ఘనంగా విజయం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T142229.204.wav?_=1

 

ఘనంగా విజయం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి

◆-: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ..

◆-: నాజియా అంజుమ్ షేక్ సోహెబ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, తుమ్మనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు,నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

ఇందిరమ్మ మహిళాశక్తి చీరల పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T133920.683.wav?_=2

 

ఇందిరమ్మ మహిళాశక్తి చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలం, నర్సాపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఇందిరమ్మ మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకుల సురేష్ గోపాల్ జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు చీరలను అందజేశారు.

తపస్ ఝరాసంగం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T111312.439.wav?_=3

 

తపస్ ఝరాసంగం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తపస్ జిల్లా ఎన్నికల అధికారి పెంటారెడ్డి ఆధ్వర్యంలో
తపస్ ఝరాసంగం మండల అధ్యక్షులుగా టి. మోహన్, ప్రధాన కార్యదర్శి గా కె. స్వరూపరాణి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, డివిజన్ అధ్యక్షులు తుక్కప్ప, సురేష్, కృష్ణ, బాల్ శెట్టి, తదితరులు పాల్గొనడం జరిగింది.

శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే…

శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల బొప్పనపల్లి గ్రామ యువ నాయకులు శశి వర్ధన్ రెడ్డి నూతన వాహనాన్ని కొనుగోలు చేసిన సందర్భంగా జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోహెల్ దత్త రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సత్తార్ మధు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మై బెల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T125529.060.wav?_=4

 

 

తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ

జహీరాబాద్, నేటిధాత్రి:

ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, జూనే గావ్ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో ప్రజ ల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను అందజేశారు.

 

 

జిల్లపల్లి బోరేగావ్ ప్యాలరం గ్రామంలో షేర్లు వేయడం జరిగింది అమ్మ క్రీస్తు శేషులు అయిన జ్ఞాపకార్థం గ్రామాల్లోని పలు వీధుల్లో ప్రజ లు కూర్చునేందుకు ఈ బెంచీలను ఏర్పా టు చేశారు. తన తల్లి మాణెమ్మ జ్ఞాపకార్థం బెంచీలను ఏర్పాటు చేసినట్లు విజేం దర్ రెడ్డి తెలిపారు.

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

వీవోఏల సమస్యల పరిష్కరించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-28T124143.836.wav?_=5

 

 

వీవోఏల సమస్యల పరిష్కరించాలి

◆:- సైర్ఫ ఉద్యోగాలుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలకు పెంచాలి

◆:- వివో ఏల అధ్యక్షురాలు. తెలుగు హర్షిత. డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రమైన ఐకేపీ వీవోఏలు గత 18 సంవత్సరాల నుండి పనిచేసుతున్నా ఝరాసంగం మండలంలో 38 మంది వీవోఏ లు ఉన్నారు. వెలగుగ్రామఖ్య సంగం లో పనిచేస్తున్న విఓఏలు అన్ని రకాల పైన పనులు 1 లైవ్ మీటింగ్ చేయడం. 2. ఉల్లాస్ యాప్.3 లోకాస్ యాప్. ఆన్లైన్ దావరా పనిఉత్తిడి. మహిళా సంఘాలకు బ్యాంక్ లీకేజ్ టార్గెట్ ఇప్పించడం గ్రామ సంఘం అప్పులు వసూలు చేయడం శ్రీనిధి లోన్ ఇప్పించ డం. శ్రీనిధి అప్పులు రికవరీ 100% చేయడం. పీఎంఫమ్.యూనిట్. లోన్ భీమ చేయడం మహిళ లకు సంఘాలను చేర్పించడం. వృద్ధదు సంఘాలు. కిశోర బాలికల సంఘాలు వికలాంగుల సంఘాలు చేయడం 18 నుఁడి 59 సంవత్సరం లోపు ఉన్న మహిళలను గుర్తించి సంఘాలలో చేర్పించడం .అన్ లై న్ పని ఒత్తిడి. లైవ్ మీటింగ్ ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలు. మహిళలను కోటీశ్వరులు. చేయడం. పని భారం తగ్గించడం. వివోఏ లకు కనీస

వేతనం చేయాలి.

డిమాండ్ :

1. కనీస వేతనం అమలు చేయాలి

2 వీవోఏ గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి.

3 వీవోఏ ఖాతాకు వేతనం వేయాలి

4 ప్రమాద ఇన్సూరెన్స్ అమలుచేయాలి

5 గ్రామ సంఘానికి నెట్ సౌకర్యం కల్పించాలి

6 శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలి

7 బ్యాంకు లీకేజ్ టార్గెట్ తొలగించాలి

8 గ్రేడింగ్ విధానం తొలగించాలి

9 వివోఏ ఖాతాలో ప్రతినెల వేతనం చెల్లించాలి

10 సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి.

