ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం

మందమర్రి నేటి ధాత్రి :

 

 

 

మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు. మందమర్రి లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబం మేడి శ్రీమతి కొడుకు శ్రావణ్లు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం అగ్గు బాలయ్య సారంగపల్లి నివాసి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లు చేయగా ప్లాటు కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామపంచాయతీ వారు ఇంటికి నెంబర్ కూడా కేటాయించారని ఇల్లు శిధిలమైపోవడంతో నూతనంగా ఇంటిని నిర్మించుకుందామనే ఆలోచనతో ఉండగా అగ్గు బాలయ్య కొడుకు అగ్గు మల్లయ్య భార్య ఆగు లక్ష్మి కూతురు సంధ్య కుటుంబ సభ్యులందరూ కలిసి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇది మా పట్టా భూమిని మీ పేరు పై పట్టాలేదని ప్రస్తుతం ఉన్న భూమి విలువకు తగ్గట్టుగా మరింత అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారని తెలిపారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి వ్యవసాయతర భూమిగా రికార్డుల్లోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుందని  .అధికారులు గమనించి మా కుటుంబం పై భూమి అమ్మిన అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడమైనది.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి

జైపూర్ నేటి ధాత్రి:

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులతో పాటు సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు జైపూర్ ఎస్టిపిపి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం వెల్లడించారు.ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నత అధికారులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్లాంట్ ఉద్యోగులంతా పరిస్థితులకు తగిన విధంగా తగిన జాగ్రత్త వహించాలని వివిధ అంశాలను పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కే. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడి కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి ఏవైనా వస్తువులు గాని,పార్సిల్స్ గానీ వస్తే తీసుకోరాదని కోరారు.అందరూ విధిగా. ఈ ఆదేశాలను పాటించాలని, అప్రమత్తంగా మెదలాలని తెలిపారు.అలాగే నివాస ప్రాంతాల్లో గాని,ప్లాంట్ పరిసరాల్లో గాని అనుమానితులు కనిపిస్తే వెంటనే సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.8332974224 కీ సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ (ఓ&ఎం) జే.ఎన్.సింగ్,ఏజీఎం (ఈ అండ్ ఎం) మదన్మోహన్,సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,పీఎంపిఎల్ ప్లాంట్ హెడ్ అఖిల్ కపూర్,పీఈఎస్ ప్లాంట్ హెడ్ రమేష్ చంద్ర ,డీజీఎం (సివిల్) శ్రీ అజాజుల్లా ఖాన్,డిజీఏం పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, ఎస్ అండ్ పిసి ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి .!

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి
.
విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని
మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని
టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక బృందం , వసతి సౌకర్యాలు ,హాస్టల్ సౌకర్యాలు పరిశీలించిన తరువాత కళాశాలల్లో చేరాలని, అసౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలలో చేరి న వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని కళాశాల వారికి సూచించారు . విద్యార్థుల సలహాల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని అయిన తెలిపారు 7386820819,9959395310 లకు ఫోన్ చేయాలని విద్యార్థులకు సలహాలు ఇస్తామని అన్నారు.

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న దైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని.!

సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది.
భారత్ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని,మన సైనికులు క్షేమంగా యుద్ధరంగం నందు విజయం సాధించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తరపున దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.

పశువులు రోడ్లపై సంచరిస్తే గోశాలలకు తరలిస్తాం.

పశువులు రోడ్లపై సంచరిస్తే గోశాలలకు తరలిస్తాం..

మున్సిపల్ కమీషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలో పశువుల యజమానులు పశువులను యదేచ్చగా వదలడంతో రోడ్లపై సంచరిస్తున్నాయని, వాహనదారులకు,పాదాచారులకు ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు అన్నారు. పత్రిక ప్రకటన వెలువడిన 48 గంటలలోగా పశువులను వారి యజమానులు ఇంటికి తీసుకువెళ్లాలని, లేనియెడల పశువులను గోశాలలకు తరలిస్తామని అన్నారు.పట్టణ ప్రజలను ఇబ్బందిపెడుతున్న పశువులపై మున్సిపాలిటీ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో తీసుకునే చర్యలకు పశువుల యజమానులు పూర్తి బాధ్యులవుతారని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్ లు పట్టణ పశు యజమానులకు సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.!

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి..

ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు.పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్ను నేపథ్యంలో రోడ్డుకు వ్యతిరేక దిశలో నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ వాహనదారులకి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్  నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు.

workers

కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే .

మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ నగర్, ఆల్లిపుర్ రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ అవరణంలో నిర్వహిస్తున్న మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతరకి డి.ఎస్. సుకుమార్ గారితో, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారితో,జనరల్ సెక్రటరీ రవికుమార్ గార్లతో మరియు పాస్టర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి జండా ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డీసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
అనంతరం ఎమ్మెల్యే , చైర్మన్ గార్లు మాట్లాడుతూ గత 95 సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 3 రోజుల పాటు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అని ,ఇట్టి జాతరకు జహీరాబాద్. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి జండా ఊరేగింపు తో వచ్చి దేవుణ్ణి మహిమ పరచడం జరుగుతుందని అన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం .

