మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి.

మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి..

*ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం..

*వైసిపి నేతల విమర్శలను ప్రజలు నమ్మొద్దు..

*ఇంటింటికి టిడిపితో ప్రజా సమస్యల పరిష్కారం..

*సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి):

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంక్షేమ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సత్య గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారుఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా వార్డులో అడుగడుగునా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఏడాది పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా అర్ధరహిత విమర్శలు చేస్తున్నదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు పరచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి మరోమారు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించు కుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ప్రజాభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి మంచి ప్రభుత్వమని ఇప్పటి వరకు తాము చేసిన మంచి పనులను ప్రజానికానికి వివరించేందుకే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్. వి.బాలాజీ,
ఆర్ బి సి
కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,
బీఆర్శి కుమార్,కిరణ్, రూపేష్, సుదర్శన్ బాలాజీ, సురేష్ లతో పాటు జనసేన నాయకులు దిలీప్, హరీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

 

 

గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.

జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.

కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.

దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు.
పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.

 

ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…

 

జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.

మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

వారికి నోటీసులు పంపిస్తున్నారు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.

ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version