శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ మాజి చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,నాయకులు ప్రభు పటేల్ ,ప్రవీణ్ పాటిల్ ,విజయ్ రాథోడ్ శివశంకర్ ,తదితరులు పాల్గొన్నారు .

టిడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు ప్రారంభం…!

టిడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు ప్రారంభం

పెద్దపల్లి :- నేటి ధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదును పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ సభ్యత్వం స్వీకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వల్లాల జగన్ హాజరై సభ్యత్వాలను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు మార్చి 25 తేదీలోపు సభ్యత్వాలను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి,జిల్లా కార్యదర్శి సుంక మహేష్, రవి, సాగర్,సాబీర్ పాషా, శోభన్,ప్రభాకర్ స్వామి లతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ :నేటిధాత్రి

వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం..!

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.

బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా…!

బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా…
– శ్రీపాద ట్రస్టు ద్వారా ఒక్కరికైనా సాయం చేసిండ్లా
– చిన్నసారు పుట్టిన రోజున బీద బిడ్డ గుర్తుకు రాలేదా
– 40 ఏండ్ల అధికారానికి కాటారమే కేంద్ర బిందువు
– అబద్దాలతో సాయం చేసే స్థితిలో లేకుండా చేసిండ్లు
– కులాలను వాడుకోవడం తప్పా పైసా సాయం చేయరు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

తన ఉన్నత విద్యకు ఆర్థిక స్థోమత అడ్డుగా ఉందని, మెడికల్‌ సీటు వచ్చినా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఓ బీదబిడ్డకు సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఎందుకు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ప్రశ్నించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న అనే బీద బిడ్డకు మెడికల్‌ సీటు వచ్చిందని, అయితే ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని, తన తండ్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నాడని సాయం చేయాలని నెల రోజుల క్రితం సోషల్‌ మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలు చక్కర్లు కొట్టాయని ఆయన తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ పుట్టిన రోజు సందర్బంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారని, ఈ వేడుకలు నిర్వహించిన వారిలో ఎక్కువగా బీసీ, ఎస్సీ బిడ్డలే ఉన్నారన్నారు. అయితే వేడుకలు నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బీద బిడ్డ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ పుట్టినరోజు సందర్బంగా ఆ బీద బిడ్డకు సాయం చేస్తారని అనుకున్నానని, కానీ అలాంటి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.స్వాతంత్రం వచ్చిన 78ఏండ్ల చరిత్రలో ఏనాడైనా శ్రీపాద ట్రస్టుద్వారా ఒక్క పేదవాడికి సాయం చేశారా అని ప్రశ్నించారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింహబాగంలో కాటారం మండలం కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఇస్తుందని, అలాంటి మెజార్టీ ఇచ్చే కాటారం మండలంలోని ఏ ఒక్కరికైనా సాయం చేశారో చెప్పాలన్నారు. కేవలం మూడు ఓట్లు ఉన్న ఆ కుటుంబానికి 40ఏండ్లు అధికారం ఇవ్వడంలో కాటారమే కీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటి కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ బీద బిడ్డ తనకు సాయం చేయాలని కోరితే సాయం చేయకపోవడం విడ్డూరమన్నారు. తాను పదేళ్ల కాలంలో మెడికల్‌ సీట్లు వచ్చిన కనీసం ఐదుగురికి ఫీజు కట్టానని, మరికొంత మంది బీద బిడ్డలకు అమెరికా వెళ్లేందుకు సాయం చేశానన్నారు.కానీ తనపై అబద్దాలు, అబండాలు వేసి సమాజానికి దూరం చేశారని, కనీసం సాయం చేయలేని స్థితికి తీసుకువచ్చారని అన్నారు. బీదబిడ్డ జ్యోత్స్న మెడికల్‌ సీటు కోసం తాను సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ కుటుంబం తనను క్షమించాలన్నారు. ఓట్లు వస్తెనే నోట్ల కట్టలతో వచ్చే నాయకులు కలెక్షన్‌ కోసం కార్యాలయాలు సైతం ఏర్పాటుచేశారని ఆయన ఆరోపించారు. అనేక ఏండ్లుగా అమెరికాలోనే ఉంటున్న దుద్దిళ్ల కుటుంబం తమ ఏ సంస్థ ద్వార నైనా బీద బిడ్డకు సాయం చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయలేదని, ఈ మట్టిలో పుట్టిన వాళ్లు ప్రజాప్రతినిధులైతే ఏ విధమైన పాలన ఉంటుందో, మట్టితో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులకు అధికారం ఇస్తే ఎలా ఉంటారో ప్రజలు గమనించాలన్నారు. మన ఆకలి, కష్టాలుతెలియని వాళ్లు నోట్లతోనే అధికారం వస్తుందనే ఆలోచనలో ఉన్నారని, కులాలను వాడుకుంటారే తప్ప పైసా సాయం చేయరన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్శంగా కోరారు.

బాధిత కుటుంబంమును పరామర్శించిన..!

బాధిత కుటుంబంమును పరామర్శించిన

మాజీఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం రామకృష్ణపూర్ గ్రామంలో బుర్ర పోచ గౌడ్ ఇటీవల మరణించగ వారి కుటుంబంమును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని పరామర్శించినారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..

ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.

మంథని :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీ..

ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసిన
మండల వ్యవసాయ అధికారి అనూష

ముత్తారం :- నేటి ధాత్రి

మండలం లోని ముత్తారం మచ్చుపేట అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో గల ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి అనూష తనిఖీలు నిర్వహించారు ఈ సందర్బంగా అధిక ధరలకు ఎరువులు విక్రాయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది బిల్లు బుక్కులను ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు రైతులకు ఎరువులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని సూచించారు

దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ

రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్‌ నాయకత్వం

నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు

ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం

గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ

రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్‌

నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ

సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు

ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను సుదీర్ఘకాలం కొనసాగించేం దుకు చక్కగా అడుగులు ముందుకేస్తున్నదన్న సత్యం బోధపడుతోంది. అంతేకాదు కేంద్రంలో సీనియర్‌ నాయకత్వం బలంగా వున్నప్పుడే ఈవిధంగా సెకండ్‌ లైన్‌ నాయకులకు కీలకస్థానాలు అప్పగించి, ఏవైనా సమస్యలు వస్తే తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఆయా నాయకత్వాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీలో నాయకత్వ కొరత లేకుండా చేయడంలో భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మక ఆచరణశైలి అద్భుతమనే చెప్పాలి. ఇది దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీల్లో కని పించడం లేదు. 

బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా నాయకులను ఎంపిక చేసిన తర్వాత వారికి పూర్తి అండగా నిలుస్తోంది. ఎవరైనా నాయకుల్లో అసంతృప్తి వున్నా, ముఖ్యమంత్రికి వ్య తిరేకత వ్యక్తమవుతున్న సందర్భాల్లో ఎప్పటికప్పుడు కేంద్రం కలుగజేసుకొని సర్దుబాటు చేయడ మే కాదు, పార్టీ దిగువస్థాయి నాయకత్వంతో పాటు, కార్యకర్తలు కూడా ఆయా ముఖ్యమంత్రులనాయకత్వంలో పనిచేసేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ఆవిధంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో బల మైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం వల్ల, దేశం మరియు రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేయగలదు. 

అదే కాంగ్రెస్‌ విషయానికి వస్తే అసలు రెండోతరం నాయకులను ఎదగనిచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ అన్ని ప్రతికూలతలను తట్టుకొని ఎదగాలని యత్నించినా యధాశక్తి వాళ్లను బలహీనపరచేవరకు కేంద్ర నాయకత్వం నిద్రపోదు. రాహుల్‌ గాంధీ, ఆయన సలహాదార్లు కూడా గత పదేళ్లుగా ఇదే వ్యవహారశైలి అనుసరిస్తున్నారు. సచిన్‌ పైలెట్‌, మనీష్‌ తివారీ, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేంద్రసింగ్‌ హూడా వంటి నాయకుల వ్యవహారశైలివల్ల పార్టీ ఎప్పటికప్పుడు బల హీనపడటం తప్ప మరో ప్రయోజనం ఏమీ వుండటంలేదు. 

గత లోక్‌సభ మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే నరేంద్రమోదీ, అమిత్‌ షాల వ్యూహం ఎంతచక్కగా పనిచేస్తున్నదీ అర్థమవుతుంది. అటల్‌`అద్వానీ కాలంలో మాదిరిగా రెండోతరం నాయకులు పార్టీలో ఎదగడంలేదని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి యుగంలో అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, కళ్యాణ్‌ సింగ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లకు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ల భించింది. అదేవిధంగా ప్రస్తుత నరేంద్రమోదీ హయాంలో అమిత్‌ షా, జె.పి.నడ్డా, యోగి ఆది త్యనాథ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌ కట్టర్‌, రమణ్‌సింగ్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌, మో హన్‌ యాదవ్‌, భజన్‌లాల్‌ శర్మ, విష్ణుదేవ్‌ సాయి, నాయబ్‌ సింగ్‌ సైనీ వంటి నాయకులకు అ త్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన భూమికను రూపొందిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌ పనితీరు ఆధారంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో స్థానం కల్పించడమే కాకుండా సంస్థాగతంగా కూడా సముచిత స్థాయిలో నిలిపారు. ఇప్పుడు మోహన్‌ యాదవ్‌ వంటి నాయకులు క్షేత్రస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకులుగా రూపొందడమే కాదు, పరిపాలన పై గట్టి పట్టు సాధిస్తున్నారు. అంతేకాదు వీరు ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సంస్థాగత నాయకుడి స్థాయిని దాటి ఎదిగిపోయారు. ప్రస్తు తం ముఖ్యమంత్రిగా పాలన, శాంతిభద్రతలపై గట్టి నియంత్రణ సాధించారు. మతపరమైన అంశాలపై ఒక మహంత్‌గా తన స్పష్టమైన ముద్రను సమాజం పై వేయగలిగారు. అయోధ్య, కాశి, మధుర, వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కుంభ్‌మేళాను సమర్థవం తంగా నిర్వహిస్తున్నారు. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే గత రెండుదశాబ్దాలో దాని నాయకత్వ వైఖరిలో మార్పు లేశమాత్రం కూడా కనిపించడంలేదు. పార్టీ యావత్తు గాంధీ కుటుంబంపైనే ఆధారపడివుంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. కానీ మాస్‌ లీడర్‌గా లేదా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నాయకుడిగా గుర్తింపు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత రాజ్యసభ ద్వారా ఆయన్ను పార్టీ ప్రధానిని చేసింది. అసలాయనకు కాంగ్రెస్‌ సంస్థపైనే పెద్దగా ఆసక్తి లేదు.

గాంధీ కుటుంబం చేసిందేమంటే సొంతపార్టీలోనే ప్రత్యర్థి రాజకీయాలను ఎగదోయడం. అర్జున్‌సింగ్‌, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌, మాథవరావు సింథియా, జ్యోతిరాదిత్య, అశోక్‌ గెహ్లాట్‌, రాజేష్‌ పైలెట్‌, భూపేంద్రసింగ్‌ హూడా, వీరేంద్రసింగ్‌, కుమారి షెల్జా మొదలైన నాయకుల పక్క లో అసంతృప్తులను ఎగదోసి వారిని సుస్థిరపాలన చేయనీయలేదు. ఫలితంగా ఇటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో ఏనాడు బలోపేతం కాలేకపోయారు. పార్టీలో వృద్ధ నిజాయతీ నాయకుడు ఎ. కె. అంటోనీ పార్టీ వరుస ఓటమికి కారణాలపై ఇచ్చిన నివేదిక నాయకత్వాన్ని నైరాశ్యంలో ముంచింది.

