జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
జైపూర్,నేటి ధాత్రి:
రాష్ట్ర కార్మిక,ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో శనివారం రోజున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు అందరికీ పథకంలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,హౌసింగ్ శాఖ ఏఈ కాంక్ష,గ్రామ కార్యదర్శి ఉదయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి,తడిసిన కల్కి రమేష్,ప్రశాంత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు ఇరిగిరాల శ్రావన్ కుమార్,అరిగేలా శ్రీనివాస్ గౌడ్,ఇరిగిరాల లింగయ్య పాల్గొన్నారు.