నేటి ధాత్రి -గార్ల :-మండల పరిధిలోని, సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఇందిరానగర్ తండ గ్రామానికి చెందిన భూక్యా రమేష్ నాయక్ చిమ్మచీకట్లో ఉన్న పల్లెల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి వెలుగు నింపారు. వర్షాకాలంలో గ్రామాల్లో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు పాము, తెలు కాట్లకు గురవుతారేమోనని ఆందోళన చెందిన రమేష్ వీధి లైట్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. కొందరు రాజకీయాలు చేయడమే పనిగా, తమ స్వార్థం కోసం పని చేస్తుంటే ఇతను మాత్రం తన సొంత డబ్బులతో సమస్య పరిష్కరానికి కృషి చేయడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్ ను ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.