శరవేగంగా షూటింగ్‌..

శరవేగంగా షూటింగ్‌

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వీటీ15’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇండో – కొరియన్‌ హారర్‌ కామెడీగా…వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వీటీ15’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇండో – కొరియన్‌ హారర్‌ కామెడీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవలె హైదరాబాద్‌, అనంతపురంలో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తాజాగా విదేశాల్లో ప్రారంభించిన షెడ్యూల్‌ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వేటకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుందని చిత్రబృందం పేర్కొంది.

వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే.

వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ…

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బేనర్‌పై తెలుగు రాష్ట్రాల్లో ‘వార్‌-2’ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన తారక్‌ సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నటించిన రెండు సినిమాలు ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ మా బేనర్‌పై విడుదలయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్‌-2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం’ అంటూ నిర్మాత నాగవంశీ ఓ వీడియోను షేర్‌ చేశారు. ’వార్‌-2’ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.

పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా..

పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా..

ఆర్కే సాగర్‌ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపుదిద్దుకొంది. ఈ సినిమా…ఆర్కే సాగర్‌ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపుదిద్దుకొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, హీరో పవన్‌కల్యాణ్‌ శనివారం విడుదల చేశారు. ‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం. కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అంటూ విక్రాంత్‌ ఐపీఎస్‌ పాత్ర పోషించిన ఆర్కే సాగర్‌ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఫిట్‌నెస్‌ కలిగి అద్భుతంగా కనిపించారాయన. మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించారు. సస్పెన్స్‌, థ్రిల్స్‌తో ఎంతో గ్రిప్పింగ్‌గా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను దర్శకుడు రూపొందించారు. విడుదలకు ముందే సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్‌ పెంచేసింది.

జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.

జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.. సినిమా చూసిన హైకోర్టు జడ్జిలు..

మాలీవుడ్‌లో తీవ్ర వివాదాస్పదమైన జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాను కేరళ హైకోర్టు జడ్జ్‌లు చూశారు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…? అనుపమ పాత్రకు జానకి అని పేరు పెట్టడంపై ఎలా స్పందించారు…? ఈ చిత్రంలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో సురేష్ గోపి కీలకపాత్ర పోషించారు.

సినిమా స్టోరీ సంగతేమోగానీ అంతకుమించిన ట్విస్టులు నడుస్తున్నాయి బయట. మిగతా భాషలకు రోల్‌మోడల్‌గా ఉండే మాలీవుడ్‌ సిన్మాలకు కూడా విచిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అలాంటి వివాదంలోనే చిక్కుకుంది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా. సిన్మాలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర పేరు జానకి కావడంపై గతకొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరుని హిందూ పురాణాల్లో సీతాదేవికి పర్యాయపదంగా పరిగణిస్తారు. అలాంటి పవిత్రమైన పేరుని అత్యాచార బాధితురాలి పాత్రకు పెట్టడం సమంజసం కాదంటోంది సెన్సార్ బోర్డు.

అయితే జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే. ఇందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదంటున్నారు ప్రొడ్యూసర్‌. పేరు మార్చడం సాధ్యం కాదంటూ సర్టిఫికెట్‌ కోసం సెన్సార్ బోర్డుకు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాకి సెన్సార్‌ జాప్యంపై కేరళ హైకోర్టు సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. అదే పేరుతో గతంలో పలు పాత్రలు, సినిమాలు వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని న్యాయస్థానం క్వశ్చన్‌ చేసింది. అంతేకాదు… శనివారం జడ్జీలతో పాటు పలువురు లాయర్లు సైతం సినిమాను చూశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగింది. సినిమా చూసిన వాళ్లు ఎలాంటి తీర్పునిస్తారు…? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సెన్సార్ బోర్డు ఆవిర్భావం.. 20వ శతాబ్దం ప్రారంభంలో సినిమా ప్రపంచంలో ప్రజాదరణ పొందింది. అనేక చోట్ల సినిమాల బహిరంగ ప్రదర్శనల సమయంలో సమస్యలు తలెత్తిన తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం 1909లో ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా చట్టాన్ని ప్రవేశపెట్టింది. మొదటి చట్టం బహిరంగ ప్రదర్శనలకు లైసెన్స్‌లు అందించడం. అయితే, స్థానిక ప్రభుత్వాలు ఆ సమయంలో తమను విమర్శించే చిత్రాలకు లైసెన్స్‌లను నిరాకరించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించాయి.

నైతిక క్రమశిక్షణకు దలైలామా ప్రతీకః ప్రధాని మోదీ.

ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా ప్రతీకః ప్రధాని మోదీ

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నేడు తన 98వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనను ప్రేమ, సహనానికి చిహ్నంగా ప్రధాని అభివర్ణించారు.టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నేడు తన 98వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనను ప్రేమ, సహనానికి చిహ్నంగా ప్రధాని అభివర్ణించారు.