వివో ఏ అధ్యక్షురాలు తెలుగు హర్షిత, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, కార్యదర్శి అనిత, కోశాధికారి చిన్ని .సలహాదారులు రాజు పటేల్. ఉప సలహాదారులు సిరాజోద్దీన్, యూనియన్ సభ్యులు ఖాజా మియా, సిదప్ప, సూర్ రెడ్డి, రాములు, విజయ్ కుమార్, నర్సింలు ,పద్మారాణి, బేబీ, మరియమ్మ, ఫారిన బేగం, వివో వేలు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T112437.027.wav?_=6

 

ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో 100 రోజుల ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కేవైసీ అప్డేషన్ చేయించు కోవాలని మండల ఏపీవో రాజ్ కుమార్ సూచించారు.మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, కేవైసీ అప్డేట్ చేయని కూలీలు ఇకపై ఉపాధి హామీ పథకం కింద పనులు పొందడం లేదా పనులకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. అలాగే అట్టి కూలీలకు వ్యక్తిగత పనులకు సాంక్షన్ ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేశారు. ప్రతి జాబ్ కార్డు దారుడు తమ ఝరాసంగం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు ను సంప్రదించి వెంటనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు, వివాహం అయి అత్తగారింటికి వెళ్లిన మహిళల పేర్లు వంటి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్కి తెలియజేసి జాబ్ కార్డుల నుండి తొలగించుకోవాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు అందుబాటులో ఉండి కేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

తుల్జా భవాని ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T130019.858.wav?_=7

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.తుల్జా భవాని దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లిన గ్రామస్తులు నర్సాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తుల్జా భవాని ఆలయం మహారాష్ట్రలోని ధరాశివ్‌లో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు శక్తి స్వరూపిణి అయిన భవాని దేవికి అంకితం చేయబడింది. ఈ దేవిని అనేకమంది భక్తులు, ముఖ్యంగా మరాఠాలు, రాజపుత్రులు, దేశస్థ బ్రాహ్మణులు, మరియు అగ్రిలు వంశ దేవతగా పూజిస్తానన్నారు,

ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

“తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా బుధవారం రోజు ఝరాసంగం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు ఝరాసంగం మండల ఎంపిడిఓ మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ మంజుల మాట్లాడుతూ.పోలీసు, సిబ్బందికి మరియు మండల ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేది.ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు రేడియోలో ఉపన్యాసిస్తూ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజును మనం “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకుంటున్నాం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనగా ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తూ.., ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయం అని, ఇది “ప్రజల పాలన” అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు.

 

 

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలని ఉత్సాహంగా విధులలో చేరామో, అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగిస్తూ.., తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి, మన వంతు కృషి చేయాలని అన్నారు. చివరగా, ఈ ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తు చేస్తుంది అన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎంఆర్ఓ తిరుమల రావు నాయబ్ తహశీల్దార్ కరుణాకర్ రావు జూనియర్ అసిస్టెంట్ విజ్ఞాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రావు ఆయా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పోలీసు సిబ్బందులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన ధినోత్సవ వేడుకలు:

కొల్లూరులో ప్రజాపాలన దీనోత్సవం లో బాగంగా గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు,నాయకులు,వివిధ సంఘనాయకులు,అధికారులు,గ్రామ విద్యార్థుల అధ్వర్యం లో ఘనంగా జాతీయ పథకాన్నీ ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్,సోషల్ మీడియా ఇంచార్జి దిగంబర్,షెరి సంగమేష్,మలగరి మాణయ్య,వడ్ల కాశీనాథ్, చింతలగట్టు నర్సింలు,చింతలగట్టు ప్రకాష్,మలగరి బాలయ్య, బి శ్రీనివాస్,సి హెచ్ సంగమేష్, కాశీనాథ్, రామ్ లక్ష్మణ్,అబ్రహం,కిస్టయ్య, దేవదాస్, టి నర్సిమ్లు,సంగయ్యా,మానయ్యా,వీరన్న, పాఠశాల ఉపాధ్యాయులు అక్షర, వనిత, సిఏ మరియమ్మ,మరియు వివో లీడర్స్ మరియు మహిళా గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T120257.493-1.wav?_=8

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో
పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు
పాల్గొన్నారు

ఝరాసంగం ఆలయంలో అమృతగుండం పొంగిపొర్లుతోంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T130818.367-1.wav?_=9

 

ఝరాసంగం ఆలయంలో అమృతగుండం పొంగిపొర్లుతోంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అమృతగుండం నిండుకుండలా మారింది. ఆలయ సిబ్బంది భక్తులను ఆలయంలోకి అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలుగు పారుతున్న జీర్లపల్లి చెరువు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T122052.925-1.wav?_=10

 