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌లు ఎంత విరోధులుగా వుంటే పార్టీ అధిష్టానానికి అంత లాభం. మల్లికార్జున ఖర్గే పేరుకే పార్టీ అధ్యక్షులు. నిర్ణయాలన్నీరాహుల్‌ గాంధీ, వేణుగోపాల్‌, జయరామ్‌ రమేష్‌లవే. ఇప్పుడు ప్రియాంకా గాంధీ వాద్రా తన టీమ్‌కు ప్రాధాన్యతనిస్తారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శిబు హేమంత్‌ సొరేన్‌తో సఖ్యత ద్వారా ఈ టీమ్‌ కొంత ప్రయోజనం పొందవచ్చు. రాహుల్‌ గాంధీ సమకాలీన నాయకులైన మిళింద్‌ దియోరా, జ్యోతిరాదిత్య, ఆర్‌.పి.ఎన్‌. సింగ్‌ వంటివారు తమను పార్టీలో పక్కన పెట్టడంతో మన స్తాపం చెంది భాజపాలో చేరిపోయారు. శశి థరూర్‌, మనీష్‌ తివారి, సచిన్‌ పైలెట్‌లను ఒక పరిమితికి మించి అధిష్టానం ఎదగనివ్వడంలేదు. 

ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధినేతదే పూర్తి ఆధిపత్యం. ప శ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీపైనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పూర్తిగా ఆధారపడిరది. బిహార్‌లో రా ష్ట్రీయ జనతాదళ్‌పై ఏకఛత్రాధిపత్యం లాలూప్రసాద్‌ యాదవ్‌, తేజస్వినీ యాదవ్‌లదే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌పై, లోక్‌దళ్‌ జయంత్‌ చౌదరి, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ మయావతి, తమిళనాడలో డీఎంకే స్టాలిన్‌పై, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్ర బాబు నాయుడిపై, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కె.సి.ఆర్‌. కుటుంబంపై, కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యులర్‌ హెచ్‌.డి. దేవగౌడ`కుమారస్వామి కుటుంబంపై, హర్యానాలో లోక్‌దళ్‌ చౌతా లా కుటుంబంపై, పంజాబ్‌లో అకాలీదళ్‌ బాదల్‌ కుటుంబంపై ఆధారపడి వున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల నాయకుల ఛరిష్మాపై నెట్టుకొస్తున్నాయి తప్ప సంస్థాగత నిర్మాణం, రెం డో స్థాయి నాయకత్వ వృద్ది అనేవి ఇక్కడ సాధ్యంకాదు. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రంలో కాం గ్రెస్‌, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం ముసుగులో ‘రాచరికాన్ని’ అనుసరిస్తున్నాయని చెప్పాలి. 

ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. దేశవ్యాప్తంగా పూర్తిగా పట్టుకోల్పోయి అంపశయ్యపై కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో గట్టి ప్రతిపక్షం ఏర్పడే అవకాశాలు కనిపించడంలేదు. 

ప్రస్తుతం భారతీయ ఎన్డీఏ కూటమి దేశంలోని మొత్తం 28రాష్ట్రాలో పంధొమ్మిదింటిలో అధికా రంలో వుంది. ఇక బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. అదేవిధంగా మూడు కేంద్ర పాలితప్రాంతాల్లో రెండిరటిని ఎన్డీఏ కూటమే పాలి స్తోంది. ఒకప్పుడు బీజేపీ రaార్ఖండ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం రaార్ఖండ్‌ ముక్తిమో ర్చా రాష్ట్ర పగ్గాలను చేపట్టింది. ఇక జమ్ము`కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గతంలో భాజపా ఇతర పార్టీలతో కూటమి కట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే బీజేపీ ఇప్పటివరకు అధికా రంలోకి రాని రాష్ట్రాలు మూడున్నాయి. అవి వరుసగా తమిళనాడు, తెలంగాణ, కేరళ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ కమలం గుర్తుపై పోటీచేసే పార్టీలు కూడా వున్నాయి. ఈ పార్టీలన్నీ తమిళనాడుకు చెందినవే కావడం విశేషం. అవి వరుసగా ఇండియా జననాయగ కచ్చి, పుతియా నీధి కచ్చి, తమిరaగ మక్కల్‌ మున్నేట్ర కజగం, ఇంధియా మక్కల్‌ కల్వి మున్నేట్ర కజగం. సంస్థాగతంగా, వ్యూహాత్మకంగా ముందుకు కదలడంలో భాజపా దరిదాపుల్లో ఏ పార్టీ లేదన్నది అక్షరసత్యం.

500 నోటుకు కాలం చెల్లనుందా?

`2000 నోటు దారిలో నడవనుందా?

`కొద్ది రోజులలో కనుమరుగు కానుందా?

`అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయా?

`మళ్లీ నోట్ల ఉపసంహరణ సంకేతాలు ?

`200 నోటుకు కూడా కష్టకాలం రానుందా?

`100 తోనే ఆర్థిక లావాదేవీలు జరుపోవాల్సి వస్తుందా?

`50 ఇంకా కొంత కాలం ఆయువు వుండేనా?

`300 నోటు రానుందంటున్నారు నిజమేనా? 

`నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ పోయినట్లే అన్నారు!

