డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

ceime

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి రోడ్డులో వెళ్తున్న కారును అడ్డగించి, సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన దుండగులు

నేటిధాత్రి వరంగల్.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు రాజ్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ పై దాడి సంచలనం కలిగించిన కేసులో, వారం రోజుల్లోనే చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు. వరంగల్ లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు వరంగల్ మిల్స్ కాలని పోలీసులు. డాక్టర్ పై దాడి ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధమే డాక్టర్ ప్రాణాలను తీయాలని వేసిన పన్నాగం బయటపడింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా, దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మిల్స్ కాలని పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

అసలేం జరిగింది?

crime
crime

 

ఫిబ్రవరి 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై దాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినారని బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిల్స్ కాలని పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు.? వైద్యుడు సిద్దార్థ్ ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్ పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కి, వరంగల్ షిరిడీ సాయి నగర్ కి చెందిన ఫ్లోరా మరియా అను ఆమెతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత 2018 సంవత్సరంలో సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్ రెడ్డి బందువుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని చూసుకోవడం కోసం భార్య భర్త లు సంగారెడ్డి కి షిఫ్ట్ అయితారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పి.ఎచ్.సి లో, కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా వారి బంధువుల స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది.

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డి లోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఆ జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. జిమ్ ట్రైనింగ్ పేరిట అయినా పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంనకు దారితీసింది. వీరి అక్రమ సంబంధం గురించి డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగానే, భార్యా భర్తలకు గొడవలు జరిగాయి. ఈ గొడవల వలన డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేసినారు. తరువాత 2019 సంవత్సరంలో సదరు ఫ్లోరా మరియా, ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం పొంది, జనగాం జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వుండేవారు. తర్వాత ఆ కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ కు మారడంతో, డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ, కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ, ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. సదరు ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ నీ ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో సదరు ఫ్లోరా మరియా, ప్రియుడు శామ్యూల్ లు కలిసి, డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కి తమ మర్డర్ ప్లాన్ విషయం చెప్పి, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కి సహకరిస్తే నీకు సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్తాడు. దానికి సదరు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. తరువాత అందాదా 15 రోజుల క్రితం ఒక్క లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, తన ప్రియుడు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చెయ్యగా, అందులో నుండి ఖర్చులకు 50వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇస్తాడు.

crime
crime

 

భట్టుపల్లి రోడ్డులో మర్డర్ ప్లాన్

నిందితులు వారి మర్డర్ ప్లాన్ లో భాగంగా తేదీ20.02.2025 రోజున మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసి, హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ యొక్క రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి, కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం, డాక్టర్ సుమంత్ రెడ్డిని సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ చేసుకుని వాళ్లు అనుకున్న పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి వేళ, తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట కు, వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్ఆర్ స్కూల్ దాటిన తరువాత ఉన్న, చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా, అట్టి చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొడుతాడు. ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా, శామ్యూల్ అతని స్నేహితడు రాజ్ కుమార్ లు, సదరు డాక్టర్ సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుండి వారు పారిపోతారు.

వారం రోజుల్లో కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు

బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ కేసును వరంగల్ ఏసిపి నంది రామ్ ఆధ్వర్యంలో, మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నం, టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జెలెందర్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, సల్మాన్ ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ లు నిందితుల కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సంచలనం సృష్టించిన కేసులోని నిందితులైన సంగారెడ్డి కి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ (ఏ1), డాక్టర్ భార్య గాదె ఫ్లోరా మరియా (ఏ2), వీరికి సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (ఏ3) లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!