలో కొంత తర్ఫీదు తీసుకుంటే పరీక్ష సులువౌతుందన్న భావన వారిలో కలుగుతుంది. అందుకే కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కృత్రిమ ఉద్యమం లేపారు. పరీక్షల నిర్వహణతో అంతా చల్లబడిరది. గ్రూప్‌ పరీక్షలు వాయిదా పడడంతో ఆగిపోయింది.
ట్యుటోరియల్స్‌, కోచింగ్‌ సెంటర్ల మూలంగా లక్షల్లో వుండే పై చదువులకు అవసరమైన కోర్సుల్లో సీట్లు సాధించేందుకు కొంత వరకు ఉపకరిస్తాయేమో కాని, వందల్లో, కొన్ని సార్లు వేలల్లో వుండే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనుకోవడం మాత్రం పూర్తిగా భ్రమే. సహజంగా ఏ రాష్ట్రాలలో అయినా గ్రూప్‌ పరీక్షల నిర్వహణతో ప్రభుత్వాలు ఎంపిక చేసే ఉద్యోగాలు కేవలం వందల్లోనే వుంటాయి. ఒక్క డిఎస్సీ లాంటి పరీక్షలే కొన్ని సార్లు వేలల్లో వుంటాయి. అంతే కాని వందల్లో వుండే గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షలు కేవలం కోచింగ్‌ సెంటర్లలలో చదువుకున్నవారికే ఉద్యోగాలు వస్తాయన్నది ముమ్మటికీ అబద్దం. ఏ కోచింగ్‌ సెంటరైనా సరే పరీక్షల్లో మెలుకవలు నేర్పుతారు. పరీక్షల్లో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెడతారు. కాకపోతే పరీక్షల విధానంలో తర్పీదు ఇవ్వడంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర కొంత వరకు ఉపయోగకరమే తప్ప, పూర్తిగా దోహరపడతాయని చెప్పడం మాత్రం శుద్ద అబద్దం. ఒక తెలివైన అభ్యర్ధి కోచింగ్‌ వెళ్తే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మెరుగౌతుంది. అంతే తప్ప ఆ తెలివైన అభ్యర్ధి కేవలం కోచింగ్‌కు వెళ్లడం వల్లనే ఉద్యోగం సంపాదించాడని చెప్పలేం. కారణం ఎంతో మంది కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేని వాళ్లు కూడా ఉద్యోగ నిర్వహణ పరీక్షల్లో కూడా ఫస్టు ర్యాంకు సాధించిన వారున్నారు. కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లందరూ మొదటి ర్యాంకులుసాధించినట్లు పెద్దగా చరిత్రలుకూడా లేవు. అంతే కాదు గ్రూప్‌1 లో ప్రభుత్వాలు ప్రకటించే కొలువులు ఎన్ని వుంటాయో, తెలంగాణ మొత్తం మీద అన్ని కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటే ఆశ్చర్యపోవనవసరం లేదు.
ఇటీవల కోచింగ్‌ సెంటర్లలో చదువుకుంటే తప్ప కొలువులు రావన్న భ్రమలు యువతలో బాగా కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాల పరంపర అలా కొనసాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాల మంది అప్పటి అధికారుల కనుసన్నల్లో నడిచిన కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం వుండేది. అందులో కొంత వాస్తవం కూడా వుంది. అందుకే ఉద్యోగార్ధులు కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. వాళ్లు తయారు చేసిన మెటీరియల్‌ నుంచే ప్రశ్నలు వస్తాయన్న భ్రమలు కల్పించారు. అదే నిజమైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్లంతా కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లే అయి వుండాలి. కాని అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కాని అందమైన బ్రోచర్లు తయారు చేయడం, ఉద్యోగాలు పొందిన వారితో ఇంటర్వూలు చేయించడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గరే పూర్తి సమయం చదువుకున్న అభ్యర్ధులకు డబ్బులిచ్చి కూడా తమ కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్నట్లు కూడా ప్రచారం చేయించుకుంటూ వస్తున్నారు. దాంతో యువత ఆకర్షితులౌతున్నారు. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరీ విపరీతమైంది. దాంతో గ్రామీణ యువత కోచింగ్‌ సెంటర్లవైపు చూడడం అలవాటు చేసుకున్నారు. నిత్యం కోచింగ్‌తోపాటు, పరీక్ష నిర్వహణ వంటివి చేస్తుంటారు. అయినా ఉద్యోగాలు పొందని వారే ఎక్కువగా వుంటారు. తెలంగాణలో కొన్ని వందల కోచింగ్‌ సెంటర్లు వున్నాయి. అన్నింటి నుంచి ఉద్యోగాలు పొందుతున్న వారు ఎంత మంది? కోచింగ్‌లు తీసుకున్నవారు ఎంత మంది? అన్నది లెక్కేస్తే అసలు బండారం బైటపడుతుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్ద చదువుకున్నవారు కూడా రెండు మూడు ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా చాల మంది వున్నారు.
కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఎందుకంటే కోచింగ్‌ సెంటర్లు విద్యా వ్యవస్దలకు అనుసంధానమై వుండవు. ఎందుకంటే అవి ట్యూషన్‌ సెంటర్లుగానే పరిగణిస్తారు. కాని కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం వేల కోట్లలో వుంటుంది. ఒక కోచింగ్‌ సెంటరు ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎవరి నుంచి పర్మిషన్లు పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిబంధనలు లేవు. ఆంక్షలు అసలే లేవు. ఎందుకంటే అది విద్యా సంస్ధలు కాదు. ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే సవాలక్ష నిబంధనలుంటాయి. ఒక కాలేజ్‌ ఏర్పాటుకు కూడా అనేక రకాల అనుమతులు పొందాల్సివుంటుంది. కోచింగ్‌ సెంటర్లు కూడా స్కూళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. పైగా స్కూళ్లు, కాలేజీలు వేసవి కాలంలో మూసేస్తారు. కాని కోచింగ్‌ సెంటర్లు అప్పుడే ఎక్కువ నిర్వహిస్తారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, నిబంధనలుంటాయి. ఏ క్లాసుకు ఎంత చార్జి వసూలు చేయాలన్నదానిపై స్పష్టమైన గైడ్‌ లైన్స్‌ వుంటాయి. కాని కోచింగ్‌ సెంటర్లకు ఎలాంటి లెక్క లేదు. ఉద్యోగార్ధులు కోచింగ్‌ కోసం వెళ్లడానికి ఆ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయించిన దానికి కట్టుబడే చేరుతుంటారు. కారణం భవిష్యత్తు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం. కొందరు ఒక్కసారి కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్‌ తీసుకుంటూనే వుంటారు. అలా ఏళ్ల తరబడి తీసుకునేవారు కూడా వున్నారు. పలు కోచింగ్‌ సెంటర్లు మారుతుంటారు. అన్ని కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు వదిలించుకుంటుంటారు. అయినా ఉద్యోగాలు రాని వాళ్లు చాలా మంది వున్నారు. అలాంటప్పుడు కోచింగ్‌ సెంటర్ల గొప్పదనం ఏమీ లేదు. కాని వాళ్ల వ్యాపారానికి ఢోకా వుండదు. కోచింగ్‌ సెంటర్లు సంపాదనకు ఎలాంటి ఐటి కూడా అవసరంలేదు. కాని వచ్చే ఆదాయాన్ని ఎవరూ చూపించరు. అందుకు అవసరమైన బిల్లు బుక్కులు కూడా సరిగ్గా వుండవు.

నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు

శివ నామస్మరణంతో మారుమోగే రోజు రేపు మహా శివరాత్రి.

నేటి నుండి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలు.

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం.

నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు

జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అధికారులు పోలీసుల ప్రత్యేక బందోబస్తు.

శివ భక్తుల కొరకు నేటిధాత్రి  ప్రత్యేక  కథనం.

మహాదేవపూర్-నేటిధాత్రి:

చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో తెలపడం జరిగింది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం,  శివరాత్రి ఫిబ్రవరి  నెలలో రావడం జరిగుతుంది .సనాతన మాసం ప్రకారం  మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో ఒకటి మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించడం తో ఈ బుధవారం రాత్రిని మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన ఆలయం కాలేశ్వర ముక్తేశ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన మొహమ్మద్ తన్వీర్..

చలివేంద్రాన్ని ప్రారంభించిన టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ చింతల్ ఘట్ ఎక్స్ రోడ్లో టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మాట్లాడుతూ ఎండాకాలం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోష కరం అన్నారు టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ స్పోక్ పర్సన్ నసీర్ రుద్దీన్ మాట్లాడుతూ తండ్రి బాటలో తనయుడు అంకితభావం సేవ గుణంతో ముందుకెళ్తున్నటువంటి తన్వీర్ గారికి మైనార్టీ వర్గంతో పాటు అన్ని వర్గాల మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

పైడిపల్లి నర్సింగ్ ఖబడ్దార్ బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

మందమర్రి నేటి ధాత్రి: 

మందమర్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సకినాలశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు పోల్ శ్రీనివాస్, మందమర్రి పట్టణ యువజన అధ్యక్షుడు మూడారపు శేఖర్, లు మాట్లాడుతూ గత వారం రోజుల క్రిందట బీసీలపై మాల సంఘం పైడిమల్ల నర్సింగ్ బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని వారు కోరారు రాబోయే రోజుల్లో క్షమాపణ చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటికి పూర్తి బాధ్యత పైడిమల్ల నర్సింగ్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు కుల ఘననకు అనుకూలంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని కాదని బీసీల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు అసలు మాల l సంఘంలో ఎవరికి ఏం పోస్టు ఉందో కూడా తెలియకుండా ఆ సంఘ సభ్యుల కు అర్థం కాకుండా ఉంది అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు బే షరతుగా క్షమాపణ చెప్పి తీరాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో రామస్వామి శేఖర్. బేరా వేణుగోపాలరావు. దేవరపల్లి ప్రభాకర్. పోల్ సంపత్. మునిసెట్టి సత్యనారాయణ. మాడకుండా శంకర్. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version