వర్గ సామాజిక జమిలి పోరాటాలే దోపిడికి ప్రత్యామ్నయం..

వర్గ సామాజిక జమిలి పోరాటాలే దోపిడికి ప్రత్యామ్నయం

సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే మార్గం

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

కార్పొరేట్ పెట్టుబడి దారి అనుకూల పాలకుల దోపిడీ విధానాలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే ప్రత్యామ్నాయన్ని చూపిస్తాయని ఆ దిశలో వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రజా ఉద్యమాల నిర్మించాలని ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర ప్లీనరీ సమావేశం కామ్రేడ్ ఎగ్గేని మల్లిఖార్జున్, ఐతం నాగేష్, మలోత్ ప్రత్యూష అధ్యక్ష వర్గంగా కరిమాబాద్ మున్నూరుకాపు సంఘం భవన్ లో జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి తమ ఇష్టానుసారంగా పాలను కొనసాగిస్తూ ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నారని ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర వస్తువుల ధరల భారం విపరీతంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందన్నారు. ప్రజల మధ్యన ఐక్యత లేకుండా కుల మత ప్రాంత విభేదాలతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ పాలన కొనసాగుతున్నదని నిర్బంధాలను ప్రయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక వర్గ పోరాటాలను ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు ఆ దిశలో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో అనేక సమస్యలు తిష్ట వేశాయని గత ప్రస్తుత పాలకులు హామీలకే పరిమితం అవుతూ జిల్లా అభివృద్ధిని విస్మరించారని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న పట్టించుకోకుండా పేదలు తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే మాత్రం నానా బీభత్సం చేస్తూ నిర్బంధం ప్రయోగిస్తున్నారని రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చి దిద్దుతామని గొప్పలు చెప్పి ఆచరణలో ప్రచార అర్పటం తప్ప చేసింది శూన్యమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలే ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటును ఇస్తాయని అన్నారు.
అనంతరం పార్టీ నగర నిర్మాణం ప్రజా పోరాటాలపై కామ్రేడ్ సుంచు జగదీశ్వర్ రిపోర్టు ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు నర్ర ప్రతాప్, మంద రవి, కన్నం వెంకన్న, వంగల రాగసుధ, మాలోత్ సాగర్, ముక్కేర రామస్వామి, పరిమళ గోవర్ధన్ రాజు, మాలోతూ ప్రత్యూష, తాటికాయల రత్నం, మాలి ప్రభాకర్, మహమ్మద్ ఇస్మాయిల్, నరసయ్య, దాసు రవి, రాజేందర్, యాదగిరి,మాధవి,స్వప్న లతోపాటు నగరంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి.

భద్రాది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి

బిజెపి భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులుగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నేటి ధాత్రి,;భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి భద్రాచలం నియోజకవర్గ వచ్చిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి బ్రిడ్జి సెంటర్ వద్ద బిజెపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికి సీనియర్ నాయకులు అల్లాడి వెంకటేశ్వరరావు సాలువతో సత్కరించారు
ముందుగా భద్రాచలం రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయ సమావేశంలో
ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ నిధులు తీసుకురాకపోగా అవినీతికి పరాకాష్టగా మిగిలారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేననిస్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాదించడాన్నిఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా టిఆర్ఎస్ కనీసం బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారనీఅన్నారు ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ లోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా దర్శ,ములిశెట్టి రామ్మోహన్రావు, కుంజా సంతోష్, త్రినాథరావు, రఘురాం, బిట్రగుంట్ల క్రాంతికుమార్, ముఠాల శ్రీనివాసరావు, నాగబాబు, ముక్కెరకోటేశ్వరి పాల్గొన

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version