మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి

వనపర్తి నేటిదాత్రి :

 

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య
మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

డివిజన్ టాపర్ గా కొత్త కార్తీక్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

గత నెల 30న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ప్రతిభ కనబరిచి డివిజన్ టాపర్ లుగా నిలిచారు.అలాగే ఇదే పాఠశాలకు చెందిన కొత్త కార్తీక్ అనే డివిజన్ టాపర్ గా రికార్డు సృష్టించాడు.కాగా డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూల మాలలతో అభినందించారు. 2025 -2026 సంవత్సరంలో 10/10 జీబీఏ 600 మార్కులకు 563 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచిన కొత్త కార్తీక్,అలాగే 558 మార్కులు సాధించిన బూర సాత్విక్, 557 మార్కులు సాధించిన మూలా అవినాష్ లను పూల బొకేలతో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించారు.

students

ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గౌరవంగా ఉందని తెలియజేశారు.అలాగే గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 10/10 లు సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని ఈ సంవత్సరం నర్సంపేట డివిజన్ టాపర్ లు గా నిలవడం గౌరవంగా ఉందన్నారు. 62 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించగా ఆ విద్యార్థులను అభినందించారు.పట్టుదలతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కవిత, బిక్షపతి, మణికంఠ, శశిధర చారి, ప్రిన్సిపల్స్ స్రవంతి, సుధాకర్, స్వప్న చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి :

 

బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న… ఎమ్మెల్యే.

దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న… ఎమ్మెల్యే

దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మంగళవారం కేసముద్రం మండలం కేంద్రంలో సప్పిడి గుట్ట తండా దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్, మాట్లాడుతూ.. అమ్మ వారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి మరియు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాం అని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ఇనుగుర్తి మండల అధ్యక్షులు సతీష్ మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న, మాజీ టీపీసీసీ సభ్యులు దస్రు నాయక్, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య మాజీ ఎంపీటీసీ బానోత్ బద్రి నాయక్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తరాల వీరేష్ యాదవ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల నేతాజీ, దామరి అశోక్,మండల నాయకులు,డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని దేవదాసు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి అతని అంతక్రియలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి దేవదాసు పాడే మోసినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిని దేవదాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటామని ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సన్మానించిన ముదిరాజ్ కులస్తులు.

ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.!

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం పుట్టపాక గ్రామంలో దుర్కి లక్ష్మయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు

తిరుపతి నాయక్ ను పరామర్శించిన కమలాకర్.!

 

తిరుపతి నాయక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, నేటిధాత్రి:

టిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చింతకుంట మాజీ ఎంపీటీసీ, కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి ఫ్రాక్చరయి గాయపడిన విషయం తెలుసుకొని వారి స్వగృహం శాంతినగర్ లో కలిసి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈసందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడుతున్న తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యాదిలో ఉంచుకుంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.!

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల మండల కేంద్రం వాసవి కళ్యాణ మండపంలో జరిగిన *మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గారు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్j ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,
మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ గ్రామాల అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు  తదితరులు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.

 

MLA

పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.

 

MLA

తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన.!

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్;

గణపురం నేటి ధాత్రి;

 

 

 

 

 

 

ఈగణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో (వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి సీతారాంపూర్) బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల వలన మోరంచ వాగు ప్రవహించి అటు వెళ్ళు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది. గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.

construction works

ఈ సమస్యను పరిష్కారం కోసం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జికి సుమారు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు,అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పలు గ్రామాలకు రాకపోకలకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతుందన్నారు.  కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ .డబ్ల్యూ. ఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

 

మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

 

MLA

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.పంట నష్టానికి గల కారణాలను రైతుల అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి,పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని,నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులు ప్రజాప్రతినిధులు,రైతులు ఉన్నారు.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

 

*వనపర్తి పట్టణములో పాత బజార్ 4వ వార్డ్ లో దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి అమ్మవారికి వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు
అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడిగిన వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సహాయం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
తిరుమల మహేష్ విగ్రహ ప్రతిష్ట కు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తిరుమల మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు ఓ బీ సీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మాజీ మున్సిపల్ వై
స్ చైర్మన్ బి కృష్ణ కృష్ణ నందిమల్ల శ్యామ్ పాషానాయక్ పరుశురాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీ పీ సీ సీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు

*ఎమ్మెల్యేకు పలువురి వినతి..

*ఎమ్మెల్యేకు పలువురి వినతి..

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 16:

 

 

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…

వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version