స్పోర్ట్స్‌ మాన్‌..స్పోర్టివ్‌ పోలిటిషియన్‌!

`ప్రతిపక్షాలకు అంతుపట్టని సీఎం. రేవంత్‌ రెడ్డి రాజకీయం

`కాంగ్రెస్‌ నాయకులు కూడా అంచనా వేయలేకపోతున్న పాలనా వ్యవహారం

`ఇలాంటి రాజకీయం గతంలో ఎవరూ చేయలేదు

`ఒక స్పోర్ట్స్‌ మాన్‌లో వుండే స్పిరిట్‌ అందరికీ అర్థం కాదు

`పడిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహముతో ముందుకెళ్తారు

`రాజకీయంలో అదే చూపించి గెలిచారు

`పాలనలో కూడా అదే ఫాలో అవుతున్నాడు

`నిజాలు నిర్భయంగా చెప్పేస్తారు

`ప్రతి సవాలును ఎదుర్కొని నిలబడతారు

`ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోరు

`వెనుకబడినట్లు కనిపించినా విజయాన్ని అందరి ముందు అందుకుంటారు

`ప్రత్యర్థులను దారి మళ్లించే ఎత్తులు వ్యూహాత్మకంగా వేస్తారు

`ప్రతిపక్షాలను అల్లాడిస్తూ, ఊహకందిని దెబ్బ కొడుతున్నారు

`ఆరు గ్యారంటీలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు

`బీఆర్‌ఎస్‌ ఎక్కువ తప్పటడుగు వేసిందో అక్కడి నుంచి మొదలుపెట్టారు

`కుందేలు, తాబేలు కథను అక్షరాల అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు

`ఒక్కక్కటీ పూర్తి చేసి తిరుగులేని శక్తిగా మారుతున్నాడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  కౌరవులను ఓడిరచాలంటే, రాజ్యం గెలవాలంటే ధర్మ రాజు కూడా అబద్దమాడక తప్పలేదు. రాజుల మధ్య యుద్దంలో రాజ్యాల కోసం యుక్తితోనే కాదు, కుయుక్తులు కూడా ఆచరించాల్సిందే. లేకుంటే విజయం వరించదు. రాజ్యం దక్కడు. రాజకీయం కూడా అంతే అధర్మ పాలన అంతం చేయాలంటే కొన్ని సార్లు నాయకులు మాటలు చెప్పకతప్పదు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనేది రాజకీయాలకు కూడా పనికొస్తుందని చూపించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. అబద్దాలను, అబద్దాలతోనే ఎదుర్కొవాలని తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే 2015లో ఓసారి అమెరికా వెళ్లినప్పుడు కుండబద్దలు కొట్టినట్లు నాయకులు ఎలాంటి వారు. తనతోసహా అంటూ ఆయన రేవంత్‌ చెప్పిన మాటలు అప్పుడు ఆశ్చర్యానికి గురిచేశాయి. కాని అదే రేవంత్‌రెడ్డికి విజయం కూడా చేకూర్చాయి. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి బోలా శంకురుడు. ఏది మనసులోదాచుకోడు. నిజమైనా, అబద్దమైన నిర్భయంగా చెప్పగలిగే ఏకైక నాయకుడు. అందుకే అలవి కాని హామీలను గుప్పించి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసిఆర్‌ను ఓడిరచాలంటే అదే మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. కేసిఆర్‌ ఎత్తుకు పై ఎత్తు వేశారు. ఆఖరుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫోస్టోను కేసిఆర్‌ కూడా అనుసరించేలా చేశారు. అక్కడే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎన్నికల ముందే గెలిచాడు. ఎందుకంటే కాంగ్రెస్‌ హామీలను కేసిఆర్‌ కూడా కాపీ కొట్టి మరోసారి నమ్మించాలని చూశాడు. సిఎం.రేవంత్‌ రెడ్డి ముందు కేసిఆర్‌ పప్పులుడకలేదు. నిజాన్ని బతికించాలంటే అబద్దాన్ని కూడా ఓ ఆయుధంగా రేవంత్‌రెడ్డి వాడుకోవాలనుకున్నాడు. అక్షరాల అదే అనుసరించారు. కేసిఆర్‌ పాలనకు చరమగీతం ప్రజల చేత పాడిరచారు. కేసిఆర్‌కు దిమ్మతిరిగేలా రేవంత్‌ రెడ్డి రాజకీయం నెరిపి తెలంగాణలో టాల్‌ పర్సనాలిటీ అయ్యారు. నాయకుడుగా గెలిచి నిలిచారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలకుడయ్యారు. ఇలాంటి రాజకీయాలు అందరి వల్ల కాదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి ఒక స్పోట్స్‌ మాన్‌. నిజమైన స్పోర్టివ్‌ పొలిటీషియన్‌. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పాలకపక్షంలోని వాళ్లుకు, ఇటు ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాంతో అంతుపట్టని రాజకీయం సిఎం. రేవంత్‌ చేస్తున్నారు. పైకి చూడడానికి ఏమీ లేదనే భావన కల్పిస్తున్నాడు. ప్రతిపక్షాలను చూపును మరల్చి తాను అనుకున్న వ్యూహం అమలు చేస్తున్నారు. అది తెలిసిన నాడు బిఆర్‌ఎస్‌, కేసిఆర్‌కు కూడా మరోసారి దిమ్మ తిరిగిపోవాలి. ఎవరికీ అంతు పట్టని రాజకీయాన్ని రేవంత్‌రెడ్డి చూపిస్తున్నారు. అది అర్దం కాక పాలన తేలిపోతుందని అనుకుంటున్నారు కాని, అసలు రాజకీయం తెలిసేందుకు మౌనం వహిస్తున్నాడు. ఇలాంటి రాజకీయం గతంలో ఎవరూ నెరపలేదు. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి ఒక స్పోర్ట్‌ మ్యాన్‌. వారిలో వుండే స్పిరిట్‌ అందిరకీ అర్దం కాదు. చేసుకోలేరు. ఆయన పరిపానలతో కూడా అనుసరిస్తున్న వ్యూహంలో చాలా లోతైన ఆలోచన వుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అది తెలియక ఇచ్చినవి కాదు. తెలిసే ఇచ్చారు. ఎందుకంటే కేసిఆర్‌ రెండుసార్లు ఇచ్చిన హమీలను నిశితంగా రేవంత్‌ రెడ్డి గమనిస్తూ వచ్చారు. వాటిని తలదన్నేలా కొత్త వ్యూహాలు ఎంచుకున్నాడు. ఓ వైపు కేసిఆర్‌ ఇచ్చిన హమీలను అమలు చేస్తూనే, కేసిఆర్‌ ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి రేవంత్‌ పాలనా రాజకీయం నెరుపుతున్నారు. రుణమాఫీతోనే మొదలు పెట్టారు. కాని అది అందరూ అర్దం చేసుకోవడం లేదు. గత పదేళ్ల కాలంలో కేసిఆర్‌ రెండుసార్లు రుణమాఫీ చేశారు. కాని అది ప్రజల్లోకి వెళ్లలేదు. దానిని మర్చిపోయేందుకు కేసిఆర్‌ రైతు బంధు తెచ్చారు. నిజం చెప్పాలంటే రుణమాఫీ చేస్తే రైతులు అప్పుడే మర్చిపోతారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తే మళ్లీ ఎన్నుకుంటారని భావించాడు. అది కూడా ఒకే దఫాకు రైతులు మర్చిపోయేలా రేవంత్‌ రెడ్డి చేశారు. అందుకే ముందు రేవంత్‌ రెడ్డి పదే పదే రుణమాఫీ చేశారు. అది కాకుండా ఇందిరమ్మ ఇండ్లు చేపట్టినా ప్రజల్లో రుణమాఫీ మీదనే రైతుల ఆలోచన వుండేది. రైతు భరోసా రెండు సార్లు ఆపేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. పల్లెల్లో కొత్త శోభను తెచ్చాడు. కేసిఆర్‌ నీళ్లు తెచ్చినా, కరంటు తెచ్చినా డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ప్రజలున్నారు. అందులో రైతులు కూడా వున్నారు. ఈ రెండు వర్గాలను ఏక కాలంలో గెలవాలంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు మెదలు పెడితే ప్రజలను ఆకర్షించొచ్చు అనుకున్నారు. ఇటీవల రైతు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. దాంతో పల్లెల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రైతు రుణమాఫీపై చర్చ ఆగిపోయింది. రైతు భరోసా అందలేదన్న మాట ఆగిపోయింది. రైతుకు బ్యాంకుల రుణాలు ఎక్కడా ఆగలేదు. పదేళ్లుగా అదిగో, ఇదిగో డబుల్‌ బెడ్‌ రూంలు అంటూ ఊరించిన కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వలేదు. దాన్ని ముందు పూరిస్తే కాంగ్రెస్‌ మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి బలంగా నిరూపించాలనుకున్నారు. తొలి విడతగా లక్ష ఇండ్లు మాత్రమే మొదలు పెట్టారు. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకున్నారు. ప్రజల్లో ఇండ్లపై వున్న ఆశలు తీర్చే నాయకుడుగా రేవంత్‌ను ప్రజలు కీర్తిస్తున్నారు. ఇలా వచ్చే ఐదేళ్లులో ఏడాదికి 5లక్షల ఇండ్లు మంజూరు చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల నాటికి ఎంత లేదన్నా 15లక్షల మందికి ఇండ్లు అందుతాయి. కేసిఆర్‌ రైతు బంధు సకాలంలో ఇచ్చేవారన్న మాట పల్లెల్లో ఎలా వుందో..రేవంత్‌ రెడ్డి మిగిలిపోయిన వాళ్లు తప్పకుండా ఇండ్లు ఇస్తారన్న నమ్మకం మరింత బలపడుతుంది. అది వచ్చే పంచాయితీ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పెట్టేందుకు దోహపడుతుంది. ఎందుకంటే కేసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలకు, ఖనాలో సొమ్ముకు చాలా అగాదం వుందని తెలుసుకున్నాడు. అందుకే డబుల్‌ బెడ్‌ రూంలకోసం అప్పులు పుట్టవు. సాగునీటి ప్రాజెక్టుల కోసమంటూ అప్పులు పుడతాయనుకున్నారు. కరంటు సమస్య తీరిస్తే ప్రజలు హమీల ఆలోచన మారుతుందనుకున్నాడు. అందుకే ఏక కాలంలో కేసిఆర్‌ చెరువుల పునరుద్దరణ అంటూ అప్పులు తెచ్చాడు. కరంటు ఉత్పాదన కోసం అప్పులు తెచ్చాడు. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పేరు చెప్పి అప్పులు చేశాడు. సంక్షేమ పథకాలపై ప్రజల ఆలోచన మళ్లకుండా కళ్యాణ లక్ష్మిని తెచ్చాడు. దాంతో రైతులు రుణమాఫీపై నిలదీయలేదు. డబుల్‌ బెడ్‌ రూంల గురించి మాట్లాడలేదు. రైతులకు మూడెకరాల భూమి గురించి మర్చిపోయారు. కళ్లముందు నీళ్లు, కరంటు కనిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదన్న మాట మర్చిపోతారనుకున్నాడు. కళ్యాణ లక్ష్మి తెచ్చి మేనమామ అనిపించుకుంటాననుకున్నాడు. ఇందిరమ్మ ఇండ్లను పట్టించుకోలేదు. ఇవ్వడం సాధ్యం కాదనుకున్నాడు. ఆసమయంలో ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన 30లక్షల అప్లికేషన్లు చూసి సాధ్యమయ్యేది కాదనుకున్నాడు. అలా అటకెక్కించిన పథకాలను రేవంత్‌ రెడ్డి ఎంచుకున్నారు. ఎంత పరుగెత్తినా కేసిఆర్‌ డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. దానికితోడు ప్రజలకు నాయకుడుగా కేసిఆర్‌ అందుబాటులో లేరు. ఇన్ని పథకాలు అందించిన తర్వాత తాను జనంలోవున్నా, లేకున్నా ఓట్లు ఎక్కడికి పోవనుకున్నాడు. కాని కేసిఆర్‌ ఎక్కడ పొరపాట్లు చేశాడో వాటినే ఎన్నికల ముందు రాజకీయంగా రేవంత్‌ పట్టుకున్నారు. సెక్రెటరియేట్‌కు రాని ముఖ్యమంత్రి ఎందుకన్నాడు. ప్రగతి భవన్‌లో దాటి కేసిఆర్‌ రాకపోవడాన్ని తప్పు పట్టాడు. ఫామ్‌ హౌజ్‌లో వుండడాన్ని దొరతనంగా చిత్రీకరించారు. ఇలా కేసిఆర్‌పై అడుగడుగునా వ్యతిరేకత పెరిగేలా చేశారు. కేసిఆర్‌ దృష్టి అంతా రేవంత్‌ రెడ్డి మీద ఫోకస్‌ అయ్యేలా రాజకీయం నెరిపాడు. రేవంత్‌ రెడ్డితో తన రాజకీయ పతనం కేసిఆర్‌కు కదిలేలా చేశాడు. అప్పటి నుంచి రేవంత్‌పై నిర్భందం పెరిగేలా చూసుకున్నాడు. రేవంత్‌ రెడ్డికి జనంలో సానుభూతి సంపాదించుకున్నారు. కేసిఆర్‌ను ఎదిరించే నాయకుడు కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే అనే భావన ప్రజల్లో కల్పించారు. మరో వైపు ఎన్నికల శంఖారావం తాను పిసిసి. అద్యక్షుడైనప్పటి నుంచి పూరించి, ఏడాది ముందు రేవంత్‌ రెడ్డి ఆడిన ఆటను కేసిఆర్‌ కూడా తట్టుకోలేకుండా చేశాడు. ఓటమిని ఎన్నికల రాకముందే కేసిఆర్‌కు రుచి చూపించి, జనం మద్దతు కూడగట్టుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రేవంత్‌ సిఎం. అయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version