ఘనంగా విజయం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి
◆-: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ..
◆-: నాజియా అంజుమ్ షేక్ సోహెబ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, తుమ్మనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు,నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,
