ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

“తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా బుధవారం రోజు ఝరాసంగం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు ఝరాసంగం మండల ఎంపిడిఓ మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ మంజుల మాట్లాడుతూ.పోలీసు, సిబ్బందికి మరియు మండల ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేది.ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు రేడియోలో ఉపన్యాసిస్తూ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజును మనం “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకుంటున్నాం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనగా ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తూ.., ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయం అని, ఇది “ప్రజల పాలన” అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు.

 

 

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలని ఉత్సాహంగా విధులలో చేరామో, అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగిస్తూ.., తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి, మన వంతు కృషి చేయాలని అన్నారు. చివరగా, ఈ ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తు చేస్తుంది అన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎంఆర్ఓ తిరుమల రావు నాయబ్ తహశీల్దార్ కరుణాకర్ రావు జూనియర్ అసిస్టెంట్ విజ్ఞాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రావు ఆయా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పోలీసు సిబ్బందులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన ధినోత్సవ వేడుకలు:

కొల్లూరులో ప్రజాపాలన దీనోత్సవం లో బాగంగా గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు,నాయకులు,వివిధ సంఘనాయకులు,అధికారులు,గ్రామ విద్యార్థుల అధ్వర్యం లో ఘనంగా జాతీయ పథకాన్నీ ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్,సోషల్ మీడియా ఇంచార్జి దిగంబర్,షెరి సంగమేష్,మలగరి మాణయ్య,వడ్ల కాశీనాథ్, చింతలగట్టు నర్సింలు,చింతలగట్టు ప్రకాష్,మలగరి బాలయ్య, బి శ్రీనివాస్,సి హెచ్ సంగమేష్, కాశీనాథ్, రామ్ లక్ష్మణ్,అబ్రహం,కిస్టయ్య, దేవదాస్, టి నర్సిమ్లు,సంగయ్యా,మానయ్యా,వీరన్న, పాఠశాల ఉపాధ్యాయులు అక్షర, వనిత, సిఏ మరియమ్మ,మరియు వివో లీడర్స్ మరియు మహిళా గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version