`బ్లాక్‌ మనీ గురించి మాట్లాడడం మానేశారు.

`పాకిస్తాన్‌ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు రద్దు చేశారు.

`ఇక కొత్త నోట్ల ప్రవేశంతో నకిలీ తయారీ అసాధ్యమన్నారు.

`నకిలీ నోట్ల చెలామణి వ్యవస్థకు పాతరే అన్నారు.

`అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసేశారు.

`డిజిటల్‌ లావాదేవీలు అమలు చేశారు.

`నోట్ల రద్దు కాగానే వెంటనే 2000 నోట్లు తెచ్చారు.

`విపరీతంగా విమర్శలు రావడంతో క్రమంగా దానిని కనుమరుగు చేశారు.

`తర్వాత 200 నోట్లు తెచ్చారు.

`దేశంలో పెద్ద ఎత్తున 500 నోట్లు నకిలీ చెలమణి జరుగుతుందంటున్నారు.

`ఇలా ఉపసంహరణలు చేసుకుంటూ పోతే జనం సహనాన్ని కూడా మర్చిపోతారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మార్కెట్‌లో త్వరంలో రూ.500 నోటు ఉప సంహరణ జరగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెద్దనోట్ల వల్ల నల్ల దనం ఆగడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు నల్లదనమే లేదని నోట్ల రద్దు మూలంగా తేలిపోయింది. మళ్లీ నలధనం వార్తలు ఎందుకు సృష్టించబడుతున్నాయి. అంటే సమాదానం చెప్పేవారు లేరు. దేశమంతా ఒకే పన్ను విధానం వుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ధరల వ్యత్యాసం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఎస్టీ తెచ్చారు. దానిని అమలు చేసిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లైందన్నారు. అందుకే జీఎస్టీ అమలు అర్ధరాత్రి చేపట్టారు. అర్ధరాత్రి ఆర్ధిక స్వాతంత్య్రం అన్నారు. ఏమైంది? దేశ ఖజానాను పన్నుల వరద పారింది. సగటు వ్యక్తి జీవితం తలకిందులైంది. అంతకు ముందు నోట్ల రద్దు చేశారు. యాభై రోజులు సమయం ఇవ్వండి. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలు జరక్కపోతే అడగండి అన్నారు. కాని ప్రజలు బాదపడుతుతంటే చూశారు. జనం విలవిలలాడుతుంటే చూస్తూ మౌన వ్రతం చేశారు. నోట్ల రుద్ద చేపట్టి, పెద్ద నోట్లను ముందు తెచ్చారు. అన్ని నోట్లు రద్దుచేసి, కొత్తగా రెండువేల నోటు తెచ్చారు. డిజిటల్‌ మనీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. నోట్లు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టించారు. ఇది కొంత మేలు జరిగిందనుకున్నా నోట్లు పూర్తిగా లేకపోతే కూడా ఇబ్బందులే అన్నది తెలుసుకున్నారు. కాకపోతే రెండు వేల నోట్లు తెచ్చారు. దాని వల్ల పేదలకు ఏమైనా మేలు జరిగిందా? అంటే అదీ లేదు. ఆ నోటును కూడా కొంతకాలం తర్వాత ఉపసంహంరించుకున్నారు. అప్పుడు పేదలు పెద్దగా స్పందించలేదు. కారణం వారి ఆర్ధిక సానుకూలతకు ఆ నోటుకు పెద్దగా సంబంధం లేదు. కాని ఇప్పుడు మళ్లీ ఐదు వందలరూపాయల నోటును కూడా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. అనే వార్త సగటువ్యక్తికి పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఎంత డిజిటల్‌ పేమెంట్లు పెరిగినా చాలా సంస్ధలు నగదు లావాదేవీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య , దేవాదాయ రంగాలలో డిజిటల్‌మనీ లావాదేవీలు జరగడం లేదు. ఈ విషయం పాలకులకు తెలియదా? పెద్ద పెద్ద ఆసుపత్రులలో నగదు ఇస్తే తప్ప వైద్యం చేయడంలేదు. నగదు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్ధల్లో కూడా నగదు లావాదేవీలకు ఆస్కారం లేదు. అంటే అవి జీఎస్టీ ఎగ్గొడుతుంటే మాత్రం పాలుకలు చేష్టలుడిగి చూస్తుంటారు. సామాన్యుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలుచేస్తారు. అంతెందుకు నూటానలభైకోట్ల మన దేశ జనాభాలో నూటా ఇరవై కోట్ల మంది హిందువులే. హిందువులు ఏ గుడికి వెళ్లినా నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కూడా నిర్వహించే హోటళ్లు, దర్శనం ప్రసాదాలు ఇలా అనేక రకాల సేవలు నగదు వుంటేనే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్‌ చెల్లింపుల వల్ల లాభం ఏం జరుగుతోంది? ఇక ఐదువందలనోట్ల ఉప సంహకరణకు ఇప్పుడు మరో కారణం చెబుతున్నారు. దేశంలో నకిలీ ఐదు వందలనోట్లు చెలామణిలోవున్నాయంటున్నారు. మరి నోట్ల రద్దు సమయంలో తెచ్చిన కొత్త నోట్లను తయారు చేయడం ఎవరి వల్ల కాదన్నారు? ఆ నోట్లలో వుండే చిప్‌లు కూడా వుంటాయన్నారు. వాటిని తయారు చేయడం అంత సులువైన పని కాదన్నారు. ఇప్పుడు ఆ నోట్లను ఎలా తయారు చేస్తున్నారు. నోట్లను రద్దు చేసి ప్రభుత్వం సాదించిన విజయమేమింటంటే ఏం సమాదానం చెబుతారు? ఐదు వందల నోటుతోపాటు, రెండు వందల నోటు కూడా ఉపసంహరించుకుంటారన్న వర్తాలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. వాటి స్ధానంలో మూడువందల రూపాలయ నోటు వస్తుందంటున్నారు. అసలు ఈ నోట్ల ఉప సంహకరణ వల్ల కొత్తగా నోట్ల ప్రింటింగ్‌ ఎంత భారమౌతుందో తెలిసి కూడా పదే పదే ప్రయోగాలు చేస్తూ, జనం నెత్తిన పన్నుల భారం రుద్దడం తప్ప మరేం లాభం లేదు. ఎందుకంటే సంచి నోట్లు తీసుకుపోతే ఒక మూలన సరిపడే సరుకులు రాకపోవడమే ద్రవ్యోల్భనం. ఈ లాజిక్‌ను మర్చిపోయి పదే పదే నోట్ల రద్దు వల్ల జనాన్ని విసిగించడం, వారి వద్దనున్న సొమ్మును పన్నుల రూపాలంలో లేకుండా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. పేదలు మరింత పేదలుగా మారడం తప్ప, ధనవంతులు కావడం దుర్లభం. