సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చేరువై ప్రజలకు సేవలందించాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చాడ వెంకటరెడ్డి. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల భంగం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని, గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ ఏర్పాటులో సిపిఐ కార్యకర్తల కృషి ఉందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దాటిందని, ప్రజా పాలన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కృషి చేయాలని, సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు అందించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నప్పటికీ ఎంతో ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందని ఈనూతన సంవత్సరం నుండి మరో మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తారనే ఆశాభావాన్ని చాడ వెంకటరెడ్డి వ్యక్తం చేశారు.
