51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి

*51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి*

*డి ఏ లు,జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇంకా పెండింగ్ లోనే….!!*

*ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు.*

*ఉచితాలకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడి తెచ్చుకున్న ఆర్థిక హక్కులను కాలురాస్తున్న ప్రభుత్వాలు.*

*కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం సత్వరమే తగిన చర్యలు గైకొనాలి.*

*తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ డిమాండ్*

*కేసముద్రం/ నేటి ధాత్రి*

జూలై 2023 సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాస్టి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో కేసముద్రం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ డిఏలు, మెడికల్ రీయంబర్స్మెంట్, జిపిఎఫ్ ఉపసంహరణ లతో పాటు 2023 జూలై నుంచి అమలు కావల్సిన పి ఆర్ సి ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇవ్వకూడని హామీలు ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచితాల హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారని, కానీ ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు హక్కుగా ఇవ్వాల్సిన డి ఏలు, పిఆర్సీలు మొదలగు వాటిని ఆమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఏరి కోరీ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటిని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మండల శాఖ అధ్యక్షులు అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్, కల్వల తాళ్లపూసపల్లి ఉన్నత పాఠశాలలను, అన్నారం ప్రాథమికొన్నత పాఠశాలలను సందర్శించామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండలశాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య, మండల శాఖ ఉపాధ్యక్షులు ఆంజన్న, కొమ్ము రాజేందర్, కార్యదర్శులు బి విజయ్ చందర్, జీ.మోహనకృష్ణ, బబ్బులు సురేష్ , పి రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం:జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్.

*ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం:జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్.*

*గడిచిన 10 రోజుల్లో జిల్లాలో 31మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.*

*18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 03 కేసులు నమోదు.*

* సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజుజిల్లా పోలీస్ కార్యలయంలో అపరేషన్ ముస్కాన్ టీమ్ లో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లాలో ఉన్న పరిశ్రమలు,

Let’s conduct Operation Muskan strictly: District SP Mahesh. B Gite IPS.

హోటల్స్ , వ్యాపార సముదాయాలు,
గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ -11 విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు..ఈసంవత్సరం జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10 రోజులలో 31 మంది పిల్లలని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని,18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 03 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల RDOవెంకటేశ్వర్లు,CMC చైర్పర్సన్ అంజయ్య,సి.ఐ లు నాగేశ్వరరావు,ఎస్.ఐ లు లింబద్రి, లక్పతి, అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హమ్మద్, మెడికల్ &హెల్త్ నుండి నయుమ్ జహార్, విద్య శాఖ నుండి శైలజ,ఏ ఏఎస్ఐ ప్రమీల,మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా,పోలీస్ అధికారులు,సిబ్బంది అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

వనపర్తి నేటిదాత్రి :

గురుపౌర్ణిమ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం ము ఎన్ టి ఆర్ లలిత కళాతోరణం లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పిలుపుమేరకు గురువులను మహిళ మోర్చా నేతలు గురువులు రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీవెంకటేశ్వర ఆలయ చైర్మన్ అయ్యలూరి రంగనాథచార్యులు విజయకుమార్ శ్రీమతి శ్యామల,

స్వర్ణముకి అకాడమీ చైర్మన్ నాట్యకలా వి నీరజ దేవి లను ఘనంగా సన్మానము చేశారు వారు గురువుల ఆశీర్వాదం తీసున్నారు సన్మానము చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి శ్రీమతి నారాయణదాసు జ్యోతి రమణ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత మాజీ జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా కల్పన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి సుగూరు లక్ష్మి, అర్చన తదితరులు.ఉన్నారు

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఏజెంట్లు

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఏజెంట్లు

నర్సంపేట,నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ సంఘాలుసి బ్రాంచ్ ఏజెంట్లు బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి అధ్యక్షతన సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారు., కార్మికవర్గాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సిఐటియు అనుబంధ సంస్థ ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఎల్ఐఈ ధర్నాలో ఎల్ఐసి ఏఓఐ వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్ గారు మరియు నర్సంపేట బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొనుగోటి సుధాకర్ రావు,గౌరవ అధ్యక్షులు ర్.చoద్రమౌళి,మర్ద గణేష్, నాయకులు కుసుంబ రఘుపతి, కుక్కల వేణు, నెల్లుట్ల అశోక్, నాంపల్లి రాంబాబు, పురాని రాంబాబు, శ్రీధర్ రాజు, సిఐటియు నాయకులు బిక్షపతి,రవీందర్,మల్లేష్,సతీష్, విక్రం, సారంగపాణి,వివేక్,మధుసూదన్,నరేందర్,తదితర ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట లో మే 2025 నెలలో నిర్వహించిన బిఏ,బికామ్,బిఎస్సి (లైఫ్ సైన్సెస్),బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామ్ చంద్రం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాల అటానమస్ సెమిస్టర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కాకతీయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్ రెడ్డి అభినందించారని అన్నారు.అనంతరం ప్రిన్సిపాల్ ఫలితాల వివరాలు తెలిపారు.బిఎస్సిలో 41.74 శాతం,
బి.ఏ లో 51.85 శాతం,బి.కామ్ లో 39.02 శాతం పాస్ కాగా మొత్తం 42.62 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు క్యూ.ఆర్ కోడ్ తో పాటు లింక్ ద్వారా అందుబాటులో కళాశాల వెబ్సైట్ లో ఉంటాయని తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కళాశాల విద్య కమీషనర్ ఎ.శ్రీదేవసేన, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫలితాల విడుదల ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ ఎస్. కమలాకర్,అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజీరు,
డాక్టర్ భద్రు, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్ పాల్గొన్నారు.

మళ్లీ చెల్లరేగుతున్న చిల్లర దొంగలు

Retail thieves on the rise again

లారీల బ్యాటరీలను దొంగతనం చేస్తున్న దొంగలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి సింగరేణి బొగ్గు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి బొగ్గును రవాణా చేయడానికి నిరుద్యోగ యువత చాలామంది ఉపాధి కొరకు లారీలను కొనుగోలు చేసి బొగ్గు రవాణాను వివిధ పరిశ్రమల ప్రాంతాలకు రవాణాచేయడానికి వాహనాలను కొనుగోలు చేశారు ఇది వారి కుటుంబాలకు ప్రధాన ఆదాయంగా మారడం జరిగింది.