‘‘దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 1.4 బిలియన్ల భారతీయులతో కలిసి నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని’’ ప్రధానమంత్రి రాశారు. ‘‘ఆయన ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు చిరస్మరణీయ చిహ్నం. ఆయన సందేశం అన్ని మతాల ప్రజలలో గౌరవం మరియు ప్రశంసలను ప్రేరేపించింది. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు కూడా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయనతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. “పవిత్ర దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శాంతి, కరుణ, ఆధ్యాత్మిక బలానికి ప్రపంచవ్యాప్త చిహ్నం, ఆయన సామరస్యం సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది” అని ఆయన రాశారు.

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన 90వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘నేను ఇంకా 130 సంవత్సరాలు జీవిస్తానని’’ ఆయన అన్నారు. వారసుడి ఎన్నిక, వివాదాల మధ్య, దలైలామా శనివారం ఇలా కీలక ప్రకటన చేశారు. ‘‘అనేక ప్రవచనాలను పరిశీలిస్తే, నాకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా 30-40 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నాను. బహుశా నేను 130 సంవత్సరాలకు పైగా జీవిస్తాను.’’ అంటూ వెల్లడించారు.

తన వారసుడిని ప్రకటించారనే పుకార్ల మధ్య దలైలామా ఈ ప్రకటన చేశారు. దలైలామా పుట్టినరోజున హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జూలై 2న మూడు రోజుల 15వ టిబెటన్ మతపరమైన సమావేశం ప్రారంభమైంది. ‘‘నా మరణం తర్వాత, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక చేస్తామని’’ ఆయన చెప్పారు.

టెన్జిన్ గ్యాట్సో 14వ దలైలామా. ఆయన జూలై 6, 1935న జన్మించారు. ఆయన టిబెట్ దేశాధినేత, ఆధ్యాత్మిక గురువు. ఆయన తొలిసారిగా 1959లో చైనా నుండి తవాంగ్ చేరుకున్నారు. అప్పటి నుండి ఆయన భారతదేశంలో నివసిస్తున్నారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన 65 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించారు. అంతే కాకుండా, ఆయన ఇప్పటివరకు 85 కంటే ఎక్కువ గౌరవాలను అందుకున్నారు.

వంద గెలుస్తాం…పదేళ్లు మనమే పాలిస్తాం!

`తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనను పది కాలాలపాటు నిలుపుకుందాం.

`‘‘సిఎం రేవంత్‌ రెడ్డి’’ కాన్ఫిడెన్స్‌ స్టేట్‌మెంట్‌.

`తెలంగాణ వ్యాప్తంగా సన్నాలు పండిరచాం..

`ప్రతి గింజ కొనుగోలు చేసి రైతును రాజును చేశాం.

`రికార్డు స్థాయిలో వరి పండిరచి నెంబర్‌వన్‌ తెలంగాణ అని నిరూపించాం.

`రుణమాఫీ చేసి తెలంగాణ రైతులను రుణ విముక్తి చేశాం.

`రైతు భరోసాతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం.

`సన్న బియ్యం పంపిణీ చేసి పేదల కడుపు నింపుతున్నాం.

`60 వేల ఉద్యోగాలిచ్చి రికార్డు నెలకొల్పాం.

`నిరుద్యోగుల కల నెరవేర్చుతున్నాం.

`తెలంగాణలో నిరుద్యోగాన్ని పారద్రోలుతున్నాం.

`జాబ్‌ క్యాలెండర్‌ తో యువత భవిష్యత్తు ఆశలు చిగురింపజేస్తున్నాం.

`ఒక్క సభతో పెరిగిన జోష్‌!

`సిఎం స్పీచ్‌తో నాయకులలో కనిపించిన ఉత్సాహం.

`సిఎం రేవంత్‌ మాట్లాడుతున్నంత సేపు ఈలలు, చప్పట్లు.

`పదేళ్లు నేనే సిఎం అనగానే నాయకులను నుంచి జేజేలు.

`ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతుంటే నాయకులు కరతాల ద్వానాలు.

`తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షాలను ఓ ఆట ఆడుకున్న సిఎం.

`పంచాయతి ఎన్నికలలో అందరినీ గెలిపించే బాధ్యత నాది అని చెప్పారు.

`నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.

`ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు చేయాలన్నారు.

`పదకొండేళ్ల తర్వాత పల్లెల్లో కాంగ్రెస్‌ బలం రెండిరతలైందన్నారు.

`ఈ బలం ఎల్లకాలం నిలుపుకుందాం అన్నారు.

`తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన రెండు దశాబ్దాలు కాపాడుకుందాం.

`ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమానికి నెలవని చాటుదాం అని అన్నారు

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  నాయకుడు నింపే నమ్మకం ఏ పార్టీకైనా వెయ్యేనుగుల బలం ఇస్తుందని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిదర్శనం. ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి చేరినప్పుడున్న పరిస్దితి, ఇప్పుడున్న పరిస్దితిని బేరీజు వేసుకుంటే పార్టీని నిజమైన నాయకుడు రేవంత్‌రెడ్డే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఏ నాయకుడైనా పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి ఎదగాలనుకుంటాడు. పార్టీ నీడలో పెరిగి పెద్ద నాయకుడౌతారు. కాని కొంత మంది నాయకులే పార్టీకే నీడకల్పిస్తారు. పార్టీకి జవసత్వాలు తెస్తారు. పార్టీని నిలబెడతారు. గెలిపిస్తారు. అధికారంలోకి తీసుకొస్తారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించిన వారిలో ఒకే ఒక్కడు సిఎం. రేవంత్‌ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకుడైనా సరే కాంగ్రెస్‌ను నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్లే కనిపిస్తారు. కాంగ్రెస్‌ మూలంగానే నాయకులయ్యారు. కాంగ్రెస్‌ బలంతోనే నాయకులుగా చెలామణి అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఆశీస్సులతోనే పదవులు అనుభవించారు. మొత్తం కాంగ్రెస్‌ చరిత్రలో రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడు ఒక్కరు కూడా లేరు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్‌ నీడనే ఎదిగారు. కాంగ్రెస్‌లోనే బలమైన నాయకుడయ్యారు. పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేశాడు. పార్టీ విశ్వాసం చూరొగని ముఖ్యమంత్రి అయ్యారు. కాని రేవంత్‌ రెడ్డి మాత్రమే పార్టీ కోసం వచ్చారు. పార్టీని నిలబెట్టారు. తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఏ రాష్ట్రంలో లేరు. రేవంత్‌ రెడ్డిలాగా పార్టీని బతికించిన వారు లేరు. పార్టీ అదిష్టానంతో నాయకులైన వారే ఎక్కువ. రాజకీయాల్లో ఉన్నత పదవులు అందుకున్నవారే అందరూ. కాని కాంగ్రెస్‌ పార్టీలోనే స్పెషల్‌..కాంగ్రెస్‌ పార్టీకే స్పెషల్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి. అందుకే పార్టీ అదిష్టానం కూడా రేవంత్‌ రెడ్డికి అంత ప్రాధాన్యత కల్పిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గొప్పలు చెప్పుకునే వారే వుంటారు. పదవుల్లో పోటీ పడుతుంటారు. కాని గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి పార్టీ పగ్గాలు చేతిలో పట్టుకోకపోతే, ఆయన పిపిసి పదవిలో లేకపోతే కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ ప్రతిపక్షం తప్పకపోయేది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోయేవారు. ఇది నూరుపైసల నిజం. రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ వేదికగా నిలిచింది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీ ఒక దారిని చూపింది. పదేళ్లుగా కుదేలైపోయిన పార్టీకి జీవం పోసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పార్టీలోకి చేరినప్పుడే పార్టీకి కొంత జోష్‌ వచ్చింది. ఆయన పిసిసి అద్యక్షుడు అయ్యాక పార్టీకి ఎప్పుడూ లేని ఊపు తెచ్చింది. ఈ రెండు రేవంత్‌ రెడ్డి వల్లనే వచ్చాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు. దాంతో ఆదిపత్య ధోరణి కోసం పాకులాడిన నాయకులకు కూడా రేవంత్‌ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కారణమయ్యారు. ఇదిలా వుంటే ఇప్పుడు మళ్లీ పార్టీకి మరింత బలం పెంచేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మధ్య ఎల్‌బి స్టేడియంలో జరిగిన కాంగ్రెస్‌ నాయకుల సమావేశ పార్టీలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం ఎంతో కాన్ఫిడెన్స్‌ను నింపింది. అంతే కాదు రేవంత్‌ రెడ్డి ధైర్యాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పిన మాటే అయినా, మళ్లీ నాయకులు కొత్తగా విన్న భావనతో విన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పడంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు, చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది. రేవంత్‌రెడ్డి జయజయ ధ్వానాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వచ్చే పదేళ్లు మనదే అధికారం అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యేందుకు చాన్స్‌ వుందన్నారు. పార్టీ కోసం కష్టపడితే మంత్రులు కూడ ఆయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎక్కడిక్కడ నాయకులు తమ నాయకత్వ పటమితో పనులు చేయాలన్నారు. పార్టీని పట్టిష్టం చేయాలని కోరారు. నాయకులుగా ఎదగాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎందుకంటే ఈ పద్దెనమి నెలల్లో సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలన్నారు. వరి పంటలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని రికార్డును తెలంగాణ సాధించిందని గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహమే కారణమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు కోట్లమెట్రిక్‌ టన్నులకు పైగా వరి ధాన్యం పండిరదని గుర్తు చేశారు. అందులోనూ సన్నాలు పండిరచడం వల్ల తెలంగాణ మొత్తానికి అన్నం పెట్టే అవకాశం కూడా దొరికిందని గుర్తు చేశారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ప్రభుత్వాలు ముందూ వెనుక ఆలోచించేవన్నారు. కాని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కతెలంగాణలోనే సన్న బియ్యం పేదలకు అందిస్తున్నామన్నారు. పేదల ఆకలిని సన్నబియ్యంతో తీర్చుతున్నామన్నారు. ఈ క్రెటిట్‌ తెలంగాణ వున్నంత వరకు రేవంత్‌ రెడ్డికే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఓ ఇద్దరి మాత్రమే చరిత్రలో చోటు కలిగింది. కాని ఇప్పుడు సన్న బియ్యంతో రేవంత్‌ రెడ్డి పేరు కూడా చిరిత్ర నిక్షిప్తం చేసుకున్నదని చెప్పాలి. రైతులకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నారు. సన్నాలు పండిస్తే బోనస్‌లు ఇస్తున్నారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారు. గతంలో దళారులు బతికేవారు. కాని ప్రజా ప్రభుత్వంలో రైతులు బతుకుతున్నారు. రాజులౌతున్నారు. ఏక కాలంలో చేసిన రుణమాఫీ వల్ల రైతుకు భారం తీరింది. రుణవిముక్తి జరిగింది. మళ్లీ సకాలంలో రుణాలు అందేందుకు మార్గం పడిరది. ఇదంతా సిఎం. రేవంత్‌ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలన్నింటికీ ఆదర్శమైంది. గతంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంలో అదికారంలో వున్నప్పుడే దేశ వ్యాప్తంగా అప్పటి వరకు వున్న 90వేల కోట్ల రుణమాఫీ జరిగింది. దేశమంతా పండుగ చేసుకున్నది. దేశంలోని అప్పటి రైతులందరికీ రుణ విముక్తి జరిగింది. ఆ తర్వాత మళ్లీ బిజేపి కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చినా ఏనాడు రుణమాఫీ జరగలేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ ముచ్చటే లేదు. కాని తెలంగాణలో ప్రజా ప్రభుత్వంలో, సిఎం. రేవంత్‌రెడ్డి పాలనలో రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది. ఇంతకన్నా ప్రజా ప్రబుత్వం మరెక్కడ వుంటుంది. ఆ క్రెడిట్‌ అంతా సిఎం. రేవంత్‌ రెడ్డికే దక్కింది. ఇక తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల పండుగ మొదలైంది. పదకొండేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నా సొంతింటి కల కూడా మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే తీరుతోంది. పదేళ్లులో పది ఇండ్లు కూడా కట్టకుండా ప్రజలను కేసిఆర్‌ మోసం చేశాడు. కాని పద్దెనమి నెలల కాలంలో సుమారు నాలుగు లక్షల ఇండ్లకు పట్టాలు పంచారు. ఇందిరమ్మ ఇండ్లకు మొదటి విడత లక్ష రూపాయలు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొదలౌతున్నాయి. శ్రావణ మాసంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వచ్చే మూడేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. ఇదీ ప్రజా పాలన అంటే. ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 60వేల వరకు ప్రభుత్వ కొలువులిచ్చారు. గతంలోగాని, ఇప్పుడు గాని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కొలువులు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. ఏకకాలంలో 60వేల ఉద్యోగాలు కూడా ఒక రికార్డును సృష్టించింది. వీటన్నింటిపై ప్రతి పక్షాలకు సిఎం.రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు. తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ను ఓ ఆట ఆడుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో త్వరలోనే నాయకులకు పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చే రెండుదశాబ్దాలు పాలన సాగిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సంక్షేమం అందుతుందన్నారు. పేద ప్రభుత్వం అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని సిఎం. మరోసారి పునరుగ్ఘాటించారు.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో మహా జననేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ కరకగూడెం మండల ఇన్చార్జి బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. మహా జననేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 7వ తేదీన సోమవారం నాడు ఎమ్మార్పీఎస్31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ పతాక ఆవిష్కరణ, మంద కృష్ణ మాది జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఇల్లందుల సత్యం మాదిగ. ఉపాధ్యక్షులుగా ఇల్లందుల కృష్ణ మాదిగ. కార్యదర్శి ఇల్లందుల యేసు మాదిగ. ప్రధాన కార్యదర్శి ఇల్లందుల నరేష్ మాదిగ. సహాయ కార్యదర్శి వెంకటేష్ మాదిగ. ట్రెజరర్ ఇల్లందుల సమ్మయ్య మాదిగ. కమిటీ సభ్యులు సోమిడి వినోద్ మాదిగ. ఇల్లందుల శ్రీను మాదిగ. ఇల్లందులో నరసయ్య మాదిగ. ఇల్లందుల అర్జున్ మాదిగ. ఇల్లందుల సుకుమార్ మాదిగ. ఇల్లందుల సంతోష్ మాదిగ లను ఎన్నుకోవడం జరిగింది.

బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

◆ పుస్తకాలను ఆవిష్కరించిన బీసీ నాయకులు .

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గము. తీన్మార్ మల్లన టీమ్,మరియు బీసీ నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన రాసిన ‘బీసీలకు పెనుముప్పు’ ‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల, ‘శాసనమండలిలో ప్రజా గొంతుక ‘అనే పుస్తకాలను శనివారం పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పుస్తకాలను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోట వల్ల విద్యా, ప్రభుత్వ రంగాల్లో బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని రిజర్వేషన్ వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాసిన పుస్తకంలో చాలా విషయాలు వాస్తవాలుగా ఉన్నాయని వారు రాసిన పుస్తకం ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉన్నా అన్నారు.అన్ని రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు వారు తమ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జీ నర్సింహ, హనుమంత్,బీసీ నాయకులు డా. పెద్దగొల్ల నారాయణ, బీసీ తాలూకా కోర్ కమిటీ సభ్యులు కె. నర్సింలుముదిరాజ్ . ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, బీసీ నాయకురాలు జ్యోతి పండాల్, పి. అశోక్, పి.శేఖర్,తాలూకా బీసీ కోర్ కమిటీ సభ్యులు విశ్వనాథ్ యాదవ్, యువ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే ‌‌.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లోని పర్లపల్లి గ్రామంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కాంతాలా సతీష్ రెడ్డిగారి కూతురినీ ఆశీర్వదించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ కార్యక్రమంలో చిట్యాలవ్యవసాయ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి వైస్ చైర్మన్ మమ్మద్ రఫీ మొగుళ్ళపల్లిసొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు జిల్లా నాయకులు తక్కలపల్లి రాజుమండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ జిల్లా బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ మండల నాయకులు పాల్గొన్నారు

జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

నస్పూర్,నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కార్యాలయం నందు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బి ఎం ఎస్) ఆధ్వర్యంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం రోజున జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూలై 9న కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఉద్దేశాలతో పిలిచిన దేశవ్యాప్త సమ్మెలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) పాల్గొనదని స్పష్టం చేశారు.దేశంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లుగా రూపుదిద్దిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వాటిలో వేతనాల కోడ్ 2019 మరియు సామాజిక భద్రత కోడ్ 2020లను బిఎంఎస్ స్వాగతించిందని పేర్కొన్నారు.ఈ కోడ్‌ల ద్వారా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన హక్కు,గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని వివరించారు.ఇతర రెండు కోడ్‌లైన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020,ఆక్యుపెన్షియల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో కొన్ని సవరణలు అవసరమని పేర్కొన్నారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ,మరింత లోతుగా చర్చించి వీలైనంత త్వరగా సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ ప్రయోజనాల కోణంలో కొన్ని కార్మిక సంఘాలు జూలై 9 సమ్మెకు పిలుపునిస్తున్నప్పటికీ,బిఎంఎస్ మాత్రం కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు.అందుకే కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిచి ఆ సమ్మెలో పాల్గొనరాదని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాగం రాజేందర్ ఏరియా సెక్రటరీ,ఐలవేణి శ్రీనివాస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,భూoపల్లి రమేష్ జాయింట్ సెక్రెటరీ,కట్కూరి సతీష్ జాయింట్ సెక్రెటరీ,శాంతం సంపత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,గోళ్ళ మహేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,కిరణ్ కుమార్,గోనె రామకృష్ణ ఆర్కే 5 పిట్ సెక్రెటరీ,కుంట రాజు ఆర్కే 7 అసిస్టెంట్ సెక్రటరీ,కొమ్మ బాపు,ఎస్ అండ్ పి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా.!

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆవాస ప్రాంతాలలో గృహాల మధ్య నిర్మాణాలు లేని ఖాలి ప్లాట్లు ఉండడం వలన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగండం,ప్లాట్లలో మొరం నింపకుండా నిక్ష్యంగా వదిలేయడం వలన దోమలు ఎక్కువవుతున్నాయని ఆయా ఫ్లాట్ల యజమానులు గమనించి పిచ్చిమొక్కలను తొలగించాలని దోమల వ్యాప్తి,చెందకుండా తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిరక్ష్యం వహిస్తే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ తెలిపారు.

సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

భూపాలపల్లి నేటిధాత్రి

సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో రేగొండ, చిట్యాల కొత్తపల్లిగోరి టేకుమట్ల, మొగుళ్ళపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లోని మొత్తం 191 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.61,10,500/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ.అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సుంకరి రామచంద్రయ్య అప్పం కిషన్ సాంబమూర్తి తోట రంజిత్లబ్ధిదారులు పాల్గొన్నారు

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మానవ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీర దానం పై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని, అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.

