అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు భూమి పరిశీలన

అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు భూమి పరిశీలన

పరకాల,నేటిధాత్రి

పట్టణ కేంద్రంలో నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు సంబంధించి భూమిని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని తెలిపారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో పరకాలలో ఏర్పాటు చేయనున్న ఏటీసీ పట్టణ అభివృద్ధికి దోహదపడటంతో పాటు యువతకు నైపుణ్య కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.పట్టణాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాజుపేట సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్,నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేపడుతున్నట్లు వెల్లడించారు.పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు…

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

అభివృద్దే ద్యేయంగా పనిచేసే నాయకుడు పావుశెట్టి సునీల్

18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్‌ను శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా 18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంటేరు రమేష్ చైర్మన్‌ను కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం పరకాల పట్టణ అభివృద్ధికి మంచి సూచిక అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ పావుశెట్టి సునీల్ సమర్థంగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్…

పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్

పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సునీల్ కుమార్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్‌లను కూడా ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ పావుశెట్టి సునీల్ మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసంతో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి లక్ష్యమని తెలిపారు.పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి,పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం,రోడ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు.పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ సునీల్ కుమార్ నాయకత్వంలో మున్సిపాలిటీ ముందుకు సాగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version