విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని.
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని
ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని
త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని
తమ లక్ష్యాలను చేరుకోవాలని
ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు.

కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు…

విశ్వ జంపాల,న్యాయవాది మరియు
విశ్వ సమాజం వ్యవస్థాపకులు…

మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్యా-వైద్య సంస్థలను నిర్వహిస్తూన్నాయి. వాటి నిర్వాహాణకు సరిపడా నిధులు మాత్రం కెటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి.భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తూన్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు, కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు.

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికి సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-గూడు-గుడ్డ తో పాటు విద్యా- వైద్యం-ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూన్నాయి.

సమగ్ర విద్యా- వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాశక్తులలో పది శాతం కల్గి వున్న “అక్షర భారత్ – ఆరోగ్య భారత్” నిర్మాణం జరిగి ఉండేది.

దీని పర్యావసానమే విద్యా -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ- కార్పోరేటికరణ ప్రభలంగా పెరిగి పోయింది. విద్యా – వైద్య రంగంలో కార్పోరేట్ విష పోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి.

సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్యా- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి.

కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్యా- వైద్య సంస్థల్లో నేటికి కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదు.

కమిటీలు, కమీషన్లు వేస్తూ, కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీన వేశాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.

లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారు.సమాజ మనుగడకు విద్యా-వైద్యం-ఆరోగ్యం అతి ప్రధాన మైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కల్గి వున్నాయి.

భారత దేశంలో భూస్వాములు- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పోరెట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తూన్నాయి.

ప్రభుత్వ అనుమతితోనే విద్యా-వైద్య రంగాల్లో కార్పోరేటీకరణ విష ఫలాలనందించే వట వృక్షంగా పెరిగిపోయింది.

కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి.

విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.

ఈ వర్గాలే సేవా రంగాలైన విద్యా-వైద్య రంగాలను అత్యంత లాభ సాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.

కార్పోరేట్ యాజమాన్యాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను, డాక్టర్లను కీలు బొమ్మల్లాగా మార్చుకున్నాయి.

ప్రైవేట్, కార్పోరేట్ విద్యా-వైద్య సంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్ధం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నారు.పారి శుద్యం, త్రాగు నీరు, మల మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పడకలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌళిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.

వీటికి తోడు అరకొర నిధుల కెటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలను నిత్యం పట్టి పీడిస్తున్నాయి.

సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాయి.

ఒకప్పుడు విదేశీయులు, దోపిడి దొంగల భీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బ్రతికేవారు.

నేడు విద్యా-వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుధ్ధితో విద్యా-వైద్య-ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

ఆకలి చావులైనా, ఆత్మ హత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.

నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలు, కుల వృత్తి దారుల ఆత్మ హత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ పూరిత అనాలోచిత నిర్ణయాలు-నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మ హత్యలకు కారణాలు.ప్రజా ద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పోరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి

ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.

భారత దేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్తూన్నాయి.

ప్రజా ద్రోహులు-రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూన్నారు.

విద్యా-వైద్యం-ఉపాధి మొదలైన మౌళిక రంగాలలో విధానాలు రూపొందించడం- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్పూర్తిని కలిగియుండాలి.

విద్య-వైద్య రంగాలలో కార్పోరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజా జీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే విద్యా – వైద్యం జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం.

విద్యా-వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు దోపిడి పీడన ఆగేంత వరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు

పుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకొని అధికారులు

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

కరీంనగర్ నగరంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నా చేస్తూ పుస్తకాలు అమ్ముతున్నారని డిఈఓ, ఏంఈఓకి సమాచారం ఇచ్చిన పట్టించుకోకుండా రాకుండా స్పందించలేదు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ నారాయణ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా మరియు కరీంనగర్ జిల్లాలో నారాయణ విద్యా సంస్థలలో ఎట్లాంటి ప్రభుత్వాల అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు బుక్కులు, పెన్నులు, షూ ,టై వంటి అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని అన్నారు. జీవో 1,10,92,42 లను ఉల్లంఘించి జిల్లా కేంద్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, పెంచిన ఫీజులను నోటీస్ బోర్డ్ లో పెట్టకుండా, స్మార్ట్ పేర్లను జోడిస్తూ గ్రౌండ్, నిబంధనలకు అనుగుణంగా విశాలమైన తరగతి గదులు లేకుండా నడిపిస్తున్నారనీ
విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో నారాయణ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవస్థను నడుపుతున్నాయని. ఇది విద్యను వ్యాపారంగా మలచే దిశగా తీసుకెళుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతోంది.వెంటనే అధికారులు మొద్దు నిద్ర వదిలి విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షకార్యదర్శులు కేశాబోయిన రాము, మామిడిపల్లి హేమంత్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి

ట్రైనింగ్ పొందిన టీచర్స్

చదువులో అనుభవం ఉన్న టీచర్స్

పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్

పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు.

నేటి ధాత్రి:

 

 

 

ఇల్లంద గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి తదినంతరం తిరుపతిలోని సాంస్క్రిట్ విద్యాపీట్లో యోగ డిప్లమా పూర్తి చేసుకుని, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరావు గారి సూచనతో గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో సుమారు 157 గ్రామాలలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి యోగా లో శిక్షణను ఇవ్వటమే కాకుండా…

 

 

 

 

 

 

20 24 సంవత్సరానికి గాను యోగాలో గోల్డ్ రికార్డ్ సాధించినందుకు గాను వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు అభినందిస్తున్న ఫోటో.

 

జూన్ 21.2024 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందుకున్న శ్రీనివాస్ మనందరికీ అభినందనీయుడు.

వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమాలలో , అందుల ఆశ్రమాలలో ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజంలోని అనేకమందికి మార్గదర్శకుడిగా నిలిచాడు యోగా గురువు పోశాల శ్రీనివాస్.

సేవే పరమావధిగా భావించి అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పునర్జన్మకు కారణమయ్యాడు

యోగా గురువు శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం కిలా వరంగల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ యోగ గురువు అవార్డును పొందడం జరిగింది.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి జీ వారి చేతుల మీదుగా…

 

2017 వ సంవత్సరంలో జనవరి (12- 18 ) జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.

2018 – 2022 సంవత్సరాలలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనను అందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డులను అందుకోవటం జరిగింది.

2019వ సంవత్సరంలో ప్రముఖ చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో ఒక వెయ్యి మంది విద్యార్థులతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందుకోవటం జరిగింది.

 

 

 

 

 

ధరిత్రి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతూ…

 

2019 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయంలో, వేయి స్తంభాల దేవాలయంలో, కిలా వరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా డేలను నిర్వహించినందుకు కాను అవార్డులను అందుకోవటం జరిగింది.

 

 

2019 వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన యోగ డే ప్రోగ్రాం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవార్డును కోవడం జరిగింది.

 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ తో

 

 

 

2021 వ సంవత్సరంలో పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరోనా సమయంలో ప్రతిరోజు వేలాదిమంది కి ఫుడ్, మెడిసిన్స్ అందించి రోగుల కొరకు విశేష కృషి చేసిన యోగా గురువుకు తెలంగాణ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకోవటం జరిగింది.

 

25 సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న విశేష కృషిని ఆదరించి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని యోగా గురువు శ్రీనివాస్ కి అందించడం జరిగింది.

 

అదేవిధంగా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో అనేక అవార్డులను యోగా గురువు శ్రీనివాస్ అందుకోవటం జరిగింది. .

 

ప్రముఖ వ్యక్తులైన శ్రీ రాందేవ్ బాబా గారి చేతుల మీదుగా, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులను అందుకోవటం జరిగింది.

 

యోగా గురువు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో మరియు పాఠశాలలోను,

 

NSS, NCC క్యాండిడేట్లకి యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.