 

ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైద్య విద్యార్థులు మానవ శరీరం పై ఫిజియాలజీ, అనటమి పరీక్షలు ఆచారాత్మకంగా చేయుటకు మానవ మృత దేహల అవసరం ఎంతో ఉందని, మానవ మృత దేహలు దానం చేయడం వల్ల వీటిని వినియోగించి మంచి వైద్యులను తయారు చేయ వచ్చునని కలెక్టర్ తెలిపారు. మనిషి చనిపోతే ఇక తిరిగి రారు, ఇక లేరు అనుకుంటారని, కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు. వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అవయవ దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం చేయాలని కలెక్టర్ కోరారు. దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులు, అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

 

 

తాము కూడా వైద్య విద్యార్థులుగా విద్యానభ్యసించిన సమయంలో మానవ మృతదేహాలపై ప్రాక్టికల్ గా పరీక్షలు నిర్వహించడం వల్ల ఈరోజు సమాజంలో రోగులకు పరిపూర్ణంగా శస్త్ర చికిత్సలు చేయగలుగుతున్నామన్నారు.నేటి వైద్య విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ గా శస్త్ర చికిత్సలు నేర్పడానికి మానవ పార్థివ దేహాలు ఎంతో అవసరమని అన్నారు. అవయవ దానం చేయుటకు అంగీకరించడం,బ్రెయిన్డెడ్ అయిన వారి శరీరాలను ముందుకు వచ్చి మెడికల్ కాలేజీలకు ఇవ్వడం మంచి పరిణామం అని, దీని ద్వారా గొప్ప డాక్టర్లను తీర్చిదిద్దడం తో పాటు దైవం కూడా అనుగ్రహిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు,

 

కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి, డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు,తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రజక సంఘం అధ్యక్షులు గా బండలయ్య.

వనపర్తి జిల్లా రజక సంఘం అధ్యక్షులు గా బండలయ్య
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా రజక సంగం అధ్యక్షులు గా బండలయ్యా
పట్టణ రజక సంఘం అధ్యక్షులుగా శేఖర్ నియమకము అయ్యా రని రమేష్ తెలిపారు వనపర్తి పట్టణంలో వ్రజక కమిటీ హాల్ లో రజక సంఘం సభ్యులు సమావేశం జెరిగింద ని నూతనంగా ఎన్నికైన వనపర్తి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షులు ఇటిక్యాల బండలయ్య పట్టణ రజక సంఘం అధ్యక్షులుగా కరట శేఖర్ ను ఎన్నుకున్నావారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి రజక సంఘం సభ్యులు పాలకొండ సత్యనారాయణ శ్యామ్ వెంకటయ్య భీముడు వజ్రాల రమేష్ శ్రీనివాసులు రవి సలేష్ పరశురాం గణేష్ మహేష్ అంజి శ్రీను నరసింహ రాము అంజి బాలస్వామి గోవర్ధన్ చందు గార్లు పాల్గొన్నారు.

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్(జడ్జ్) న్యాయమూర్తి గంటా కవితా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరవన్ శర్మ రాశారు. ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా న్యాయ మూర్తి గంటా కవితదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాని ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్యారస్పాండెంట్ వెంకటయ్య ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయులను, తల్లి తండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు పది సంవత్సరాలు కష్టపడి చదివితే విద్యార్థుల జీవితాలు మంచి స్థాయిలో ఉంటారని, విద్యార్థులు మీ సంతకం గురించి వేరేవారు ఎదురుచూతారో అపోయూడు విద్యార్థులు సక్సెస్ అవుతారని అన్నారు. అనంతరం రచయిత భైరవన్ శర్మను న్యాయమూర్తి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహేబూబ్, హరికృష్ణ, ఆకాష్, మహా రుద్రయ్య స్వామి, సంజీవ్ కుమార్, అత్తర్, రాజేందర్, యువరాజ్, మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన ఆర్టీసీ డిఎం

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో ఇందనం పొదుపు చేసి బెస్ట్ కేఎంపిఎల్ అవార్డు పొందిన డ్రైవర్లు అశోక్ రెడ్డి, పీవి రావ్ లను, బెస్ట్ ఈపీకే తీసుకువచ్చిన కండక్టర్ యాదగిరి లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శాలువాతో సన్మానం చేసి నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ సూపర్ వైజర్ నారాయణ, ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్, ఏఎంఎఫ్ దత్తం, ఎస్డిఐ వెంకటేశ్వర్లు,రవీందర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

సందడిగా మహిళల గోరింటాకు వేడుకలు.

