హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version