చెక్ పోస్ట్, ఫైవ్ ఇంక్లైన్ కమాన్, ప్రధాన రోడ్డు ఇరువైపులా, మెకానిక్ షెడ్లలో వివిధ ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉన్నటువంటి లారీల నుండి లారీల బ్యాటరీలను, డీజిల్, గత రెండు సంవత్సరాల నుండి సుమారు 150 లారీల బ్యాట్లను దొంగిలించిన దొంగలు లారీ యజమానులను ఆర్థిక ఇబ్బందులు గురి చేసే దొంగలను
కొంతకాలం క్రితం పెట్రోలియం పోలీసులు, దొంగలను గుర్తించి చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ ఆరు నెలలుగా స్తబ్దంగా ఉన్న దొంగలు తిరిగి రెచ్చిపోయి
వివిధ ప్రాంతాలలో పార్కింగ్ చేసిన లారీలకు డీజిల్ బ్యాటరీలను,దొంగలించి లారీ యజమాలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న వారిని
పోలీసులు గుర్తించి చట్టపర చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు లారీ యజమానులు భూపాలపల్లి పోలీస్ వారిని కోరడం జరిగింది

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమక్షంలో పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ మరియు టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి రామ్ రాథోడ్ వారితోపాటు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రవీందర్ చవాన్, మాజీ సర్పంచ్ కేశవరం రాథోడ్,

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జహీరాబాద్ మండల అధ్యక్షులు ధర్మరాజు, ఎక్స్ ఆర్మీ రామ్ సింగ్ రాథోడ్, రఘు రాథోడ్, రమేష్ బానోత్ టీచర్, చందర్ పవర్, శీను బానోత్, ధర్మ, సింగ్ పవర్, ఎక్స్ ఆర్మీ పాండు సింగ్ రాథోడ్, రమేష్ పోలీస్, శివాజీ రాథోడ్, అర్జున్ టీచర్, మోహన్ కృష్ణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావుని హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేసిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షులు వివిధ జిల్లా మోర్చా అధ్యక్షులు మండల నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదెత్తును పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 63వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో. పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని తదుపరి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు చాలామంది ఉత్సాహంగా పాల్గొని కేకే కట్ చేసి బర్తడే జన్మదిన వేడుకలను. ఘనంగా నిర్వహించడం పాటు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మండలంలో గ్రామంలో పండ్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం పాటు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నోసార్లుఓడిపోయిన కూడాప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల వెంటనే ఉంటూ ఎల్లకాలం వారి బాగు బాగోళలు. చూసుకుంటూ పార్టీకి అధిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుండి ప్రజా సమస్యల పరిష్కరించే నాయకుడిగా నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అధిష్టానం దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్న మన ప్రియతమ నాయకుడు కేక మహేందర్ రెడ్డి అని ఆయన ఎల్లప్పుడు.పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికైనా అధిష్టానం గుర్తించి తగు ఫలితం దక్కుతుందని ఆశ భావం వ్యక్తంచేశారు. ఇట్టి బర్త్డే కార్యక్రమంలో. మండల అధ్యక్షులు ప్రవీణ్. మునిగల రాజు సత్తు శ్రీనివాస్ రెడ్డి లింగాల భూపతి టెక్స్టైల్ పార్కు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి.రాము లీగల్ సెల్ బొద్దుల రాజేశం. పొన్నాల పరుశురాం పొన్నాల లక్ష్మణ్.ముందాటి తిరుపతి. ఎగుర్ల ప్రశాంత్. కర్ణాకర్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. మీరాల శ్రీనివాస్ యాదవ్. మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లింగం రాణి జిల్లా ఆసుపత్రి బృందం. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత 30 సంవత్సరాల క్రితం పోరాటం సాధిస్తూ వస్తుందని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు మాదిగ మాదిగ ఉపకులాలకు హక్కుల కోసం కృష్ణ మాదిగ జులై ఏడున. ప్రకాశం జిల్లా నుండి ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ను స్థాపించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని అహర్నిశలు కొనసాగించారని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు ఇట్టి కార్యక్రమాన్ని మాదిగ కులాల ఉపకులాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పసుల సుధాకర్ పసుల కమలాకర్. పసుల డేవిడ్. రాజు. బూడిద సంతోష్. పసుల రఘు. బొల్లారం . నానక్. బందా రం ప్రేమ్. దుమాటి రాజయ్య. బొల్లారం దుర్గయ్య. తిరుపతి. జంగంపల్లి రాజు. తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మడేలయ్య బోనాల జాతర

ఘనంగా మడేలయ్య బోనాల జాతర

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతంలోని అరుణక్క నగర్ లో రజకుల వారి కుల దైవం శ్రీ మడేలయ్య స్వామి బోనాల జాతరను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.బుధవారం ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్,

ప్రధాన కార్యదర్శి పుట్టపాక తిరుపతి, గ్రామ అధ్యక్షులు పున్న బక్కయ్య,కార్యదర్శి అన్నారం మహేష్ లు మాట్లాడుతూ… ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రజకుల కుల దైవం శ్రీ మాడెలయ్య స్వామి, సీతాలమ్మ దేవి,ఈదమ్మ దేవి బోనాలు ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజకుల సేవ సమాజ సేవ అని వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ ను అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన రజకుల చిరకాల కోరిక ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. స్థానికంగా ఉన్న నాయకులు మా కుల దైవం శ్రీ మడేలయ్య దేవాలయం నిర్మాణానికి సహాయ,సహకారాలు అందించాలని రజక కులస్తుల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నగనూరి సారయ్య,సహాయ కార్యదర్శి పావురాల రాజయ్య,గ్రామ కోశాధికారి శ్రీరాముల దుర్గయ్య,రజక సంఘ నాయకులు రాములు,శంకర్, తిరుపతి,చందు,శంకర్, రాజేష్,వెంకటేష్,శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.

అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు…

Allotment of double bedroom houses to deserving people…

ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో సతీష్ కుమార్,కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగింది. మంచిర్యాల్ ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు లాటరీ ద్వారా చీటీలు తీసి అర్హులకు ఇండ్ల నెంబర్లను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే విద్యార్థులతో లాటరీ ద్వారా చీటీలు తీయించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు మొదటగా 13 ఇండ్లను లాటరీ ద్వారా అందించిన అనంతరం 217 ఇండ్లను అందరికీ కలిపి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగిందో వారి బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ , ఎలక్షన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ లు తీసుకొని సాఫ్ట్ వేర్ లో డాటా ఎంట్రీ చేసిన అనంతరం పట్టా సర్టిఫికేట్ రాగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లును అందజేస్తామని తెలిపారు.ఇండ్ల కేటాయింపు స్థలమైన క్లబ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు పరిశీలించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా….!

*విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా….!*

Rampant black market business….!

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ ఝరాసంగం మండలంలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.గుట్కా అమ్మగాలపై నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారుల నిఘా లేకపోవడంతో మండలంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు చేపడుతూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇటీవల కాలంలో దీనిపై అధికారులు ఎవరూ అజమాషి చేయకపోవడంతో అక్రమ వ్యాపారులు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యాపారం గుట్టుగా కొనసాగుతుంది.

*- కిరాణా షాపుల్లో పుష్కలంగా గుట్కా అమ్మకాలు*

మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని కిరాణా షాపుల్లో, పాన్ షాపులలో నిషేధ గుట్కాలను పుష్కలంగా అమ్ముతున్నారు. అధికారులు ఎవ్వరు కిరాణా, పాన్ షాపులపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ గుట్కాలు అమ్ముతున్న వారు ఇతర రాష్ట్రాల నుండి ఎంతో గోప్యంగా తీసుకువచ్చి చిరు వ్యాపారులు,పాన్ షాప్ లకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న పాన్ షాప్, చిల్లర దుకాణాల వ్యాపారులు వారు కొన్న ధరల కంటే రెండు రెట్లు లాభాన్ని చూసుకుని గుట్కా ప్రియులకు విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

*- గుట్కాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?*

ఈ నిషేధిత గుట్కాలు మండలానికి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అంటే చత్తీస్గడ్ నుండి మండలంలోని స్వర్ణ గ్రామానికి వస్తున్నాయనే వినికిడి వినిపిస్తోంది. అక్కడ నుంచి ప్రతినిత్యం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడి అండదండలతో ఈ గుట్కా రవాణా చేస్తు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు వున్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర కూడా ప్రతినిత్యం వాహనాల్లో గుట్కాను అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మండల గ్రామాల కేంద్రంగానే గుట్కా దందా జోరుగా సాగుతుందని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా నిషేధాన్ని అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

సొంత నిధులతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్…

నేటి ధాత్రి -గార్ల :-మండల పరిధిలోని, సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఇందిరానగర్ తండ గ్రామానికి చెందిన భూక్యా రమేష్ నాయక్ చిమ్మచీకట్లో ఉన్న పల్లెల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి వెలుగు నింపారు. వర్షాకాలంలో గ్రామాల్లో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు పాము, తెలు కాట్లకు గురవుతారేమోనని ఆందోళన చెందిన రమేష్ వీధి లైట్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. కొందరు రాజకీయాలు చేయడమే పనిగా, తమ స్వార్థం కోసం పని చేస్తుంటే ఇతను మాత్రం తన సొంత డబ్బులతో సమస్య పరిష్కరానికి కృషి చేయడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్ ను ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

 

street lights with own money

క్రీడా మైదానమా లేక డంపింగ్ యార్డ?

నేటిధాత్రి -గార్ల :- రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆశయంతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం నిరుపయోగంగా మారి డంపింగ్ యార్డులా దర్శనమిస్తుంది.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చిన్నకిష్ణాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన క్రీడామైదానం అంగన్వాడి,ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీలకు అతి సమీపంలో ఏర్పాటు చేశారు. అయితే క్రీడా మైదానం పక్కనే డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో సేకరించే చెత్తను డంపింగ్ యార్డులో వేయవలసిన గ్రామపంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్ లో కాకుండా క్రీడా మైదానంలో పడేయడంతో ఇక్కడి చెత్తను కాల్చడంతో ఎగిసిపడుతున్న మంటలు,పోగలతో ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ లోని పిల్లలు,స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య గురించి అనేక దఫాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే క్రీడా మైదానంలో నుండి చెత్తను తీసివేసి డంపింగ్ యార్డ్ లో వేయాలని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నారు.

భాషా రాజకీయాలను నమ్ముకున్న ప్రాంతీయ పార్టీలు

ప్రాంతీయ రాజకీయాలకు రానున్న కాలం అనుకూలం కాకపోవచ్చు

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కొనసాగుతున్న వలసలే ఇందుకు కారణం

వలసలవల్ల ఎక్కువ భాషలపై పట్టు స్థానికులకు ఎంతో ప్రయోజనకరం

దేశవ్యాప్తంగా ప్రజల అనుసంధానతకు దోహదం

అవసరాల రీత్యా పంథాను

మార్చుకుంటేనే పార్టీలకు మనుగడ

డెస్క్‌,నేటిధాత్రి:

మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు రెచ్చగొడుతున్న ప్రాంతీయభాషాభిమానం రానురాను వికృతరూపం దాల్చి, తీవ్రస్థాయి భాషా ద్వేషాలకు దారితీసే ప్రమాదం ఏర్పడుతోంది. దేశ సమైక్యతను దెబ్బతీసేవిధంగా, ప్రాంతీయ దురభిమానాలను రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం కోసం పాకులాడే ప్రాంతీయ పార్టీల వైఖరికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దారుణం. పాఠశాల స్థాయి విద్యలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరాఠీ భాషాభిమానాన్ని నరనరానా నింపుకున్నప్పటికీ గత 18 సంవత్సరాలుగా ఉప్పు, నిప్పుగా వుంటున్న ఠాక్రే సోదరులు ఏకం కావడానికి దోహదం చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరాఠీభాషకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ వీరు విరుచుకుపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సమితి నాయకుడు రాజ్‌ ఠాక్రేలు ఇప్పుడు మరాఠీభాషపై ఒకే రాగం వినిపిస్తున్నారు. అయితే తాను తీసుకున్న నిర్ణయం సరికొత్త సమస్యకు దారితీయడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం దీని అమలులో వెనక్కి తగ్గింది. దీంతో ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఠాక్రే సోదరులు జులై 5న ‘విజయోత్సవాలు’ నిర్వహించడం ఈ భాషా వివాద ఎపి సోడ్‌లో పరాకాష్ట. ఇతవరకు బాగానే వున్నప్పటికీ, ఠాక్రే సోదరులు కలిసి భాషా ‘నినాదం’ చే యడం కొత్త సమస్యలకు దారితీస్తుందేమోన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో చెలరేగిన మరాఠీ భాషాభిమానంతో ఠాక్రే సోదరుల అనుచరులు గుజరాత్‌, ఉత్తరభారత్‌ నుంచి ముంబయిలో నివాసముంటున్న వ్యాపారులతో పా టు వివిధ రంగాలకు చెందినవారిపై విపరీతంగా దాడులు చేయడం చరిత్ర. మళ్లీ అది పునరా వృత్తమవుతుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నిజానికి భాషా వివాదాం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు, ఇటీవల బెంగళూరులో ఒక బ్యాంక్‌ మేనేజర్‌ కన్నడంలో మాట్లాడటానికి అంగీకరించనందుకు, పెద్ద గొడవే జరిగింది. చివరకు సదరు బ్యాంకు యాజమాన్యం మేనేజర్‌ను బదిలీచేసి వివాదానికి తెరదించింది. ఇక తమిళనాడు లో డీఎంకే రాజకీయాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క డీఎంకే నాయకుడికి హిందీ వస్తుంది. కానీ అంతా హిందీని తీవ్రంగా ద్వేషిస్తారు. ప్రాంతీయ పార్టీల మూర్ఖత్వం వల్ల దెబ్బతినిపోయేది ప్రజలు మాత్రమే. నాయకులు బాగానే వుంటారు. ఓట్ల రాజకీయం కోసం వీరి రెచ్చగొట్టే వ్యవహారశైలి దేశ సమగ్రతకు ఎంతమాత్రం ఉపయోగపడదు! స్థానిక భాష తల్లితో సమానం కనుక దాన్ని గౌరవించి తీరవలసిందే. మాతృభాషలో బోధన జరగాల్సిందే. అయితే దేశవ్యాప్తంగా అనుసంధానత ఏర్పడాలంటే జాతీయభాషను అనుసరించక తప్పదు. దీన్ని పక్కనబెట్టి తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టడంవల్ల అశాంతి తప్ప ఒరిగేదేమీ వుండదు.
నిజానికి దేశం సాంత్రంత్య్రం పొందిన తర్వాత, క్రమంగా భాషావివాదాలు చోటుచేసుకోవడం మొదలైంది. దీనికి ఆద్యులుగా చెప్పుకోవలసింది ఆంధ్రరాష్ట్ర ఉద్యమం. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష, ఆత్మార్పణం, 1952 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అప్పటి ప్రధాని నెహ్రూకు ఎంతమాత్రం ఆమోదయోగం కాకపోయినా, ఆంధ్ర పరిణామాల నేపథ్యంలో ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగిన నేపథ్యం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి దారితీసింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈవిధంగా ఏర్పడినవే. తర్వాత బంబాయి రాష్ట్ర వివాదం మరో ప్రకంపనలకు కారణమైంది. సంయుక్త మహారాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బంబాయి రాజధానిగా మరాఠీ బాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆందోళన మొదలైంది. 1955`56లో ఈ ఉద్యమంలో 106మంది ప్రాణాలు కోల్పోవడం చరిత్ర. చివరకు 1960 మే 1న బంబాయి పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా బంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్ప డిరది. నాటి బంబాయి రాష్ట్రం నుంచి గుజరాతీ మాట్లాడేవారితో గుజరాత్‌ రాష్ట్రం ఏర్పడిరది. ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల మధ్య బెలగావీ వంటి సరిహద్దు ప్రాంతాలపై వివాదం కొనసాగు తూనే వుండటం గమనార్హం.
ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో భాషావివాదాలు చెలరేగడానికి ప్రధాన కారణం, ఉత్తర భారత రా ష్ట్రాలైన ఉత్తప్రదేశ్‌, రaార్ఖండ్‌, బిహార్‌ మరియు మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలనుంచి పెద్దఎత్తున జీవనోపాధికోసం ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని టైర్‌`2 నగరాలకు వలసపోవడంతో, సాంస్కృతిక, భాషా పరమైన కొత్త సంప్రదాయాల ప్రవేశంతో పాటు జనాభాపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. హాస్పిటాలిటీ, నిర్మాణరంగం, భద్రత వంటి రంగాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగాలకు, ఉత్తరాదినుంచి వచ్చిన హిందీభాష మాట్లాడేవారు వెన్నెముకగా మారారు. ఇదే సమయంలో ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు ఇదే ఉత్తరభారత్‌ నుంచి వైట్‌ కాలర్‌ (ముఖ్యంగా ఐటీ) ఉద్యోగులు వలస రావడం బాగా పెరిగిపోయింది. వీరి జనాభా క్రమంగా పెరిగిపోవడంతో, స్థానికులు వీరితో సమాచారాన్ని పంచుకోవడానికి హిందీ లేదా ఇంగ్లీషు
భాషలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి పదివేల మందిలో హిందీ భాషను మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈవిధంగా వలసవచ్చిన వారి ప్రభావం క్రమంగా పెరగడంతో స్థానికుల్లో అభద్రతకు దారితీస్తోంది.
ఈ ‘అభద్రత’ భావాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఓట్లు దండుకోవచ్చన్న సత్యాన్ని గ్రహించిన ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు, ప్రాంతీయ భాషా వివాదాలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. తమిళనాడులోని డీఎంకే, పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌, మహారాష్ట్రలోని శివసేన వంటి పార్టీల మనుగడ ఈ ప్రాంతీయ భాషా వివాదాలపై ఆధారపడివుంటం గమనార్హం. ఇటీవలి కాలంలో నరేంద్రమోదీ, అమిత్‌షాలు జాతీయస్థాయిలో రాణిస్తున్న నేపథ్యంలో బీజేపీని గుజరాతీ పార్టీగా, వీరిద్దరినీ గుజరాత్‌కు మాత్రమే ప్రయోజనం కల్పించే నాయకులుగా ఈ ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఆవిధంగా బీజేపీని గుజ రాత్‌కు చెందిన పార్టీగా ప్రజల్లో చూపించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి.
1960 ప్రాంతంలో శివసేన అధినేత బాల్‌ థాకరే, ముంబయిలో తమిళ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరాఠీ యువత ఉద్యోగాలను తమిళులు ఆక్రమించేస్తున్నారంటూ రేపిన ఉద్యమంతో, అప్పట్లో ముంబయి మున్సిపల్‌ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అయితే తర్వాతి కాలంలో శివసేన ప్రగతి ఆగిపోయింది. ఒకదశలో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచర స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్‌, బంబాయి ప్రాధాన్యతను తగ్గించే విధంగా కొన్ని ప్రకటనలు ఇవ్వడం, బాల్‌ థా కరేకు కలిసొచ్చింది. దీంతో మరాఠీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి 1985లో జరిగిన బీఎంసీ ఎన్నిక ల్లో కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. అయితే భాషా రాజకీయాలవల్ల ప్రయోజనం చాలా పరిమితమేనన్న సత్యం థాకరేకు బాగా అర్థం కావడంతో ఒక్కసారిగా హిందూత్వకు అనుకూలంగా దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆవిధంగా పార్టీ బేస్‌ను రాష్ట్రంలో మరింత విస్త రించు కోవడమే కాదు 1995నాటికి బీజేపీలో జట్టుకట్టే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు.
ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ థాకరే కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టి మరాఠీ సెంట్‌మెంట్‌ను రెచ్చగొట్టడంతో 2009లో లోక్‌సభ ఎన్నికల్లో గుర్తించదగిన స్థాయిలో ఓట్ల షేర్‌ను పొందగలిగింది. అయితే కేవలం భాషా రాజకీయాలు ఎంఎన్‌ఎస్‌ ఎ దుగుదలకు ఎంతమాత్రం దోహదం చేయలేదు. పలితంగా పార్టీ ఎదుగుబదుగులేని స్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఈఎస్‌) పరిస్థితి కూడా ఇంతకు మించి గొప్పగా ఏమీ లేదు. బెలగావి ప్రాంతంలో మరాఠీ ప్రజల హక్కులకోసం పోరాటం మొదలుపెట్టినా, ఇప్పుడు ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.
పశ్చిమబెంగాల్‌ విషయానికి వస్తే 2021ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, స్థానిక బెంగాలీ మరి యు ఇతర ప్రాంతాలవారు అన్న అంశాన్ని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా బీజేపీ స్థానిక పార్టీ కాదని, వీరు ఉత్తరాదినుంచి వచ్చినవారుగా అంటే ‘బోహిర్గటో’గా ప్రచారం చేసింది. ఆవిధంగాబెంగాలీ హిందువుల్లోకి బీజేపీ చొచ్చుకెళ్లకుండా అడ్డుకోవడానికి యత్నించింది. ఇదే సమయం లో బీజేపీ హిందూత్వను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే తృణమూల్‌ అమలు చేసే సంక్షేమ పథకాలు, ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడటంతో అధికారంలోకి రాగలిగింది. అంతేకాదు ‘బెంగాలీ అస్మిత’కు తానే ప్రతినిధిగా చూపుకోవడానికి మమతా బెనర్జీ తీవ్రంగా యత్నించారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే ఇప్పుడు హిందీ వ్యతిరేక భావజాలాన్ని బాగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి నామమాత్రమే. ఈ నేపథ్యంలో గట్టి పోటీదారులైన డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే అధికార మార్పిడి జరుగుతుంటున్న నేపథ్యంలో, ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు, బీజేపీని గుజరాతీల పార్టీగా ప్రచారం చేశాయి. ముఖ్యంగా గుజరాతీ వ్యాపారులు, మరాఠి అస్మితను దెబ్బతీస్తున్నా రంటూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి యత్నించారు. ఇంతగా ప్రచారం చేసినా మహాయుతి (ఎన్‌డీఏ) మొత్తం 288 స్థానాల్లో 235సీట్లను గెలుచుకొంది. మొత్తంమీద ఈ విశ్లేషనలను పరిశీలిస్తే, ప్రాంతీయ భాషా వివాదాలు, ప్రాంతీయతలు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, ఎన్నికల సమయంలో ఓట్లను రాబట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయన్నది స్పష్టమవుతోంది. ఇదే సమయంలో ఒక్క భాషా వివాదాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ఏ పార్టీకి భవిష్యత్తు వుండదనేది కూడా సుస్పష్టం. ఎంతవద్దనుకున్నా టైర్‌`2, టైర్‌`3 పట్టణాల్లోకి ఉపాధి అవకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో భాష కంటే, సౌకర్యాలు, సదుపాయాలు, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువ. భాషా వివా దాలవల్ల ప్రయోజనం లేదని, కేవలం సుపరిపాలన వల్లనే సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభ వించగలుగుతామన్న భావన పెరగడంవల్ల పార్టీలు కూడా భవిష్యత్తులో తమ స్టాండ్‌ను మార్చుకోక తప్పదు.