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాలుగా మారుతున్నారు. అయినా పాలకులు మారడం లేదు. పేదలకు న్యాయం జరగడం లేదు. ధనం మూలం ఇదమ్‌ జగత్‌ అన్నారు. ప్రతి వ్యక్తి తనచేతిలో చిల్లి గవ్వైనా వుండాలనుకుంటాడు. కానీ గవ్వలేకుండా పాలకులు చేస్తున్నారు. నోటు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని పూర్తిగా నోట్లు లేకుండా చేయడం సాద్యం కాదు. పదే పదే నోట్లను అందుబాటులోలేకుండా చేస్తే మాత్రం ఆర్దిక వ్యవస్ధ కుదేలు. ఇదంతా పాలకులు అర్దం చేసుకోరు. వారికి అర్దం కాదు. అవును దేశంలో నోట్ల రద్దు మూలంగా జరిగిన ఇబ్బందులు జనానికి తెలుసు. కాని పాలకులకు వాటి కష్టం తెలిస్తే బాగుండు. సామాన్యుడు నోట్ల రద్దు మూలంగా పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడంకోసం, నకిలీ నోట్ల చెలామణి ఆపడం కోసం ఐదేళ్లకో, ఆరెళ్లకో నోట్లలో మార్పులు తీసుకురావడం సహజమే. కాని ఎవరైనా ఒక్కొ మెట్టు ఎక్కి పైకి వెళ్లాలలనుకుంటారు. కాని పై నుంచి కిందికి రావడమే పురోగమనం అని ఎవరూ అనుకోరు. నోట్ల రద్దు మూలంగా జరిగిందదే…నోట్ల రద్దుకు ముందు వున్న ఆర్ధిక వ్యవస్ధకు, ఇప్పటికీ తేడా చాలా వుంది. ఆర్దిక వ్యవస్ధ పనతనమైంది. కాని పాలకులు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. ట్రిలియన్‌ డాలర్లు అంటూ పెద్ద పెద్ద లెక్కలు చెబుతారు. వారికి కూడా వాటి సంగతి తెలియదు. వాటి విలువ అసలే తెలియదు. కాని ఆర్దిక వేత్తలు చెప్పమంటే చెబుతారు. కాని పేదల జీవితాలు చూడాల్సిన పాలకులు, పెద్దల మాటలు వింటే ప్రగతి కారకులు కాదు. ప్రగతి నిరోధకులౌతారు. పది మంది దగ్గర ఆర్దిక వ్యవస్ధ బందీ అయితే, మిగతా వర్గాలకు కుదేలౌతాయి. వంద మందిలో తలో రూపాయి వుంటే అందరికీ ఉయోపగడుతుంది. కాని పది మంది దగ్గ పదిరూపాయలు వుంటే ఆ పది మందికే ఉపయోగపడుతుంది. ఇంత చిన్న లాజిక్‌ను పాలకులు మిస్‌ అతుంటారు. జనాన్ని ఇబ్బందులు పెడుతుంటారు. గతంలో మురార్జీ దేశాయి అదికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. ఎంత సేపు పక్కన దేశాల మూలంగా మనం నష్టపోతున్నామంటూ లెక్కలు చెప్పి నోట్లు అప్పడూ రద్దు చేశారు. ఇప్పుడూ ఆ కారణం ఒకటిగాచేసి నోట్లు రద్దు చేశారు. ఏమైంది. ఆర్ధిక వ్యవస్ధ కోలుకోనేంత దూరం వెళ్లిపోయింది. దేశంలో నల్లధనం పెరిగిపోయింది. దాంతో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆగమౌతుందన్నారు. నల్ల దనం మొత్తం తీస్తే దేశానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఏమైంది? ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్‌ సక్సెస్‌ బట్‌ పేషెండ్‌ డెడ్‌ అని వార్త వినాల్సి వచ్చింది. నోట్ల రద్దు వల్ల ఏర్పడినసమస్యల వల్ల కూడా జనం దేశంలో అనేక మంది చనిపోయారు. కాని లాభమేమైనా జరిగిందా? అంటే శూన్యం. ఒక వేళ నిజంగానే నోట్ల రద్దు వల్ల మన దేశానికి మేలు జరిగితే బిజేపి పార్టీ ఈ పాటికి చేసే ప్రచారం మామూలుగా వుండేది కాదు. కాని నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్‌ గిలగిలాడిపోతోంది..ఆ దేశ ఆర్ధిక వ్యవస్ద కుప్పకూలింది. తినడానికి తిండి లేకుండా జనం మలమల మాడిపోతున్నారు. అని వాట్సాప్‌ యూనివర్సిటీ చేసే అబద్దపు ప్రచారాలను నమ్మే వాళ్లు కూడా మనదేశంలో కోట్ల మంది వున్నారు. అందుకే నోట్ల రద్దు ప్రభావం బిజేపి మీద పడకుండాపోయింది. లేకుంటే ఈ పాటికి ప్రజలు బిజేపిని సర్ధేశేవారు. కాని ఎంత సేపు పక్క దేశాల రాజకీయాలను గురించి ప్రజల్లో ఏవగింపు నింపాలి. మన దేశ ఆర్ధిక విధనాల వల్ల పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఆకలి రాజ్యమేలుతుందని చెప్పాలి. మనదేశంలో ముస్లింల సంఖ్య పెరగుతుందని చెప్పాలి. మేకిన్‌ ఇండియా అని నినాదాలు చేయాలి. చైనా వస్తువులు వాడకూడదు అని పదే పదే బిజేపి నాయకులు ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటీకీ ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ఎక్కువ వాణిజ్యం చైనాతోనే ముడిపడి వుందన్న సంగతిని చెప్పదు. అసలు మనం చైనా వస్తువులు కొనకపోవడం వల్ల అక్కడి ప్రజలు పనులు లేక, ఉపాదిలేక విలవిలలాడుతున్నారని అంటారు. ఇదా రాజకీయం. ఇదేనా దేశాన్ని ఆర్దికంగా గాడిలో పెట్టడం. ఏది మేకిన్‌ ఇండియా? పతంగుల దారం నుంచి మొదలు, మనదేశ జాతీయ జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇంక్కెక్కడి మేకిన్‌ ఇండియా? పన్నుల వాయింపుల తప్పడం లేదు. విదేశీ వస్తువులు కొనుగోలు ఆగడం లేదు. మనదేశంలో పారిశ్రామిక ప్రగతి కనిపించింది లేదు. పెద్ద నోట్లు పోయి చిన్న నోట్లు వస్తే జేబులు నిండినట్లు కనిపించొచ్చేమో గాని, వాటి విలువ పెరగదన్నది తెలిస్తే పాలకులు పదే పదే ఇలాంటి ప్రయోగాలు చేయరు. లెస్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్టు అని పెద్దలన్నారు. గాని మోర్‌ లగేజ్‌ మోర్‌ కంపర్టు అని అనలేదు. ఈ లాజిక్‌ పాలకులు ఎప్పుడో మిస్‌ అయ్యారు. మిస్‌ ఫైర్‌ అయిన లెక్కలతోటి పన్నులు వాయిస్తున్నారు. నోట్ల ఉపసంహరణ సర్వరోగ నివారిణి అనుకుంటున్నారు. మొదటికే మోసం వస్తున్నా అదే పని కరక్టు అనుకుంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో యధా ప్రజా ..తదారాజ అన్నది కనిపించాలి. కాని యధా రాజా..తధా ప్రజా రాజ్యమేలుతోంది. సామ్యవాదం మరుగునపడిపోయింది. మళ్లీ ప్యూడల్‌ వ్యవస్ధ ముసుగులో పెట్టుబడి దారి వ్యవస్ధ కాటేస్తోంది. జనాన్ని పీల్చుకుతింటోంది. ఒక రకంగా చెప్పాలంటే కాల్చుకుతింటోంది.

