గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఓకే కుటుంబానికి చెందిన గొర్రె కంటి ప్రభు కుమార్,విఠల్,శంకరమ్మ ,అనే ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అవడం జరిగింది.
గ్రామస్తులు ఈ సంఘటన తెలుసుకుని 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సమాచారం అందుకున్న ఈఎంటి శంకర్, పైలట్ సాగర్, సంఘటన స్థలానికి చేరుకుని శతగాత్రులు ను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం జరిగిందని అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు.