*ఫోటో జర్నలిస్ట్ శివ కుమార్ ను పరామర్శించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు..
*ప్రభుత్వం అండగా ఉంటుందని శివకుమార్ కు భరోసానిచ్చిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..
*దాడి ఘటనకు బాధ్యులైన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపి దగ్గుమళ్ళ..
చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 10:
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన నేపథ్యంలో దాడికి గురై తీవ్రంగా గాయపడి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ను గురువారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పరామర్శించారు.
దాడి ఘటనకు సంబంధించిన వివరాలను శివకుమార్ ను అడిగి తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ఫోటో జర్నలిస్ట్ కు అందుతున్న వైద్యసేవల గురించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయుడు శివకుమార్
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.., ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని భరోసానిచ్చారు.అదే సమయంలో శివకుమార్ పై దాడి పాల్పడ్డ వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతుందని ఎంపీ తెలిపారు.