వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న.

కరుణించు వరుణ దేవా…

వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…

నేటి ధాత్రి గార్ల:

జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చెరువులు, కాలువలు, కుంటలు అడుగంటిపోయినాయి. నీటి చుక్క కరువైంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు వెతుకున్న అన్నదాతలు ఆందోళనలకు గురవుతున్నారు. బోర్లు, మోటార్లు ఉన్న రైతులు పొలాలకు తడిపేందుకు ప్రయత్నం చేస్తుంటే, ఏ సౌకర్యం లేని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారినాయి. మబ్బులు కనిపిస్తున్న, వాన మాత్రం పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి, పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసింది. ఖరీఫ్ సాగు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్న వర్షాలు ఎప్పుడు పడతాయా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version