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు…

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు

నిజాంపేట, నేటి ధాత్రి

ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్ ఫు @కరాటే వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన టోర్నమెంట్ లో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కుంగ్ ఫు విద్యార్థులు తమ ప్రదర్శనను కనబరిచారు అలాగే ఈ పోటీల్లో 6 బంగారు పతకాలు, 8వెండి పతకాలు,3 బ్రౌన్ పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ స్వామి, శ్రీనివాస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు

జి సి సి, వైస్ చైర్మన్ గా బుచ్చక్క ఖరారు అయినట్టే.?

జి సి సి, వైస్ చైర్మన్ గా బుచ్చక్క ఖరారు అయినట్టే.?

ఆదివాసి గిరిజన బిడ్డల నాయకురాలుగా సేవలు ఎన్నో.

గిరిజన ఆదివాసి గ్రామాలకు అభివృద్ధిని నోచుకునేలా చేసింది బుచ్చక్క.

నలుగురు జిసిసి డైరెక్టర్లు బుచక్క కు మద్దతుగా.!?

ప్రశ్నించకుండా అమాయక వైస్ చైర్మన్ కొరకు డైరెక్టర్లను ఒక అధికారి పోగు చేస్తున్నట్లు సమాచారం.!?.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

vice chairman

గిరిజన సహకార సంస్థ జి సి సి డైరెక్టర్ల ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. జిసిసి పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన ఆదివాసి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకొని డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. జిసిసి మహదేవ్పూర్ పరిధిలో ఐదు మండలాలకు ఐదుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. వాటిలో మహిళా రిజర్వేషన్ యునాని మాస్ గా ఇద్దరు మహిళలు డైరెక్టర్లుగా నియమితులు కాక సోమవారం రోజున ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఏడుగురు సభ్యులు డైరెక్టర్లకు పోటీ చేయగా, మహాదేవపూర్ నుండి ఒక డైరెక్టర్, మహా ముత్తారం మండలం నుండి ఇద్దరు డైరెక్టర్లు గెలుపొందడం జరిగింది. గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లు ఎన్నుకొనుటకు పొన్నగాలు ప్రారంభం కావడం జరిగింది. జిసిసి వైస్ చైర్మన్ నియామకం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారింది. ఇతర ఎన్నికల విధంగా జిసిసి వైస్ చైర్మన్ పదవి కొరకు గెలుపొందిన డైరెక్టర్ లతోపాటు జిసిసి ఓ అధికారి కూడా తమ కనుసైగల్లో ఉండే వైస్ చైర్మన్ కొరకు పావులు కలుపుతున్నట్లు విశ్వనీయ సమాచారం.

