క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక.!

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసంg…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు

ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనది…ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు

మహమ్మద్ చోటు బాయ్ రూపొందించిన రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన…ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

రంజాన్ మాసంలోనే కాదు అనునిత్యం సేవా కార్యక్రమాలు చేసే చోటు బాయ్ ని అభినందించిన…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు

వర్దన్నపేట (నేటిదాత్రి) :

ఈరోజు…హనుమకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సేవా తత్పరుడు & కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారు రూపొందించిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్పోస్టర్ను వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ…క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే 9 వ నెలనే రంజాన్ మాసం.ఈ రంజాన్ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడింది.కావున రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అని అన్నారు.

ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా రోజా ఉంటూ ఉంటారు. రోజా ఉన్న ముస్లింలు రంజాన్ మాసంలో అత్యంత నీతి నియమాలతో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ఆరాధిస్తారని తెలిపారు.

ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు.

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతను, మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని, పండుగ మానవాళికి హితన్ని బోధిస్తుందని అన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది అని అన్నారు.

అల్లా ప్రబోధించినట్టుగా మన చోటు బాయ్ గారు కూడా అత్యంత దాతృత్వంతో సహృదయ అనే అనాధ వృద్ధాశ్రమం నడపడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో దానధర్మాలు చేస్తూ ఎంతో విశ్వాసం నమ్మకంతో ఉండే సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి & మాజీ సర్పంచ్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుళ్ళ రవి,కాజీపేట మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్,జిల్లా నాయకులు నాంపెల్లి యాదగిరి,మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్,కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రషీద్,లు పాల్గొన్నారు.

మేతగా మారిన వరి పంట.

మేతగా మారిన వరి పంట

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్, నందగోకుల్ ,నగరం, చల్మెడ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటటం తో బోర్లు నీళ్లు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుకాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో బోర్లలో నీళ్లు రాక పశువులకు మేతగా మారుతున్నాయి. ప్రభుత్వం ద్వారానైన రైతులకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని కోరుతున్నారు

తాళం ఉన్న పశువైద్య కేంద్రం..

తాళం ఉన్న పశువైద్య కేంద్రం,

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేటమండల కేంద్రంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి శుక్రవారం తాళాలు వేసి ఉండడంతో మూగజీవాల వైద్యానికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఉదయం 9 గంటలకు తీయవలసిన పశువైద్య కేంద్రం పశువైద్యాధికారితో పాటు దిగు స్థాయి సిబ్బంది గైర్హాజరు తో మూగజీవాల వైద్యానికి మధ్యాహ్నం వరకు వైద్యాధికారితోపాటు సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెను తిరిగారు. పశువైద్యాధికారితో పాటుగా సిబ్బంది ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

Locked veterinary center,

వాహనాల తనిఖీ…

వాహనాల తనిఖీ

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు తప్పకుండా సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడిపినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సోహెల్, రజక్ పాల్గొన్నారు.

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్.!

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్
పెన్నులుపంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్నులు పంపిణి చేయడం జరిగింది, 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్ధి ఉన్నత చదువులకి మొదటి మెట్టు లాంటిది కాబట్టి విద్యార్థులు బాగా చదివి అందరు ఉత్తిర్ణత సాదించాలి, మనం ఏదైనా సాదించాలి అనుకుంటే అది కేవలం విద్య తోనే సాధ్యం అవ్వుద్ది కనుక ఎగ్జామ్స్ బాగా రాయాలని జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత రావాలని గురువారం పరిక్ష పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రంలో వంశీకృష్ణ , సందీప్, రాకేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం..

సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఆమోదం తెలపడం చారిత్రక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదిస్తూ తీర్మానం చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిదర్శనం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు.గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం అభిషేకం నిర్వహించారు. అనంతరం మండలాధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. గతం పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లుకు అనుకూలం అంటూనే, అసెంబ్లీలో ఆమోదించకుండా నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని నాటి ప్రభుత్వం పూర్తిగా విస్మరిచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పురమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,రామిడి రాజిరెడ్డి,దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొలెపాక స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూలం వీరేశం, దీకొండ మధు, గరిగంటి కరుణాకర్, ముచ్చె శంకర్, తాళ్ల శ్రీనివాస్, పడాల రాజయ్య, గంగాధర సుదర్శన్, నాగేందర్ రెడ్డి, ఆముదాల రోహిత్ రెడ్డి, పెద్దోళ్ల రాజేశం, రామంచ రాజు, ప్రభాకర్, ఆనంద్, కరీం, దోమకొండ మహేష్, పిట్టల మల్లేశం, నగేష్, ప్రభాకర్, శ్రీనివాస్, కోలాపురం లక్ష్మణ్, కుమారస్వామి, అట్లా రాజిరెడ్డి, కముటం శ్రీనివాస్, రొండ్ల అనిల్,మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో.!

