తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

 

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు? అని ప్రశ్నించారు.

* ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్

* ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీజేపీ నాయకులను అర్ధరాత్రి సమయంలో హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మోరె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అక్రమంగా నిర్బంధాలు చేస్తున్నప్పటికీ తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతు భరోసా, మహిళలకు తులం బంగారం, యువతకు ఉపాధి అవకాశాలు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు మోరె వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని, ప్రతి కార్యకర్త బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెవ్వశేషగిరి కుమ్మరి సారయ్య బండారి రవీందర్ మండల ప్రధాన కార్యదర్శిలు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం కోరం లేక వాయిదా పడింది. నిర్దేశించిన సమయానికి మునిసిపాలిటీ కార్యాలయానికి 22 మంది కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం వాయిదా వేస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు. నేడు మళ్లీ 11 గంటల ప్రాంతంలో కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలు ఉంటాయని, కౌన్సిలర్ లు అందరూ సకాలంలో విచ్చేసి ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మార్వో కోరారు. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణుల పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిఆర్ఎస్,సిపిఐ కలిపి 14 కౌన్సిలర్ సీట్లు గెలుపొందగా కౌన్సిలర్లను ప్రమాణస్వీకారానికి తీసుకొస్తున్న సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రావడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య లను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని గమనించిన పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతంలో అల్లరి సద్దుమణిగింది. నేడు ఎన్నిక జరిగే సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కు సమాచారం అందిస్తామని ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version