మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం.

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం..

పెద్దపల్లి జిల్లా నేటి ధాత్రి:

వరంగల్ జిల్లాలోని మామునూరు క్యాంప్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) గా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఈర్ల కృపావరం భార్య స్నిగ్ధ పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఆర్ ఎస్సై మాట్లాడుతూ తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఏరియాలోని బొంకూరి కాలనీకి చెందిన ఆర్ఎస్ఐ కృపావరం భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఆ జంట ఇతరులకు ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని
ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం అయినట్లు సమాచారం అలాగే సమీపాన ఉన్న స్థానిక చర్చిలో షార్ట్ సర్క్యూట్ తో చర్చిలోని వస్తువులన్నీ కాలిపోయాయి అలాగే స్థానిక రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ ఫ్యాన్లు కంప్యూటర్లు కాలిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్స్ కార్డు ఆన్లైన్ కోసం వచ్చిన రైతులు రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో రైతులందరూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు ఇంత జరిగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అటువైపు రాకపోవడం గమనార్హం, ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను తెలుసుకొని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు, రైతు వేదికలో కూడా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో బయటికి పరిగెత్తారు అనంతరం రైతులు రైతు వేదిక ముందు గల ప్రదేశంలో అగ్రికల్చర్ అధికారి మొబైల్ ఫోన్లో రైతుల ఆధార్ కార్డులు ఆన్లైన్ చేసుకుంటున్నారు, కాబట్టి రైతుల బాధలు స్థానిక ప్రజల బాధలు అర్థం చేసుకొని రైతు వేదికలో విద్యుత్ సమస్యను తొందరగా పరిష్కరించి పరిష్కరించి రైతుల కు సహకరించాలని అన్నారు ఏది ఏమైనా ఎంపీడీవో పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కావున వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మహిళా భవన్లో జీలుగు విత్తనాల పంపిణీ కేంద్రం.

మహిళా భవన్లో జీలుగు విత్తనాల పంపిణీ కేంద్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ. మహిళ భవన్లో ఐకెపి. మహిళ సంఘాల. ఆధ్వర్యంలో సబ్సిడీ జీలుగు విత్తనాల పంపిణీ.కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతిరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎరుగుల రూపంగా ఉపయోగపడి పంట దిగుబడి పెరుగుతుందని ప్రజా పాలనలో రైతులకు ఈ విత్తనాలు సబ్సిడీ అందడం జరుగుతుందని రైతులు వినియోగించుకోవాలని కోరడం జరుగుతూ మండలంలోని ప్రతి గ్రామ రైతులు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి. అధిక దిగుబడులు.వచ్చే విధంగా రైతులు సలహాలు. సూచనలు తీసుకోవాలని. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ జీలుగు విత్తనాలు రైతులు అధిక దిగుబడి రావడానికి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఏపిఎం చంద్రయ్య శ్రీకాంత్ గౌడ్. మహేందర్. కవిత. శోభ. సంబంధిత అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర అమలు పరిస్థితులు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ధాన్యం కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిపడిన ధాన్యాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ధనరాశిని రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ మార్కెట్ శనివారం నాడు కమిటీ వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా ఆమనగల్ PACS ఆధ్వర్యం లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలను సంబధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డు లో నిర్మినా దశలో ఆగిపోయిన పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు.కూరగాయల మార్కెట్ .మాటెన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను MLA గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఒకే దగ్గర ఉంటాయని వైస్ చైర్మన్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తాళ్ల రవీందర్ ,నరేష్ నాయక్ , సంపత్ కుమార్ ఉన్నారు.

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ .!

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది… సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు. సంబంధించి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్. చెక్కులను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక మార్కండేయ భవన్ లో ఏర్పాటుచేసిన. దానిలో భాగంగా మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి . షాది ముబారక్. చెక్కుల పంపిణీలను. స్థానిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు. తంగళ్ళపల్లి ఎమ్మార్వో సంబంధిత అధికారుల. చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. కొంచెం ఆలస్యం.అయిన అర్హులందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్. చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి. ఎమ్మార్వో . జయత్ కుమార్. జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్. సిరిసిల్ల ఏఎంసి. చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడి ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి.!

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి

నిజాంపేట్, నేటి ధాత్రి :

 

 

నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో మంగళవారం రోజున జిల్లా వెల్ఫేర్ అధికారి హైమావతి చల్మెడ అంగన్వాడి 4 వ సెంటర్ ను సందర్శించడం జరిగింది. బరువు తక్కువ ఉన్న పిల్లలు(SAM), నామ మాత్రం బరువు తక్కువ ఉన్న పిల్లలు(MAM) పిల్లల బరువులు, ఎత్తు, చూడడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడి టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లల తల్లులు గర్భిణీలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన
జిల్లా అధికారి వీరునాయక్

నేటిధాత్రి మొగుళ్ల పల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సి పేట వివిధ గ్రామాల్లోఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారి వీరు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ ఎ క్యూ పద్ధతిని పాటించాలని తేమశాతం 17/. దాటి ఉండకూడదని సూచించారు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రే గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులకు చెప్పి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఫార్మా రిజిస్ట్రచేసుకోవాలని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రే చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఏఈఓ లు రైతులు పాల్గొన్నారుముఖ్యంగా,

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు .

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మరియు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని.

Camp

అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి, సామజిక కార్యకర్త కోట ధనరాజ్ గారు, ఎంపిడిఓ సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఎస్సై సాయి తేజ, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామపంచాయతీ కార్యదర్శి చిట్యాల వ్యవసాయ. మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ చిట్యాల డైరెక్టర్లు అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.!

డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో తెలంగాణ ఉన్నత విద్య మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని తెలిపారు. కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని,డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీ కొరకు మే 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయని అన్నారు.ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలో జరుగుతుందని అందులో జూన్ 30 నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ వారి మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలని పేర్కొన్నారు.దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదవతరగతి మెమో,ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్,కుల ధ్రువీకరణపత్రం,ఆదాయధ్రువీకరణపత్రం(01-04-2025 తేదీ తరవాత తీయబడింది) 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు ,పాస్స్పోర్ట్ సైజు ఫోటో తీసుకురాగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో దోస్త్ సమన్వయ కర్త డా.పూర్ణచందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ,అడ్మిషన్ ఇంచార్జ్ డాక్టర్ యం.సోమయ్య,కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్ ఎస్.కమలాకర్, రహీముద్దీన్ ,డాక్టర్ రాంబాబు, డా.భద్రు, డా.రాజీరు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు అందుబాటులో లేవని వారు చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీమతి యశస్విని రెడ్డి తక్షణమే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదు, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లాజిస్టిక్స్ సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు అని కలెక్టర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను అని అన్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ధాన్యాన్ని తడి కాకుండా కాపాడుకోవడం అవసరం రైతులకు ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అధికారులను ఆదేశించారు. అదనంగా, వారు అధికారులను ఆలస్యం కాకుండా, ఖచ్చితమైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రైతులు ఎటువంటి అవినీతిని సహించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ తనిఖీతో గ్రామస్థుల్లో, రైతుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడతానని వారు హామీ ఇచ్చారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.

బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి 

గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు  హాజరైనారు

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా.

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.

కారేపల్లి నేటి ధాత్రి.

 

 

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పి ఎ సి ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.సన్నరకం వడ్లకు క్వింటాకు రూ500బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వ్యవసాయ సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి.

వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version