స్పోర్ట్స్‌ మాన్‌..స్పోర్టివ్‌ పోలిటిషియన్‌!

`ప్రతిపక్షాలకు అంతుపట్టని సీఎం. రేవంత్‌ రెడ్డి రాజకీయం

`కాంగ్రెస్‌ నాయకులు కూడా అంచనా వేయలేకపోతున్న పాలనా వ్యవహారం

`ఇలాంటి రాజకీయం గతంలో ఎవరూ చేయలేదు

`ఒక స్పోర్ట్స్‌ మాన్‌లో వుండే స్పిరిట్‌ అందరికీ అర్థం కాదు

`పడిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహముతో ముందుకెళ్తారు

`రాజకీయంలో అదే చూపించి గెలిచారు

`పాలనలో కూడా అదే ఫాలో అవుతున్నాడు

`నిజాలు నిర్భయంగా చెప్పేస్తారు

`ప్రతి సవాలును ఎదుర్కొని నిలబడతారు

`ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోరు

`వెనుకబడినట్లు కనిపించినా విజయాన్ని అందరి ముందు అందుకుంటారు

`ప్రత్యర్థులను దారి మళ్లించే ఎత్తులు వ్యూహాత్మకంగా వేస్తారు

`ప్రతిపక్షాలను అల్లాడిస్తూ, ఊహకందిని దెబ్బ కొడుతున్నారు

`ఆరు గ్యారంటీలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు

`బీఆర్‌ఎస్‌ ఎక్కువ తప్పటడుగు వేసిందో అక్కడి నుంచి మొదలుపెట్టారు

`కుందేలు, తాబేలు కథను అక్షరాల అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు

