ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి
* మునిసిపల్ బిఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
మునిసిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యం ఒక్కో వార్డు నా బాధ్యతని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ మునిసిపల్ అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్, మూడుచింతలపల్లి మునిసిపల్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కాంగ్రెస్ రెండు ఏండ్లు పాలన గడిచిన అంతా ఆగమే ఉందన్నారు. ఆగమైన ఆరు గ్యారంటీకాని ప్రజల్లో ప్రశ్నించి చైతన్యపరచలన్నారు.
ఓటర్లను అక్కర్శించే పనులతో ప్రజల్లోకి వెళ్ళాలని, 13న ఊర్లలో ముగ్గుల పోటీలు, 16న క్రికెట్ మ్యాచ్ లు చేపట్టాలనసూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఏఎంసి వైస్ చైర్మన్ లు నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పల్లె సితారములు గౌడ్, ఎల్లుభాయి, మాజీ జడ్పీటీసీ అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