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో


మెట్ పల్లి మార్చి 20 నేటి దాత్రి

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని. అలాగే బకాయిలు చెల్లించి వచ్చే వార్షిక సంవత్సరం2025-2026 ఇంటి పన్ను పై ఐదు శాతం రిబేటును సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని అన్నారు.

ఔదార్యాన్ని చాటుకున్న భీమ్ యువత..

ఔదార్యాన్ని చాటుకున్న భీమ్ యువత

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన నీరటి సాయికుమార్ ఈ నెల 11 వ తేదీన అనారోగ్యం తో మరణించాడు. వారి ఆర్థిక స్థితి బాగోలేదని తెలుసుకున్న భీమ్ యువత గురువారం రోజున వారి ఇంటికి వెళ్లి 12000 రూపాయలు మరియు 25 కిలోల రైస్ బ్యాగ్ ను అందించి మానవత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో భీమ్ యువత సభ్యులు లింగాల సందీప్, ఈసరి కిరణ్, గడ్డం వెంకటేష్, బుర్క రాకేష్, బుర్క రాజు, గడ్డి నరేష్, వరస రాకేష్ లో పాల్గొన్నారు.

స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20:

నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.

ఉచితంగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు..

మల్లాపూర్ మార్చి 20 నేటి దాత్రి
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మల్లాపూర్ వారి అధ్వర్యంలో ఉచితంగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆవులు, గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు మరియు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్శింగరావు హాజరై రైతులకు ఇలాంటి వైద్య శిబిరాన్ని ఉపయోగిచుకోవాలనీ తేలిపారు. ఈ కార్యక్రమము లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత, ఉపద్యక్చులు ఎత్తడి నారాయణ రెడ్డి, ముత్యంపేట పశువైద్యాధికారి డాక్టర్ జి. అశోక్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ డి.వెంకటేష్, డాక్టర్ జె.వెంకటేష్ మరియు కళాశాల విద్యార్థులు పశువైద్య సిబ్బంది ఇక్బల్,అచ్చె శ్రీనివాస్ తైసిన్ రవీందర్,రవి, సాయన్న, గ్రామస్తులు మరియు పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల మధ్యలో మురికి నీరు.

ఇళ్ల మధ్యలో మురికి నీరు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మురుకి నీరు మొత్తం ఇళ్ల మధ్యలో చేరుతోంది. మురికి నీరు ఇళ్ల మధ్యలో చేరడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దుర్వాసన వెదజలడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటిని తొలగింపజేయాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి

మల్లాపూర్ మార్చ్ 20 నేటి దాత్రి

అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే తెలంగాణా రాష్ట్ర బడ్జెట్
మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఅభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి అన్నారు.
బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చిన్నారెడ్డి స్పందిస్తూ తెలంగాణా రాష్ట్రంలో గడ్డు ఆర్థిక పరిస్థితులు వున్నప్పటికీ, వాటిని అధికమించే విధంగా 3,04,965 కోట్ల ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు బడ్జెట్ మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని అద్యక్షులు చిన్నారెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగానికి, రైతు భరోసాకు, నీటిపారుదల శాఖలకు పెద్దపీట వేసి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వున్నా చిత్తశుద్ధిని తెలిపింది అని కొమ్ముల చిన్నారెడ్డి తెలిపారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మండల విద్యాశాఖ అధికారి రఘపతి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష
కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

దశ దిన కర్మ కు హాజరు అయిన పార్వతి రమేష్ నాయక్.

దశ దిన కర్మ కు హాజరు అయిన పార్వతి రమేష్ నాయక్

మరిపెడ నేటిధాత్రి.