సందడిగా మహిళల గోరింటాకు వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

ఆషాడ మాసం పురస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఏరియా సింగరేణి సేవా లేడీస్ క్లబ్ ఆధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు అందరికీ పండుగ వాతావరణం లో గోరింటాకు పోటీలను నిర్వహిచడం జరిగింది . ఈ గోరింటాకుపోటీలలో విజేతలు అయినవారికి బహుమతులను సేవ ఆధ్యక్షురాలు చేతులమీదుగా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఒంట్లోని వేడిని తగ్గిస్తుందని, గోరింటాకు అనేది సాంప్రదాయకంగా, సౌందర్య సాధనంగా, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉందని గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుందాని, ఆషాడ మాసం లో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జైపూర్,నేటి ధాత్రి:

రాష్ట్ర కార్మిక,ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో శనివారం రోజున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు అందరికీ పథకంలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,హౌసింగ్ శాఖ ఏఈ కాంక్ష,గ్రామ కార్యదర్శి ఉదయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి,తడిసిన కల్కి రమేష్,ప్రశాంత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు ఇరిగిరాల శ్రావన్ కుమార్,అరిగేలా శ్రీనివాస్ గౌడ్,ఇరిగిరాల లింగయ్య  పాల్గొన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఘన నివాళులు

శంకర్ పల్లి, నేటిధాత్రి:
రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి సతీమణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరియు మాజీ ఎంపీపీ శ్రీమతి పడాల యాదమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించబడిన సందర్భంగా, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్వర్గీయ యాదమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన పడాల వెంకట్ స్వామి మరియు కుమారుడు ప్రభాకర్ ని పరామర్శిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఫిషర్ మెన్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, తోల్కట్ట సత్యనారాయణ, బలవంత రెడ్డి, ముడిమ్యాల గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

చెత్తను తొలగించండి మహాప్రభో…..!

చెత్తను తొలగించండి మహాప్రభో…..!

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.

నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..

ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..

వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు

అసలే వర్షాకాలం.. ప్రధాన రహదారుల్లో గుంతలలోకి నీరు చేరి ప్రమాదాలు..

కమీషనర్ బయటకు వస్తేనే, కదులుతున్న మున్సిపల్ అధికారులు? లేదంటే ఏసీ రూములకే పరిమితం.

బల్దియా అధికారుల నిర్లక్ష్యం…?

పేరుకుపోయిన చెత్త ఓ వైపు.., రోడ్ల మీద గుంతలు మరోవైపు..

వరంగల్ నగర ప్రజల ఆవేదన.. పట్టించుకొని స్థానిక కార్పొరేటర్లు?

మృత్యు మార్గాలుగా ప్రధాన రహదారులు? నిర్వహణ లేక అధ్వాన్నంగా మారిన కొన్ని రోడ్లు.

“పోతననగర్ నుండి హంటర్ రోడ్డు” వైపు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయ్యింది

అడుక్కో గుంతతో భయంభయంగా వాహనదారుల రాకపోకలు.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిధ్రమైన పలు రోడ్లు, కాగితాలకే పరిమితమైన మరమ్మతుల ప్రతిపాదనలు?.

గుంతలను పూడ్చండి, పేరుకుపోయిన చెత్తను తొలగించండి, ప్రాణాలను కాపాడండి. బల్దియా కమిషనర్ కు నగర ప్రజల వేడుకోలు.

 

