ఘనంగా మడేలయ్య బోనాల జాతర
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతంలోని అరుణక్క నగర్ లో రజకుల వారి కుల దైవం శ్రీ మడేలయ్య స్వామి బోనాల జాతరను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.బుధవారం ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్,
ప్రధాన కార్యదర్శి పుట్టపాక తిరుపతి, గ్రామ అధ్యక్షులు పున్న బక్కయ్య,కార్యదర్శి అన్నారం మహేష్ లు మాట్లాడుతూ… ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రజకుల కుల దైవం శ్రీ మాడెలయ్య స్వామి, సీతాలమ్మ దేవి,ఈదమ్మ దేవి బోనాలు ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజకుల సేవ సమాజ సేవ అని వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ ను అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన రజకుల చిరకాల కోరిక ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. స్థానికంగా ఉన్న నాయకులు మా కుల దైవం శ్రీ మడేలయ్య దేవాలయం నిర్మాణానికి సహాయ,సహకారాలు అందించాలని రజక కులస్తుల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నగనూరి సారయ్య,సహాయ కార్యదర్శి పావురాల రాజయ్య,గ్రామ కోశాధికారి శ్రీరాముల దుర్గయ్య,రజక సంఘ నాయకులు రాములు,శంకర్, తిరుపతి,చందు,శంకర్, రాజేష్,వెంకటేష్,శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.