జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.

జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.. సినిమా చూసిన హైకోర్టు జడ్జిలు..

మాలీవుడ్‌లో తీవ్ర వివాదాస్పదమైన జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాను కేరళ హైకోర్టు జడ్జ్‌లు చూశారు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…? అనుపమ పాత్రకు జానకి అని పేరు పెట్టడంపై ఎలా స్పందించారు…? ఈ చిత్రంలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో సురేష్ గోపి కీలకపాత్ర పోషించారు.

సినిమా స్టోరీ సంగతేమోగానీ అంతకుమించిన ట్విస్టులు నడుస్తున్నాయి బయట. మిగతా భాషలకు రోల్‌మోడల్‌గా ఉండే మాలీవుడ్‌ సిన్మాలకు కూడా విచిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అలాంటి వివాదంలోనే చిక్కుకుంది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా. సిన్మాలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర పేరు జానకి కావడంపై గతకొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరుని హిందూ పురాణాల్లో సీతాదేవికి పర్యాయపదంగా పరిగణిస్తారు. అలాంటి పవిత్రమైన పేరుని అత్యాచార బాధితురాలి పాత్రకు పెట్టడం సమంజసం కాదంటోంది సెన్సార్ బోర్డు.

అయితే జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే. ఇందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదంటున్నారు ప్రొడ్యూసర్‌. పేరు మార్చడం సాధ్యం కాదంటూ సర్టిఫికెట్‌ కోసం సెన్సార్ బోర్డుకు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాకి సెన్సార్‌ జాప్యంపై కేరళ హైకోర్టు సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. అదే పేరుతో గతంలో పలు పాత్రలు, సినిమాలు వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని న్యాయస్థానం క్వశ్చన్‌ చేసింది. అంతేకాదు… శనివారం జడ్జీలతో పాటు పలువురు లాయర్లు సైతం సినిమాను చూశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగింది. సినిమా చూసిన వాళ్లు ఎలాంటి తీర్పునిస్తారు…? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సెన్సార్ బోర్డు ఆవిర్భావం.. 20వ శతాబ్దం ప్రారంభంలో సినిమా ప్రపంచంలో ప్రజాదరణ పొందింది. అనేక చోట్ల సినిమాల బహిరంగ ప్రదర్శనల సమయంలో సమస్యలు తలెత్తిన తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం 1909లో ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా చట్టాన్ని ప్రవేశపెట్టింది. మొదటి చట్టం బహిరంగ ప్రదర్శనలకు లైసెన్స్‌లు అందించడం. అయితే, స్థానిక ప్రభుత్వాలు ఆ సమయంలో తమను విమర్శించే చిత్రాలకు లైసెన్స్‌లను నిరాకరించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version