`ఒక్కక్కటీ పూర్తి చేసి తిరుగులేని శక్తిగా మారుతున్నాడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  కౌరవులను ఓడిరచాలంటే, రాజ్యం గెలవాలంటే ధర్మ రాజు కూడా అబద్దమాడక తప్పలేదు. రాజుల మధ్య యుద్దంలో రాజ్యాల కోసం యుక్తితోనే కాదు, కుయుక్తులు కూడా ఆచరించాల్సిందే. లేకుంటే విజయం వరించదు. రాజ్యం దక్కడు. రాజకీయం కూడా అంతే అధర్మ పాలన అంతం చేయాలంటే కొన్ని సార్లు నాయకులు మాటలు చెప్పకతప్పదు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనేది రాజకీయాలకు కూడా పనికొస్తుందని చూపించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. అబద్దాలను, అబద్దాలతోనే ఎదుర్కొవాలని తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే 2015లో ఓసారి అమెరికా వెళ్లినప్పుడు కుండబద్దలు కొట్టినట్లు నాయకులు ఎలాంటి వారు. తనతోసహా అంటూ ఆయన రేవంత్‌ చెప్పిన మాటలు అప్పుడు ఆశ్చర్యానికి గురిచేశాయి. కాని అదే రేవంత్‌రెడ్డికి విజయం కూడా చేకూర్చాయి. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి బోలా శంకురుడు. ఏది మనసులోదాచుకోడు. నిజమైనా, అబద్దమైన నిర్భయంగా చెప్పగలిగే ఏకైక నాయకుడు. అందుకే అలవి కాని హామీలను గుప్పించి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసిఆర్‌ను ఓడిరచాలంటే అదే మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. కేసిఆర్‌ ఎత్తుకు పై ఎత్తు వేశారు. ఆఖరుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫోస్టోను కేసిఆర్‌ కూడా అనుసరించేలా చేశారు. అక్కడే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎన్నికల ముందే గెలిచాడు. ఎందుకంటే కాంగ్రెస్‌ హామీలను కేసిఆర్‌ కూడా కాపీ కొట్టి మరోసారి నమ్మించాలని చూశాడు. సిఎం.రేవంత్‌ రెడ్డి ముందు కేసిఆర్‌ పప్పులుడకలేదు. నిజాన్ని బతికించాలంటే అబద్దాన్ని కూడా ఓ ఆయుధంగా రేవంత్‌రెడ్డి వాడుకోవాలనుకున్నాడు. అక్షరాల అదే అనుసరించారు. కేసిఆర్‌ పాలనకు చరమగీతం ప్రజల చేత పాడిరచారు. కేసిఆర్‌కు దిమ్మతిరిగేలా రేవంత్‌ రెడ్డి రాజకీయం నెరిపి తెలంగాణలో టాల్‌ పర్సనాలిటీ అయ్యారు. నాయకుడుగా గెలిచి నిలిచారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలకుడయ్యారు. ఇలాంటి రాజకీయాలు అందరి వల్ల కాదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి ఒక స్పోట్స్‌ మాన్‌. నిజమైన స్పోర్టివ్‌ పొలిటీషియన్‌. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పాలకపక్షంలోని వాళ్లుకు, ఇటు ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాంతో అంతుపట్టని రాజకీయం సిఎం. రేవంత్‌ చేస్తున్నారు. పైకి చూడడానికి ఏమీ లేదనే భావన కల్పిస్తున్నాడు. ప్రతిపక్షాలను చూపును మరల్చి తాను అనుకున్న వ్యూహం అమలు చేస్తున్నారు. అది తెలిసిన నాడు బిఆర్‌ఎస్‌, కేసిఆర్‌కు కూడా మరోసారి దిమ్మ తిరిగిపోవాలి. ఎవరికీ అంతు పట్టని రాజకీయాన్ని రేవంత్‌రెడ్డి చూపిస్తున్నారు. అది అర్దం కాక పాలన తేలిపోతుందని అనుకుంటున్నారు కాని, అసలు రాజకీయం తెలిసేందుకు మౌనం వహిస్తున్నాడు. ఇలాంటి రాజకీయం గతంలో ఎవరూ నెరపలేదు. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి ఒక స్పోర్ట్‌ మ్యాన్‌. వారిలో వుండే స్పిరిట్‌ అందిరకీ అర్దం కాదు. చేసుకోలేరు. ఆయన పరిపానలతో కూడా అనుసరిస్తున్న వ్యూహంలో చాలా లోతైన ఆలోచన వుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అది తెలియక ఇచ్చినవి కాదు. తెలిసే ఇచ్చారు. ఎందుకంటే కేసిఆర్‌ రెండుసార్లు ఇచ్చిన హమీలను నిశితంగా రేవంత్‌ రెడ్డి గమనిస్తూ వచ్చారు. వాటిని తలదన్నేలా కొత్త వ్యూహాలు ఎంచుకున్నాడు. ఓ వైపు కేసిఆర్‌ ఇచ్చిన హమీలను అమలు చేస్తూనే, కేసిఆర్‌ ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి రేవంత్‌ పాలనా రాజకీయం నెరుపుతున్నారు. రుణమాఫీతోనే మొదలు పెట్టారు. కాని అది అందరూ అర్దం చేసుకోవడం లేదు. గత పదేళ్ల కాలంలో కేసిఆర్‌ రెండుసార్లు రుణమాఫీ చేశారు. కాని అది ప్రజల్లోకి వెళ్లలేదు. దానిని మర్చిపోయేందుకు కేసిఆర్‌ రైతు బంధు తెచ్చారు. నిజం చెప్పాలంటే రుణమాఫీ చేస్తే రైతులు అప్పుడే మర్చిపోతారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తే మళ్లీ ఎన్నుకుంటారని భావించాడు. అది కూడా ఒకే దఫాకు రైతులు మర్చిపోయేలా రేవంత్‌ రెడ్డి చేశారు. అందుకే ముందు రేవంత్‌ రెడ్డి పదే పదే రుణమాఫీ చేశారు. అది కాకుండా ఇందిరమ్మ ఇండ్లు చేపట్టినా ప్రజల్లో రుణమాఫీ మీదనే రైతుల ఆలోచన వుండేది. రైతు భరోసా రెండు సార్లు ఆపేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. పల్లెల్లో కొత్త శోభను తెచ్చాడు. కేసిఆర్‌ నీళ్లు తెచ్చినా, కరంటు తెచ్చినా డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ప్రజలున్నారు. అందులో రైతులు కూడా వున్నారు. ఈ రెండు వర్గాలను ఏక కాలంలో గెలవాలంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు మెదలు పెడితే ప్రజలను ఆకర్షించొచ్చు అనుకున్నారు. ఇటీవల రైతు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. దాంతో పల్లెల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రైతు రుణమాఫీపై చర్చ ఆగిపోయింది. రైతు భరోసా అందలేదన్న మాట ఆగిపోయింది. రైతుకు బ్యాంకుల రుణాలు ఎక్కడా ఆగలేదు. పదేళ్లుగా అదిగో, ఇదిగో డబుల్‌ బెడ్‌ రూంలు అంటూ ఊరించిన కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వలేదు. దాన్ని ముందు పూరిస్తే కాంగ్రెస్‌ మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి బలంగా నిరూపించాలనుకున్నారు. తొలి విడతగా లక్ష ఇండ్లు మాత్రమే మొదలు పెట్టారు. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకున్నారు. ప్రజల్లో ఇండ్లపై వున్న ఆశలు తీర్చే నాయకుడుగా రేవంత్‌ను ప్రజలు కీర్తిస్తున్నారు. ఇలా వచ్చే ఐదేళ్లులో ఏడాదికి 5లక్షల ఇండ్లు మంజూరు చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల నాటికి ఎంత లేదన్నా 15లక్షల మందికి ఇండ్లు అందుతాయి. కేసిఆర్‌ రైతు బంధు సకాలంలో ఇచ్చేవారన్న మాట పల్లెల్లో ఎలా వుందో..రేవంత్‌ రెడ్డి మిగిలిపోయిన వాళ్లు తప్పకుండా ఇండ్లు ఇస్తారన్న నమ్మకం మరింత బలపడుతుంది. అది వచ్చే పంచాయితీ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పెట్టేందుకు దోహపడుతుంది. ఎందుకంటే కేసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలకు, ఖనాలో సొమ్ముకు చాలా అగాదం వుందని తెలుసుకున్నాడు. అందుకే డబుల్‌ బెడ్‌ రూంలకోసం అప్పులు పుట్టవు. సాగునీటి ప్రాజెక్టుల కోసమంటూ అప్పులు పుడతాయనుకున్నారు. కరంటు సమస్య తీరిస్తే ప్రజలు హమీల ఆలోచన మారుతుందనుకున్నాడు. అందుకే ఏక కాలంలో కేసిఆర్‌ చెరువుల పునరుద్దరణ అంటూ అప్పులు తెచ్చాడు. కరంటు ఉత్పాదన కోసం అప్పులు తెచ్చాడు. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పేరు చెప్పి అప్పులు చేశాడు. సంక్షేమ పథకాలపై ప్రజల ఆలోచన మళ్లకుండా కళ్యాణ లక్ష్మిని తెచ్చాడు. దాంతో రైతులు రుణమాఫీపై నిలదీయలేదు. డబుల్‌ బెడ్‌ రూంల గురించి మాట్లాడలేదు. రైతులకు మూడెకరాల భూమి గురించి మర్చిపోయారు. కళ్లముందు నీళ్లు, కరంటు కనిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదన్న మాట మర్చిపోతారనుకున్నాడు. కళ్యాణ లక్ష్మి తెచ్చి మేనమామ అనిపించుకుంటాననుకున్నాడు. ఇందిరమ్మ ఇండ్లను పట్టించుకోలేదు. ఇవ్వడం సాధ్యం కాదనుకున్నాడు. ఆసమయంలో ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన 30లక్షల అప్లికేషన్లు చూసి సాధ్యమయ్యేది కాదనుకున్నాడు. అలా అటకెక్కించిన పథకాలను రేవంత్‌ రెడ్డి ఎంచుకున్నారు. ఎంత పరుగెత్తినా కేసిఆర్‌ డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. దానికితోడు ప్రజలకు నాయకుడుగా కేసిఆర్‌ అందుబాటులో లేరు. ఇన్ని పథకాలు అందించిన తర్వాత తాను జనంలోవున్నా, లేకున్నా ఓట్లు ఎక్కడికి పోవనుకున్నాడు. కాని కేసిఆర్‌ ఎక్కడ పొరపాట్లు చేశాడో వాటినే ఎన్నికల ముందు రాజకీయంగా రేవంత్‌ పట్టుకున్నారు. సెక్రెటరియేట్‌కు రాని ముఖ్యమంత్రి ఎందుకన్నాడు. ప్రగతి భవన్‌లో దాటి కేసిఆర్‌ రాకపోవడాన్ని తప్పు పట్టాడు. ఫామ్‌ హౌజ్‌లో వుండడాన్ని దొరతనంగా చిత్రీకరించారు. ఇలా కేసిఆర్‌పై అడుగడుగునా వ్యతిరేకత పెరిగేలా చేశారు. కేసిఆర్‌ దృష్టి అంతా రేవంత్‌ రెడ్డి మీద ఫోకస్‌ అయ్యేలా రాజకీయం నెరిపాడు. రేవంత్‌ రెడ్డితో తన రాజకీయ పతనం కేసిఆర్‌కు కదిలేలా చేశాడు. అప్పటి నుంచి రేవంత్‌పై నిర్భందం పెరిగేలా చూసుకున్నాడు. రేవంత్‌ రెడ్డికి జనంలో సానుభూతి సంపాదించుకున్నారు. కేసిఆర్‌ను ఎదిరించే నాయకుడు కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే అనే భావన ప్రజల్లో కల్పించారు. మరో వైపు ఎన్నికల శంఖారావం తాను పిసిసి. అద్యక్షుడైనప్పటి నుంచి పూరించి, ఏడాది ముందు రేవంత్‌ రెడ్డి ఆడిన ఆటను కేసిఆర్‌ కూడా తట్టుకోలేకుండా చేశాడు. ఓటమిని ఎన్నికల రాకముందే కేసిఆర్‌కు రుచి చూపించి, జనం మద్దతు కూడగట్టుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రేవంత్‌ సిఎం. అయ్యారు.

యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ

 

యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ ఎంటర్ప్రైజెస్.

సీఎం డి సంజయ్ భరత్ రెడ్డి

చిట్యాల,నేటిధాత్రి :

యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ముందుకు సాగుతున్నదని ఆ సంస్థ సిఎండి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగం లేదని ఉపాధి అందడంలేదని యువకులు ప్రభుత్వం పనిలేదని అన్నారు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు పలు రకాల అవకాశాలు కల్పించే విధంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నం చేస్తుందన్నారు పలు రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలు ఉపాధ్యాయ అవకాశాలను సృష్టించి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుందని సంస్థ సీఎంటి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మొదటగా ప్రజలకు అత్యంత అవసరం ఉన్న 55 65 ఇంచుల టీవీలను తక్కువ ధరకు అందించడమే కాకుండా యువకులను అన్ని రకాలుగా అభివృద్ధి చెందే మార్గదర్శకాలను వారికి బోధించడం జరుగుతుందన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే లక్షలాది రూపాయలు సంపాదించి మార్గాలను తెలియజేయడంతో పాటు తమ ఆకాశ సంస్థలో పూర్తిస్థాయి భాగస్వామ్యాన్ని కల్పించడం

 

 

 

 

జరుగుతుందనిఅన్నారు. 55 ఇంచ్ల టీవీని 60 వేలకు మాత్రమే అందిస్తూ మరో 10 వేల విలువ చేసే హోం థియేటర్ ను సైతం అందించడం జరుగుతుందని 24 వేల రూపాయలు చెల్లించి టీవీ మరియు హోమ్ థియేటర్ను తీసుకొని వెళ్లవచ్చునని అన్నారు. లేదంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలను చెల్లించి తమ పేరును బుక్ చేసుకొన్న అనంతరం మరొక పదిమంది తమ స్నేహితులను సంస్థ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసి టీవీ హోమ్ థియేటర్ ను తీసుకొని వెళ్ళిపోవచ్చని అనంతరం ఈఎంఐలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు తీసుకున్న టీవీ సంవత్సరంలోపు పాడైతే తిరిగి కొత్త టీవీని అందించడం జరుగుతుందని లేదంటే రెండు సంవత్సరాల వారంటీ రూపకంగా ఎలాంటి సమస్య తలెత్తిన రెండు సంవత్సరాల వరకు దానిని బాగు చేసి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంపెనీలలో టీవీ తీసుకున్న ప్రతి వారు షేర్ హోల్డర్ గా

 

 

 

పరిగణించబడుతారాన్నారు. కంపెనీ కోసం ఎలాంటి పని చేయకపోయినా ఎంటర్ప్రైజెస్ ద్వారా వచ్చే లాభాల్లో పర్సంటేజ్ ని ప్రతి యేటా పంచుడం జరుగుతుందని భరత్ రెడ్డి తెలిపారు. జిల్లా మొత్తంలో కేవలం 150 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఉత్సాహవంతులైన వారు ఎవరైనా కంపెనీకి షేర్ హోల్డర్లుగా చేరవచ్చును అన్నారు ఎలాంటి రుసుము అవసరం లేదని ఒక్క రూపాయి కూడా కంపెనీ కోసం పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. కావలసిన పెట్టుబడి మొత్తంగా ఆకాష్ ఎంటర్ ప్రైజెస్ నుంచే అందుతుందన్నారు మరిన్ని వివరాల కోసం సెల్ నెంబరు 9398903016 నందు సంప్రదించవచ్చు అన్నారు.

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలోని వెంకట చెరువు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో 34 మంది రోగులను పరీక్షించారు
అనంతరం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను బాలింతలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గల గ్రామాలలో మరి ముఖ్యంగా మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశం అధికంగా ఉన్నది కనుక ఆశకార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది గ్రామాన్ని తరచూ సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలి అని అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ కొండ్రు నరసింహ మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత పాల్గొన్నారు

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

. మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రామస్వామి విజయ గార్ల కుమారుడు చి||వినయ్ -చి||ల||సౌ శ్రీజ గార్ల వివాహ వేడుకల్లో పాల్గొన్ని వధూ వరులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సి ఎస్ ఐ సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్స్
అనంతరం మొగుళ్ళపల్లి మండలం,పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు కాల్వ రాములు -రజిత గార్ల కుమార్తె అక్షిత నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి వెంట ప్రజా ప్రతినిధులుమండలకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version