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస
పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు
లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం.
లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు
నేటి ధాత్రి ఐనఓలు:-

ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. శుక్రవారం అయినవోలు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యలు మరియు కాంగ్రెస్ నాయకులు వారి ఇష్ట నుసారంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించుకొని నిజమైన అర్హులను మోసం చేశారని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆదికారుల నుంచి స్పందన కరువైందని ఆరోపించారు.
అఖిలపక్ష నాయకులు అందరు గ్రామ కార్యదర్శి కి ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందించాలని వినతిపత్రం అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, ధర్మసామాజ్, ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఆశవహులు పాల్గొన్నారు బిఆర్ఎస్ నుంచి టి. కుమార్. కె. అశోక్, గడ్డం రఘువంశీ, టి లక్ష్మణ్,దుపెల్లి రాజు, నాగరాజు, చందు,సంతోష్, సమ్మయ్య, రవి కాంగ్రెస్ నుంచి కొత్తూరి రాజు, కొండేటి దిలీప్, టి ప్రశాంత్, ఏలీయా, కుమార్, అనిల్
బీజేపీ నుంచి బొల్లెపెల్లి మహేష్, పులి సాగర్, బిఎస్పి నుంచి సామ్యాల్ ధర్మసామాజ్ నుంచి విష్ణువర్ధన్ ఎంఆర్పిస్ నుంచి చింత అశోక్ తదితరులు పాల్గొన్నారు..

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న శైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

రాయికల్  నేటి దాత్రి:

మే 9.ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమ‌న్నారు.
భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు.ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్,బొమ్మకంటి నవీన్, సుమన్,భరత్,మహేష్,పవన్,అశోక్, రంజిత్ అర్చకులు సంతోష్. వాసం ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన
జిల్లా అధికారి వీరునాయక్

నేటిధాత్రి మొగుళ్ల పల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సి పేట వివిధ గ్రామాల్లోఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారి వీరు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ ఎ క్యూ పద్ధతిని పాటించాలని తేమశాతం 17/. దాటి ఉండకూడదని సూచించారు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రే గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులకు చెప్పి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఫార్మా రిజిస్ట్రచేసుకోవాలని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రే చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఏఈఓ లు రైతులు పాల్గొన్నారుముఖ్యంగా,

మృతుల కుటుంబాలను పరామర్శించిన .!

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇటీవల ఆరోగ్యానికి గురై మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య అలాగే బాధిత మహిళ బుడిద పద్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందగా ఆరోగ్యం మెరుగుపరచడానికి సుమారు పది లక్షల వరకు ఖర్చుపెట్టి నిరుపేద కుటుంబాలు ప్రభుత్వం. ఎలాగైనా ఆదుకోవాలని పరామర్శిస్తూ మృతురాలికి భర్త లింగం కొడుకు చరణ్ బిడ్డ వైష్ణవి ఉన్నారని లాగైన ప్రభుత్వం స్పందిస్తూ వారికి. కుటుంబానికి ఆదుకోవాలని ఈ సందర్భంగా విన్నవించారుమండల కేంద్రంలో అలాగే గ్రామానికి చెందిన హెల్పుల కర్ణ అనే మహిళ ఇటీవల గుండెపోటుతో చనిపోగా ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్నిచ్చి చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ జెడ్పిటిసి వెంటా కడారి నవీన్ రెడ్డి. బింద్రం పవన్. బురా సాయి. దోర్నాల నవీన్ రెడ్డి. రంగు మల్లేశం. తదితరులు పాల్గొన్నారు

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,డిజిటల్ బోధన,యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం,అటల్ టింకరింగ్,ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు.వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా బాత్రూములతో పాటు వివిధ వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాలను సహా వివరంగా వివరించడంతో పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం.

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం

మందమర్రి నేటి ధాత్రి:

మందమరి మార్కెట్ బస్టాండ్ చౌరస్తాలో ప్రకృతిని నాలుగోసారి బలిచేశారు. ప్రకటనల ప్రాధాన్యతకి ప్రకృతి విలువ తక్కువ అన్నట్లు, ఈ ఎండాకాలంలో పదిమందికి నీడనిచ్చే రాళ్ల చెట్టును రాత్రికి రాత్రే కోమ్మలు నరికి వేశారు. ఈ చెట్టు కొమ్మలను కనీస ఆనవాళ్లు కనిపించకుండా చెట్టు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రంగా చేసి వేయడం వెనుక చెట్టును మళ్లీ ఎదగకుండా తుదిముట్ట ఇవ్వాలన్న ఉద్దేశమే ఉన్నట్లు ప్రత్యక్షదర్శులు చెబుతున్నారు.

Trees

ఈ చెట్టు వయస్సు సుమారు 20 సంవత్సరాలు. మున్సిపాలిటీ పరిధిలో పని చేసే కొందరి మాటల ప్రకారం… ఇదే చెట్టును గతంలో మూడు సార్లు కోసి గాయపర్చారు. కానీ ప్రతిసారీ అది మళ్లీ కోల్పోయిన కొమ్మలను పుట్టించుకుంటూ నిలబడింది. ఈసారి మాత్రం నిండా నీడాను అందించే కొమ్మలానే నరికి వేసినట్లు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా ఆటో డ్రైవర్లు మాట్లాడుతు”మేము ఆటోలో రోజంతా తిరిగి వేసవి వేడిలో అలసిపోయి ఇక్కడే ఆగుతాం. ఇప్పుడు ఆ నీడ కూడా పోయింది” అంటూ కొందరు ఆటో డ్రైవర్స్ బాధతో చెప్పుకొచ్చారు. “అదే చెట్టుకింద మా సోడాబండి పెట్టుకుంటే కాస్త నీడలో పనిచేస్తాం. ఇప్పుడు మేము ఎండల్లో కాలిపోతున్నాం” అంటూ ఓ చిన్న వ్యాపారి వాపోయాడు.ప్రత్యక్షంగా చూసినవారూ, చెట్టు నీడను అనుభవించినవారూ ఆ కోపం, బాధ, అసహనం కలగలిపిన మాటలతో చెట్టు గాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version