జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ను వెంటనే ఉపసంహరించుకోవాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులను హరించే విధంగా , కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని తదితర డిమాండ్లతో జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ , పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు*
జూలై 9వ తేదీన సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో ర్యాలీ ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ , పేషెంట్ కేర్ , కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సుజాత , నాగమణి , పద్మ , రజిత , దేవలక్ష్మి , రాజవ్వ , లక్ష్మి , శ్రీను , తిరుపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.