❗❗సమస్య_1❗❗❗

వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు

వరంగల్, నేటిధాత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతలతో ఉండటం, ప్రయాణం చేస్తున్న వాహనదారులకు సడన్ బ్రేక్ వేయలేక అందులో నుండి వెళ్ళే క్రమంలో కింద పడటం , సడన్ బ్రేక్ వేయడం వలన ప్రమాదాలు జరుగుతున్న తీరు. ఎంజిఎం నుండి ములుగు రోడ్డు వెళ్లే ప్రధాన రహదారిలో కియా కార్ షో రూమ్ ముందు, పాత సిటీ గ్రాండ్ హోటల్ ముందు, గార్డెన్ ముందు రోడ్డు మధ్యలో గుంతలు ఉండటం వల్ల ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతన నగర్ నుండి హంటర్ రోడ్డు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయిన పట్టించుకునే నాథుడు లేడు. ఈ ఏరియా నగర మేయర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ప్రజా ప్రతినిధులకు వారి డివిజన్ లో రోడ్ల మీద ఎలాంటి నిర్లక్ష్యం ఉందో అని. అలాగే ములుగు రోడ్డు జంక్షన్ లో రోడ్డు గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పోచంమైదాన్ నుండి కాశీబుగ్గ వైపు వెళ్ళే దారిలో రోడ్డులో అక్కడక్కడా గుంతల వల్ల ఇబ్బందులు. మరికొన్ని చోట్ల రోడ్డు పనుల వల్ల ఇబ్బందులు జరుగుతున్న తీరు. తాత్కాలికంగా బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గుంతలు ఉన్న చోట తాత్కాలికంగా గుంతలు పూడ్చే అవకాశం ఉన్న కూడా పట్టించుకొని బల్దియా అధికారులు. స్థానిక కార్పొరేటర్లు సైతం వారికి ఏమి పట్టనట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుండి కాపాడే ప్రయత్నం అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ చేయకపోవడం పట్ల నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అడుక్కో గుంత.. ఆపై అడపాదడపా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు వాహనదారులను భయపెడుతున్నాయి. వాహనదారులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యుఢంకా మోగిస్తున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు, కాలనీల్లోనీ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. గుంతలు పూడ్చడానికి తట్ట మట్టి కూడా వేసే వారు లేక పోవడంతో, రోడ్డెక్కాలంటే వాహన చోదకులు వణికిపోతున్నారు. పెద్దపెద్ద గోతులతో.. నీటితో నిండిన గుంతలతో రోడ్లు వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లుకు ఇటీవల కురుస్తున్న చిన్న చిన్న వర్షాలు తోడవడంతో చిధ్రమై పోయాయి. ప్రమాదాలకు కేంద్రాలుగా నగరంలోని పలు రోడ్లు మారాయి. పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా.. రాత్రుళ్లు మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. రోడ్లు బాగు చేయండి సార్‌ అని ఆయా ప్రాంతాల ప్రజలు చేసుకుంటున్న వేడుకోలు అటు అధికారులను.. ఇటు ప్రజాప్రతినిధులను కూడా కదల్చలేకపోతున్నాయి.

రోడ్ల మరమ్మతులు మరిచారు..

City residents

వర్షాకాలం మొదలైంది. దెబ్బతిన్న రోడ్లకు చేసే మరమ్మతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. బల్దియా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నారు కానీ, ఉన్న రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లకు, మరమ్మతు పనులకు బడ్జెట్‌ని విడుదల చేయకపోతుండటంతో కొత్త రోడ్ల నిర్మాణం మాట అటుంచి, ఉన్న రోడ్ల మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. గతంలో వర్షాకాలంలో ధ్వంసమైన రోడ్లకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల పేరుతో తొలుత ప్రతిపాదనలు స్వీకరించి ఆ తర్వాత నిధులు మంజూరు చేసి రోడ్లకు రిపేర్లు చేయించేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు.

 

❗❗సమస్య_2❗❗❗

 

చెత్తను తొలగించండి మహాప్రభో…

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.

నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..

ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..

వరంగల్, నేటిధాత్రి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో రోడ్లపై చెత్త వేయడం వాటిని నెలల తరబడి తీయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు. అసలే వర్షాకాలం మొదలైంది. చెత్తను ఇంటింటి నుండి సేకరించి ఆటోల్లో తరలించే విధానం ఉన్న కూడా అక్కడక్కడా కొందరు సిబ్బంది నిర్లక్యం వల్ల చెత్త రోడ్డు మీద వేయడం, అక్కడి చెత్తను రోజుల తరబడి తీయకపోవడం జరుగుతుంది. హనుమకొండ నగరంతో పోల్చుకుంటే వరంగల్ లో పారిశుధ్యం పనులు వెనుకబడే ఉన్నాయి. నగరంలోని 23వ డివిజన్ వార్డులో, ఎంజిఎం సర్కిల్ నుండి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రోడ్డు మార్గంలో, యూనివర్సిటీ ముందు, ప్రభుత్వ కంటి దవాఖాన పక్కన, ప్రధాన రహదారిపై, ఆటోలోనే చెత్త వేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా చెత్తను తొలగించడం లేదని అటు వైపుగా వెళ్తున్న వాహనదారుల ఆవేదన. ఆ చెత్తవల్ల దోమలు చేరి విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చెత్తను తొలగించండి మహాప్రభో అంటూ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను వేడుకుంటున్నారు.

రోడ్ల మీద చెత్తను వెంటనే తొలగించాలి.

రోడ్ల మీద చెత్త వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాగే పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి, చెత్తను రోడ్లపై వేయకుండా ఉండటానికి, ప్రతి ఒక్కరూ తమ చెత్తను చెత్త కుండీలలో వేయాలి. మరియు, చెత్తను సేకరించే సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఉండాలి. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తలో దోమలు, ఈగలు మరియు ఇతర క్రిములు వృద్ధి చెందుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి మరియు దుర్వాసన వస్తుంది. ఆటోనగర్ లో కొందరు రోడ్ల మీదే చెత్తను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వర్షం వచ్చినప్పుడు, రోడ్లపై ఉన్న చెత్త మురుగునీటి వ్యవస్థను అడ్డుకుంటు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ప్రజలు అటు అధికారులు చెత్త తొలగింపు విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక కార్పొరేటర్లు కూడా చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి చెత్తను తొలగించాలని, స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version