అలుగు పారుతున్న జీర్లపల్లి చెరువు

◆:- ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చబడిన మడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఝరాసంగం మండలం జీర్ణపల్లి చెరువు అలుగు పారింది. ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల చెరువు నిండుగా ఉప్పొంగుతోందని స్థానికులు తెలిపారు. చెరువులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అటువైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు
మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.రాత్రి ఏకధాటిగా వర్షం పడటంతో పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. జీర్లపల్లి చెరువు అలుగు పారుతోంది. చెరువును చూసేందుకు పర్యావరణ తరలి వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ తిరుమల రావు, ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ డిప్యూటీ ఎంఆర్ఓ కరుణాకర్ రావు, ఆర్ఐ రామారావు చెరువును సందర్శించారు. చెరువు అలుగు పారుతుండటం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని తహసీల్దార్ సూచించారు

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T111233.146-1.wav?_=11

 

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలోని సిద్ధాపూర్ క్లస్టర్ ఏ ఈ ఓ సుకుమార్ కి ఉత్తమ సేవ అవార్డు లభించింది , జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రవీణ్యా ఎస్పీ పారితోష్ పంకజ్ టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చేతుల మీదుగా సుకుమార్ అవార్డు అందుకున్నారు,ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ 8 ఏళ్లుగా రైతులకు విశిష్ట సేవలు అందించిన ఉద్యోగానికి గుర్తింపు వచ్చిందన్నారు, అవార్డు రావడం వల్ల క్లస్టర్ రైతులు మరియు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T114502.753.wav?_=12

 

జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పార్లమెంట్ సమావేశంలో రజకులను ఉధ్యేషించి ప్రస్థావిస్తూ వారిని ఎస్సీ కోటాలో చేర్చాలని ప్రస్థావించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారిని జహీరాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో “ఝరాసంగం మండల
కొల్లూరు మాజీ ఎంపీటీసీ సిహెచ్ రాజ్ కుమార్ మరియూ తెలంగాణ రాష్ట్ర రజక కమిటీ అధ్వర్యంలో” మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానించి రజక సంఘస్థుల తరపునా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో రాష్ట్ర,జిల్లా,మండలాల కమిటీ సభ్యులు పాల్గొని ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు..

మంత్రి వివేక్ గారిని కలిసిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-4.wav?_=13

మంత్రి వివేక్ గారిని కలిసిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి గారిని పెండింగ్ లో ఉన్న మరియు పలు నూతన అభివృద్ధి పనులకోసం కలిసి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎ చంద్ర శేఖర్, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రామలింగారెడ్డి,ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, న్యాల్కల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ సంగ్రామం పాటిల్, రాజు స్వామి, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ తధితరులు కలిసి మంత్రి గారితో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులు తక్షణమే మొధలు పెట్టి పూర్తి చెయ్యాల్సిందిగా మరియు నియోజకవర్గం లో గల వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు కావాలని అడగడం జరిగింది మరియు వివిధ నూతనా అభివృద్ది పనులు అడిగారు అందుకు ఇంచార్జి మంత్రి సానుకులంగా స్పందించి త్వరలోనే పూర్తి చేయించేద్దమన్నారు.

ఇందిరమ్మ ఇల్లు భూమి ముగ్గేసిన కార్యదర్శి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-3.wav?_=15

ఇందిరమ్మ ఇల్లు భూమి ముగ్గేసిన కార్యదర్శి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో బంగ్లా గడ్డ పంచాయతీ పరిధిలోని కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరేశం పటేల్ మొహమ్మద్ అష్రఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మొహమ్మద్ బషీర్ మొహమ్మద్ గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T130153.632-1.wav?_=16

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు నాయకులతో కలిసి ఆసుపత్రి కి చేరుకుని , ప్రమాద వివరాలు కుటుంబ సభ్యులను ,గ్రామస్తులను అడిగి తెలుసుకునారు డాక్టర్ ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రి కి తరలించారు ,ఎమ్మెల్యే డాక్టర్ లతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు,త్వరగా కోలుకుంటారు అని అధైర్యపడొద్దు అని,అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు* ….
అనంతరం ఆసుపత్రి లో అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మరియు సిబ్బంది సూచించారు .ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్ ,నాయకులు నరేష్ రెడ్డి ,శంకర్,నవీన్ తదితరులు ఉన్నారు..

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T112706.610.wav?_=17

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఓకే కుటుంబానికి చెందిన గొర్రె కంటి ప్రభు కుమార్,విఠల్,శంకరమ్మ ,అనే ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అవడం జరిగింది.

గ్రామస్తులు ఈ సంఘటన తెలుసుకుని 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సమాచారం అందుకున్న ఈఎంటి శంకర్, పైలట్ సాగర్, సంఘటన స్థలానికి చేరుకుని శతగాత్రులు ను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం జరిగిందని అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version