డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన ఆర్టీసీ డిఎం
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో ఇందనం పొదుపు చేసి బెస్ట్ కేఎంపిఎల్ అవార్డు పొందిన డ్రైవర్లు అశోక్ రెడ్డి, పీవి రావ్ లను, బెస్ట్ ఈపీకే తీసుకువచ్చిన కండక్టర్ యాదగిరి లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శాలువాతో సన్మానం చేసి నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ సూపర్ వైజర్ నారాయణ, ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్, ఏఎంఎఫ్ దత్తం, ఎస్డిఐ వెంకటేశ్వర్లు,రవీందర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.