బహుజన్ సమాజ్ పార్టీ డోర్నకల్ నియోజక వర్గ ఇన్చార్జి పార్వతి రమేష్ నాయక్ అనెపురం రెవెన్యూ గ్రామ పంచాయతీ యలమంచిలి తండా లో ఇటీవల స్వర్గస్థులు అయిన బాణోత్ లాలమ్మ దశ దిన కర్మ కు హాజరు అయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి సద్గురువు సేవాలాల్ మహారాజ్ మరియు సప్త భవాని మాతల మనో ధైర్యం ప్రసాదించాలి అని కోరారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోత్ భద్రు నాయక్, వీరన్న నాయక్, శ్రీను నాయక్ అమ్మ అయిన లాల్లమ్మ తొలిదశ అనేపురం రెవెన్యూ గ్రామ నాయకులు అన్నారు, ఈ కార్య క్రమం లో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్,బహుజన్ సమాజ్ పార్టీ మరిపెడ మండల సెక్రటరీ గుగులోత్ మోహన్ నాయక్, తండా నాయకులు భీమా నాయక్,సిరి నాయక్, లాలు నాయక్ , కీరు నాయక్,చందు నాయక్, రామ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం

టీఎన్జీవో స్ భద్రాచలం

నేటిధాత్రి భద్రాచలం

10వ తరగతి పరీక్షలు జరగబోతున్న సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ యన్ జి ఓ స్) భద్రాచలం ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్ డెక్కా నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, పడిగ నరసింహారావు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమని.. అందుకే ప్రతి విద్యార్థి ఎంతో మేలుకువతో పరీక్షలు వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని,. అదేవిధంగా వడ దెబ్బ తగలకుండా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ.. ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా విద్యాశాఖ వారు ఆయా పరీక్ష హాల్ నందు అన్ని రకాల వసతులు సమకూర్చనీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీలో బీసీ కులగనన ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం అనే బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందులకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీసీ కులగలను చేయక బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలను అధిగమించి ఎంతో సాహసోపేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అలాగే గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీల్లలోని మాదిగలు చేస్తున్న పోరాటాన్ని న్యాయమైనదిగా గుర్తించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర కె దక్కింది అన్నారు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎలాంటి అభివృద్ధి చేయక ఇబ్బందులు పెట్టిన పార్టీలు టిఆర్ఎస్ బిజెపి లను రాబోయే కాలంలోప్రజలు బొంద పెడతారని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పింగిలి జ్యోతి , మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ములశంకర్ గౌడ్ మండల ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల రవి నందరాజు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గుండెపు రెడ్డి రవీందర్ రెడ్డి చిట్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ సి ఆర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ పార్లపల్లి కుమార్ మార్కెట్ డైరెక్టర్ మటిక రవీందర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి పోలోజూ సంతోష్ శరత్ ఆరేపల్లి మల్లయ్య శనికరం మొగిలి గుర్రపు అశోక్ ఈగ కోటి చిలుముల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు..

మంచిగా వ్రాస్తే ఉజ్వల భవిష్యత్తు.

మంచిగా వ్రాస్తే ఉజ్వల భవిష్యత్తు

ఐటీడీఏ,పీవో బి రాహుల్ ఐఏఎస్
భద్రాచలం నేటి ధాత్రి

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 55, వసతిగృహాలు 21, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 79 ఇన్స్టిట్యూషన్లలో 2665 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1423, బాలికలు 1242 కలిపి 2665 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.-

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి.

భద్రాది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి

బిజెపి భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులుగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నేటి ధాత్రి,;భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి భద్రాచలం నియోజకవర్గ వచ్చిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి బ్రిడ్జి సెంటర్ వద్ద బిజెపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికి సీనియర్ నాయకులు అల్లాడి వెంకటేశ్వరరావు సాలువతో సత్కరించారు
ముందుగా భద్రాచలం రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయ సమావేశంలో
ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ నిధులు తీసుకురాకపోగా అవినీతికి పరాకాష్టగా మిగిలారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేననిస్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాదించడాన్నిఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా టిఆర్ఎస్ కనీసం బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారనీఅన్నారు ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ లోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా దర్శ,ములిశెట్టి రామ్మోహన్రావు, కుంజా సంతోష్, త్రినాథరావు, రఘురాం, బిట్రగుంట్ల క్రాంతికుమార్, ముఠాల శ్రీనివాసరావు, నాగబాబు, ముక్కెరకోటేశ్వరి పాల్గొన

ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చింది. తిరుపతి.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. గురువారం రోజున మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో, పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం రాష్ట్రంలోని బీసీల కు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని, ప్రభుత్వం బిల్లు ఆమోదించడం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు మర్చిపోలేని రోజని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులకు శాసనమండలి సభ్యులకు, బీసీ సంఘాల ప్రతినిధులకు, అధ్యక్షుడు తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మురళి, దేవరావు, స్వామి, తిరుపతి, డాక్టర్ హబీబ్ ,సతీష్ జగదీష్ రామస్వామి, ప్రవీణ్, చంద్రయ్య, లక్ష్మణ్, మహబూబ్ ఖాన్, మహేష్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version