 

 

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

మామునూరు లో ఉన్నటువంటి ఫోర్త్ బెటాలియన్ CRPF పోలీస్ ఆఫీసర్లకి, భీమారంలో ఉన్నటువంటి 58వ బెటాలియన్ CRPF ఆఫీసర్ లందరికీ యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.తన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై యోగా లో ఉత్తమ ప్రదర్శనలు కనబరిచి అనేక అవార్డులను అందుకోవటం కూడా జరిగింది.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

కల్వకుర్తి నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

“ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వారి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ లాంటి వాటికి కళాశాలలో శిక్షణ ఇస్తారని ఉన్నతంగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివుకున్న విద్యార్థులకు ఎంసెట్ లక్ష ర్యాంకు వరకు ఉచితంగా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(బి ఎస్ యు)

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి:

shine junior college

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్యఅందించాలి నేడు ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బి ఎస్ యు) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వా లు మారిన పత్రికా విలేకరు లకు ఇచ్చిన హామీలు ఏ ప్రభు త్వం నెరవేర్చ లేకపోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లల కు ఉచిత విద్య అందించలే కపోవడం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి.

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి

నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం

నర్సంపేట నేటిధాత్రి:

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని ఏఐఎఫ్ డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2009 విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అమలు చేయాలని అధికారులను కోరారు. జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని,బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని తక్షణమే ఉపసహరించుకోవాలి అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యజమాన్యాలపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలనిలేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కళ్ళేపెళ్లి రాకేష్, ఏఐఎఫ్డిడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు మార్త సుధ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి.

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి

బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

పరకాల నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్య అభివృద్ధికీ నోచుకోలేకపోయిందని
బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ నూ తీసుకొని సంవత్సరం గడిచిపోయిన కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లు ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేద మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ల మీదనే ఆధారపడి చదువుతున్నారని ఇప్పుడు అవి రిలీజ్ కాకపోవడంతో విద్యార్థులు పైచదువులు చదవలేని పరిస్థితిలు ఉన్నాయన్నారు.కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బడా కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యాలకు లక్షలలో ఫీజులు కట్టడం జరుగుతున్నదని ఇంత జరుగుతున్నా కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు.

విద్యా వ్యాపారని అరికట్టండి.

విద్యా వ్యాపారని అరికట్టండి.

అడ్మిషన్ ఫీజు పేరిట 5,000 వసూళ్లు.

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్.

 మిర్యాలగూడ నేటిధాత్రి:

మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ నీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ భవన్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలు& కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అడ్మిషన్ ఫీజు పేరిట 5000, రూపాయలు అత్యధిక ఫీజు వసూళ్లు చేస్తున్న కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు ప్రైవేటు పాఠశాలలో పిల్లల్ని చదివించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కత్తి మీద స్వాముల మారిందని ఆయన అన్నారు పాఠశాలలలోని లక్షల రూపాయల ఫీజులు ఎలా కట్టాలో అని ఆందోళనకరంగా ఉన్నారు ప్రైవేటు పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు తొత్తుగా మారి విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక శోభకు గురిచేస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు నిర్ణయించిన ఫీజు కే విద్యార్థులను చదివించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మిర్యాలగూడలో విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా అరికట్టవలసినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆయన హెచ్చరించారు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లో చదువుకునే దుస్థితి లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ప్రైవేటు పాఠశాలలపై ఒక కమిటీని నిర్ణయించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఫీజుల దోపిడి నీ అరికట్టక పోతే మాత్రం అన్ని ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాలతో ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్, సిద్ధం రాజు, నాయిని భాస్కర్, అంజి గౌడ్, గంగాధర్, ఉపేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.

 

Provide quality education to students

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థకు తూట్లు కార్పొరేట్లకు కోట్లు…

విద్యావ్యవస్థకు తూట్లు కార్పొరేట్లకు కోట్లు…

మహబూబాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రైవేట్ విద్యా వ్యాపారం…

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు…

సర్కారు మారిన విద్యావ్యవస్థలో కనిపించని మార్పు…

ఆదేశాలకే పరిమితమైన విద్యాశాఖ…

ప్రభుత్వ విద్య వ్యవస్థపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న విద్యాశాఖధికారులు…

ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థకు వత్తాసు పలుకుతున్న అధికారులు…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

మహబూబాబాద్ జిల్లాలో చుట్టుపక్క‌ మండలంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.

పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు ఆశలు చూపించి జాయిన్ చేస్తూ కోట్లకు కోట్లు గడ్డిస్తున్నారు.