—————–

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఎంతో అండగా ఉండి వారికి విద్యా ఉపాధి పై ప్రత్యేక దృష్టి సాధించి అటవీ ఉత్పత్తుల కొనుగోలు అటవీ ఉత్పత్తుల కొరకు ప్రోత్సాహం, ఇలాంటి మరెన్నో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నిధుల నుండి ఆదివాసి గిరిజన కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రస్తుతం జిసిసి అనేక సంవత్సరాలుగా వైస్ చైర్మన్ ఎన్నికైనప్పటికీ ఆదివాసి గిరిజనులు ట్రైబల్ కుటుంబాలకు, వైస్ చైర్మన్ యొక్క ఉపయోగం విధులు తెలువకపోవడంతో ఆదివాసి గిరిజన కుటుంబాలు అభివృద్ధికి నోచుకోలేదని ప్రస్తుతం గిరిజనులు చెప్పుకుంటున్న విషయం. ఇదే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిసిసి నిధులు అందించి ఉపాధి విద్య తోపాటు ప్రత్యేకంగా మహాదేవపూర్ మండలంలో పెట్రోల్ బంక్ తో పాటు స్వయం సహాయక యూనిట్లను మంజూరు చేయడం, ఇప్పటికే కొందరు విద్యావంతులుగా ఉన్న ఆదివాసి గిరిజనులు, పథకాలను పొంది ఉపాధి పొందడం జరుగుతుంది.

—————–

ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ల ఎన్నికల్లో మాజీ ఎంపీపీ పలిమెల మండలానికి చెందిన కురుసం బుచ్చక్క డైరెక్టర్ గా జినానిమాస్ ఎన్నిక కావడం జరిగింది. పలివెల నూతన మండలం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి గిరిజన ఆదివాసి మహిళా ఎంపీపీగా బుచ్చక్క గిరిజన ఆదివాసి గ్రామ ప్రజలకు అనేక అభివృద్ధి పథకాలతో పాటు, ఆదివాసి గిరిజనుల కుటుంబాల్లో చైతన్యం, గిరిజను ఆదివాసి ప్రజల గొంతువై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులు పథకాలను పలిమెల మండలం తో పాటు ఇతర ఆదివాసి గ్రామాలకు అంతేగా చూసిన ఘనత కూడా కురుసం బుచ్చక్కకు దక్కింది. ఒక ఆదివాసి బిడ్డ అయిన కురుసం బుచ్చక్క అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో పదవులు లేకున్నప్పటికీ కూడా ఆదివాసి గిరిజనుల సమస్యలపై పోరాడటం లో వెనుకడుగు వేయలేదని ఇప్పటికీ పలివెల మండలం తో పాటు నికిత ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఐదు డైరెక్టర్లు ఉండగా నలుగురు డైరెక్టర్లు కురుసం ఉచ్చక్క వైస్ చైర్మన్ నియమించుటకు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

——————

మరోవైపు గిరిజన సహకార సంస్థ 5 మండలాల పరిధిలో తమ రేషన్ షాపుల నిర్వహణ, హెచ్.పీ గ్యాస్ సప్లై, తోపాటు ఎంఎల్ఎస్ గోడౌన్, ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఉంది, మరికొద్ది రోజుల్లో గిరిజన సహకార సంస్థకు పెట్రోల్ బంక్ సైతం కేటాయించడం జరిగింది. ఇలా జిసిసి సంస్థ ఐదు మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు ఇతర ఆదాయ వనరులు సమకూర్చడంలో కాస్త ఎక్కువ మోతాదులో పాత్ర పోషించడంతో, వైస్ చైర్మన్ జిసిసి చేతుల్లో ఉండేలా అమాయకులను వైస్ చైర్మన్ గా నియమిస్తే ప్రశ్నించేవారు ఎవరు ఉండరని జిసిసి ఓ అధికారి భావించి డైరెక్టర్లను తమ వైపు పోగు చేసుకోవడం లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం జీసీసీ వైస్ చైర్మన్ ఎన్నిక గతంలో సాధారణ సొసైటీ ఎన్నికలు కాకుండా గిరిజన సహకార సంస్థ 5 మండలాల్లో తన పాత్ర క్రియేషీలక పోషించడంతో గిరిజన్
నుల్లో కూడా చైతన్యం కలగడంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ రాజకీయంగా, విద్యావంతులుగా, సమాజ సేవ అనుభవం ఉన్న వారిని వైస్ చైర్మన్ గా ఎన్నుకొనుటకు గిరిజనులు ఆదివాసీల కోరిక, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికైన డైరెక్టర్లు మాజీ ఎంపీపీ కురుసం బుచ్చక్క వైపు మొగ్గు చూపడం జరుగుతుందని ప్రస్తుతం మహదేవపూర్ పలివెల మండలంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి

దేవరకద్ర/ నేటి ధాత్రి.

