*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…
*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..
*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…
చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:
పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 56మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు తవక్కల్ విధ్యాసంస్థల అధినేత, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ,గాండ్ల సమ్మన్న మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ గురుపౌర్ణమి సంధర్భంగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ మంచి కార్యక్రమాన్ని చేయడం హార్షనీయమైన గత 8సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్ పట్టణంలో యువత జనం సభ్యులు సేవలు చేస్తున్నారనీ భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువ మంది సేవలు చేయాలని సంస్థ సభ్యులనీ అభినందించారు … యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు రమాదేవి శోభ నాయకులు గూడ సత్తన్న,కోక్కుల సతీష్ సంగ రవి యాదవ్ భాస్కర్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,
– 5000 రూపాయలను అందించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతి.
నేటి ధాత్రి- మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నె అంజి అనే విద్యుత్తు తాత్కాలిక ఉద్యోగి ఈనెల మూడవ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్తు పోలు నుండి విద్యుత్ షాక్ తగలడం వలన కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు ప్రస్తుతం హైదరాబాదు యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందుతున్నాడు,
గాయపడిన జన్నె అంజి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది జన్నె అంజి తండ్రి సైతం మంచాన అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది మొట్లపల్లి సబ్స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న జన్నె అంజి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో.. అంజికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా తయారయింది. అంజి దయనీయ పరిస్థితి గురించి వివిధ పత్రికలలో కథనాలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధినేత ఐలు మారుతి స్పందించి బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు అంతేకాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయంగా చేతనందిస్తానని భరోసా ముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ నరహరి పద్మా వెంకటరెడ్డి 5000 రూపాయలను అందించగా బజ్జూరి వేణుగోపాల్ వెయ్యి రూపాయలు బజ్జూరి వీరన్న పెడిసిల్ల 1000 రూపాయలు గూడూరి రఘుపతి రెడ్డి 1000 రూపాయలు శ్రీ పల్లి రాజేష్ 2000 రూపాయలు దర్శనాల సురేష్ 2000 రూపాయలు టేకుమట్ల లైన్మెన్ రఘు వెయ్యి ఇలా చాలామంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి అందించి తమ ఔదార్యాన్ని చాటారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతి. ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి బజ్జూరి వేణుగోపాల్ బజ్జూరి వీరన్న సీనియర్ జర్నలిస్టు రాళ్ల బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,
కోడి పందాల స్థావరం పై జైపూర్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించినట్లు తెలిపారు.జైపూర్ మండలం దుబ్బ పల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో జైపూర్ ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.వివరాల్లోకి వెళితే సిసిసి నస్పూర్ కు చెందిన గడ్డం సతీష్,లక్షేటి పేట కోమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేష్,శ్రీరాంపూర్ తీగల పహాడ్ కు చెందిన చెట్టుకురి రాజేష్ అదుపులోకి తీసుకొని విచారించగా అక్కడినుండి పోలీసులను చూసి కొంతమంది పారిపోయినట్లు వారు తెలిపారు.అక్కడి నుండి పారిపోయిన వ్యక్తులు వివరాలు ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్,యతి రాజు,వంశీ,మహేష్,వైద్య గణేష్ టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్,గోదావరిఖనికి చెందిన పాకి సందీప్,నస్పూర్ కు చెందిన రంగు సాయి, అరుణక్కనగర్ శ్రీరాంపూర్ చెందిన ఉదయ్ పారిపోయినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నేరస్తుల వద్ద నుండి ఒక కోడి,31 కోడి కత్తులు,3840 రూపాయల నగదు,మూడు సెల్ ఫోన్లు,ఏడు వాహనాలు స్వాధీనపరచుకొని జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.
*నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే*
*బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శి సబ్బని హరీష్*
*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సబ్బని హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుంది తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్లను చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుంది. దీనివల్ల వాళ్లు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారు
బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటివరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి విద్యా వ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర తీశారు.స్వయానా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గురుకులాల్లో విషాహారం, పాము కాట్లు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పుడు నర్సింగ్ కళాశాల విద్యార్థుల ను హాస్టల్ నుండి గెంటి వేతలు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది
ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థుల హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము చూస్తూ ఊరుకోం వెంటనే వాళ్ళ స్టైఫండ్ విడుదల చేయాలి.
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు అందరితో కలిసి ఆయా కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని
బిఆర్ఎస్వి పక్షాన హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టల సాయి దీపక్ రాచమల్ల మోహన్ కనుకుంట్ల వెంకటరమణ రాచమల్లు రామ్, భరత్,రాము,చిరంజీవి, నరేష్, సోఫీయాన్, మణి దిప్ సాయి తదితరులు పాల్గొన్నారు
*విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నత శిఖరాలకు ప్రభుత్వ విద్య..
*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ క్రీడా పై శిక్షణ ఏర్పాటు చేస్తాం..
*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 10:
విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి కొర్లగుంట లోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పొశారు. అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్, షూ లు అందిస్తున్నారని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13000 జమ చేయడం జరిగిందని తెలియజేశారుదేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. చదువుతోపాటు ఆటపాటల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తెలివితేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడ పై శిక్షణ ఏర్పాటు చేస్తామని ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు తుడా తోపాటు తన వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని పాఠశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్
మాస్టర్, రవిచంద్రన్, ఇన్ చార్జీ,
హెడ్
మా
స్టర్ రవికుమార్, పాఠశాల చైర్మన్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయా లని వినతిపత్రం అందజేత*
*పద్మశాలీలందరూ ఒక రూపాయి చెల్లించి ప్రమాద బీమా పొందాలి*
*అఖిలభారత పద్మశాలి సంఘ మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య*
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్మికులకు అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీ డివో కు వినతిపత్రం అంద జేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని చేనేత కార్మికు లకు 50 సంవత్సరాలు నిండిన అర్హులైన పద్మశాలిలందరికీ జియో టాక్ షో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని, రాష్ట్రంలోనీ చేనేత కార్మికులు గతంలో 1500 మంది ఆత్మహత్య చేసుకు న్నారు ఇప్పటికీ ఆసరా పింఛన్లు కొనసాగలేదని నేటికీ పని ఉపాధి లేక అనేక ఇబ్బం దులు పడుతున్నారని రాష్ట్రం లో గత అనేక సంవత్సరాల నుండి నేటికీ చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు పింఛన్లు మంజూరు చేయాలని, రెక్కాడితే గాని డొక్కాడని పేదవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి లందరూ ఒక రూపాయి సభ్యత్వ నమోదు తీసుకొని ప్రమాద బీమా పొందగలరు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దిడ్డి రమేష్, చిందం రవి, బాసని శాంత, ప్రభాకర్, చంద్రమౌళి, వనం దేవరాజు ,రమేష్, రాజశేఖర్ ,బాలకృష్ణ, మల్లి కార్జున్, అన్ని గ్రామాల అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
గ్రామ కార్యదర్శులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే అయిదు నెలలుగా ట్రాక్టర్ డీజిల్‌తో పాటు ఇతరత్రా మరమ్మతుల కోసం సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. దీనికి తోడు అధికారులు అప్పగిస్తున్న పలు సర్వేలతో ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామ కార్యదర్శులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే అయిదు నెలలుగా ట్రాక్టర్ డీజిల్‌తో పాటు ఇతరత్రా మరమ్మతుల కోసం సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. దీనికి తోడు అధికారులు అప్పగిస్తున్న పలు సర్వేలతో ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కొద్ది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారిని సముదాయించి పని చేయించడానికి కార్యదర్శులు పడుతున్న కష్టాలు అన్నీ..ఇన్నీ కావు..
గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి అయిదు నెలలు గడచిపోయింది. ప్రత్యేకాధికారులు ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 5 నెలల నుంచి, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 24 నెలల నుంచి పంచాయతీలకు రావడం లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామాభివృద్ధిలో ప్రముఖ భూమిక పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామ పంచాయతీలు ఉండగా 631 మంది కార్యదర్శులు ఉన్నారు. మిగతా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గ్రామాల అభివృద్ధి పనులతో పాటు మరమ్మతులు తదితర వ్యవహారమంతా సర్పంచ్‌లు, పాలకవర్గాలు చూసుకునేది.. గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగియగా, ఆ వెంటనే ప్రభుత్వం ప్రతీ గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించింది. ఇతర శాఖలో కీలకంగా ఉన్న గెజిటెడ్ అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు గ్రామాలపై సరైన దృష్టి సారించలేకపోతున్నారు. తమ మాతృ శాఖలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడో ఒక సారి గ్రామాలకు వెళ్తు సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితమవుతున్నారు.
*అంతా తామై..*
పంచాయతీ పాలన భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరమ్మతు పనుల నిర్వహణ బాధ్యత, సిబ్బంది జీతభత్యాలు, పన్నుల వసూళ్లు, ఆదాయ, వ్యయం లావాదేవీలు, నెలవారి చెల్లింపులు తదితర విషయాలన్నీ పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరీ అప్పులు చేసి జీపీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని కార్యదర్శులు వాపోతున్నారు.
*నిలిచిపోయిన నిధులు..*
గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. ట్రాక్టర్‌కు అవసరమైన డీజిల్‌తో పాటు పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య నిర్వహణ, సెగ్రిగేషన్ షెడ్లు, చెత్త దంపింగ్ యార్డులు, శ్మశానవాటిక నిర్వహణ, వాటర్ ట్యాంక్‌ల క్లోరినేషన్ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 5 నెలల నుంచి, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 24 నెలల నుంచి పంచాయతీలకు రావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధుల కొరత ఏర్పడింది. జీపీ కార్మికుల జీతాలు ఇవ్వలేక, ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు కట్టలేక కార్యదర్శులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వసూలైన పన్నులు, ఇతరత్రా ఆదాయం సాధారణ ఖర్చులకే సరిపోవడం లేదు. ఏదైనా మరమ్మతులు, అత్యవసర అవసరాలకు పంచాయతీ కార్యదర్శులే తమ జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు పాలకవర్గాలు లేక, నిధులు రాక, అటు ప్రత్యేకాధికారులు పట్టించుకోక అడకత్తెరలో పొకచెక్కలా కార్యదర్శులు నలిగిపోతున్నారు.
*సర్వేలతో సతమతం……*
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందాన పంచాయతీల పాలనతోనే అష్టకష్టాలు పడుతున్న పంంచాయతీ కార్యదర్శులపై సర్వేల భారం మోపుతున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. తమ శాఖలకు సంబంధం లేని సర్వేలను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటా మిషన్ భగీరథ నల్లాల వివరాలను నమోదు చేసే విషయంలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించారు.
◆ ప్రభుత్వ ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన పట్టణ బి.ఆర్.ఎస్ నాయకులు.
*జహీరాబాద్ నేటి దాత్రి:*
జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి జన్మదినం పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టణ బిఆర్ఎస్ నాయకులు ప్రారంభించడం జరిగింది
… ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.. పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకుని వృధా ఖర్చులు చేయకుండా ఎమ్మెల్యే గారు మంచి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు… సీనియర్ నాయకుడు నామారవి కిరణ్,
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ తంజీం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మహ్మద్ యూసుఫ్, పట్టణ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ యాకూబ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా, పురుషోత్తం రెడ్డి, గణేష్, అప్పి రాజ్, ఆశమ్, జుబేర్ ,వహీద్, ఇబ్రహీం, అలీమ్, సలీం అశోక్ రెడ్డి, ప్రవీణ్ చింటూ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కృష్ణకాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించుకుని స్వామి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని కలిసిన గుర్రపు నాగరాజు గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రామచందర్ రావును టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు నాయకత్వంలో బిజెపి బృందం హైదరాబాదులోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుని వలె పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి గోపాల్ కుర సురేందర్ రెడ్డి బండారి సమ్మయ్య గాజుల అజయ్ తదితరులు పాల్గొన్నారు
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో వనమహోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. “మానవ సేవయే మాధవ సేవ” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బెజుగం రాజయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: జహీరాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ 12వ వార్డులో మురికి కాలువలను నెలరోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై పారుతోంది. మున్సిపల్ అధికారులు ఇతర కాలనీలను పరిశీలిస్తున్నప్పటికీ, ఈ వార్డును పట్టించుకోవడం లేదు. శానిటైజర్ సూపర్వైజర్ సిబ్బందిని వేరే ప్రాంతాలకు పంపుతున్నారు. అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించి శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు
ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు
మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.
కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
యాదవ మండల సంఘ అధ్యక్షునికి ఘనంగా సన్మానం…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మండల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బండి దేవేందర్ యాదవును.
తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు మండల సభ్యులు మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బండి దేవేందర్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో యాదవులు నాపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా ఉండి మండలంలో సంఘం సభ్యులఅందరిని ఏకతాటిపై నడిపించి యాదవ సంఘం తరఫున వచ్చే ఆ టువంటి నిధులైన సహాయ సహకారాలైన ఎటువంటి సమస్య వచ్చిన వారి వెన్నటువంటి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండల అధ్యక్షునిగా ఎన్నికైన నాకు ఘనంగా సన్మానించిన యాదవ సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రాళ్లపేట గ్రామ అధ్యక్షులు రమేష్. ప్రధాన కార్యదర్శి సంజీవ్. సాయి. కనకయ్య. దుర్గయ్య. మహేష్. ఎల్లయ్య. దేవేందర్. రాజమల్లు. సురేష్ యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
గుడ్లకర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
మొగుళ్లపల్లినేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం గుండ్ల కర్తి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ యాస్మిని గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని గురువారం రోజున నిర్వహించినారు. గ్రామంలో46 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం సులోచన పంచాయతీ సెక్రెటరీ మౌనిక ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
*ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం…*
*ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంజూరు పత్రాన్ని అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ:- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు,గత బిఅర్ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు గత ప్రభుత్వ 10 ఏండ్ల పాలనలో
కేసముద్రం పట్టణ పరిధిలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు.
ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డా!! భూక్యా మురళి నాయక్ , ఎంపీ పోరిక బలరాం నాయక్ సారాధ్యంలో కేసముద్రం పట్టణానికి మొదటి విడతలో 89 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు బానోత్ కోదండపాణి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
*మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన కేటీఆర్ సేన నాయకులు*
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి నూతన కేటీఆర్ సేన అధ్యక్షుడిగా ఎన్నికైన రాకేష్ భూపాలపల్లి నియోజకవర్గం మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి మర్యాద పూర్వ కంగా కలిసిన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన నాయకులు అభినందించి శాలువాతో సత్కరించారు. బి ఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రచారాలను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండ గట్టాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, నియోజ కవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్, యూత్ నాయకులు సికిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
గురువు ఆశీర్వదాం తీసుకున్న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
గురుపౌర్ణమి సందర్భంగా మాజి మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి గురువు హైదరాబాద్ లో నాగులపల్లి సీతారామరావ్ నివాసానికి వెళ్లి ఆశీర్వదాము తీసుకున్నా రని మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక ఒక ప్రకటన లో తెలిపారు చదువు చెప్పిన గురువులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురుపూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారని అశోక్ తెలిపారు
*ఫోటో జర్నలిస్ట్ శివ కుమార్ ను పరామర్శించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు..
*ప్రభుత్వం అండగా ఉంటుందని శివకుమార్ కు భరోసానిచ్చిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..
*దాడి ఘటనకు బాధ్యులైన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపి దగ్గుమళ్ళ..
చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 10:
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన నేపథ్యంలో దాడికి గురై తీవ్రంగా గాయపడి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ను గురువారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పరామర్శించారు.
దాడి ఘటనకు సంబంధించిన వివరాలను శివకుమార్ ను అడిగి తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ఫోటో జర్నలిస్ట్ కు అందుతున్న వైద్యసేవల గురించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయుడు శివకుమార్
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.., ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని భరోసానిచ్చారు.అదే సమయంలో శివకుమార్ పై దాడి పాల్పడ్డ వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతుందని ఎంపీ తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.