అధిక ఫీజులతో విద్యా వ్యాపారాని కొనసాగిస్తూ విద్యార్థులను అధిక ఫీజులతో మనోవేదనకు గురి చేస్తున్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలు వారి సంస్థల్లో జాయిన్ అయ్యే ముందు డిజిటల్ లో సినిమా చూపించి వారి విద్యాసంస్థ పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి అనుకూలంగా ఫీజులు ఉంటాయని నమ్మబలికారు,
తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, పాఠ్యపుస్తకాల ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలు దొడ్డిదారిన దోచుకుంటున్నారు‌.

కళాశాలలో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఉచిత విద్యను అందిస్తామని స్కాలర్షిప్ తోనే చదవచ్చని ఆశలు పెట్టి,తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, మెటీరియల్ ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలకు వేలు దొడ్డిదారిన దోచుకోవటం పరిపాటిగా మారింది.

చిన్నచిన్న గదుల్లో విద్య బోధన చేయటం మరియు కనీస విద్యార్హత లేకుండా ఉన్నవారికి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పెట్టుకొని నడిపిస్తున్నారు.

విద్యార్థులు జాయిన్ అయిన తరువాత అనేక పేర్ల మీద డబ్బులు గుంజటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

తల్లిదండ్రులను జలగల్లా పీకుతూ సర్టిఫికెట్లు ఇవ్వమని మనోవేదనకు గురి చేస్తున్నారు.

చేరే ముందు నమ్మించి చేర్పించుకున్నారని నమ్మి జాయిన్ అయితే అనేక పేర్ల మీద డబ్బులు గుంజినట్టేట ముంచారని తల్లిదండ్రులు గోడు వెళ్ళబోస్తున్నారు.

 

సరైన వసతులు లేకపోయినా ఉన్నట్లు అనుమతి పొంది అధికారులను మంచిగా చేసుకుని వారికి ఇచ్చే మామూళ్లను వాళ్లకు ఇస్తూ స్కూళ్లను నడిపిస్తున్నారు.

అధికారులను నిలదీసిన వాళ్లకు అధికారులు మీరు ఎందుకు జైన్ అయ్యారు.

ప్రైవేట్ సంస్థలు అంటే ఇలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే ఉండండి కష్టమైతే మానేయండి అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తుంది.

 

Education Officials.

 

 

అంతేగాని విద్యార్థులను రాసిరంపాన పెడుతున్న విద్యా సంస్థలపై ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు ఉంటే పేద మధ్య తరగతి కుటుంబాలు విద్యార్థిని విద్యార్థులు ఎలా చదువులు ముందుకు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాడ్ లు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

 

బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు..

నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని తోపనపెల్లి గ్రామ వాసి ఒంటెల యకమ్మ 90 గారు మరణించగా, దుఃఖం లో యుండి కూడా కుటుంబ సభ్యులు కుమారులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మధుసూదనరెడ్డి, మనుమడు కరుణాకర్ రెడ్డి మనుమలు ‘’సమాజ హితం కోరి, ‘’నేత్రదానం చేయడానికి అంగీకరించగా, “” తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో “” వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ లక్షమన్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.మృతురాలు యాకమ్మ గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునివ్వడం తో పాటు భావి వైద్యుల నేత్ర వైద్య విద్యకు ఉపయోగ పడినవారయ్యారన్నారు కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడుదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వివరాలకు 8790548706, 9908088011సెల్ నెంబర్ లలో సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లీ ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి,పాల్గొన్నారు. ‎

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి..

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ

 

quality education

ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ ,
చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి…

పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

 

 

 

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ను కలిసి విద్యారంగ సమస్యలపై పి డి ఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ,విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేతకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ హంగు ఆర్భాటాలు చూపించే విధంగా కరపత్రాలు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ తెలిపారు.ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి, కార్పొరేటు,ప్రైవేటు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.వివిధ రకాలుగా టై, బెల్టు, పాఠ్యపుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలువరించాలని, పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ఆర్ధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్,పట్టణ నాయకులు శేఖర్, దీపక్, సుందర్,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version