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక…

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక

పరకాల నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ ల కుమారుడు ఎన్ఎస్యుఐ జాతీయ కోఆర్డినేటర్ మార్క అభినయ్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి పెండ్లి శుభలేఖ అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ,ఏఎంసీ చైర్మన్ చందుపట్లరాజిరెడ్డి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఏకు రాజు,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు…

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్న రైతులు

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంను, అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారు.
* మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.*

వరంగల్, ఎనుమాముల నేటిధాత్రి

 

 

BRS leaders

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సంఘీభవంగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లు కలిసి ఏనుమముల మార్కెట్ ను సందర్శించి రైతన్నల కష్టాలను మద్దతు ధర లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతు.. రైతన్నలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతన్నలు రోడ్డున పడి ఆగమవుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతన్నల పొట్టగొడుతున్నారు అని, ఇలా రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తొందరలోనే అదే రైతన్నలు భూస్థాపితం చేస్తారు అని చెప్పారు. రైతన్నలకు మద్దతు ధర ఇవ్వడంలో కాని, ఎరువుల సప్లై లో కాని, రైతు బీమాలో కాని రైతన్నను కేసీఆర్ చూసుకున్నట్లు ఎవరు చూడట్లేదని, ఆయనను మించిన నాయకుడు ఈ దేశలోనే లేడు అని అన్నారు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ ఈ ఏనుమముల మార్కెట్ లో మద్దతు ధర కాని రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మరియు గుమస్తాలు, దడవాయిలు, హమాలీ కార్మికులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అని అన్నారు. ఇలా మద్దతు ధర ఇవ్వకుండా రైతన్నలను నానా గోసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు రైతన్న పక్షాన కొట్లాడటానికి మా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తూర్పు కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.

BRS leaders

అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాలి

అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాలి

ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్ చేసి అమ్మే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

దుర్వినియోగం అవుతున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాదీన పరుచుకోవాలి

ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవాలి

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఆర్డీవో తహసిల్దార్లకు మెమోరాండం

నర్సంపేట,నేటిధాత్రి:

Real estate

ప్రభుత్వ అసైన్డ్ భూములను దొడ్డి దారిన ఆక్రమించి ప్రభుత్వ నిబంధనలను అధిక్రమించి పేద మధ్యతరగతి ప్రజలను నమ్మించి అమ్మకాలకు కొనుగోళ్లకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ అసైన్డ్ భూములను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నం వెంకన్న గుండెబోయిన చంద్రయ్య వంగల రాగసుధ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలు ఆ భూముల రక్షణకై పోరు బాట పట్టక తప్పదని హెచ్చరించారు.నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల సర్వేనెంబర్ 111 లోని అసైన్డ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా భూమి చదును చేస్తూ క్రయవిక్రయాలకు ప్రయత్నిస్తున్న స్థలాన్ని రక్షించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ, తహసిల్దార్ల వద్ద ఆందోళన చేసి మెమోరాండం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం పేదలకు మరియు సేవకులకు జీవనభృతి కోసం ప్రభుత్వ భూములను అసైన్ చేసి ఇస్తే అట్టి భూములను కొంతమంది అనర్హులు దుర్వినియోగం చేస్తూ దళారులకు క్రయవిక్రయాలకు పాల్పడుతూ ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని 1977 అసైన్డ్ యాక్ట్ ను విస్మరిస్తున్నారని ఈ క్రమంలో విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయం చేయడం కోసం ఇచ్చిన భూమిని దశాబ్దాల తరబడి బీడు బడి ఉన్న రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం అట్టి భూములను స్వాధీన పరచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ,అసైన్డ్ భూములను రక్షించాల్సిన రెవిన్యూ యంత్రాంగమే కబ్జాదారులకు వంత పాడుతున్నట్టు కనబడుతున్నదని ఆరోపించారు.పేదలు నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే నిర్ధాక్షిణ్యంగా తొలగించి కేసులు పెట్టే ప్రభుత్వ యంత్రాంగం అంగ,అర్థ, రాజకీయ అధికార బలం ఉన్నవారికి మాత్రం అండగా నిలవడం జరుగుతుందని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంతకంటే అప్రజస్వామికం మరొకటి లేదని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కోరితే నాన్చివేత ధోరణి ప్రదర్శించడం అధికారులకు తగదని ఇప్పటికైనా మాదన్నపేట రోడ్డు 111 సర్వే నెంబర్లో చట్టాలను ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా భూములను చదును చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో అట్టి భూమిరక్షణకు పూనుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎం సిపీఐ(యు) నాయకులు భైరబోయిన నర్సయ్య, ఎండి పాషా, అస్గర్, చొప్పరి పద్మ, చింతకింది మనమ్మ, గోనెల అనిత, పెండ్యాల సరిత, మురహరి సరోజన, పద్మ, సాంబ, అరుణ, సంపూర్ణ, నాగమణి, శివ నాగరాజు, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు

అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, సహకరిస్తే..!

ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ నాయకుల సమావేశంలో మచ్చ రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ కళాశాలలో ప్రవేశం పొందాలని గ్రామాల్లో తిరుగుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆకళాశాలల్లో విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరుగుతున్న కార్పొరేట్ కళాశాలకు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం కోసం త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు రామారావు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కనకం రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ..

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…..

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా విద్యార్థులు మరింత పైకి ఎదగాలని, మరిన్ని గొప్ప గొప్ప ఆశయాలను పూర్తి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆటపాటలతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థుల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఎల్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల తో పాటు పలువురు పాల్గొన్నారు…

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి

– ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ

– ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి

– పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

శాసనమండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
చందుర్తి, కోనరావు పేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రాజేశ్వర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పోలింగ్ సజావుగా జరిపేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని, సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద
ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు.
పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని ,100 మీటర్ల రేడియస్ లో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రచారం జరగడానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ సహాయ కేంద్రానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ బుక్ , పాన్ కార్డు ఆధార్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, యూడి ఐడి, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.
పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీజ్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4 గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని, అన్నారు.
చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనలు ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించు కోవాలని , విధులను పక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు.
అనంతరం కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ తహసిల్దార్లు విజయ్ ప్రకాష్ రావు , మహేష్, సుజాత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version